Author: Prashanth Pagilla

తన యాంకరింగ్ తో అందర్నీ అలరించే సుమ కనకాల అరెస్ట్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆమె అరెస్ట్ అయింది నేరం చేసిందుకు కాదు. ఓ మూవీ ప్రమోషన్ కోసం సుమను అరెస్ట్ చేశారు. అయితే అసలు విషయం తెలియని సుమ అభిమానులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. తీరా మూవీ ప్రమోషన్ కోసమే సుమను అరెస్ట్ చేశారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. ఇలాంటి స్టంట్స్ చేసి అభిమానులను కన్ఫ్యూజ్ చేయవద్దు.. మీరు కూడా ఇలాంటి పనికిమాలిన స్టంట్స్ చేసి అభిమానులను తప్పుదోవ పట్టిస్తారని ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆమె ఇలాగే ఓ స్టంట్ చేశారు. తాను నటనకు గుడ్ బై చెప్తున్నానని ప్రకటించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. మొదట ఆమె నటనకు గుడ్ బై చెప్తున్నానడంతో నిజమేనని నమ్మేసిన సుమ అభిమానులు కన్నీటిపర్యంతం అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీరు…

Read More

కేసీఆర్ అవినీతి, భూదోపిడీకి సంబంధించిన ఆధారాలను వెలికితీసి కల్వకుంట్ల కుటుంబ అక్రమాలను రేవంత్ రెడ్డి బయటపెడుతోన్న వేళ కాంగ్రెస్ పార్టీలోని కేసీఆర్ కోవర్టులు అలర్ట్ అయ్యారా..? రేవంత్ లేవనెత్తుతోన్న అంశాలపై జనాల అటెన్షన్ ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ ఆపరేషన్ షురూ చేశారా..? ఆ సీనియర్ నేత డైరక్షన్ లోనే ఆ నిత్య అసంతృప్త నేత పార్టీ మార్పు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అవినీతి చిట్టాను రేవంత్ రెడ్డి బయటపెట్టిన ప్రతిసారి కాంగ్రెస్ లో కొంతమంది నేతలు హైడ్రామా నడపి బీఆర్ఎస్ కు ఫేవర్ చేసేలా వ్యవహరించడం రొటీన్ గా మారుతోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ భూ దోపిడీ మాయాజాలాన్ని ఆధారాలతో సహా రేవంత్ బయటపెడుతుంటే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతారని మీడియాకు లీకులివ్వడం వెనక రాజకీయ వ్యూహం దాగి ఉండొచ్చునని…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు వేగం మందగించిందని ప్రచారం జరుగుతోన్న వేళ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలనానికి తెరలేపారు. తాను ఆప్ నేతల ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత సన్నిహితుడికి 15కోట్ల డబ్బును అప్పగించినట్లు ఇటీవలే జైలు నుంచి లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా మరో బాంబ్ పేల్చాడు. ఈ పదిహేను కోట్ల డబ్బును మూటజెప్పెందుకు కవితతో చాట్ చేసినట్లు సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. ఆమెతో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్ లను తాజాగా బయటపెట్టాడు. కేజ్రీవాల్‌ను AKగా, సత్యేంద్ర జైన్‌ను SJగా కోడ్ నేమ్‌తో చాటింగ్ చేసినట్టుగా పేర్కొన్నాడు. ఇక ఎమ్మెల్సీ కవిత పేరును Kavita Akka TRS తో నంబర్ సేవ్ చేసుకున్నట్టుగా అందులో కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఏంటనే దానిపై ఈడీ కీలక ఆధారాల అన్వేషణలో ఉండగా సుఖేష్…

