Author: Prashanth Pagilla

నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి తలకిందులు అవుతోంది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితిని కల్పించుకుంది. జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యే పార్టీ మారతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం… ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో వారంతా జగన్ కు వ్యతిరేకంగా మారారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రాంనారాయణరెడ్డిలు తిరుగుబాటు తరువాత నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత దీనంగా మారింది. జగన్ కు వీరవిధేయుడిగానున్న అనిల్ కుమార్ యాదవ్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ జగన్ తో తనకున్న సాన్నిహిత్యంతో టికెట్ పొందగలనే ఆశతో ఉన్నారు అనిల్ కుమార్. అయితే అనిల్ ను కాదని మరొకరికి అవకాశం కల్పించాలనుకున్న బలమైన నేతలు వైసీపీకి దొరకడం…

Read More

తెలంగాణ జన సమితిని కీలక నేతలంతా వీడుతున్నారు. తాజాగా జన సమితి కీలక నేతలు వెంకట్ రెడ్డి, మమతారెడ్డి  బీజేపీలో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరితోపాటు మరికొంతమంది నేతలు కూడా బీజేపీలో చేరారు. ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ కోదండరాముని నాయకత్వంలోని టీజేఎస్ నేతలు వలస బాట పట్టడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పొచ్చు. ఉద్యమ కాలం నుంచి కోదండరాం నాయకత్వంలో పని చేసిన కీలక నేతలంతా కాంగ్రెస్ , బీజేపీలో చేరుతున్నారు. టీ-జేఎసీ ఉనికిలో ఉన్న సమయంలో కోదండరాం పిలుపులో ప్రముఖంగా పని చేసిన నేతలు కోదండరాం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే మరో ఆలోచన లేకుండా ఆయనతో కలిసి అడుగులేశారు. కానీ కోదండరాం సున్నిత మనస్తత్వం…ప్రతిసారి వేచి చూసే ధోరణితో కీలక నేతలు పార్టీ ఏర్పాటు చేసిన కొద్దికాలానికే టీజేఎస్…

Read More

యువగళం పాదయాత్రలోనున్న నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ అందర్నీ కదిలిస్తోంది. టీడీపీ హయంలో చేసిన అభివృద్ధితోపాటు జగన్ హయంలో జరుగుతోన్న దోపిడీపై సెల్ఫీ ఛాలెంజ్ లను విసురుతున్నారు. టీడీపీ శ్రేణులు సెల్ఫీ చాలెంజ్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా వాటికి వైసీపీ సరైన ఆన్సర్ చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సెల్ఫీ ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయ్యారు. సెల్ఫీ వీడియోతో సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తోన్న పార్టీ కార్యక్రమాన్నికి వెళ్తుండగా టిడ్కో ఇళ్ళను చూసి బాబు అక్కడ అగ్గారు. వాటితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో జగన్ కు సవాల్ చేశారు. నెల్లూరులో ఇవి మా ప్రభుత్వ హయంలో కట్టిన వేలాది ఇల్లు. మేము చేసిన అభివృద్ధికి టిడ్కో ఇల్లు సజీవ సాక్ష్యాలని.. మీ ప్రభుత్వ హయంలో కట్టిన ఇళ్ళ ఆచూకీ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తూ సోషల్…

Read More

తెలంగాణ బీజేపీ అద్యక్ష బాధ్యతలను మరో కొత్త నేతకు అప్పగించబోతున్నారా..? పేపర్ లీక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ ను ప్రెసిడెంట్ పోస్ట్ లో కొనసాగించడం ఎంతమాత్రం భావ్యం కాదని హైకమాండ్ కు రాష్ట్ర నేతలు కొంతమంది నివేదికలు పంపించారా..? బండి అరెస్ట్ నేపథ్యంలో అద్యక్ష బాధ్యతల కోసం కీలక నేతలు తమకు సన్నిహితంగా ఉండే కేంద్రంలో బీజేపీ పెద్దలతో లాబియింగ్ కొనసాగించారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది కాలంగా బండి సంజయ్ అద్యక్ష బాధ్యతలపై చర్చ జరుగుతోంది. ఆయనను తప్పించి మరో నేతకు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని తరుణ్ చుగ్ లాంటి నేతలు చెబుతున్నా బండి పోస్ట్ కు ఎసరు తప్పదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ అరెస్ట్ తో పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు కొంతమంది ప్రెసిడెంట్ పోస్ట్ కోసం…

Read More

తెలంగాణ రాజకీయాలను గత కొన్ని రోజులుగా పేపర్ లీక్ వ్యవహారం కుదిపేస్తోంది. ముఖ్యంగా టీఎస్ పీస్సీ పేపర్ల లీకుల వ్యవహారంతో ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. పైగా ఈ వ్యవహారంలో నేరుగా కేటీఆర్, కవితల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ వైపు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతోంటే… మరోవైపు పదో తరగతి ప్రశ్నాపత్రాలు కూడా లీక్ కావడంతో ప్రభుత్వం పరిస్థితి పెనం మీది నుంచి పోయ్యిలోకి పడినట్టయింది. ప్రజలు, మీడియా, ప్రతిపక్షాలు ఇలా.. అందరి నుంచి ముప్పేటా దాడి మొదలు కావడంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుంది. సరిగ్గా ఇదే సమయంలో హిందీ పేపర్ లీక్ తో బండి సంజయ్ కు సంబంధముందని పోలీసులు తేల్చడంతో.. ఇక సర్కార్ రూట్ మార్చింది. ఆ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని మరిపించేలా చేసింది. ఇక దొరికిందే ఛాన్స్ అని.. బండి సంజయ్ ను…

