Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల తాకిడి చూస్తుంటే కర్ణాటక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అక్కడ కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ నేతలు క్యూ కట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, టికెట్ రాని అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపించడం జనాల్లో కాంగ్రెస్ కు మైలేజ్ పెంచేసింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట తెలంగాణ కాంగ్రెస్ లోకి అదే తరహలో చేరికలు కొనసాగుతుండటంతో పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా అధికారంలోకి వచ్చే పార్టీ కాంగ్రెస్ అనే అభిప్రాయం ఏర్పడేలా చేస్తోంది. ఈ తరహ అభిప్రాయం జనాల మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేస్తుంది. ఓ పార్టీ వైపు మొగ్గే ఓటర్లను సైతం డైవర్ట్ చేస్తోంది. ఇదే బీఆర్ఎస్ ఆందోళన కూడా. అందుకే కాంగ్రెస్ లోకి చేరికలను నిలువరించేందుకు ఆపసోపాలు పడుతోంది. గతంలో జూపల్లి, పొంగులేటిలను పోతేపోని అని లైట్ తీసుకున్న బీఆర్ఎస్ .. ఇప్పుడు పోతామని అనుమానిస్తోన్న నేతలను పిలిచి…
గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ లో చేరిక సమయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కారణం..సోమన్న కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తే కావడం. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసి కిషోర్ ను ఓడించాలని ఏపూరి ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలోనే ఆ పార్టీ కాంగ్రెస్ విలీనం దిశగా సాగడంతో సోమన్న రాజకీయ భవితవ్యం సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో సోమన్న బీఆర్ఎస్ లో చేరారు. సోమన్న చేరిక సమయంలో గాదరి కిషోర్ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సోమన్న బీఆర్ఎస్ లో చేరిక గాదరి కిషోర్ కు ఇష్టం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అటుంచితే.. సోమన్న చేరికపై స్థానిక ఎమ్మెల్యే కిషోర్ తో బాల్క సుమన్ కనీసం చర్చించలేదని..ఆయనతో సంప్రదించకుండానే సోమన్న చేరికను ఖరారు చేయడంతోనే కిషోర్ అసంతృప్తిగా ఉన్నారని…
తెలంగాణ సచివాలయంలోని ఆలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ఆహ్వానించి ఆమెకు అతిథి మర్యాదలు చేయడంతో ఇక కేసీఆర్ , గవర్నర్ ల మధ్య శషభిషలు తొలగిపోయినట్లేనని అనుకుంటున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సి అభ్యర్థుల పేర్లను ఆమోదించకుండా గవర్నర్ తాజాగా తిరస్కరించారు. రాజకీయ నేతల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సి అభ్యర్థులుగా ప్రతిపాదించవద్దని ప్రగతి భవన్ కు గవర్నర్ లేఖ రాశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ప్రతిపాదిస్తూ గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ కాబినెట్ పంపింది. వీటిపై తాజాగా గవర్నర్ స్పందిస్తూ… సామజిక కార్యక్రమాల్లో వీరు యాక్టివ్ గా ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని.. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదని కేసీఆర్ కు గవర్నర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అర్హులను సిఫార్సు చేస్తే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో సామజిక కార్యక్రమాలు చేపడుతున్న వారు చాలామంది ఉన్నారని..…
కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కసిరెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డితోపాటు వంశీచంద్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు సమాచారం. ఈ నెల 29వ తేదీన కసిరెడ్డి ఢిల్లీ వెళ్లి అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ కోసం కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. పార్టీ నాయకులు కూడా కసిరెడ్డికే ఇవ్వాలని పట్టుబట్టారు. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి కసిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. జైపాల్ యాదవ్ కు సహకరించకుండా జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపి గెలిపించుకోవాలని రహస్య భేటీలు కొనసాగించారు. కాని పోటీకి బాలాజీ సింగ్ ఆసక్తి చూపకపోవడంతో కసిరెడ్డి పోటీలో ఉండాలనుకున్నారు. ఈ…
సిల్క్ స్మిత.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైన నటనతో మెప్పించింది. తన కళ్ళతో అందర్నీ మైమరపించింది. సినిమాలో ఆమె ఒక్క ఐటెం సాంగ్ చేస్తే చాలు అనుకునే స్టేజ్ కు ఎదిగింది. ఆమె కాల్ షీట్ల కోసం అప్పట్లోనే వెయిట్ చేసేవారంటే స్కిల్ కెరీర్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 200కు పైగా సినిమాలో నటించిన సిల్క్ స్మిత బాగా సంపాదించినా.. చాలా మంది చేతిలో మోసపోయి అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం ఇప్పటికీ ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది.ఇటీవల ఆమె జయంతి సందర్భంగా సిల్క్ స్మితకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరో రజినికాంత్ సినిమాలో చాలా ఐటెం సాంగ్స్ చేసిన సిల్క్ స్మితకు ఆయనతో పరిచయం ఏర్పడిందని.. ఇది వారి మధ్య ఎఫైర్ కు దారితీసిందని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే రజినీకాంత్ సిల్క్ స్మితను ఓసారి ప్రైవేట్ పార్ట్ పై…
