Author: Prashanth Pagilla

ప్రతిపక్ష కూటమికి తనను చైర్మన్ ను చేస్తే ఎన్నికల ఖర్చును తానే పెట్టుకుంటానని బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే…బీజేపీయేతర పార్టీలకన్నింటికి ఎన్నికల ఖర్చు చేసేంత డబ్బు కేసీఆర్ కు ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా ఈ సీక్రెట్ ను ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో బయటపెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూదందా చేసి కేసీఆర్ కోట్లను గడించారని ఆర్కే పేర్కోన్నాడు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి…అవి తమవేనని ఎవరైనా కోర్టుకు వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకుంటే… వాటిని ప్రభుత్వం తరుఫున కనీసం సవాల్ చేయకుండా నిస్సహాయంగా ఉంటున్నారని.. అలా ప్రైవేట్ పరం చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆర్కే చెప్పుకొచ్చారు. కేసిఆర్ రియల్ స్టేట్ బిజినెస్ ను అడ్డుపెట్టుకొని సంపాదించడంతోనే జాతీయ స్థాయిలో పార్టీలకు ఎన్నికల ఖర్చు చేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారని ..మొత్తంగా తెలంగాణను…

Read More

టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నోటిసులు పంపిన కేటీఆర్ కు రేవంత్ ఊహించని విధంగా రిప్లై ఇచ్చారు. తనకు పంపిన నోటిసులు వాపస్ తీసుకోకపోతే తానే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కేటీఆర్ కు రిటర్న్ ఝలక్ ఇచ్చారు. తాను నిరుద్యోగుల తరుఫున కేటీఆర్ పై నిర్దిష్టమైన ఆరోపణలు చేశానని తెలిపారు. టీఎస్ పీస్సీకి సాంకేతికంగా మొత్తం ఐటీ శాఖనే సపోర్ట్ చేస్తుంది కాబట్టి…పేపర్ లీక్ తో ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్ కు సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పేపర్ లీక్ వ్యవహారంపై నిష్పాక్షపాతమైన విచారణ జరగాలని సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశామని గుర్తు చేశారు రేవంత్. తెలంగాణ ఉద్యమమే నియామకాల ప్రాతిపదికన ప్రారంభమైందని గుర్తు చేసిన రేవంత్…అసలు తెలంగాణ ఉద్యమంతో…

Read More

బయటి ప్రపంచానికి రైతు బాంధవుడిగా కనిపించే చక్రధర్ గౌడ్ లో ఎవరికీ కనిపించని మరో రూపం దాగి ఉందా..? సంఘ సంస్కర్తగా కలరింగ్ ఇచ్చిన చక్రధర్ గౌడ్ అసాంఘీక కార్యకలాపాలు కూడా కొనసాగించారా..? ఇటీవలి తన స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం కేసులో పట్టుబడిన చక్రధర్ గౌడ్ ఈ సంఘటనతో తన అసలు రంగు బయటపడుతుందనే బీజేపీలో చేరారా..?అంటే అవుననే సమాధానం వస్తోంది. గాద‌గోని చ‌క్ర‌ధర్ గౌడ్.. ఈ మ‌ధ్య కాలంలో సిద్ధిపేట రాజ‌కీయాల్లో విప‌రీతంగా వినిపిస్తోన్న పేరు. సిద్ధిపేటలో నివాసమంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో ఆర్థికంగా బలంగా ఎదిగాడు. ఆ తరువాత ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించి కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చే ‘రైతుబందు’కేవలం భూసాములకు మాత్రమే మేలు చేసే పథకమని…స్వచ్చందంగా తాను రైతు బంధును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలోనే తనకు…

Read More

సోషల్ మీడియాను గత కొంతకాలంగా ఊపేస్తోన్న వార్త నిహారిక కొణిదెల విడాకుల ఇష్యూనే. చైతన్య జొన్నలగడ్డ కుటుంబం విధిస్తోన్న అంక్షలతో విసిగిన నిహారిక అతనితో విడిపోయేందుకు సిద్దమైందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడాకుల పంచాయితీ కాస్త మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నిహారిక, చైతన్యలు కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా నిహారిక కుదరదని చెప్పడంతో వారిద్దరిని తీసుకొని నాగబాబు , చిరంజీవి వద్దకు ఈ పంచాయితీని తీసుకెళ్లాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఎందుకు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నావని నిహారికను చిరంజీవి ప్రశ్నించగా… ప్రతి విషయంలో తన అత్తా, మామల ఆంక్షలను భరించలేకపోతున్నానని చెప్పిందట. దాంతో తమ మధ్య తరుచు గొడవలు అవుతున్నాయని అందుకే చైతన్యతో కలిసి ఉండలేనని చెప్పగా చిరంజీవి జోక్యం చేసుకొని వాళ్ళిద్దరితో మాట్లాడి కంప్రమైజ్ చేశాడని అంటున్నారు. చిరంజీవి దగ్గరకు ఈ విడాకుల పంచాయితీ చేరడంతో ఈ వివాదానికి…

Read More

వైసీపీ ఎమెల్యేలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. వైసీపీ పాలన ఏమాత్రం బాగోలేదని ఓపెన్ గానే ప్రకటిస్తున్నారు. ఆ మధ్య ఆనం రాంనారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీ పాలనపై పెదవి విరిస్తే వారంతా టీడీపీ డైరక్షన్ లో ఈ విమర్శలు చేస్తున్నారని చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే జగన్ పాలన ఏమంత ఆశాజనకంగా లేదనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం చర్చనీయంశం అవుతోంది. ఉమ్మడి కర్నూల్ జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఆయన ఎలాంటి ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేశారో కానీ వైసీపీలో అగ్గి పుట్టించినట్లు ఉన్నాయి. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉన్న మాట నిజమేనని దీనికి జగన్ కు అనుభవం లేకపోవడమే కారణమని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలతో ఎలా సఖ్యతగా మెలగాలన్న దానిపై జగన్ కు ఎక్స్ పిరియన్స్ లేకపోవడంతోనే ఎమ్మెల్యేలకు – ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ వస్తోందని చెప్పారు.…

Read More

పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసేందుకు తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించి వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చర్యలు ఉంటాయని పరేడ్ గ్రౌండ్ సభ నుంచి ప్రగతి భవన్ కు హెచ్చరికలు పంపారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలా..? వద్దా అని ప్రజలను ప్రశ్నించారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదని రెండు ఒకే తాను ముక్కలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్న తాము ఉపేక్షించబోమని పరోక్షంగా బీఅర్ఎస్ సర్కార్ ను హెచ్చరించారు. తెలంగాణకు కేంద్రం దండిగా అండదండలు కల్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేక సకాలంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు పెండింగ్ లో ఉంటున్నాయని రాష్ట్రప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలంగాణ ప్రజలకు నష్టం కల్గించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ప్రతి ప్రాజెక్టులో తమ స్వార్ధాన్ని చూసుకుంటున్నారని.. కమిషన్లను దండుకుంటున్నారని పరోక్షంగా కాళేశ్వరంపై వస్తోన్న ఆరోపణలు మోడీ వినిపించారు.…

Read More

పదో తరగతి హిందీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో ఓ విద్యార్థి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. పేపర్ లీక్ కు సంబంధించిన రాజకీయ కుట్రలో ఏమాత్రం సంబంధం లేని ఓ విద్యార్థి బీఆర్ఎస్ – బీజేపీ రాజకీయాలకు బలి అయినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల రాజకీయ ఎత్తుగడలో ఏమాత్రం సంబంధం లేని పదిహేనేళ్ళ కుర్రాడు పరీక్షలు రాసే అర్హత కోల్పోయాడన్న వాదనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కమలాపూర్ లోని పదో తరగతి పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తోన్న హరీష్ అనే విద్యార్ధిని బెదిరించి ఓ వ్యక్తి హిందీ పేపర్ ఫోటో తీసుకున్నాడు. క్వశ్చన్ పేపర్ ఇచ్చేందుకు మొదట హరీష్ నిరాకరించి, ఇన్విజిలేటర్ కు చెప్తానన్నాడు. ఎవరికైనా చెప్తే ఇక్కడే చంపేస్తానని బెదిరించి ప్రశ్నాపత్రం ఫోటో తీసుకొని దానిని వాట్సప్ లో వైరల్ చేశారు. ఆ తరువాత అది ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్ట్ నుంచి బండి సంజయ్ కు…

