Author: Prashanth Pagilla

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి, డాక్టర్ సుధాకర్ తరహాలో తనను చంపుతారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ప్రాణ భయంతోనే తాను ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చేశానని చెప్పారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. ఏపీకి వస్తే ఎలాంటి ప్రాణహాని ఉండదని మనవ హక్కుల కమిషన్ హామీ ఇస్తేనే ఏపీకి వస్తానని ప్రకటించారు శ్రీదేవి. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు నుంచే తనపై పార్టీ నేతలు కుట్రలు చేశారని మండిపడ్డారు.మహిళా నేత అని కూడా చూడకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. శ్రీదేవి ఎక్కడ అంటూ మాట్లాడుతున్నారని.. తను ఏమైనా గ్యాంగ్ స్టార్ నా అని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణా,ఇళ్ళ స్థలాలపెరుతో వేల కోట్ల దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి ఎక్కడికి పోదని చెప్పినందుకే…

Read More

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకొని అన్యోన్యంగా మెలుగుతోన్న వారిలో మహేష్ బాబు – నమ్రత జంట మొదటి ప్లేసులో ఉంటుంది. మహేష్ బాబుకు సహకరిస్తూ ఇద్దరి పిల్లల బాధ్యతలను చూసుకుంటు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు నమ్రత. అయితే పెళ్లి కాకముందే నమ్రత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కాని పెళ్లి అయ్యాక ఆమె సినిమాలు చేయడం పూర్తిగా మానేసి కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉండాలనే షరతు విధించి నమ్రతను మహేష్ బాబు పెళ్లి చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతో ఎవరికీ ఇప్పటివరకు స్పష్టత లేదు. ఏదీ ఏమైనా నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తి సమయం ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నమ్రత ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. అయితే ఈ…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మరోసారిఈడీ విచారణకు పిలవనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే మూడుసార్లు కవితను విచారించిన ఈడీ నాలుగోసారి విచారణకు పిలిచి కీలక అంశాలపై సమాచారం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కవితను నాలుగోసారి విచారణలో ప్రధానంగా ప్రశ్నించి..ఆమె ఇచ్చే సమాధానాల ఆధారంగా ఈడీ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం . ఇప్పటివరకు మూడు సార్లు విచారణకు హాజరైన కవిత…ఈ విచారణలో ఆమె ఎదుర్కొన్న ప్రశ్నల క్రమాన్ని పరిశీలిస్తే అసలు విషయం యిట్టె అర్థం అవుతోంది. అయితే… ఇప్పటివరకు ఆమెకు ఎదురైనా ప్రశ్నల ఆధారంగా నాలుగోసారి కవిత ముందు ఎలాంటి ప్రశ్నలను ఉంచే అవకాశం ఉందనే విషయంలో కొంత క్లారిటీ వస్తోంది. మొదటిసారి విచారణలో కవిత ఎదుర్కొన్న ప్రశ్నలివే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీ ప్రమేయం ఏమిటి..? లిక్కర్…

Read More

కోవిడ్ మళ్ళీ దూకుడు పెంచుతోంది. కోవిడ్ పని అయిపోయినట్లేనని జనం రిలాక్స్ అవుతున్న సమయంలోనే కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్లు, శ్వాసకొస సంబంధిత సమస్యతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు కోవిడ్ పాజిటివిటి రేట్ పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేసింది. కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలోపలు రాష్ట్రాల గణాంకాల్ని కేంద్రం ఉటంకిస్తోంది. కేరళలో 26.4 శాతం.. మహారాష్ట్రలో 21.7 శాతం.. గుజరాత్ లో 13.9 శాతం.. కర్ణాటకలో 8.6 శాతం.. తమిళనాడులో 6.3 శాతం కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని సూచించింది. గతంలోలాగా ట్రిపుల్ టీ విధానం (టెస్టింగ్.. ట్రాకింగ్.. ట్రీమ్మెంట్ ) విధానం అనుచరించాలని పేర్కొంది. తాజాగా కేంద్రం జారీ చేసిన గైడ్…

Read More

మంచు వారి ఇంట్లో విబేధాలు ముదిరి రచ్చకెక్కాయి. మంచు మనోజ్ – మంచు విష్ణుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో మనోజ్ సన్నిహితుడిపై విష్ణు దాడి చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎప్పుడు తన సన్నిహితులపై విష్ణు ఇలాగే దాడి చేస్తాడని పెర్కొనడటంతో ఇద్దరి మధ్య గొడవలు చాలా కాలంగానే జరుగుతున్నాయని తేలిపోయింది. అయితే మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను మోహన్ బాబు రంగంలోకి దిగడంతో డిలీట్ చేశాడు. మరోవైపు అన్నదమ్ముల మధ్య విబేధాలు కామన్ అని మంచు లక్ష్మి సర్ది చెబుతోంది. అయితే.. మనోజ్ దగ్గర మరిన్ని వీడియోలు ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే బయటపెడుతాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి మంచు వారి బ్రదర్స్ మధ్య విబేధాలు కొత్తవేమీ కాదు. ఎప్పటి నుంచే ఉన్నవే. ఇప్పుడు అవి ముదిరిపాకన పడి బయటకొచ్చాయి అంతే. ఐతే మనోజ్ విడుదల చేసిన వీడియో ఇప్పటిది కాదన్నది ఆయన…

