Author: Prashanth Pagilla

రూల్స్ అంటే ఎవరికైనా ఒకే విధంగా ఉంటాయి. అంతటి వారైనా పాటించాల్సిందే. ప్రధాని అయినా , ముఖ్యమంత్రి అయినా, వార్డు మెంబర్ అయినా రూల్స్ ను తప్పనిసరిగా పాటించాల్సిందే. అయితే పోలీసులు అన్నాక కాస్తంత అధికారం ఎక్కువే ఉంటుంది. రూల్స్ పాటించాలని చెప్పే పోలీసులకు ఎవరూ రూల్స్ పాటించాలని గుర్తుచేయరు. అందులో కమిషనర్ కు ఓ కానిస్టేబుల్ రూల్స్ గురించి చెప్పే సాహసం చేస్తుందా..? అంటే చాన్సే లేదని చెప్పాలి. కాని రూల్స్ మరిచిపోయిన కమిషనర్ కు రూల్స్ ను గుర్తు చేసింది ఓ లేడి కానిస్టేబుల్. దాంతో ఆమె చేసిన పనికి సీపీ అభినందించారు. పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతుండటంతో ఉన్నాతాధికారులు పరీక్షా కేంద్రాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాచకొండ కమిషనర్ చౌహాన్ ను ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్తుండగా అక్కడే డ్యూటీలోనున్న మహిళా కానిస్టేబుల్ అడ్డుకోవడం కనిపించింది. దాంతో అందరూ…

Read More

ఇండియాలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి కరోనా విలయం తప్పదా అనే అనుమానాలు కల్గుతున్నాయి. కాగ తెలంగాణలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ సమీపంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 15మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో వారందరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి 15మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో సహా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులను తమ ఇంటికి తీసుకేళ్ళెందుకు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుంటున్నారు. .దేశంలో గత…

Read More

పదో తరగతి పేపర్ లీక్ కేసు బీజేపీ నేతల మెడలకు చుట్టుకుంటుంది. పేపర్ లీక్ చేసింది బండి సంజయేనని ఈమేరకు ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు తాజాగా ఈటల రాజేందర్ కు నోటిసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈటలకు కూడా హిందీ ప్రశ్నా పత్రాన్ని ప్రశాంత్ షేర్ చేసినట్లు తేలడంతో ఆయనకు నోటిసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కమలాపూర్ లో పేపర్ లీకేజ్ పై ఈటల స్టేట్మెంట్ ను వరంగల్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు. పేపర్ లీక్ కు కేంద్రంగా హుజురాబాద్ నియోజకవర్గాన్నే కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుంచే ప్రశ్నాపత్రం బయటకొచ్చిందని గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారంలో ఈటల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ప్రశాంత్ మాజీ జర్నలిస్ట్ కావడంతో గతంలో నుంచే ఈటలకు ప్రశాంత్ టచ్ లో ఉన్నాడా…? బండి సంజయ్ తరహాలోనే ఈటల…

Read More

బండి సంజయ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడంతో కేంద్ర పెద్దలు కన్నెర చేశారని కథనాలు వచ్చాయి. సంజయ్ అరెస్ట్ వివరాలను ప్రధాని మోడీ, అమిత్ షా లు బీజేపీ జాతీయద్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కార్యక్రమాల్లోనున్న బండి సంజయ్ ని అర్దరాత్రి అరెస్ట్ చేయడం పట్ల మోడీ , షా లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బుధవారమంతా బీజేపీ ప్రొ మీడియా ప్రచారం చేసింది. బండి సంజయ్ ను ఆదరాబాదరాగా అరెస్ట్ చేసి అనవసరంగా బీజేపీతో బీఆర్ఎస్ కెలుక్కుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై మోడీ , షా లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ కు ఇక మూడినట్లేనని అంచనా వేశారు. షా ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే బండి సంజయ్ అరెస్ట్ ఎపిసోడ్ పై షా దృష్టి సారిస్తారని…బీఆర్ఎస్ కు చుక్కలు చూపించేందుకు కమలం నేతలు…

Read More

టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి డ్రామాలు ఆడుతున్నాయా..? పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవడంతోనే ఈ అంశాన్ని తెరమరుగు చేసేందుకే బండిని జైలులో వేశారా? ప్రశ్నా పత్రాల లీక్ వివాదంలో బీఆర్ఎస్ పై పోరాటం చేస్తోన్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుండటంతోనే ఈ వ్యవహారంలో బండి సంజయ్ ని అరెస్ట్ చేయించారా? అంటే అరెస్ట్ జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో మంగళవారం అర్దరాత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే బండి సంజయ్ అరెస్ట్ జరిగిందనేది చెప్పాల్సిన పని లేదు. అయితే పేపర్ లీక్ ఎపిసోడ్ లో కాంగ్రెస్ ను చర్చలో లేకుండా చేసేందుకు ఈ అరెస్ట్ చేయించినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బలపడితే బీఆరెస్ ఖాళీ అవుతుంది గనుక బీజేపీకి మైలేజ్ పెంచాలనే వ్యూహంలో భాగంగా బండి…

