Author: Prashanth Pagilla

టాలీవుడ్ యంగ్ అండ్ మాస్ హీరో విశ్వక్ సేన్ గత మూవీ ప్రమోషన్ ఎంత వాయిలెంట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీవీ9 లేడి జర్నలిస్ట్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ని స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ ప్రారంభమైయ్యాక కాసేపు చర్చ బాగానే జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికీ చెడింది. అసలు నా క్యారెక్టర్ ను తప్పుబట్టడానికి మీరెవరు అంటూ దేవి నాగవల్లి మీద విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. దాంతో ఆగ్రహానికి లోనైన దేవి నోరు జారారు. గెట్ అవుట్ మై స్టూడియో అంటూ రూడ్ గా వార్నింగ్ ఇచ్చింది. దేవి వార్నింగ్ తో ఆగ్రహానికి గురైన విశ్వక్ సేన్ వెంటనే మైక్ తీసేసి స్టూడియో నుంచి వెళ్ళిపోయాడు. ఈ గొడవ అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొందరు దేవికి మద్దతుగా నిలవగా…మరికొందరు విశ్వక్ సేన్ కు సపోర్ట్ గా…

Read More

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన కామెడి టైమింగ్ తో చాలా తక్కువ కాలంలో స్టార్ కమెడియన్ కు ఎదిగాడు. హైపర్ ఆదితో సమానమైన క్రేజ్ తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయేల్. తను చేసిన స్కిట్స్ ను ఆదరణ భారీగా ఉండటంతో స్పెషల్ ఈవెంట్స్ కు ఇమ్మాన్యుయేల్ ను యాంకర్ గా ఇన్వైట్ చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్ తాజాగా ఓ స్కిట్ చేసి దెబ్బలు తిన్నాడు. కారణం రాజకీయపరమైన స్కిట్లు. ఎమ్మెల్యేను అనుకరిస్తూ స్కిట్స్ చేసి నవ్వించాడు. కానీ ఇది ఎమ్మెల్యే అనుచరులకు నచ్చలేదు. ఇంకేముంది ఇమ్మాన్యుయేల్ పై  దాడి చేసి గాయపరిచారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇమ్మాన్యుయేల్ ను లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే… ఇమ్మాన్యుయేల్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని అనుకరిస్తూ ఓ స్కిట్ చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి ఎలాగైతే ప్రవర్తిస్తారో అచ్చం…

Read More

తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పురుడుపోసుకున్న టీడీపీ ఇప్పుడు 41వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఓ ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాలుగా రాజకీయ మనగడలో ఉండటం విశేషమే. ఈ నలభై ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన టీడీపీని మింగేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ వాటన్నింటిని ఎదుర్కొని తెలుగు ప్రజల అభిమానంతో ఇంకా సజీవంగా… సగర్వంగా నిలబడింది తెలుగు దేశం పార్టీ. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతోన్న నేపథ్యంలో టీడీపీపై ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేశారు. ఆ సమయంలో టి. టీడీపీ నాయకులు కొంతమంది పార్టీని వీడారు. కానీ కీలక నేతలెవరూ పార్టీ జెండాను వదలలేదు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించిన టీడీపీతో అనుబంధాన్ని తెంచుకోవడమంటే పేగు బంధాన్ని తెంచుకోవడమని భావించి పార్టీలోనే కొనసాగారు. అందుకే రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలో టీడీపీపై కేసీఆర్ మొదటి కుట్ర స్టార్ట్ అయింది. ఆ పార్టీ దుకాణం తెలంగాణలో బంద్…

Read More

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ( యూపీఐ) లావాదేవీలపై కేంద్రం చార్జీలను విధించే యోచనలో ఉందన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ ప్రచారం ట్రెండ్ అవుతోంది. దేశ ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా కేంద్రం అందిస్తోన్న కానుక ఇదేనంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. యూపీఐ ద్వారా నిర్వహించబడే వ్యాపార లావాదేవీలకు ప్రీ పెయిడ్ చార్జీలను అమలులోకి తీసుకురానుందనే వార్తతో కూడిన ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం చూస్తే.. యూపీఐ ద్వారా నిర్వహించే లావాదేవీలపై 1.1శాతం చార్జీలను వసూలు చేసుకునే వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన సర్క్యూలర్ లో పేర్కొంది. ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐలో రూ. 2వేల కంటే ఎక్కువ లావాదేవీలపై 1.1పీపీఐ చార్జీలను వర్తింపజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి ఆ…

Read More

తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయి. అప్పుడే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాట్లపై చర్చిస్తున్నాయి. కూడికలు, తీసివేతలతో పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ ఎలక్షన్ రేస్ లో అధికార బీఆర్ఎస్ కాస్త ముందంజలో ఉంది. ఇందులో భాగంగా ఇద్దరు మంత్రులను కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలనుకుంటున్నారనే టాక్ హాట్ హాట్ గా సాగుతోంది. ఎన్నికలకు మరెంతో సమయం లేదు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేపడుతు నివేదికలు తెప్పించుకుంటున్నారు. సర్వే రిపోర్ట్ ల ఆధారంగా ఎమ్మెల్యేలు, మంత్రులను పనితీరు మార్చుకోవాలని కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. పనితీరు ఏమాత్రం బాగోలేని వారిని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేల విషయాన్ని పక్కనబెడితే ఇద్దరు మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ అనుమానమేనని తెలుస్తోంది. మరో మంత్రి తన సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఇద్దరు…