బహుజన యుద్దనౌక ఏపూరి సోమన్నకు బీఆర్ఎస్ లో ఆదిలోనే అవమానం ఎదురైంది. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు శనివారం రోజున ప్రకటించారు సోమన్న. కాని తెలంగాణ భవన్ లో ఆయనకు ఎమ్మెల్సి మధుసూదన చారి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం సోమన్న స్థాయిని అవమానించడమేనని అంటున్నారు. సోమన్నకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని అనుకుంటే..పార్టీలో అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని మధుసూదన చారితో బీఆర్ఎస్ కండువా కప్పించడం పట్ల సోమన్న అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సమక్షంలో సోమన్న బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కేసీఆర్ కాకుండా పార్టీ పట్టించుకోకుండా పక్కనపెట్టేసిన మధుసూదన చారితో కండువా కప్పించడం సోమన్న స్థాయిని దిగజార్చడమేనని అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి సర్పంచ్ లు, వార్డు మెంబర్లు , నల్గొండ నుంచి సర్పంచ్ లు బీఆర్ఎస్ లో చేరేందుకు వస్తే వారికీ కూడా పార్టీ కండువా కప్పి…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీ తరువాత ఆమెను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది. నిజానికి కవితకు ఇటీవల ఈడీ నోటిసులు వచ్చిన తరువాత విచారణ పేరుతో ఆమెను అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె తనను వర్చువల్ గా విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై 26న విచారణ జరగనుంది. ఆ విచారణ అనంతరం కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా అరెస్ట్ అయ్యారు. ఒక్క కవిత మినహా. సౌత్ లాబీ నుంచి లావాదేవీలు నిర్వహించిన వారంతా అప్రూవర్లు అయ్యారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, దినేశ్ అరోరా తో పాటు కవిత బినామీగా ఈడీ…
ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా కేసీఆర్ ఓట్ల వర్షం కుర్పించే హామీలపై దృష్టిసారించారు. ఒకే ఒక్క పథకం ఓటర్ల మూడ్ మార్చేసేలా హామీ ఉండాలని ఆ జనాకర్షక హామీపై ఫోకస్ పెంచారు. సరైన సమయంలో ఆ హామీని ప్రకటించి ఓట్లు దండుకునేలా కేసీఆర్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆసరా ఫించన్ తరహాలోనే కేసీఆర్ రైతు ఫించన్ స్కీమ్ ను తీసుకురానున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో ఓ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ దేశమే ఆశ్చర్యపడే పథకం మా వద్ద ఉంది.. దానిని ప్రవేశపెడితే ప్రతిపక్షాలకు నూకలు చెల్లినట్లేనని అన్నారు. కేసీఆర్ మదిలోని ఆ అస్త్రం రైతు ఫించనేనని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కీలక హామీని అక్టోబర్ 16న వరంగల్ లో జరిగే బహిరంగ సభలో ప్రకటిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది. బీఆర్ఎస్ అధికారానికి ఎసరు…
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో శనివారం షోకాజ్ నోటిసు ఇచ్చారు. కాగా, పాలకుర్తి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తోన్న మహిళా నేత హనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై కొన్ని రోజులుగా తిరుపతి రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమె భాషా సామర్ధ్యంపై , వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి..బీఆర్ఎస్ కు అనూకూలంగా స్థానికంగా రాజకీయ పరిస్థితి మారుస్తున్నారని తిరుపతి రెడ్డిపై ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా.. టికెట్ ఇంకా ఖరారు కాకముందే తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకోవడం పట్ల తిరుపతి రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి అని.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందిన ఇలాంటి సమయంలో పార్టీలోని మహిళను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం…
తెలంగాణలో అంతకంతకు బలపడుతోన్న కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసిందా…? తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే చర్యలకు కేంద్రంలోని బీజేపీ ఉపక్రమించబోతుందా..? ఒక్క నిర్ణయంతో బీఆర్ఎస్ తో తమకు దోస్తీ లేదని చెప్పడమే కాకుండా, కాంగ్రెస్ గ్రాఫ్ ను బీజేపీ నేలమట్టం చేయాలని చేయనుందా..? ఇప్పుడు ఈ అంశాలపైనే కాంగ్రెస్ నేతలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటిసులు వచ్చిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఆమె విచారణకు హాజరు కానున్నారు. విచారణ పేరుతో ఆమెను అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి మైత్రి లేదని చెప్పేందుకు కవిత అరెస్ట్ దోహదం చేస్తోందని తెలంగాణ బీజేపీ నేతలు అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ – బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగా కవితను కొద్ది రోజులపాటు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని…