Author: Prashanth Pagilla

ఇల్లు అలకగానే పండగ అయిపోదని తెలిసిందే. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం పార్టీ పేరు మార్చగానే  మాది జాతీయ పార్టీ అయిపోయిందని ఓ రేంజ్ లో ప్రచారం చేసుకుంటున్న దశలో ఈసీ బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదని…రాష్ట్ర హోదా మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఏపీలో రాష్ట్ర శాఖను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కు అక్కడ రాష్ట్ర హోదా కూడా లేదు. అంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే అక్కడ బీఆర్ఎస్ కు కారు గుర్తు దక్కుతుందని ఖచ్చితంగా చెప్పలేం. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ కు కారు గుర్తు ఉంటుంది. జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో మిగతా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు కారు గుర్తు దక్కడం గగనమే. అక్కడి పరిస్థితులను బట్టి ఎన్నికల గుర్తులను ఈసీ ఖరారు చేస్తుంది. ఇక ఇటీవలి ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన ఓట్లు, సీట్లను పరిగణనలోకి…

Read More

విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడం ఖాయమైందని ప్రచారం జరుగుతోన్న వేళ ఓ బిడ్ లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను వంద రోజుల్లో ప్రారంభిస్తామని ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్…తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇక్కడి పరిశ్రమల పునఃప్రారంభానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోకపోగా ఏపీలోని విశాఖ ఉక్కు బిడ్ లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా రాజకీయ వ్యూహమేనని తెలుస్తోంది. వాస్తవానికి బిడ్ పొందాలనే ఆలోచన కేసీఆర్ కు ఏమాత్రం లేదని… ఆ బిడ్ లో పాల్గొని కేంద్రంపై తాము పోరాడుతున్నట్లు సంకేతాలు ఇవ్వాలనేది తెలంగాణ సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. ఇలా చేయడం వలన ఏపీ ప్రజలు ముఖ్యంగా విశాఖ ప్రజల మెప్పు పొందవచ్చునని.. అలాగే ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ పట్ల ఓ పాజిటివ్ వైబ్ ఉండేలా కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను…

Read More

అకీరానందన్ బర్త్ డే సందర్భంగా పవన్ అభిమాని చేసిన కామెంట్ కు రేణు దేశాయ్ ఇచ్చిన రిప్లై వివాదస్పదం అవుతోంది. మా అన్న కొడుకు ఎలా ఉన్నాడో చూపించండని రేణు దేశాయ్ ను ట్యాగ్ చేస్తూ పవన్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అంతే. అంతమాత్రం దానికే రేణు దేశాయ్ విరుచుకుపడింది. అకీరాను మా అన్న ( పవన్ ) కొడుకు అన్నాడని ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. అకీరా నా కొడుకు అని బదులిస్తూ అసలు నువ్వు ఒక తల్లికే పుట్టావా..? ముందు మాట్లాడటం నేర్చుకో అంటూ పవన్ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరూ ఊహించని విధంగా రేణు దేశాయ్ నుంచి రిప్లై రావడంతో నెటిజన్స్ అంత ఆశ్చర్య పోయారు. పవన్ కొడుకు అంటే మీ కొడుకు కాదని అర్థం కాదు కదా మేడం…ఇంత చిన్న విషయానికి ఇలా రిప్లై ఇవ్వడం సరైంది కాదంటూ సదరు నెటిజన్…

Read More

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ సినీ హీరోగా మారబోతున్నారు. ఆయన నటించిన సినిమా త్వరలోనే విడుదల కానుంది. డిబేట్లలో తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించే దయాకర్ తెరపై ఎలా కనిపిస్తాడో, ఆయన నటన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కాంగ్రెస్ అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది అద్దంకి దయాకర్ నటించిన సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎదురైన వరుస పరాజయాలు కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీశాయి. దీంతో చాలామంది నేతలు పార్టీ పని అయిపోయిందని పార్టీని వీడారు. వీరిలో చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోనున్న కాలంలో మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులు , చైర్మన్ పదవులు, పీసీసీ అద్యక్ష పదవులు అనుభవించిన వారే ఉన్నారు. ఇలా సీనియర్ నేతలంతా పార్టీ కష్టకాలంలో ఉందని కాంగ్రెస్ ను వీడినా తెలంగాణ ప్రజల కళను సాకారం చేసిన…

Read More

ఇండియాలో పెరుగుతోన్న కరోనా కేసులు నాలుగో వేవ్ కు సంకేతమా..? కోవిడ్ విషయంలో ఇండియా అలర్ట్ కాకపోతే కరోనా విలయం తప్పదా…? పెరుగుతోన్న కేసులు ఇదే విషయాన్నీ చెబుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. ఇండియాలో కరోనా మరోసారి గేర్ మార్చింది. కరోనా మహమ్మారి ధాటికి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 85,076 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 5880 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 35, 199 కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో మొత్తం 14 మంది కరోనాతో మరణించారు. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇండియాలో మరోసారి కరోనా విలయం తప్పదనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియాలో నిర్లక్ష్యం ఎక్కువ. కరోనా కేసులు తగ్గుముఖం పట్టగానే ముక్కుకు మాస్క్ కట్టడం…

