Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరుఫున ఏపీ సీఎం జగన్ రంగంలోకి దిగారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఢిల్లీ వరుస పర్యటనలో తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చాలని జగన్ కేంద్ర పెద్దలను కోరడం వెనక కేసీఆర్ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. ఇందులో భాగంగా సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కీలకమైన స్థానాల్లో అధికారులను బీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేసే వారిని నియమించుకున్నారు. ఎన్నికలకు కావాల్సిన సరంజామాను కూడా రెడీ చేసుకున్నారు. అయితే , బీఆర్ఎస్ – బీజేపీల మధ్య తలెత్తిన రాజకీయ సంఘర్షణతో రెండు పార్టీల మధ్య పూడ్చాలేనంత గ్యాప్ వచ్చింది. ఆ మధ్య ఢిల్లీ పెద్దలతో మాట్లాడేందుకు కేసీఆర్ ప్రయత్నించినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ పరిస్థితుల నడుమ ముందస్తుకు వెళ్తే కేంద్రం సహకరించే పరిస్థితి లేదని కేసీఆర్…
కర్ణాటక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. మే నెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రజల మనస్సు గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను ఖరారు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంపై అప్పుడే దృష్టిసారించాయి. మండుటెండలను సైతం ఖాతరు చేయకుండా ప్రచారం చేసేందుకు రెడీ అయిపోయాయి. మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ మాత్రం ఈసారి అధికారం తమదేనని ధీమాగా ఉండగా జేడీఎస్ పూర్తిమెజార్టీతో పవర్ లోకి రావాలని టార్గెట్ పెట్టుకొని ప్రచారం చేపడుతోంది.ఈ ఎన్నికలు లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే కర్ణాటక ఎన్నికల్లో గెలిచి లోక్ సభ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. కర్ణాటకలో అధికారం చేపట్టి దక్షిణాదిలో సత్తా చాటాలని ఉవ్విళ్ళురుతోంది బీజేపీ. అయితే కన్నడనాట విజయం ఈసారి అంత ఈజీ కాదని బీజేపీ హైకమాండ్ గుర్తించింది. అందుకే పవర్ లోకి…
టీఎస్ పీస్సీలో మంత్రి కేటీఆర్ విచారణను ఎదుర్కోక తప్పదా..? పట్టువదలని విక్రమార్కుడిలా రేవంత్ చేస్తోన్న పోరాటంతో కేటీఆర్ చిక్కుల్లో పడటం ఖాయమేనా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీఎస్ పీస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి వాదిస్తున్నారు. కానీ రేవంత్ వాదనలను మంత్రి కేటీఆర్ కొట్టిపారేస్తూ వచ్చారు. ఇద్దరు వ్యక్తులు చేసిన నేరాన్ని వ్యవస్థకు అంటడుతారా..? అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారాన్ని ఇద్దరిపై మాత్రమే నేట్టేసేందుకు మంత్రి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. టీఎస్ పీస్సీ చైర్మన్ , సెక్రటరీ, సభ్యులను మొత్తం విచారిస్తే ప్రభుత్వ పెద్దల బాగోతం బయటకొస్తుందని ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన నాటి నుంచే రేవంత్ చెప్తున్నారు. దీంతో ఈ విషయంలో రాజకీయపరమైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి , బండి సంజయ్ లకు నోటిసులు ఇచ్చిన సిట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆరోపణలు…
దేశంలో న్యాయస్థానాల తీర్పులను విని దేశమంతా ఆశ్చర్యానికి లోనవుతుంది. ఎక్కడ న్యాయం జరగకపోయినా చివరికి న్యాయస్థానంలోనైనా న్యాయం జరుగుతుందని విశ్వసించిన ప్రజలు మెల్ల మెల్లగా కోర్టు తీర్పులపై నమ్మకం కోల్పోతున్న స్థితి కళ్ళముందు కనిపిస్తోంది. కారణం వ్యవస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ మేనేజ్ చేస్తుందన్న అనుమానాలు. తాజాగా గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ విద్యార్హతలు అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు 25వేల జరిమానా విధించింది. మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి. ఎన్నికల అఫిడవిట్‌లో మోడీ చెప్పిన వాటి ప్రకారం ఆయన ఎక్కడ చదువుకున్నారో ఆధారాలు అడిగారు. సర్టిఫికెట్లు చూపించమన్నారు. ఇదే తప్పయిపోయింది. ఢిల్లీ సీఎం పిటిషన్ కొట్టేసి రూ. పాతిక వేలు జరిమానా వేశారు. ప్రధాని మోడీ విద్యార్హతలు తెలుసుకోవాలని అనుకోవడంలో తప్పేమి ఉందొ ఎవరికీ అంతుబట్టడం లేదు. నిజానికి ఆయన విద్యార్హతలపై వివాదం చెలరేగకుండా ఆయనే స్వయంగా వాటిని…
తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసింది ఉన్నత విద్యామండలి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీలలో మార్పులు చేసినట్లు అధికారులు ప్రకటించారు. మే 12, 13, 14 తేదీలలో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 10, 11 తేదీలలో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు మాత్రం యధాతధంగా జరుగుతాయని తెలిపారు. నీట్, టీఎస్ పీస్సీ పరీక్షల కారణంగానే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షా షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తులు భారీగా వస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం వరకు మొత్తం 1.80 లక్షలకు పైగా విద్యార్థులు దరాఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తుకు మరో పదిరోజుల గడువు ఉండటంతో ఇంకా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 1.80 లక్షల దరఖాస్తుల్లో ఇంజనీరింగ్ విభాగంలో 1,14,989, అగ్రికల్చర్…