Read More

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన తాజాగా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతల సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి కమలం కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు కిరణ్ కుమార్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతానని ఏనాడూ అనుకోలేదని కానీ తాజాగా ఆ పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఆయన ఇప్పుడు కొత్తగా పార్టీని వీడటం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణను ఏర్పాటు చేసిన తరువాత ఆయన కాంగ్రెస్ కు గతంలోనే రాజీనామా చేసి వేరు కుంపటి పెట్టుకున్నారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ తరుఫున పోటీ…

Read More

మంచు ఫ్యామిలీలో అందరికీ కాస్త వెటకారం ఎక్కువే. అడిగిన ప్రశ్నలకు సందర్భానుసారం సమాధానం చెప్పకుండా తలతిక్క సమాధానాలు చెప్పి ట్రోలింగ్ కు గురి అవుతారు. ఇటీవలి సంఘటనలతో ఈ ట్రోలింగ్ పెరుగుతున్నా మంచు వారి కుటుంబ సభ్యులు మారడం లేదు. అడ్డదిడ్డంగా సమాధానాలు చెబుతున్నారు. మనోజ్, విష్ణు ల మధ్య గొడవలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. దీనిని కవర్ చేసుకోవడానికి విష్ణు రిలీజ్ చేసిన ‘హౌస్ అఫ్ మంచుస్’ కూడా ఫేక్ అని మంచు లక్ష్మి, మంచు మనోజ్ లు చెప్పిన సమాధానంతో తేలిపోయింది. మనోజ్ పై దాడి చేసిన ఘటనను కవర్ చేసుకునేందుకు యత్నించి విష్ణు దొరికిపోయారు. తాజాగా మోహన్ బాబు ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా విష్ణు – మనోజ్ ల మధ్య గొడవ గురించి అడగ్గా…ఆయన చెప్పిన సమాధానం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ‘’మీ ఇంట్లో నీకు నీ భార్యకు సంబంధం ఏమిటో…

Read More

ప్రధాని మోడీ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12గంటల మధ్యలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మోడీ ప్రారంభించనున్నారు. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పంపారు పీఎంవో అధికారులు. అయితే కేసీఆర్ గత కొంత కాలంగా ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమంలో అస్సలు పాల్గొనడం లేదు. ఈసారి కూడా మోడీకి దూరంగానే ఉంటారా..? గతంలోని సంఘటనలు వదిలేసి భేష్ గ్గా కలిసిపోతారా..? అనే చర్చ జరుగుతోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం అనంతరం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ సభలో మోడీ పాల్గొనున్నారు. ఈ సభలో కేసీఆర్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఎందుకంటే మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్ కు మాట్లాడేందుకు సమయం కేటాయించారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు…

Read More

తెలుగు మీడియాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందరూ చెప్పేపేరు రవి ప్రకాష్. టీవీ9 అనే శాటిలైట్ ఛానెల్ ను అతి తక్కువ బడ్జెట్ తో ప్రారంభించి.. దాని దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించి ఛానెల్ ను దేశవ్యాప్తం చేశారు. అయితే, టీవీ9లో జరిగిన పరిణామాలు, రాజకీయం మీడియాలోకి చొరబడటంతో రవి ప్రకాష్ ఆ చానెల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయన ‘తొలివెలుగు’ అనే వెబ్ ఛానెల్ ను వెనకుండి నడిపిస్తున్నారు. ఈ ఛానెల్ యూట్యూబ్ ఛానెలే అయినా శాటిలైట్ కు తీసిపోని రీతిలో తెలంగాణ ప్రజల ఆదరణను చూరగొన్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజలకు దగ్గర అయింది. ప్రస్తుతం రవి ప్రకాష్ – తెలంగాణ ప్రభుత్వ పెద్దల మధ్య సఖ్యత కుదిరింది. పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రవి ప్రకాష్ సేవలను వాడుకోవాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన…

Read More

చిలకలూరిపేటలో వైసీపీ నిర్వహించిన సభలో సీఎం జగన్ ముందే బరస్ట్ అయ్యారు ఎంపీ లావు కృష్ణదేవరాయులు. తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని…అధికారిక కార్యక్రమాలకు కూడా వైసీపీ నేతలు దూరం పెడుతున్నారని అందరూ చూస్తుండగానే కృష్ణదేవరాయులు చెప్పడంతో జగన్ సైతం ఖంగుతిన్నారు. మంత్రి విడదల రజిని.. ఎంపీ కృష్ణదేవరాయులు మధ్య కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది. దీంతో నరసరావుపేట నియోజకవర్గంలో ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎంపీని పట్టించుకోవడం లేదు. ఇదంతా విడదల రజిని చేయిస్తున్నారని ఎంపీ వర్గం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ వేదిక పైకి వెళ్తుండగా ఎంపీని కింద చూసి పలకరింగా ఆయన తనలోని ఆవేదనంత వెళ్లగక్కారు. అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని..ప్రోటోకాల్ పాటించడం లేదని తాను లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో జగన్ ఉలిక్కి పడ్డారు. రా కృష్ణా అంటూ.. ఆయనను వేదికపైకి తీసుకెళ్లారు. ఈ ఘటన చిలుకలూరిపేట…

Read More