Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టాప్ మోస్ట్ హైప్రొఫైల్ కేసులు చల్లబడిపోయాయి. తెలంగాణలో ఢిల్లీ మద్యం కుంభకోణం…ఏపీలో వివేకా హత్య కేసుల్లో విచారణ సంస్థల దూకుడు తగ్గింది. ఇటీవల ఈ రెండు కేసుల్లో విచారణ సంస్థల దూకుడుతో ఇక అరెస్ట్ లు ఖాయమని అనుకుంటున్నా నేపథ్యంలోనే దర్యాప్తులో వేగం తగ్గింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మూడుసార్లు విచారణకు పిలిచిన కవితను ఈడీ దాదాపు తొమ్మిదిగంటలపాటు ప్రశ్నించింది. ఆమె ఫోన్ ను కూడా ఈడీ సీజ్ చేసింది. దాంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది కాని ఆమెను విచారించి వదిలేశారు. మళ్ళీ పిలుస్తామని లీకులు ఇస్తున్నా అలాంటి సూచనలు కనిపించడం లేదు. తరువాత విచారణకు రావాలని ఈడీ నోటిసులు ఇచ్చినా కవిత తరుఫు లాయర్ ను పంపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగానే ఏపీలో రాజకీయ రంగు పులుముకున్న హైప్రొఫైల్ కేసు వివేకా…
కాస్త ఆలస్యంగా ‘బలగం’ సినిమా చూసాను ఒకసారి కాదు – రెండు సార్లు కాకపోతే, బలగం సినిమా మీద వరదలా వచ్చి పడుతోన్న మిత్రుల పోస్టుల నడుమ, ఒక నాలుగు మాటలు పంచుకోవడానికి కాస్త తటపటాయించాను 1 నాలుగేళ్ల క్రితం మలయాళం లో మనిషి చావు నేపథ్యంలో వచ్చిన ‘ఈ మా యు’ సినిమా చూసి అనుకున్నాను – కమిట్ మెంట్ వుండాలే గానీ మన స్థానికతతో సినిమా తీయడానికి ఇటువంటి కథలు తెలుగు నాట దొరకవా? క్రితం సంవత్సరం విడుదలైన కన్నడ ‘కాంతార’ సినిమా చూసినపుడు కూడా అనిపించింది – కాస్త శ్రద్ధ పెట్టాలే గానీ, స్థానిక సంస్కృతి నేపథ్యంలో తీయడానికి మన దగ్గర ఎన్ని కథలు దొరకవూ ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘తెలంగాణ సినిమా’ అంటూ చర్చలు జరిగింది, ఆర్ నారాయణ మూర్తి మార్క్ తెలంగాణ సినిమాలు కాకుండా, తెలంగాణ స్థానిక సంస్కృతిని, జీవ భాషను…
జాతీయ రాజకీయాలను ఏ క్షణాన మొదలు పెట్టారో కానీ కేసీఆర్ కు కాలం అస్సలు కలిసిరావడం లేదు. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ఖర్చులు తాను చూసుకుంటానని ఆఫర్లు ఇస్తున్నా కేసీఆర్ ను విశ్వసించడం లేదు. విపక్ష పార్టీలు నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ ను ఆహ్వానించడం లేదు. అదే సమయంలో కేసీఆర్ మాత్రం తాను నిర్వహిస్తోన్న సభలు , సమావేశాలకు జాతీయ స్థాయి నేతలను తెలంగాణకు రప్పించుకొని తన బలాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు దాంతో కేసీఆర్ కు జాతీయ స్థాయిలో పట్టు దొరికిందని అనుకుంటుండగానే విపక్ష పార్టీలు కేసీఆర్ కు ఝలక్ ఇచ్చేశాయి. ఇటీవల బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ సమావేశం అయ్యాయి. ఇందులో కీలక నేతలు పాల్గొన్నారు. మోడీతో డీ అంటే డీ అంటున్న కేసీఆర్ ను మాత్రం ఎవరూ ఈ విపక్ష పార్టీల సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపలేదు. సందు దొరికితే చాలు మోడీని ఏకిపారేస్తూ మోడీ…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ చేశారని ఆ మధ్య ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే సంచలన కథనం వెలువరించారు. ఏపీలో ఒంటరిగా పోటీ చేసినా లేదా బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసినా పవన్ కు వెయ్యి కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్ బేరమాడుతున్నారని వీకెండ్ కామెంట్ లో ఆర్కే పేర్కొన్నారు. అప్పట్లో ఇది సంచలనం రేపింది. ఆర్కే కథనంపై చాలామంది విమర్శలు చేశారు. సంచలనాల కోసం ఈ కథనం వెలువరించాడని ఆర్కేపై తిట్ల దండకం అందుకున్నారు. