Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో టెన్త్ ప్రశ్నాపత్రాల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని బండి సంజయ్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఫలితంగా అది బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అయింది. టెన్త్ పేపర్ లీక్ అయిందంటూ బండి సంజయ్ హడావిడి వలన టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారం మరుగున పడింది. దీంతో ప్రభుత్వ పెద్దలకు కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. టీఎస్సీ పేపర్ లీక్ విషయంలో కేటీఆర్ , కవిత పాత్రలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో టెన్త్ పేపర్ లీక్ అంశాన్ని బండి సంజయ్ తెరపైకి తీసుకొచ్చి టీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని కోల్డ్ స్టోరేజ్ లోకి తీసుకెళ్లారనే విమర్శలు వస్తున్నాయి. టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపెస్తోన్న దశలోనే టెన్త్ తెలుగు పేపర్ బయటకు రావడం… ఆ మరుసటి రోజు హిందీ పేపర్ కూడా బయటకు రావడంతో సర్కార్ పై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి.…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర కూడా ఉందా..? అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను విచారించిన సీబీఐ ఏయే అంశాలపై ఆయన్ను ప్రశ్నించిందో స్పష్టత లేదు కానీ కేసీఆర్ – అరవింద్ కేజ్రీవాల్ మధ్య నెలకొన్న రాజకీయ – ఆర్ధిక బంధాలపై ఆరా తీసినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పరిచయాల నుంచి ఆర్ధిక సహాయం అందించుకునే వరకు ఎలా వచ్చిందనే కోణంలో కేజ్రీవాల్ నుంచి వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఆప్ కు బీఆర్ఎస్ ఎందుకు ఆర్ధిక సహాయం అందించిందని సీబీఐ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించినట్లు పేర్కొంటున్నారు. గత కొన్నాళ్లుగా ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకునేందుకు కేసీఆర్ ఆర్ధిక సాయం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆప్ కూడా కేసీఆర్ ఆర్ధిక సహాయం చేశారని అంటున్నారు. అందుకే కేసీఆర్ ఇన్వైట్ చేసినప్పుడుల్లా…
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక వ్యక్తిని లాగుతూ తీసుకెళ్లిన 11 సెకండ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పాలనలో సర్కార్ ఆసుపత్రులలో వీల్ చైర్లు లేక రోగులను ఇలా ఈడ్చుకెళ్తున్నారని విపక్ష నేతలు బీఆర్ఎస్ ను కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో మంత్రి హరీష్ రావు విచారణకు ఆదేశించగా తాజాగా ఈఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ప్రతిమరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఆసుపత్రిలో వీల్ చైర్లు లేవనే ప్రచారాన్ని ఖండించారు. అసలు ఆ వీడియో ఇప్పటిది కాదని స్పష్టం చేశారు. రోగిని ఆసుపత్రి సిబ్బంది ఈడ్చుకు వెళ్ళారని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆ వీడియోలో ఉన్న సదరు వ్యక్తిని అతని బందువులు అస్వస్థతగా ఉన్నాడని అత్యవసర విభాగానికి తీసుకుని వచ్చారన్నారు. అతను మద్యపానానికి బానిసగా ఉన్నాడని, సైకియాట్రిక్ విభాగానికి చెందిన ప్రత్యేక వైద్యులను సంప్రదించాలని రోగి బంధువులకు చెప్పినట్లు ప్రతిమరాజ్…
త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలో ఎన్నికల అధికారులు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయంలో ఎన్నికల ఆఫీసర్ వికాస్ రాజ్ , ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఓటర్లు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా జాబితాను సిద్దం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారుల జాబితాను కూడా సిద్దం చేయాలని ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో జూన్ 1నుంచి ఈవీఎంల మొదటి దశ తనిఖీ చేపట్టాలని సూచించారు. ఈవీఎంలపై అవగాహనా కోసం అధికారులకు రెండు రోజులపాటు అవహగన కల్పించాలని చెప్పారు. ఎలక్షన్ ఓటింగ్ మిషన్ లను పరిక్షించామని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్…
కేసీఆర్ చేస్తోన్న రాజకీయలపైనే ఈ వారం కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఆయన ప్రజలను అమాయకులుగా భావిస్తూ రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వాలు బిడ్ వేయడం సాధ్యం కాదని తెలిసి కూడా బీఆర్ఎస్ బిడ్ లో పాల్గొంటుందని చెప్పడమే. ఈ అంశంతో ఏపీలో బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం కలగడంతోపాటు ఉత్తరాంధ్రలో 25సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఊహలో తెలియాడుతున్నారట. ఆంధ్ర ప్రజలు ఒట్టి అమాయకులనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఆర్కే చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర ప్రజలే మరిచిపోయిన నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకొని మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలపడుతుందని..దేశంలో గులాబీ గుబాళింపు తప్పనిసరిగా జరుగుతుందని..అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ నేనని కేసీఆర్ ఓవర్ థింక్ చేస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలపై కన్నేసిన కేసీఆర్ తెలంగాణను మరిచిపోతున్నారని ఇదే కొనసాగితే ఆయన దారుణ పరాభవం…
వైఎస్ వివేకా హత్యకేసులోకీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాష్ రెడ్డి ( Avinash Reddy ) తండ్రి భాస్కర్ రెడ్డి( Bhaskar Reddy) ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం ఉదయం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు నోటిసులు ఇచ్చి హైదరాబాద్ తీసుకెళ్ళారు. మరోవైపు అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన పులివెందులలో లేరు.హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. ఆయన నివాసానికి కూడా సీబీఐ అధికారులు వెళ్ళినట్లు తెలుస్తోంది. వివేకా కేసులో దర్యాప్తు అధికారి మారడంతో అవినాష్ రెడ్డి రిలాక్స్ అయ్యారు. ముప్పు తప్పిందని భావించారు. అందుకే హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే సీబీఐ అవినాష్ రెడ్డికి వరుస షాకులు ఇస్తోంది. మొన్ననే అవినాష్ రెడ్డి సన్నిహితుడు అయిన ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా అవినాష్ రెడ్డి తండ్రిని కూడా అరెస్ట్ చేసింది.…
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం రచ్చ రాజేసింది. ఇదివరకు చాలా అంశాల్లో పూర్తి సహాయ సహకారాలు అందించుకున్న రెండు పార్టీల మధ్య వైరం తలెత్తడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ ఈ రాజకీయ వైరం కొత్త చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే సెంటిమెంట్ రాజకీయాలు చేయడంలో కేసీఆర్ ను మించిన వారెవరు లేరు. చంద్రబాబును బూచిగా చూపి 2018ఎన్నికల్లో గట్టెక్కిన కేసీఆర్ ఇప్పుడు పార్టీ పేరు మార్చి ప్రాంతీయ వాదాన్ని పక్కనపడేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికారం చేజారిపోకుండా ఉండటంతోపాటు, జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం కొరకు బీఆర్ఎస్ బాస్ పెద్ద స్కెచె వేసినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ , బీఆర్ఎస్ ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉన్నది. రెండు పార్టీల టార్గెట్ చంద్రబాబును కొట్టడమే. కాబట్టి ఇరు పార్టీల మధ్య ప్రస్తుతం చెలరేగుతోన్న మాటల మంటలు వ్యూహాత్మకంగా జరుగుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా.. ఎన్నడూ…
ఏపీ రాజకీయాల్లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరిస్తోన్న జనసేన కుటుంబ వారసత్వ పార్టీగా మారుతుందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు జనసేన పార్టీలో కీలక పదవి అప్పగించడమే ఈ విమర్శలకు కారణం. తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని నాగబాబుకు కట్టబెట్టారు పవన్. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచే పవన్ కు తోడుగా ఉంటూ వస్తోన్న నాగబాబుకు కీలక పదవి దక్కిందని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఏ పార్టీలోనైనా అద్యక్షుడి తరువాత ప్రధాన కార్యదర్శిదే అప్పర్ హ్యాండ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరువాత జనసేనలో నాగబాబుదే కీరోల్ అని చెప్పొచ్చు. దీనిని ఆధారం చేసుకొని జనసేనను కుటుంబ వారసత్వ పార్టీ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్ళు పార్టీలో నెంబర్ 2గా ఉండిన నాదెండ్ల మనోహర్ కు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించకుండా కేవలం పొలిటికల్ ఎఫైర్స్…
కేంద్రంలోనూ బీఆర్ఎస్ ( BRS) చక్రం తిప్పబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR) ప్రకటనలు ఆ పార్టీ ఆ పార్టీ నేతల మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఆయన ఏ ధీమాతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. పైగా ఇన్నాళ్ళు తమతో జట్టు కడుతాయని ప్రకటించిన పార్టీలు సైతం మేమే కేంద్రంలో కింగ్ మేకర్ లం అవుతామని డైలాగ్ లు పేల్చుతున్నారు.ఇది కేసీఆర్ కు ఇబ్బందికర పరిణామమే అయినా ఆయన మాత్రం ఢిల్లీ పీఠం మాదేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల గురించి పదేపదే పలవరిస్తున్నారు. అధికారంలోకి పార్టీ ఏమేం చేస్తుందో అప్పుడే ప్రకటిస్తున్నారు. పార్టీని జాతీయస్థాయిలో విస్తరించకుండానే ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని భారీ, భారీ డైలాగ్ లు కొడుతున్నారు. కేసీఆర్ ప్రకటనలకు భిన్నంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలివైన రాజకీయం చేస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకతాటి…
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని కోర్టుకు తెలిపింది. శుక్రవారం అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అతని కోర్టులో శనివారం హాజరు పరిచింది. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకు సీబీఐ సబ్మిట్ చేసింది. ఇందులో సంచలన విషయాలను ప్రస్తావించింది సీబీఐ. వివేకా హత్య పథకం ప్రకారమే జరిగిందని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. వివేకా జరుగుతుందని తెలిసి అవినాష్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలు ఒకే చోట ఉన్నారని.. హత్య సమాచారం అందుకున్న వెంటనే అవినాష్ రెడ్డితో ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనస్థలికి వెళ్ళాడని పేర్కొంది. ఆ తరువాత సాక్ష్యాలను తారుమారు చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచింది. గూగుల్ టెక్ అవుట్ లో లొకేషన్ కు సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొంది. వివేకాను మతమార్చగానే…