Read More

కోడికత్తి కేసు కీలక దశకు చేరుకున్న వేళ జగన్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ జరపాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ చూసి న్యాయవర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. అసలు ఆయన ఉద్దేశ్యం ఏంటని నివ్వెరపోతున్నారు. ఈ కేసు విషయంలో స్పష్టత రావాలనుకుంటున్నారా..? విచారణ మరింత ఆలస్యం కావాలని కోరుకుంటున్నారా..? అని జగన్ వైఖరిని తప్పుబడుతున్నారు. అసలు లోతుగా విచారణ అంటే ఏమిటన్న దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జగన్ ఒత్తిడి మేరకు కోడికత్తి కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. విచారణ చేపట్టిన ఎన్ఐఏ కీలక విషయాలను వెల్లడించింది. సరిగ్గా విచారణ కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో జగన్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసును డీల్ చేస్తోన్న ఎన్ఐఏ విచారణపై నమ్మకం లేదన్నట్లుగా ఆయన మరింత లోతైన విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లుగా కనబడుతోంది. జగన్ వైఖరి చూస్తుంటే కోడికత్తి కేసు విచారణ పూర్తి కావొద్దనే…

Read More

బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల పేపర్ లీక్ కేసులో ఆయనను అరెస్ట్ చేసే సమయంలో ఫోన్ చూస్తూనే కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ మీడియాలో ప్రసారం అయ్యాయి. కానీ సంజయ్ మాత్రం తన ఫోన్ మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు. అటు పోలీసులు బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని ప్రకటించగా.. బండి సంజయ్ మాత్రం తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయంశం అవుతోంది. వాస్తవానికి ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే ముందుగా వారి ఫోన్ స్వాధీనం చేసుకుంటారు. బండి సంజయ్ విషయంలోనూ అలాగే చేశారా..? అనేది క్లారిటీ లేదు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ఫోన్ బయటకొస్తేనే చిక్కుముడి వీడుతుంది. ఎందుకంటే పేపర్ లీక్ నిందితుడు ప్రశాంత్ , బండి సంజయ్ తో హిందీ పేపర్ లీక్ అయిన ముందు రోజే మాట్లాడాడని…

Read More

అకీరానందన్ విషయంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది. అకీరానందన్ ను పవన్ కళ్యాణ్ కొడుకు అన్నందుకు ఆమె సీరియస్ గా తీసుకొని పెద్ద పోస్ట్ చేశారు. అకీరానందన్ ను పవన్ కొడుకు అంటే రేణు దేశాయ్ కొడుకు కాదని అర్థం కాదు. ఈ విషయం ఆమెకు తెలియనిది కాదు. పవన్ కొడుకు అంటే రేణు నుంచి అకీరాను వేరు చేస్తున్నట్టు కూడా కాదు కానీ, ఎందుకో ఎప్పుడు లేని విధంగా సీరియస్ అవుతూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. చాలా కాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడే ఎందుకు వివాదాస్పదం అయ్యే పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. రేణు దేశాయ్ తాజా పోస్ట్ వెనక పెద్ద తతంగమే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు కూడా రేణు దేశాయ్ ఇలాగె వ్యవహరించారు. పవన్ అంటేనే గిట్టని సాక్షి మీడియాకు ఇంటర్వ్యూ…

Read More

బీఆర్ఎస్ అధిష్టానంపైనే తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరనున్నారు..? ఈ ఇద్దరి నేతలను చేర్చుకోవాలని పోటాపోటీగా ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్, బీజేపీలలో ఈ ఇద్దరి నేతల ఓటు ఎవరికీ పడనుంది..? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడంతో ఈ ఇద్దరి నేతల రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డిబేట్ గా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. దాంతో ఈ ఇద్దరు నేతల పొలిటికల్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. పొంగులేటిని చేర్చుకోవాలని బీజేపీ తెగ ప్రయత్నం చేస్తోంది కాని ఆయన మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఏమాత్రం బలం…

Read More

ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ నేతలంతా అప్పుడే ఎన్నికలపై దృష్టిసారిస్తున్నారు. అయితే వైసీపీ తరుఫున గెలిచిన ఎంపీలో చాలామంది ఈసారి ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కొంతమంది ఎంపీలు అప్పుడే సిట్టింగ్ లతో సంబంధం లేకుండా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యేలకు మంట పుట్టిస్తుండగా మరికొంతమంది ఎంపీలు జగన్ వద్ద లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 21 మంది వైసీపీ ఎంపీల్లో దాదాపగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగాలని కసరత్తు చేస్తున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురం నుంచి పోటీ చేయలని ప్రయత్నిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆమె తన ఎంపీ ల్యాండ్స్ ను పిఠాపురం నియోజకవర్గానికి ఎక్కువగా కేటాయిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు ఆమెకు మధ్య అంతర్గత పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అరకు ఎంపీ మాధవి పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్…

Read More