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇదే విషయాన్నీ చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కు చైర్మన్ గా తనను చేస్తే ఆ కూటమిలో పార్టీల ఎన్నికల ఖర్చులను తాను భరిస్తానని కేసీఆర్ ఆఫర్ ఇచ్చినట్లు రాజ్ దీప్ చెప్పడం సంచలనం రేపుతోంది. దేశ రాజకీయాలపై రాజ్ దీప్ ఓ…
టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ లేటు వయస్సులో పెళ్లి పీటలు ఎక్కనున్నాడని ప్రచారం జరుగుతోంది. 43ఏళ్ల వయస్సున్న దేవి శ్రీ ప్రసాద్ బ్యాచిలర్ లైఫ్ కు తన పెళ్లి కార్డుతో ఎండ్ కార్డు వేయనున్నాడని ఫిలింవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కోట్ల సంపాదన ఉన్నా డీఎస్పీ ఎందుకో పెళ్లి చేసుకోలేదు. కానీ పలువురు స్టార్ హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. అందాల తార ఛార్మితో దేవి శ్రీ ప్రసాద్ డేటింగ్ కూడా చేసినట్లు ఫోటోలు కూడా బయటకొచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో ఈ జంట మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. అనంతరం మరికొంతమంది హీరోయిన్స్ తో డీఎస్పీ డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వచ్చాయి కానీ అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. కాగా ఎట్టకేలకు దేవి శ్రీ ప్రసాద్ పెళ్లికి అంగీకరించినట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది. పెళ్లి చేసుకోవాలని కుటుబ సభ్యులు ఒత్తిడి…
నేటి యాంత్రిక యుగంలో పెళ్ళైన కొన్నాళ్ళ తరువాత భార్యలను పట్టించుకోవడమే మానేస్తున్నారు భర్తలు. పూర్తిగా ఆర్ధిక అంశాలపైనే దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా మహిళలు శారీరక సౌఖ్యానికి దూరం అవుతున్నారు. క్యాంపుల మీద భర్తలు ఉళ్లు పట్టుకుని తిరగడం, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రాత్రి వేళ ఇంటికి రాకపోవడం. లేదా ఆ భర్త మరో అమ్మాయి మోజులో పడి భార్య సుఖం గురించి మరిచిపోవడం నేడు సర్వసాధారణం. ఇలాంటి వారు ఇప్పుడు మేల్ ఎస్కార్ట్ సేవలను కోరుకుంటున్నారు. విడోస్, పెళ్లి కాని వారు మేల్ ఎస్కార్ట్ సేవల కోసం బుక్ చేసుకుంటున్నారు. తమకంటే చిన్న వయస్సున్న కాల్ బాయ్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు. పైగా… వివాహేతర సంబంధాల కంటే మేల్ ఎస్కార్ట్ సేవలు సీక్రెట్ సాగుతాయని మహిళలు ధైర్యంగా కాల్ బాయ్స్ రప్పించుకుంటున్నారు. వీళ్ళలో చాలా మంది డెలివరి బాయ్ లుగా, పిజ్జా, బర్గర్ బాయ్ లుగా రావడం గమనార్హం. హై టెక్…