Read More

పులివెందులలో కాల్పుల కలకలం రేగింది. కాల్పుల శబ్దం రావడంతో జనమంతా ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాల్పులకు ఎవరు పాల్పడ్డారు..? అని పోలీసులు విచారించగా భరత్ యాదవ్ అనే వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. దిలీప్ అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలో తేడాలు రావడంతోనే ఈ కాల్పులు భరత్ యాదవ్ జరిపినట్లుగా తెలుస్తోంది. భరత్ యాదవ్ ని వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారించింది. వివేకా హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భరత్ పదేపదే చెబుతుంటారు. ఆస్తుల తగాదాలతోనే ఆయన్ను హత్య చేశారని ఆరోపిస్తుంటారు. ఇందుకు వైసీపీ అనుకూల మీడియా తెగ కవరేజ్ ఇస్తుంది. తనకు వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని .. తనకు ఏమైనా అయితే రాజశేఖర్ రెడ్డిదే బాధ్యత అని మీడియా ముంగిట చెబుతుంటారు.…

Read More

నాగచైతన్య – సమంత విడిపోయి ఏడాదిన్నర అవుతోంది. అప్పటి నుంచి వీరి పెళ్లి వార్తలపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. పలానా హీరోయిన్ తో నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నాడని…అలాగే సమంత కూడా ఓ హీరోతో రిలేషన్ లో ఉందని ఎప్పటికప్పుడు కొత్త, కొత్త వార్తలు వస్తున్నాయి. కానీ వీటిపై అధికారిక ప్రకటన రాలేదు. విడాకులు తీసుకున్న నాగ చైతన్య- సమంతలు రిస్క్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే వారు వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. ఆలస్యం చేస్తే వయస్సు పైబడుతుంది. పిల్లల్ని కనాలన్న, వారి బాధ్యతలను చూసుకోవాలన్న సరైన సమయంలో పెళ్లి చేసుకుంటేనే సాధ్యం అవుతుంది. 35ఏళ్ల వయస్సులో నాగచైతన్య – సమంత విడిపోవడంతో భవిష్యత్ దృష్ట్యా వెంటనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. వీరి విడాకుల ప్రకటన తరువాత రెండో పెళ్లి వార్తపై ఎప్పటికప్పుడు , సరికొత్తగా వార్తలొచ్చాయి. నటి శోభిత ధూళిపాళ్ళతో చైతూ ప్రేమాయణం కొనసాగిస్తున్నారని ప్రచారం…

Read More

ఏపీలో టీడీపీ స్ట్రాంగ్ అవుతోంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీ విజయబావుటా ఎగరేసింది. ఈ తీర్పుతో ఏపీలో అధికారంలోకి రానున్నది సైకిల్ పార్టీనేనని ఆ పార్టీ నేతలతోపాటు క్యాడర్ కు ఓ నమ్మకమైతే కల్గింది. దీంతో చంద్రబాబు ఏపీతోపాటు తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు. ఇంతకాలం ఏపీపై మాత్రమే పూర్తి ఫోకస్ చేసిన చంద్రబాబు ఇటీవలి ఫలితంతో తెలంగాణకు కూడా కొంత సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టీడీపీని ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ఏం చేస్తే పార్టీ బలపడుతుంది..? పార్టీలోకి చేరికలను ముమ్మరం చేయాలంటే ఎలాంటి రూట్ మ్యాప్ రూపొందించుకోవాలి..? అనే అంశాలపై చంద్రబాబు టీడీపీ నేతలతో చర్చిస్తున్నారు. తెలంగాణ టీడీపీ అద్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించాక పార్టీలో కొంత కొత్త ఊపు వచ్చిందనేది ఓపెన్…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచుతోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడుసార్లు విచారించిన ఈడీ తాజాగా మరోసారి నోటిసులు జారీ చేసింది. మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటిసులో పేర్కొన్నారు. అయితే ఈసారి విచారణకు మీరు కాని మీ తరుఫున ప్రతినిధిని పంపవచ్చునని మినహాయింపు ఇచ్చింది ఈడీ. ఇటీవల విచారణకు హాజరైన కవిత ఈడీకి తాను వాడిన సెల్ ఫోన్లను అందజేసింది. ఆమె అందించిన ఈ మొబైల్ ఫోన్లను ఇప్పుడు ఓపెన్ చేసేందుకు సిద్దమైంది ఈడీ. దాంతో ఆమె సమక్షంలోనే ఈ ఫోన్లను ఓపెన్ చేయాలనుకొని కవితకు ఈడీ నోటిసులు ఇచ్చింది. మీరైనా రావొచ్చు, మీ ప్రతినిధినైనా పంపవచ్చునని నోటిసులో పేర్కొనడంతో ఈడీ కార్యాలయానికి కవిత తరుఫున బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లనున్నారు. కవిత వ్యక్తిగత మొబైల్‌ను మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు స్వాధీనం…

Read More

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఒటేసిందని తాటికొండలో ఆమె కార్యాలయంపై కొంతమంది దాడి కూడా చేశారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేసుకొని విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. గతంలో జగన్ కు మద్దతుగా మాట్లాడిన వీడియోస్ , ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోస్ ను సర్క్యూలెట్ చేస్తు మహానటి అంటూ పేర్కొంటున్నారు. నాడు ఆమె అమరావతి రైతు ఉద్యమం బోగస్ అని మాట్లాడిన వీడియోస్ ఇప్పుడు అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న వీడియోస్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఈ క్రమంలోనే వైసీపీ సానుభూతిపరురాలు , టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎమ్మెల్యే శ్రీదేవికి సంబంధించిన ఆడియోను బయటపెట్టారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఎమ్మెల్యే ఏమన్నారు..? ఎవరితో మాట్లాడారు ఈ కథనంలో తెలుసుకుందాం. తుళ్ళూరు ప్రాంతంలో…

Read More