Read More

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పదా..? నాలుగు జిల్లాలో ఆ పార్టీ ఖాతా కూడా తెరవదా..? 11మంది మంత్రులకు ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదా..? ఓటమి భయంతోనే కమ్యూనిస్ట్ పార్టీల పొత్తుకు బీఆర్ఎస్ ఆరాటపడుతుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తోన్న కేసీఆర్ కు తాజాగా అందిన ఓ సర్వే రిపోర్ట్ సంచలనంగా మారింది. డిసెంబర్ నుంచి వరుసగా సర్వేలు చేయిస్తోన్న కేసీఆర్ ఇటీవల మరో సర్వే చేయించారు. డిసెంబర్ నాటి సర్వేతో పోలిస్తే తాజాగా అందిన నివేదిక ప్రకారం 6శాతం పార్టీ గ్రాఫ్ పడిపోయిందని తేలింది. ఇటీవలి టీఎస్ పీస్సీ పేపర్ లీక్ , టెన్త్ పేపర్ లీక్ లో సర్కార్ వైఫల్యంతోపాటు రైతు బంధు నిధులు , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , సొంత జాగ ఉన్నవాళ్ళకు మూడు లక్షల ఆర్ధిక సాయం, ఉద్యోగ నియామకాల్లో సర్కార్…

Read More

ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్న కమలనాథులు ఆయన చేరికతో పార్టీ పుంజుకుంటుందని ఆశలు పెట్టుకున్నారు. కిరణ్ చేరికతో ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడెం తెలియదు. మరికొద్ది నెలలోనే రిజల్ట్ రానుంది. ఏపీలో బలపడేందుకు కిరణ్ ఓ ఆశాకిరణం అవుతారని గతంలో కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది ఇప్పుడు బీజేపీ కూడా అవే ఆశలు పెట్టుకుంది. ఎనిమిదేళ్లుగా రాజకీయాల్లో పత్తాకు లేని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో యాక్టివ్ పాలిటిక్స్ చేసిన పెద్దగా ప్రయోజనం ఉంటుందని అనుకోవడానికి లేదు. రాష్ట్ర విభజన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ను వీడి జైసమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసినా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. కనీసం చెప్పుకోదగ్గ నేతలెవరూ ఆ పార్టీలో చేరలేదు. ఆ తరువాత మళ్ళీ సైలంట్ అయ్యారు. ఆ మధ్య కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పదవులు ఇవ్వలేదన్న…

Read More

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందని బీఆర్ఎస్ తెగ ప్రచారం చేసుకుంది. ఇందుకోసం అధికారులు ఆలస్యం లేకుండా సింగరేణికి వెళ్లి ఉన్నాతాధికారులతో మాట్లాడారు. కట్ చేస్తే బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ప్రభుత్వాలకు అర్హత లేదని తేల్చారు. వాస్తవానికి బిడ్డింగ్ లలో ప్రభుత్వాలు పాల్గొనలేవు. అందుకే సింగరేణిని ముందుంచి బిడ్డింగ్ లో పాల్గొంటామని ప్రచారం చేసుకున్నారు. అలా కూడా బిడ్డింగ్ లో పాల్గొనడటం కుదరదని తేలినా.. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. స్టీల్ ప్లాంట్ కార్యాలయంలో ఉన్నాతాదికారులతో చర్చించిన అనంతరం బిడ్డింగ్ లో పాల్గొనడానికి నిబంధనలు అంగీకరించవనే లీకును మీడియాకు పాస్ చేశారు. సింగరేణి కూడా ప్రభుత్వ సంస్థే. కానీ స్టీల్ ప్లాంట్ లో బొగ్గుతో చేసే పనులేం ఉండవు. కాబట్టి సింగరేణిని ముందుంచి బిడ్డింగ్ లో పాల్గొనేందుకు కూడా అవకాశం లేదు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలంటే ఉండాల్సిన అర్హతలు అటు…