ఎన్నో అద్భుతమైన పాటలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు మ్యూజిక్ డైరక్టర్ చక్రి. చాలా తక్కువ కాలంలోనే మ్యూజిక్ డైరక్టర్ స్థాయికి చేరుకున్నాడు. పూరి జగన్నాథ్ రెండో సినిమా బాచి తో మ్యూజిక్ డైరక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన చక్రి ఆ తరువాత వెనుదిరిగి చూసుకొనేలేదు. బాచి సినిమా ద్వారా చక్రిలోని టాలెంట్ ను ఇండస్ట్రీ గుర్తించింది. దాంతో ఆయనకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. రవితేజ హీరోగా నటించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ , అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో వచ్చిన దేశముదురు సినిమాలకు చక్రి సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా ‘ వెన్నెల్లో హయ్ హయ్ ‘ 2016లో విడుదలైంది. ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది కానీ సినిమానే ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆయన అకాల మరణంతో చక్రి కుటుంబం ప్రస్తుతం కొంత గడ్డు…
కర్ణాటక ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటోంది. అక్కడ ఎలాగైనా నెగ్గాలని టార్గెట్ పెట్టుకుంది. కర్ణాటకలో ఓడితే ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుంది. అందుకే కర్ణాటకలో అధికారాన్ని మళ్ళీ కైవసం చేసుకొని తీరాలని హైకమాండ్ భావిస్తోంది. అయితే కర్ణాటకలో బీజేపీ గెలుపు అంత ఈజీ కాదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ పార్టీ ఓటమి ఖాయమని కీలక నేతలు సైతం కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అక్కడ కాంగ్రెస్ భారీగా పుంజుకొని అధికారం దిశగా పరుగులు పెడుతోంది. పలు ఒపినియన్ పోల్స్ లోనూ కాంగ్రెస్ దే అధికారమని స్పష్టం చేశాయి. దీంతో బీజేపీ అధినాయకత్వం కర్ణాటకపై మరింత ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఎట్టిపరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోవద్దని.. ఇందుకోసం ఎలాంటి మార్గాలు ఉన్నాయో హైకమాండ్ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ నేతల సహాయాన్ని బీజేపీ కోరుతున్నట్లు ప్రచారం ఉదృతంగా సాగుతోంది. తాజాగా కేంద్రహోం మంత్రి అమిత్…
మహేశ్వరం రాజకీయం సెగలు కక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ముగ్గురు పోటీపడుతుండటంతో రాజకీయం యమ రంజుగా మారింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి , కొత్త మనోహార్ రెడ్డిలు మహేశ్వరం నియోజకవర్గం నుంచి టికెట్ కోరుతున్నారు. కానీ ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికీ దక్కుతుందని నియోజకవర్గామంత ఏడతెగని చర్చ జరుగుతోంది. 2018లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తీగల కృష్ణారెడ్డిని ఓడించారు. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారారు సబితా. మహేశ్వరం బీఆర్ఎస్ టికెట్ టికెట్ కోసం కొత్త మనోహర్ రెడ్డి కూడా పోటీ పడ్డారు. కాని ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేయడంతో కొత్త మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల తరుఫున ప్రచారం నిర్వహించారు. కానీ తీగల ఓటమి పాలయ్యారు. తీగల ఓటమి.. సబితా బీఆర్ఎస్ లో…
తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 25నుంచి జూన్ 11వరకు వేసవి సెలవులు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 2023 -24విద్యా సంవత్సరం జూన్ 12నుంచి ప్రారంభం అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేసవి సెలవులను ప్రకటించడంతో పాఠశాల వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది విద్యాశాఖ. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. పరీక్షల అనంతరం 21తేదీ నుంచి 24వరకు పరీక్షల మూల్యాంకనం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 25న తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. వేసవి సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ పూర్తిగా దూరం పెట్టాలనుకుంటుంది. ఆయనతో ఎగలేకపోతున్నామని నిర్ధారణకు వచ్చినట్లుంది. అందుకే ఆయనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఇంకా ఎత్తివేయడం లేదు. సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతున్నా బీజేపీ నుంచి పాజిటివ్ రియాక్షన్ ఉండటం లేదు. ప్రతి సమయంలోనూ రాజాసింగ్ చేసే వ్యాఖ్యల వలన బీజేపీపై అపవాదు నెలకొంటుందని ఆ పార్టీ అంచనాకు వస్తోంది. పార్టీ బలపడుతున్నా ఆయన చేసే వ్యాఖ్యల వలన తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తే కొని కష్టాలు తెచ్చుకోవడమేనని…అందుకే ఆయన పూర్తిగా వదులుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాజాసింగ్ పై బీజేపీ అధికారంలోనున్న మహారాష్ట్రలో కేసు నమోదు కావడం చర్చనీయాంశం అవుతోంది. రాజాసింగ్ ను పార్టీ లైట్ తీసుకోవడంతోనే ఆ పార్టీ పవర్ లోనున్న రాష్ట్రంలో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. జనవరి 29న ముంబైలో ప్రసంగించిన…