Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
వైసీపీలో జగన్ తరువాత అంత సజ్జల రామకృష్ణా రెడ్డిదే పెత్తనం. మారిన రాజకీయ పరిణామాలతో సజ్జల ప్లేసులో మరో కొత్త నేతను చూడబోతున్నాం. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సజ్జలను నెంబర్ 2పొజిషన్ నుంచి తప్పించి తనతో సన్నిహితంగా మెదిలే మరో నేతకు బాధ్యతలు ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణా రెడ్డి తీరుతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నామని జగన్ ఓ అంచనాకు వచ్చారు. దాంతో సజ్జలను ఎక్కువ కాలం నెంబర్ టూ పొజిషన్ లో ఉంచితే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని.. అందుకే నెంబర్ 2స్థానంలో చెవిరెడ్డిని కూర్చోబెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా జగన్ కు చెవిరెడ్డి చాలా క్లోజ్ అయ్యారు. చిత్తూర్ జిల్లా నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కంటే కూడా చెవిరెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేంతగా జగన్ తో మూవ్ అవుతున్నారు. తాజాగా నెంబర్ టు పొజిషన్…
మీరేం చేస్తారో నాకు తెలియదు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి. ఇది ఆ మధ్య ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాట. బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ ను ఖతం చేసి గోల్కొండ ఖిల్లాపై కమలం జెండా రెపరెపలాడాలని టార్గెట్ నిర్దేశించారు షా. ఇందుకోసం కేంద్రం నుంచి ఎలాంటి సహకరమైన అందిస్తామని భరోసా కల్పించారు. ప్రతి అంశంలో బీఆర్ఎస్ ను ఇరుకునపెట్టేలా వ్యూహాత్మక రాజకీయాలు చేయాలని…అలాగైతేనే తెలంగాణలో టార్గెట్ రీచ్ అవుతాయని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశనం చేశారు షా. అమిత్ షా కర్తవ్య నిర్దేశనం చేయడంతో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్..టీఎస్ పీస్సీ లీక్ వ్యవహారం బయటకొచ్చాక టెన్త్ పేపర్ లీక్ కుట్రకు తెరలేపారా..?అనే సందేహాలు వస్తున్నాయి. అమిత్ షా అండ చూసుకొనే చెలరేగిపోవాలని బండి డిసైడ్ అయ్యారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎలాంటి కేసులు పెట్టినా కేంద్ర సర్కార్ అండగా…
టీఎస్ పీస్సీ పేపర్ లీక్ తోపాటు టెన్త్ పేపర్ లీక్ వెనక బీజేపీ హస్తముందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ ను అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ ఈ విధమైన కుట్రకు తెరలేపిందని సామజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పేపర్ లీక్ చేసిన నిందితులు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కు అత్యంత సన్నిహితులు కావడంతో పేపర్ లీక్ వెనక బీజేపీ కుట్ర ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. వికారాబాద్ పేపర్ లీక్ నిందితుడు బీజేపీ మనిషే.? పదో తరగతి తెలుగు పేపర్ లీక్ చేసిన కేసు నిందితుడు సంబుర్ బందెప్పకు బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బందెప్ప తాండూర్ పట్టణం-1ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఆయన వివాదాస్పద వ్యక్తిగానే ఉన్నారు. గతంలో ఇదే పాఠశాలలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఓ విద్యార్ధిని…
రాజన్న రాజ్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తెలంగాణలో చేస్తోన్న రాజకీయాలతో నలుగురిలో నవ్వుల పాలు అవుతున్నారు. పేపర్ లీక్ అంశంపై పోరాడటానికి తన పార్టీ బలం సరిపోదని అనుకున్నారో లేక ఈ అంశం ద్వారా రాజకీయాల్లో ఓ ముద్ర వేసుకోవాలని అనుకున్నారేమో. ఇతర పార్టీలతో కలిసి టీ- సేవ్ పేరుతో ఫోరం ఏర్పాటు చేసి సర్కార్ పై ఉద్యమించాలని షర్మిల అనుకున్నారు. ఇందుకోసం అన్ని పార్టీలను కలిసి సంప్రదింపులు జరుపుతూ ఎజెండా ఖరారు చేయాలనుకున్నారు. కాంగ్రెస్ , బీజేపీ రాష్ట్ర అద్యక్షులు రేవంత్ , బండి సంజయ్ లకు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపారు షర్మిల. నిరుద్యోగుల తరుఫున విడివిడిగా కాకుండా ఉమ్మడిగా కొట్లాడుదామని సూచనలు చేశారు. కానీ ఇందుకు రేవంత్ , బండి సంజయ్ లు కుదరదని సున్నితంగా షర్మిల సూచనను తిరస్కరించారు. కానీ ఎక్కడ నీ చిన్న పార్టీతో జాతీయ స్థాయి పార్టీలైనా…
రాజకీయ అరంగేట్రంపై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజ్ సంచలన ప్రకటన చేశారు. పార్టీలో చేరాలని ఆఫర్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. అయితే..రాజకీయాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని చెప్పిన దిల్ రాజ్ రాజకీయాల్లోకి రావడం మాత్రం పక్కా అనే సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఆయన మాటలు చూస్తే అదే అనిపిస్తోంది. దిల్ రాజ్ స్వస్థలం నిజామాబాద్. అక్కడే పుట్టి పెరిగిన దిల్ రాజ్ ఆ తరువాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో టాప్ లిస్టులో ఉన్నారు. హైదరాబాద్ లోనే సెటిల్ అయినప్పటికీ నిజామాబాద్ తో అనుబంధాన్ని తెంచుకోలేదు దిల్ రాజ్. అందుకే వీలు చిక్కినప్పుడల్లా నిజామాబాద్ వెళ్తుంటారు. గత కొంతకాలంగా నిజామాబాద్ లో ఆయన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతోనే దిల్ రాజ్ సేవా కార్యక్రమాలు మొదలెట్టారనే ప్రచారం జరుగుతోంది. ‘బలగం’ వంటి చిన్న సినిమాతో సూపర్ సక్సెస్…
బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య పొత్తు అంటూ ప్రచారం జరుగుతోన్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ అద్యక్షుడిగా ఉన్నంత కాలం బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ తో పొత్తు విషయంపై రాహుల్ గాంధీ కూడా క్లారిటీ ఇచ్చాక ఈ తరహ ప్రచారం ఎందుకు చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో అంటకాగుతున్నది బీజేపీనేనని… ఆ పార్టీ అక్రమ సంబంధం బయటపడుతుందనే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు అంటూ అబద్దపు ప్రచారాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎంల ట్రయాంగిల్ లవ్ స్టొరీ కొనసాగుతుందని రేవంత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కీలక సమయంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతునిచ్చిందని గుర్తు చేసిన రేవంత్…ఎంఐఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు…
సినిమా పేరు: నిజం లవ్ అండ్ పొలిటికల్ క్రైం కథాంశంగా తెరకెక్కిన ” నిజం ” కంప్లీట్ ఎంటర్టైనర్ గా త్వరలో ప్రైక్షకుల ముందుకి రాబోతుంది. హరిఓం కనేక్ట్స్ బ్యానర్ లో రామ్స్ కట్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. ఇంజినీరింగ్ చదివే కరణ్, కార్తీక్, సిరి మరియు సూచి లతో ఎలా ప్రేమలో పడ్డారు. వీళ్ళకి రాజకీయాలకి సంబంధాలు ఏమిటి.? చివరికి వీళ్ళు కలుస్తారా లేదా అనే అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. సీనియర్ నటులైన సాయి కుమార్, నాగబాబు మరియు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించగా ఆర్యా, అరుణ్ హీరోలుగా.. తనిస్క్ రాజన్, ప్రజ్ఞ హీరోయిన్‌లుగా నటించారు, కిషోర్ వెన్నెలకంటి దర్శకత్వంలో జానకిరామారావు పామరాజు నిర్మించారు. ప్రస్తుతం ఈ నిజం సినిమా పోస్టర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతంః C. కృష్ణ డీఓపీః G v ప్రసాద్ ఎడిటర్ః జేపీ లిరిక్స్ః సురేష్…
టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో అన్ని వర్గాలు సర్కార్ ను వేలెత్తిచూపిస్తున్నాయి. పేపర్ లీక్ సర్కార్ వైఫల్యమేనని ఆరోపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ , బీజేపీలు పట్టుబడుతున్నాయి. కంప్యూటర్లను ఐటీ శాఖనే పర్యవేక్షేస్తుంది కాబట్టి ఆ శాఖ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వివాదం ఇంకా సద్దుమణగనే లేదు అప్పుడే టెన్త్ పరీక్ష పేపర్లు లీక్ కావడంతో సర్కార్ పై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తాజాగా రెండు టెన్త్ పేపర్లు వరుసగా లీక్ కావడంతో కేటీఆర్ తోపాటు సబితా ఇంద్రారెడ్డి కూడా తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి సర్కార్ పై ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. ఇదే డిమాండ్ తో కాంగ్రెస్ , బీజేపీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. విద్యార్ధి సంఘాలు రోడ్డెక్కాయి. ప్రగతి భవన్ ముట్టడికి…
తెలంగాణలో వరుసగా పేపర్ లీక్ అవుతుండటంతో సర్కార్ విమర్శల పాలౌతుంది. టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారం ఇంకా సద్దుమణగానే లేదు అప్పుడే టెన్త్ పేపర్ లీక్ కావడం ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చి పెట్టింది. పది పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే తెలుగు పేపర్ లీక్ కాగా… రెండో రోజు హిందీ పేపర్ కూడా లీక్ కావడంతో సర్కార్ పై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కనీసం పది పరీక్షలు కూడా సమర్ధవంతంగా నిర్వహించలేరా..? అని సర్కార్ ను కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టెన్త్ పరీక్ష పేపర్ లీక్ కు సంబంధించి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని కాంగ్రెస్ , బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే మంత్రి పదవికి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలంటూ పట్టుబడుతున్నారు. మంత్రి సబితా ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు సమాయత్తం కాగా..పాఠశాల విద్యాశాఖ బోర్డును కాంగ్రెస్ అనుబంధ…
ఓ వైపు రాష్ట్రాన్ని టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారం కుదిపేస్తుండగా తాజాగా టెన్త్ పేపర్ లీక్ ఎపిసోడ్ తీవ్ర దుమారం రేపుతోంది. పది పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే క్వశ్చన్ పేపర్ లీక్ కావడం సంచలనంగా మారింది. పేపర్ లీక్ పై మొదట విద్యాశాఖ అధికారులు బుకాయించినా వాట్సప్ లో పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు బయటకు రావడంతో నలుగురిని సస్పెండ్ చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామని అధికారులు చెప్పిన మరుసటి రోజే హిందీ పేపర్ కూడా లీక్ అయినట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూర్ లో టెన్త్ తెలుగు పేపర్ లీక్ కాగా.. తాజాగా వరంగల్, కరీంనగర్ లో హిందీ పేపర్ లీక్ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. పరీక్ష మొదలైన కాసేపటికే తెలుగు పేపర్ లీక్ అయిన తరహాలోనే హిందీ పేపర్ కూడా లీక్ అయినట్లు వాట్సప్ లో క్వశ్చన్…