Read More

పెళ్లికాని ప్రసాద్ లకు ఊరట కల్గించేలా కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైతుల కుమారులను పెళ్ళాడిన యువతులకు తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. రైతుల కుమారులను పెళ్లి చేసుకునేందుకు యువతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని…ఈ సమస్య నుంచి ఉపశమనం కల్గించెందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేడీఎస్ అధినేత కుమారస్వామి వెల్లడించారు. కోలార్ లోని పంచరత్నలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కుమారస్వామి మాట్లాడుతూ పెళ్లి కాని ప్రసాద్ ల సమస్యలను తీర్చే హామీని ప్రకటించారు. కొత్తగా ఎవరూ చేయని ఆలోచన తాము చేస్తున్నామని తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీ అమలుపై దృష్టి పెడుతామని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడినట్టు అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ హామీని ప్రకటిస్తున్నామని వెల్లడించారు. పేదరికాల్లో మగ్గిపోతున్న రైతులు తమ కొడుకులకు పెళ్ళిళ్ళు…

Read More

వివేకా హత్య కేసు ఎటు తేలకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. కొత్త, కొత్త పిటిషన్ లు దాఖలు చేస్తూ విచారణను సవ్యంగా సాగకుండా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండగా …అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాది ఓ కొత్త వాదన వినిపించారు. ఇది ఇంతకుముందు విన్నది కాదు. కొత్తది. వివేకా హత్య కేసు నిందితుడుగా నున్న సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారట. అది తట్టుకోలేకే సునీల్ యాదవ్ ను గొడ్డలిపోటుతో హత్య చేశారని హైకోర్టులో నిరంజన్ రెడ్డి ధర్మాసనం ముందు వాదించారు. సోమవారం జరిగిన విచారణలో ఇలాంటి విషయాలను చెప్పలేదు. సోమవారం రోజున ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించేందుకు వస్తే… మంగళవారం మాత్రం జగన్ కు సంబంధించిన కేసులో వాదించే నిరంజన్ రెడ్డి వచ్చారు. ఆయనే ఈ కొత్త వాదన వినిపించారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని వైసీపీ నేతలు కూడా ఎక్కడ చెప్పలేదు. ముస్లిం…

Read More

మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. తనతో సెల్ఫీలు దిగేందుకు వస్తోన్న మహిళలను ఉద్దేశించి కేటీఆర్ సరదాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూడు మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ అంటేనే ప్రధాని విషం కక్కుతున్నారని మండిపడారు. తెలంగాణ ప్రజలంటేనే ప్రధాని దృష్టిలో ద్వితీయ శ్రేణి పౌరులు అనే చిన్నచూపు ఉందని విమర్శించారు. అనంతరం దళిత బంధు యూనిట్లను పరిశీలించిన కేటీఆర్… లబ్దిదారులతో కలిసి భోజనం చేశారు. వారితో కాసేపు ముచ్చటించారు. దళిత బంధుతో ఆర్థికంగా బలపడాలని కేసీఆర్ దళిత బంధు పథకం అసలు లక్ష్యాన్ని అందుకోవాలన్నారు కేటీఆర్. దళితులు సొంత కాళ్ళపై నిలబడాలనే సదుద్దేశ్యంతోనే కేసీఆర్ దళిత బంధు పథకానికి రూపకల్పన చేశారని వివరించారు. ఇదిలా ఉండగా కేటీఆర్ పర్యటనలో ఒక ఆసక్తికరమైన సీన్…

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాలు ఫ్రాక్చర్ కావడంతో మూడు వారాలపాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్లు కవిత పేర్కొన్నారు. కవిత కాలుకు గాయం కావడంతో ఆమె ఇప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరయ్యే అవకాశం లేదు. ఇటీవల ఈడీ విచారణకు హాజరైన కవిత ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని డేటాను వెలికి తీసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కవిత నుంచి పది ఫోన్లను తీసుకున్న ఈడీ అధికారులు ఫోన్లలోని సమాచారాన్ని వెలికితీసిన అనంతరం విశ్లేషణ చేసి కవితను మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. కవిత ఫోన్లలోని డేటా రికవరీ చేయడం పూర్తైందని త్వరలోనే ఈడీ నుంచి కవితకు పిలుపు వస్తుందని విస్తృత ప్రచారం జరుగుతోన్న వేళ ఆమె కాలు…

Read More