Read More

పరువునష్టం కేసులో దోషిగా తేలిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది లోక్ సభ సెక్రటేరియట్. రెండేళ్ళ జైలు శిక్షను సూరత్ కోర్టు విధించడంతో ఈ తీర్పు ఆధారంగా రాహుల్ పై చర్యలకు ఉపక్రమించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో రెండేళ్లు అంతకుమించి శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు అనర్హత వేటుకు గురవుతారు. అంతేకాదు శిక్షకాలం ముగిసాక ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోతారు. అయితే ఇలాంటి శిక్షలు పడడం భారతదేశంలో కొత్త కాదు. ఇలాంటి కేసులను గతంలో చాలామంది నేతలు ఎదురుకున్నారు. అయితే వీళ్ళందరూ నేరాలు – ఘోరాలు చేసిన వారు. కానీ రాహుల్ గాంధీ ఒక్కడే ఎలాంటి నేరం చేయకుండా కేవలం ఓ రాజకీయ విమర్శ చేసి ఈ కేసులో ఇరుక్కున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు అనర్హతవేటుకు గురైన ప్రజా ప్రతినిధులు చాలామందే ఉన్నారు. వారిలో ప్రముఖ…

Read More

ఏ రంగంలోనైనా వీకెండ్స్, పండగలకు సెలవులు ప్రకటించడం సాదారణమే. ఇందుకు బ్యాంకులు మినహాయింపు ఏమి కావు.  కాని ఏకంగా ఏప్రిల్ లో బ్యాంకులు 15రోజులు మూతబడనున్నాయి. వచ్చే నెలలో  15 రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. కాబట్టి బ్యాంకు పనులను ముందుగానే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగించుకోవాలని బ్యాంకు అధికారులు ప్రజలకు సూచించారు. కింద ఇచ్చిన లిస్ట్ లో సెలవు దినాలు మినహా బ్యాంకు సేవలు అందుబాటులో వుంటాయి. ఏప్రిల్ నెలలో బ్యాంకుల సెలవు దినాలు… ఏప్రిల్ 1: కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా ప్రకటించారు. ఏప్రిల్ 2, 9, 16, 23, 30, ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. మహావీర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 4న వివిధ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 5 బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 7న…

Read More

నాగర్ కర్నూల్ జిల్లాలో అందరి చూపు ఆ నియోజకవర్గంపైనే కేంద్రీకృతమైంది. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుంచి అధికార పార్టీ తరుఫున ఎవరు పోటీ చేయనున్నారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం ఇస్తారా..? ఆయనపై పెరుగుతోన్న వ్యతిరేకత దృష్ట్యా స్థానచలనం తప్పదా? అనే విషయాలపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటనేగా మీ సందేహం. నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఈసారి బీఆర్ఎస్ తరుఫున ఎవరు పోటీ చేస్తారు? అనే విషయమై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అచ్చంపేట ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన గువ్వల హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. టికెట్ విషయంలో క్లారిటీ లేదు కానీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీలో ఉండబోయేది తానేనని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళి టికెట్ లు ఇస్తానని కెసిఆర్ గతంలో  మాటిచ్చారు. పోయిన…

Read More

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు హైకోర్టులో ఊరట లభించింది. తనపై యూనివర్సిటీ విధించిన సస్పెన్షన్ ను రద్దు చేయాలని కోరుతూ భగీరధ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బండి భగీరథ్ ను తరగతులకు అనుమతించాలని యూనివర్సిటీని ఆదేశించింది. గతంలో యూనివర్సిటీలో సహా విద్యార్ధులపై బండి భగీరథ్ దాడికి పాల్పడిన వీడియోలు బయటకొచ్చాయి. బూతులతో తిడుతూ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ర్యాగింగ్ పేరుతో వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. తండ్రి అండ చూసుకొని యూనివర్సిటీలో పెత్తనం చెలాయించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్ ను యూనివర్సిటీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ తనపై విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు భగీరథ్.…

Read More

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందింది. టీడీపీ గెలిచే అవకాశమే లేదు. ఏడ్చినట్టుగా ఏడో స్థానానికి పోటీ పడుతుందని వైసీపీ సెటైర్లు వేసింది. కాని వైసీపీ ఎమ్మెల్యేలే పంచుమర్తి అనురాధ గెలుపుకు దోహదం చేశారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతోనే టీడీపీ అభ్యర్థి గెలిచారని వైసీపీ నిర్ధారణ చేసుకుంది. దాంతో వారిని క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీలో నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై వేటు వేసింది. ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారాల ప్రకారం జరిగింది. కాని పార్టీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు చెల్లుతుందా..? అనేది ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారింది. ఏ పార్టీలోనైనా వ్యవహారాలు కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జరగాలి.…

Read More