Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఐదు వేల చొప్పున రెండు విడతల్లో రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేస్తోంది. ఇప్పటివరకు యాసంగి సీజన్ లో 15ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే సర్కార్ సాయం అందింది. కొన్ని చోట్ల 12ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. ఆపై ఉన్న రైతులకు ఇంకా పెట్టుబడి సాయం అందలేదు. ఇలా 15ఎకరాలకు పైగా భూమి ఉన్న వారిలో అధికార పార్టీ నేతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారంతా సామాన్య రైతుల మాదిరి రైతు బంధు డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతకు దాదాపు యాభై ఎకరాల భూమి ఉంది. ఆయన భార్య పేరు మీద 25 ఎకరాలు, ఆయన కుమారుడి పేరు మీద 20ఎకరాలు, తండ్రి పేరు మీద 18ఎకరాల ఎకరాల భూమి ఉంది. సర్కార్ ఇచ్చే రైతు బంధు…
వరుస పరాజయాలతో వైసీపీలో పూర్తి నిస్తేజం కనిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకొని టీడీపీ గెలుపు సంబరాలను ఆవిరి చేయాలనుకుంది వైసీపీ. కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో స్థానంలో ఓటమి పాలవ్వడాన్ని వైసీపీ అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని యోచిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్ధిపార్టీకి ఓటేయడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. దీంతో ఎమ్మెల్యేలపై జగన్ కు పట్టు సడలిందని.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతారని వేటు వేశారు. ఇదంతా బాగానే ఉన్నా…వైసీపీని మాత్రం ఓటమి భయం వెంటాడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములపై అప్పుడే చర్చిస్తోంది. వరుసగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనని బలంగా ప్రచారం చేసుకుంటుంది. పైగా…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటును బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు అని, రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు కోసం పార్లమెంట్ ను సైతం వాడుకున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో విపక్షాలన్నీ రాజకీయ విబేధాలను పక్కనపెట్టేశాయి. ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ ఇలాంటి సమయంలో ఐక్యం కావాలని నిర్ణయించుకున్నాయి. బీఆర్ఎస్ సహా ఆప్, వామపక్షాలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్), రాష్ట్రీయ జనతాదళ్ ఇలా దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలన్నీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండించాయి. రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఢిల్లీ సీఎం అరవింద్…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పై ఆయన భార్య పల్లవి షాకింగ్ కామెంట్స్ చేశారు. పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘అలా మొదలైంది’ అనే టాక్ షో లో పల్లవి- నిఖిల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ ఈ యంగ్ కపుల్స్ ను పలు ప్రశ్నలను అడిగి ఆసక్తికర సమాధానాలను రాబట్టారు. మొదటి ప్రశ్నతోనే నిఖిల్ ను అడ్డంగా ఇరికించాడు వెన్నెల కిషోర్. పల్లవి పేరెంట్స్ అంటే మీ అత్త, మామల పేర్లు ఏంటో చెప్పాలని అడిగాడు. కానీ వారి పేర్లను చెప్పలేక ఇబ్బంది పడ్డాడు నిఖిల్. పెళ్లి అయింది. ఇంకా వాళ్ళతో ఏం పనుంది.? వారి పేర్లను గుర్తుంచుకోవడానికి అంటూ నిఖిల్ భార్య పల్లవి తన భర్త గాలి తీసింది. అనంతరం మీ లవ్ స్టొరీ చెప్పాలని వెన్నెల కిషోర్ కోరగా… పేరెంట్స్ కు చెప్పిన లవ్ స్టొరీ చెప్పాలా.? రియల్ లవ్…
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తు నిర్ణయం తీసుకుంది. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేయడంతో ఆమె గెలుపొందారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరై ఉండొచ్చునని గురువారం ఫలితాలు వెలువడిన తరువాత నుంచి అధిష్టానం ఆరా తీసింది. అయితే ఆ నలుగురిలో ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలుగా వైసీపీ అధిష్టానం గుర్తించింది. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిబంధనలను అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ పై అంతర్గత విచారణ చేసినట్లు…
ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షుడు , ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ జైలు శిక్ష విధించడంతో లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ వ్యతిరేకులు ముఖ్యంగా పోటీదారులపై వ్యవస్థలు ఎంత వేగంగా స్పందిస్తాయో రాహుల్ గాంధీ విషయంలో స్పష్టమైంది. ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. రాహుల్ గాంధీ విషయంలో కోర్టులు , వ్యవస్థలు చాలా వేగంగా స్పందించాయని తెలిపారు. ఇప్పుడు ప్రధాని విషయంలోనూ అదే తరహాలో స్పందించాలని రేణుకా చౌదరి కోరారు. ప్రధాని నరేంద్ర మోడీపై తాను పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ఆమె చెప్పారు. 2018లో పార్లమెంట్ లో తనను శూర్పణఖతో ప్రధాని పోల్చారని… దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ లో…
రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. పరువు నష్టం దావా కేసులో దోషిగా తేలడంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు. రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లేందుకు నెల రోజుల గడువు విధించింది. ఈలోగా కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లి స్టే తెచ్చుకుంటారని అనుకున్నారేమో ఏమో వెంటనే రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ వ్యతిరేకులు ముఖ్యంగా పోటీదారులపై వ్యవస్థలు ఎంత వేగంగా స్పందిస్తాయో మరోసారి రుజువు అయింది. సూరత్ కోర్టు రాహుల్ గాంధీ విషయంలో ఇచ్చిన తీర్పు కాపీ లోక్ సభ సెక్రటేరియట్ కు అందిందో లేదో స్పష్టత లేదు. ఈ తీర్పు వచ్చిన ఒక్క రోజు వ్యవధిలోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. ఒక్క రోజు గడువు కూడా ఇవ్వకుండా అనర్హత…
గోవా. ఇండియాలో మంచి పర్యాటక ప్రదేశం. ఇక్కడ మద్యం చాలా చౌకగా లభిస్తుంది. అందుకే తిరుగు ప్రయాణంలో పర్యాటక ప్రియులు మద్యం బాటిళ్ళను వెంట తీసుకెళ్తుంటారు. కాగా గోవా నుంచి అన్ని రాష్ట్రాల వారు మద్యం బాటిళ్ళను తీసుకెళ్లవచ్చా..? ఏమైనా ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయా..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. గోవా నుంచి ఏపీకి మద్యం బాటిళ్ళను అసలే అనుమతించరు. ఏపీలో ప్రత్యేకమైన మద్యం పాలసీ ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం రవాణాకు అనుమతి లేదు. గోవా నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ మార్గంలోనైతే ఒక్కో వ్యక్తికి ఐదు లీటర్ల చొప్పున మద్యాన్ని చెక్ ఇన్ బ్యాగ్ లో తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తారు. హ్యాండ్ బ్యాగ్ లో మాత్రం తీసుకువెళ్లేందుకు అనుమతించరు. కాదు.. కూడదని అతి తెలివి ప్రదర్శించి ఐదు లీటర్ల కన్నా ఎక్కువ మద్యాన్ని హ్యాండ్ బ్యాగ్ లో తీసుకువెళ్దామని అనుకుంటే కస్టమ్స్ అధికారులు పట్టేస్తారు.…
మంచు వారి ఫ్యామిలీలో విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయని ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవి బయటకు రాకపోవడంతో ఈ ప్రచారమంతా కల్పితమేనని అనుకున్నారు. తాజాగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య విబేధాలు నిజమేనని తేల్చే వీడియో ఒకటి బయటకొచ్చింది. మంచు మనోజ్ అనుచరుడు సారధి ఇంటికి వెళ్ళాడు మంచు విష్ణు. సారధిని ఏమన్నాడో ఏమో కాని అతనిపై దాడి చేసి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు విష్ణు. అక్కడున్న వారు విష్ణును నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. మంచు మనోజ్ పై కోపంతోనే అతని అనుచరుడిపై విష్ణు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియోను సారధి తన సోషల్ మీడియా స్టొరీలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సారధిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న మనోజ్ స్పందించాడు.…
ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఫేక్ డిగ్రీ సంపాదించి ఎల్ఎల్ బీ ప్రవేశం పొందారని తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి ఆరోపించారు. ఈ విషయమై అత్యున్నత స్థాయి విచారణకు ఆయన డిమాండ్ చేశారు. తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తరువాత లాకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలనుకున్నారు. అందుకేనేమో ఎల్ఎల్ బీ చదవాలనుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోని లా కాలేజ్ లో ప్రవేశం పొందారు. ఆయన లా కోర్స్ లో ప్రవేశం పొంది మూడేళ్ళు అయిపోయింది. పరీక్షలు రాశారో లేదో క్లారిటీ లేదు. కాని ఆయన డిగ్రీ పాస్ కాకుండానే మూడేళ్ళ లా విద్యను ఎలా అభ్యసిస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవాలంటే ఖచ్చితంగా డిగ్రీ ఉత్తీర్ణుడై ఉండాలి లేదా డిగ్రీకి సమానమైన అర్హత కలిగిన కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్స్ పూర్తి…