Author: Prashanth Pagilla

ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ టీమ్ గా ముంబై ఇండియన్స్ కు పేరుంది. ఇదుసార్లు టైటిల్ ను కైవసం చేసుకున్న ఆ జట్టు గత రెండు సీజన్ల నుంచి మెరుగైన ప్రదర్శన చేయలేకపోతుంది. ప్రపంచస్థాయి ఆటగాళ్ళతో ఆ జట్టు బలంగా కనిపిస్తోన్న ఆటలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేకపోతుంది. గతేడాది ఏకంగా పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి స్థానంకు పరిమితమైంది. భారీ ధరకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ , రోహిత్ శర్మలు కూడా ఘోరంగా విఫలం అవుతున్నారు . ఈ సీజన్ మొదటి మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ పూర్తిగా నిరాశపరిచింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ఇషాన్ కిషన్ (10), రోహిత్ శర్మ (1), కామెరూన్ గ్రీన్ (5), సూర్యకుమార్ యాదవ్ (15) ఇలా ఒక్కొక్కరు వెనువెంటనే ఓటై పెవిలియన్ కు క్యూ కట్టారు.పది బంతులను ఎదుర్కొన్న రోహిత్…

Read More

“గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరుతో నిత్యం ప్రజలతో మమేకం అవుతుంటారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రామిరెడ్డి. ప్రజల సమస్యలను వింటూ అక్కడిక్కడే పరిష్కరిస్తూ ప్రజల్లో మంచి ఆదరణ చూరగొన్నారు. ఆయన చేసే ఈ కార్యక్రమానికి యూట్యూబ్ చానెల్స్ లో మంచి వ్యూయర్ షిప్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ వీడియోలను చూసి మాకు కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండేదని అనుకున్నారు ఇంతకాలం. తాజాగా ఆయన కబ్జా బాగోతాన్ని నారా లోకేష్ బయట పెట్టడంతో ఈయన కూడా ఇంతేనా అనుకుంటూ ఈసడించుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం ఖాళీ జాగాల అన్వేషణ కోసమా అంటూ కేతిరెడ్డి గురించి ప్రజలు చర్చించికుంటున్నారు. మ్యాటర్ ఏంటంటే…ఓ అందమైన ప్రదేశంపై మనస్సుపడిన కేతిరెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేశారు. ఆ స్థలం మామూలుది కాదు. భూతల స్వర్గాన్ని తలపించేలా ఆ లొకేషన్ ఉంది. అందుకే ఎమ్మెల్యే మనస్సు పడింది. చెరువును కూడా…

Read More

టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రూ. లక్షల నగదు చేతులు మారిందని… వెంటనే ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా..ఈడీ కూడా ఎంటర్ కావడంతో పేపర్ లీక్ వ్యవహారం మరో టర్న్ తీసుకున్నట్లు అయింది. పేపర్ లీక్ అంశంలో ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లోనున్న ఆధారాలతో కేసు నమోదు చేసిన ఈడీ సోమవారం నుంచి విచారణ ప్రారంభించనుంది. సిట్ దర్యాప్తుకు సంబంధించిన కూడా వివరాలను తీసుకొని ఈడీ విచారణ స్టార్ట్ చేయనుంది. అయితే… ప్రధానంగా హవాలా లావాదేవీలపై ఈడీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హవాలా లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తోన్న ఈడీ..నిందితుల మధ్య జరిగిన నగదు లావాదేవీలపై తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి కీలక సమాచారాన్ని రాబట్టనుంది. నిందితులు ప్రశ్నా పత్రాలను ఎంతకు…

Read More

గత కొంతకాలంగా ముందస్తు ఎన్నికల చర్చ తెలుగు రాష్ట్రాలో జోరుగా జరుగుతోంది. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో ముందస్తు వార్తలకు ముగింపు పడగా… ఏపీలో మాత్రం ఈ ముందస్తు ముచ్చట తాజాగా మరింత ఆసక్తి రేపుతోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే డిసెంబర్ లో తెలంగాణతోపాటు ఏపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ తరుచుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం ముందస్తు ఎన్నికలపై కేంద్రం సహకారం కోరేందుకేనని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నానాటికీ వైసీపీ సర్కార్ పై ప్రజాగ్రహం ఎక్కువ అవుతుండటంతో జగన్ ముందస్తుకు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబర్ లో తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగోచ్చుననే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ వార్తలను వైసీపీ…

Read More

టాలీవుడ్ సంగీత దర్శకుల్లో అతి తక్కువ కాలంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో చక్రి ఒకరు. పూరి జగన్నాథ్ కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సరిగ్గా అప్పుడే చక్రి కెరీర్ కూడా ప్రారంభమైంది. చక్రిలోనున్న టాలెంట్ ను గుర్తించిన పూరి జగన్నాథ్ తన రెండో సినిమాలోనే సంగీత దర్శకుడిగా చక్రికి అవకాశం ఇచ్చారు. అలా తనకు వచ్చిన మొదటి సినిమాతోనే చక్రి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. దాంతో పూరి సినిమాలో సంగీత దర్శకుడుగా చక్రి ఫిక్స్ అయ్యారు. వీరిద్దరి కాంబోలో ఇడియట్ , ఇట్లు శ్రావణి స్రుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు , నేనింతే , శివమణి , గోలీమార్ , 143 ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడం.. చక్రికి సంగీతానికి ప్రశంసలు రావడంతో ఇతర దర్శకులు కూడా తమ సినిమాలో చక్రికి అవకాశం ఇచ్చారు. అలా ఎన్నో…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు సాగుతుండగా సుఖేష్ చంద్రశేఖర్ అనే ఆర్ధిక నేరగాడు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆప్ తరుఫున బీఆర్ఎస్ నేతలకు హైదరాబాద్ లో తాను 15కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పడంతో ఈ సుఖేష్ చంద్రశేఖర్ ఎవరు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటనే చర్చ విస్తృత స్థాయిలో జరుగుతోంది. ఏకంగా అతడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలిచాడు. అతడు ఎవరా అని ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు తెలిశాయి. సుఖేష్ నేపథ్యం : బెంగళూర్ లోని భవానీ నగర్ కు చెందిన ఓ రబ్బరు కాంట్రాక్టర్ కుమారుడే ఈ సుఖేష్ చంద్రశేఖర్. కేవలం పదిహేడేళ్ళ వయస్సులో అతను అనేక నేరాలకు పాల్పడ్డాడు. పేరు మోసిన పారిశ్రామికవేత్తలను, సినీ తారలను బెదిరించి , మభ్యపెట్టి కోట్లాది రూపాయల వసూళ్లు చేయడం ప్రారంభించాడు. మొదటగా తనకు పెద్ద,పెద్ద రాజకీయ నేతలతో, అధికారులతో పరిచయాలు ఉన్నాయని పరిచయాలు పెంచుకొని…