Read More

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారా..? బీజేపీలో చేరాలనుకున్న కోమటిరెడ్డి ప్రస్తుతం కొత్త  పార్టీ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ పదవుల్లో తనకు ప్రాధాన్యతనివ్వడం లేదనే అసంతృప్తితోనే కోమటిరెడ్డి కాంగ్రెస్ తో తన అనుబంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే..కాంగ్రెస్ కు రాజీనామా చేయాలనుకుంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన తమ్ముడి బాటలోనే సాగుతారా అనే చర్చ కొనసాగుతోంది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఇప్పటికే పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా లతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. దాంతో ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారని…

Read More

టెన్త్ పేపర్ లీక్ కుట్రదారుడు బండి సంజయ్ , ప్రశాంత్ అని వరంగల్ సీపీ రంగనాథ్ తేల్చి చెప్పారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం నుంచే వాట్సప్ చాటింగ్ చేసుకొని పథకంలో భాగంగానే పేపర్ ను లీక్ చేశారని సీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో ఏ-1 బండి సంజయ్ , ఏ-2గా ప్రశాంత్ ను చేర్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు నలుగురిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హిందీ క్వశ్చన్ పేపర్ కమలాపూర్ బాయ్స్ స్కూల్ నుంచి బయటకోచ్చిందని వరంగల్ సీపీ తెలిపారు. ఉదయం 11:18గంటలకు ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్ ఫోటో తీసి వాట్సప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే 11 :24గంటలకు బండి సంజయ్ కి ఫార్వార్డ్ చేశారు. ఆ తరువాత మీడియా గ్రూప్ లో షేర్ చేశాడు. ఈటల రాజేందర్ తోపాటు ఆయన పీఏకు కూడా ప్రశ్నా పత్రాన్ని పంపించారని…

Read More

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వం రద్దుకాక తప్పదా? పదో తరగతి హిందీ పరీక్షా పత్రాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే లీక్ చేసినట్లు వరంగల్ పోలీసులు తేల్చడంతో ఆయన పదవికి ఎసరు ఖాయమనిపిస్తోంది. పేపర్ లీక్ లో బండి సంజయ్ ను ఏ 1 గా చేర్చిన పోలీసులు.. క్వశ్చన్ పేపర్ ను వాట్సప్ లో వైరల్ చేసిన నిందితుడు ప్రశాంత్ తో, బండి సంజయ్ పేపర్ లీక్ ముందు రోజు పలుమార్లు మాట్లాడినట్టు గుర్తించారు. వాట్సప్ చాటింగ్ చేసినట్టుగా తేల్చారు. పేపర్ లీక్ పక్కా పథకం ప్రకారమే జరిగిందని నిర్ధారించిన పోలీసులు ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో బండి సంజ‌య్‌ను ఏ1గా చేరుస్తూ.. సంజ‌య్‌పై క‌మ‌లాపూర్ పోలీసులు తెలంగాణ ప‌బ్లిక్ ఎగ్జామినేష‌ేన్స్ యాక్ట్‌, 1997 లోని సెక్ష‌న్ 5 తో పాటు, ఐపీసీ సెక్ష‌న్ 120 బీ, సెక్ష‌న్ 420 కింద కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో ఈ…

Read More

డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలు ఉంటాయని ఈమేరకు ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ నేతలను కేసీఆర్ సమాయత్తం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ మాత్రం ఎన్నికలను వాయిదా వేసే ప్లాన్ లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలు ముగియగానే మే లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఈసారి చావుదెబ్బ కొట్టాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయాలను పసిగట్టిన కేంద్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతోపాటు జరపాలనుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ ను రాష్ట్రం దాటకుండా జాతీయ రాజకీయాల్లోకి రానీయకూడదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం జరపకూడదంటూ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదెలా అంటే.. 2024 మే లో సార్వత్రిక ఎన్నికలతోపాటు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలను జరపాలని కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాల కాలపరిమితి ముగియగానే రాష్ట్రపతి పాలన విధించి మే…

Read More

టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో 30మంది గ్రూప్ -1ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయితే అందులో…జగిత్యాల జిల్లా మొత్తంలో ఒక్కడు మాత్రమే వందకు పైగా మార్కులు సాధించాడని కేటీఆర్ చెప్పినదంతా అబద్దమేనని తేలింది. పైగా అబద్దాలను నమ్మించేందుకు తాను ఆధారాలతో మాట్లాడుతున్నానని కేటీఆర్ చెప్పడం గమనార్హం. మాల్యాల మండలానికి చెందిన కేటీఆర్ పీఏ తిరుపతి ఈ లీకేజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని రేవంత్ రెడ్డి , బండి సంజయ్ ఆరోపించారు. తిరుపతి సొంత మండలం మాల్యాల మండలంలో వంద మందికి గ్రూప్ -1 ఎగ్జామ్ లో 100కు పైగా మార్కులు వచ్చాయని ఆరోపించారు. తిరుపతికి కేటీఆర్ అండదండలు ఉన్నాయని.. టీఎస్ పీస్సీ పేపర్ లీక్ పై విచారణ జరుపుతోన్న సిట్ కేటీఆర్ ను విచారిస్తే అసలు విషయం బయటకొస్తుందని విపక్ష నేతలు వ్యాఖ్యానించారు. కానీ, ఈ ఆరోపణలు చేసిన…

Read More