మంత్రులు, ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్ నిర్వహించిన కీలక భేటీకి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని సీఎంవో నుంచి సమాచారం వెళ్ళినా వారు జగన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ డుమ్మా కొట్టడం వైసీపీ వర్గాలను విస్తుగోల్పేలా చేస్తోంది. సీఎంతో భేటీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజినిలు గైర్హాజరు అయ్యారు. వీరిలో బుగ్గన కరోనా కారణంగా ఈ భేటీ హాజరు కాలేనని ముందుగానే జగన్ కు సమాచారం అందించగా మిగతా నేతలు మాత్రం సమాచారం ఇవ్వకుండా కీలక భేటీకి దూరంగా ఉండటం సంచలనంగా మారింది. కొంతకాలంగా జగన్ పై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం…
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. జల్సా సినిమా ద్వారా ఏర్పడిన వీరి పరిచయం అలాగే కొనసాగుతోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఏ స్నేహాలు ఎక్కువ కాలం కొనసాగవు కానీ పవన్ – త్రివిక్రమ్ ల స్నేహం మాత్రం ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ సినిమా పనులన్నీ త్రివిక్రమ్ పర్యవేక్షిస్తున్నారు. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు, హీరోయిన్స్ ఎంపిక మొదలుకొని పవన్ స్టార్ చేసే సినిమా వ్యవహారాలన్నీ త్రివిక్రమే చూసుకుంటున్నారు. ఇలాంటి స్నేహితుడిని బహుశా మనం నిజ జీవితం లో కూడా చూసి ఉండము. కాగా ఇటీవల త్రివిక్రమ్ భార్య సౌజన్య ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పవన్ – త్రివిక్రమ్ ల స్నేహం గురించి చాలా గొప్పగా చెప్పింది. పవన్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. ఈమేరకు ఢిల్లీ రావాలని పవన్ కు ఆహ్వానం పంపారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లనున్న పవన్… హస్తినలో జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కానున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తోన్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు అందటం చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ ను పిలిచింది ఏపీ రాజకీయాలపై చర్చించేందుకు కాదని… కర్ణాటక ఎన్నికల విషయమై మాట్లాడేందుకు ఆయనకు ఆహ్వానం పంపారని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో వాటన్నింటిని పరిశీలిస్తోంది. కర్ణాటకలో కమలం వాడిపోతే దక్షిణాదిన మరీ ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని బీజేపీ అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. ఈమేరకు కన్నడనాటన పవన్ తో ప్రచారం చేయిస్తే బాగుంటుందని భావిస్తోన్న కమలం అగ్రనేతలు ఆయనతో సంప్రదింపులు…
టీఎస్‌పీఎస్పీ పేపర్ లీక్ వ్యవహారం మరవకముందే మరో పేపర్ లీక్ ఘటన సంచలనంగా మారింది. సోమవారం టెన్త్ పరీక్షల ప్రారంభమయ్యాయి. పరీక్షలు మొదలైన మొదటి రోజే పేపర్ లీక్ కావడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 9 :30 గంటలకు పది పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రం లీక్ అయింది. టెన్త్ ప్రశ్నా పత్రం వాట్సప్ లో చక్కర్లు కొట్టింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. ఈ క్వశ్చన్ పేపర్ ను షేర్ చేసిన వ్యక్తి వెంటనే దానిని డిలీట్ చేశాడు కాని జీబీ వాట్సప్ లో డిలీట్ చేసినవి అలాగే ఉంటాయి. దాంతో ఈ పేపర్ లీక్ వ్యవహారం బయటపడింది. వికారాబాద్ జిల్లా తాండూర్ లో పదో తరగతి పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే ప్రశ్నా పత్రం వాట్సప్ లో వెలుగుచూడటం చర్చనీయాంశం అవుతోంది. తాండూర్ లోని…