Read More

మంచు వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇటీవల జరిగిన గొడవంతా ఓ రియాలిటీ షో ప్రమోషన్ కోసమనేనని చెప్పి దొరికిపోయారు. తాము చేసిందంతా ప్రాంక్ అంటూ జరిగిన గొడవను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు విష్ణు. కానీ మంచు లక్ష్మి, మనోజ్ లు స్పష్టత ఇవ్వడంతో విష్ణు ఇరకాటంలో పడ్డారు. తామంతా త్వరలోనే ఓ భారీ రియాలిటీ షో చేస్తున్నామని..దాని ప్రమోషన్ లో భాగంగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నట్లు డ్రామా నడిపామని పరోక్షంగా విష్ణు చెప్పాడు. ‘హౌస్ ఆఫ్ మంచూస్ ‘అనే రియాలిటీ చేస్తున్నామన్నారు. ‘హౌస్ ఆఫ్ మంచూస్’ టైటిల్ తో ప్రోమో కూడా విడుదల చేశారు విష్ణు. దీనిపై మంచు లక్ష్మి, మనోజ్ లను స్పష్టత కోరగా తమకు ఈ విషయమే తెలియదని చెప్పడంతో విష్ణు చెప్పేదంతా ఫేక్ అని తేలింది. మనోజ్ ను ఈ విషయమై వివరణ కోరగాఇటీవల విష్ణుతో గొడవ…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఈడీ విచారణకు వెళ్ళే సమయంలో ఫోన్లను కవిత మీడియా ఎదుట ప్రదర్శించి తన పాత్ర లిక్కర్ స్కామ్ లో లేదని చెప్పాలనుకున్నారు. కానీ కవిత చేసిన ఈ ప్రయత్నమే ఆమెను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేట్లుగా చేసింది. లిక్కర్ స్కామ్ లో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కవిత ఫోన్లను ధ్వంసం చేసిందని ఈడీ ఆరోపించింది. దాంతో ఆమె ఆ ఫోన్లు ఇవిగో అంటూ మీడియాకు చూపించి అనంతరం ఈడీ విచారణకు వెళ్ళింది. దాంతో కవితను కావాలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని బీఆర్ఎస్ వాదించడం స్టార్ట్ చేసింది. కానీ కవిత మీడియా ముందు ప్రదర్శించిన ఫోన్లె ఆమెను బుక్ చేశాయి. కవితకు లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉందని…ఆమె ఫోన్లను ధ్వంసం చేసిందని అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు లీక్ చేసింది. అందులో ఆమె…

Read More

కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్దవిరమణ చేసినట్లు కనిపిస్తోంది. సందర్భం ఏదైనా కానీ మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించే కేసీఆర్ మునుపటి దాడిని కొనసాగించడం లేదు. కారణమెంటో తెలియదు కాని కేసీఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర నేతలు వచ్చి బీఆర్ఎస్ లో చేరే కార్యక్రమాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించారు. వారికీ పార్టీ కండువా కప్పి కేసీఆర్ సాదరంగా బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇదంతా బాగానే ఉంది కానీ కాసేపయ్యాక లైవ్ ను ఆపేయాలంటూ కేసీఆర్ ఆదేశించడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. సాధారణంగా తెలంగాణ భవన్ లో జరుగుతోన్న కార్యక్రమాలకు మీడియాను అనుమతించడం లేదు. ఏస్ మీడియా అనే ఏజెన్సీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన ఒక్క కెమెరామెన్ మాత్రమే లోపల ఉంటారు. శనివారం మహారాష్ట్ర నేతలు పార్టీలో చేరిక తరువాత కేసీఆర్ మాట్లాడుతోన్న సమయంలోనే…

Read More

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో చక్రం తిప్పిన కేవీపీ అందరికీ గుర్తుండే ఉంటారు. వైఎస్సార్ మరణం తరువాత ఆయన జగన్ కు చేదోడువాదోడుగా ఉంటారని అంత నమ్మారు కాని, కేవీపీ కాంగ్రెస్ తోనే కలిసి సాగారు. ఆ పార్టీలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. జగన్ తో కేవీపీకి సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఆయన జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించలేదు. మధ్యలో జగన్ కు రాజకీయ సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు కానీ వాటిని జగన్ రిసీవ్ చేసుకోకపోవడంతో కేవీపీ సైలెంట్ అయిపోయారు. ఇటీవల కాలంలో జగన్ కు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు కేవీపీ. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దివాళా తీయిస్తున్నారని… పోలవరాన్ని ప్రాధాన్యత అంశంలో లేకుండా చేశారని జగన్ పై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ దోపిడీ జరుగుతోందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో మీడియా సమావేశం…

Read More