Read More

బీహార్ లో జన సురాజ్ పార్టీ ఏర్పాటు చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీకి అప్పుడే తొలి విజయం దక్కింది. అయితే అది నేరుగా గెలిచింది కాదు. ఆ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపొందారు. బీహార్ లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఫాక్ అహ్మద్ అనే అభ్యర్థికి ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అహ్మద్ జన సురాజ్ పార్టీ మద్దతుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో చట్టసభల్లో జన సురాజ్ పార్టీ పరోక్షంగా ఎంటర్ అయినట్లు అయింది. ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల్లో ఎలా గెలుపొందాలో బాగా తెలుసు. కాబట్టి ఆయన వ్యూహలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అహ్మద్ అనే స్వతంత్ర అభ్యర్థి గెలిచి ఉండొచ్చననే అభిప్రాయం వినిపిస్తోంది. ఇది జన సురాజ్ పార్టీ గెలుపు కాకపోవచ్చు కానీ ఆ పార్టీ మద్దతుతో గెలుపొందటమంటే అభ్యర్థి సాధించిన విజయంలో…

Read More

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాని పాల్గొనే అధికారిక మీటింగ్ లో కేసీఆర్ కు ఆహ్వానం ఉంది కానీ ఆయన హాజరు కావడం లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. అయితే తెలంగాణ పర్యటనలో ప్రధాని బీఆర్ఎస్ పై ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది అందరిలో నానుతోన్న ప్రశ్న. గతంలో బీఆర్ఎస్ టార్గెట్ గా మోడీ అగ్రెసివ్ గా మాట్లాడిన సందర్భాలు ఏమి లేవు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా పరోక్షంగా బీఆర్ఎస్ కు చురకలు అంటించారు తప్పితే నేరుగా బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేయలేదు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు టోటల్ డిఫరెంట్. బీఆర్ఎస్ – బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ లో రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులతో బీఆర్ఎస్ – బీజేపీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇదిలా ఉండగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ…

Read More

సెల్ ఫోన్, ఇంటర్ నెట్, ఒటిటి ఫేస్బుక్ లాంటి డిజిటల్ యుగంలో తెలుగు సాహిత్య మరుగున పడిపోతోంది అన్నది వాస్తవం. కానీ సత్తా ఉన్న పుస్తకాలూ రాస్తే హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి అని ఈమధ్య ప్రముఖ సాహితివేత్తా, నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ రాసిన ‘పోయిట్రీ వర్క్ షాప్’ పుస్తకం రుజువు చేసింది. అమ్మకాలల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈమధ్య కాలంలో మోహన రావు దురికి రాసిన ‘నీతి మాలినవాళ్ళ నీతి కథలు’ కథల సంకలనం కూడా అమ్మకాలల్లో ఇలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందుకే ‘నీతి మాలినవాళ్ళ నీతి కథలు’ రెండో భాగం కూడా విడుదల చేసింది సాహితీ ప్రచురణ (విజయవాడ) సంస్థ. ఇప్పుడు మూడో భాగం, నాలుగో భాగం కూడా మేలో రాబోతున్నాయి. ‘నవధాన్యాలు’ అనే మరో పుస్తకం కూడా విపరీతంగా అమ్ముడు పోతున్నాయి. డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ రాసిన ఈ ‘పోయిట్రీ…

Read More