Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగలగొట్టి రీకౌంటింగ్ చేపట్టాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో ధర్మపురి ఎన్నికల రీకౌంటింగ్ పై సర్వత్ర ఉత్కంట నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…ప్రస్తుతం మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కొప్పుల ఈశ్వర్ 2018ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 441ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పై కొప్పుల గెలుపొందారు. అయితే… ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని… రీకౌంటింగ్ కు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు..స్ట్రాంగ్ రూమ్ తాళాలను ఓపెన్ చేయాలనీ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నెల…
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్ ను కీలక నేతలు వీడుతున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బీఆర్ఎస్ ను వీడే యోచనతోనే ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసి అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. వీరిద్దరూ ఏ పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాలు ఆసక్తిగా తిలకిస్తుండగా… మరో ఇద్దరు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న బీఆర్ఎస్ లో ప్రాధాన్యత దక్కకపోవడంతో పార్టీని వీడెందుకు సిద్దం కాగా.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి. వీరిద్దరూ గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. జోగు రామన్న, పట్నం మహేందర్ రెడ్డిలు గత ప్రభుత్వ మంత్రివర్గంలో మంత్రులుగా పని చేసిన వారే. 2018ఎన్నికల్లో జోగు రామన్న మరొసారి గెలుపొందగా.. పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తరువాత జోగు రామన్నతోపాటు పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పూర్తిగా…
బిల్కిస్ బానో దోషులను పెరోల్ పై విడుదల చేయడం పట్ల గుజరాత్ సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకోకుండా దోషులకు పెరోల్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. నేర తీవ్రతను బట్టి దోషుల పట్ల కరుణ చూపాలని తలంటింది సుప్రీంకోర్టు. 2002లో గోధ్రా అల్లర్ల సమయంలో గర్భిణి బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని హతమార్చిన దోషులను పెరోల్ పై గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా వీటిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ జస్టిస్ బి.వి.నాగరత్నలలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నేడు బిల్కిస్ బానోకు జరిగిన అన్యాయం, రేపు ఇంకెవరికైనా జరగొచ్చని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేసు తీవ్రత ఏమిటో పట్టించుకోరా? ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం ఎందుకని గుజరాత్ సర్కార్ ను కడిగిపారేసింది. దోషుల్లో ఒకరికి 1000…
“వైదేహి పరిణయం” అనే సీరియల్ లో కరుణ భూషణ్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఈ సీరియల్ విశేష ఆదరణ పొందటంతోపాటు కరుణ భూషణ్ కు పాపులారిటీ మరింత పెరిగింది. ఆమె నటనకు ప్రశంసలు వస్తుండటంతో మరిన్ని సీరియల్స్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరుణ భూషణ్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను వెల్లడించడంతోపాటు తన కుమారుడు తన పట్ల చేసే కామెంట్స్ ను వెల్లడించింది. ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ కుమారుడిని ఎలా పెంచాలో తెలియదా..? అంటూ కరుణ భూషణ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎం చెప్పిందంటే… తన కుమారుడు తాను ఫ్రెండ్స్ గా ఉంటామని వెల్లడించింది. అంతే కాకుండా తన గ్లామర్ గురించి నా కొడుకు కాంప్లిమెంట్స్ ఇస్తుంటాడని వెల్లడించింది. తన ధరించే డ్రెస్ బాగోలేకపోతే నిర్మొహమాటంగా బాగోలేదని చెప్పేస్తుంటాడని.. తను ముక్కుసూటి మనిషి అని కుమారుడి…
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థతోపాటు టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థ డైరక్టర్లు అయిన రవిశంకర్ , నవీన్ లకు చెందిన నివాసాలలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు సోదాల్లో పలు డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ సంస్థ ఇటీవల వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. దీంతో ఈ సినిమా నిర్మాణాల కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది..?ఎలా పెట్టుబడులు పెడుతున్నారని రవిశంకర్ , నవీన్ లను ఐటీ అధికారులు ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషకంతోపాటు లాభాల గురించి ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు కనబడుతోంది. గత ఏడాది కూడా మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థపై…
తమది జాతీయ పార్టీ అని ప్రచారం చేసుకుంటున్న కారు పార్టీ నేతలకు ఎన్నికల సంఘం ఇటీవల షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును తెలంగాణకు మాత్రమే పరిమితం చేసింది. ఎన్నికల సంఘం ప్రకటన వెలువడిన రెండు రోజులకే కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ప్రకటించారు. ఆయన ధీమా ఏంటో కానీ కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఆ పార్టీ నేతలకు కూడా నవ్వు తెప్పించి ఉండొచ్చు. కేసీఆర్ ది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా దేశాన్ని ఏలేందుకు ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయని అభిప్రాయపడుతున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు రెండే రెండు పథకాలు చాలునని కేసీఆర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి రైతు బంధు. రెండోది దళిత బంధు. ఈ రెండు పథకాలతో బీఆర్ఎస్ ను దేశప్రజలు సొంతం చేసుకుంటారని కేసీఆర్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. దళిత బంధు , రైతు…
యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కల్గిన తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీ పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానో కూడా ప్రకటించారు. మంగళవారం జైలు నుంచి విడుదల అయిన మల్లన్న అక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్రకటన చేశారు. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో పార్టీ పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి వచ్చే పోటీ చేయనున్నట్లు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి భూఅక్రమాలపై తరుచుగా మాట్లాడే మల్లన్న తప్పకుండా మల్లారెడ్డిపై పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే పార్టీ ప్రకటన చేసి మల్లారెడ్డిపై పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఇటీవల మల్లన్న ఆఫీసుపై దాడి చేసింది కూడా మల్లారెడ్డి అనుచరులే కావడంతో ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని యూత్ లో తీన్మార్ మల్లన్నకు మంచి…
వివేకా హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డికి కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏప్రిల్ 25వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ స్పష్టం చేసింది. అయితే అప్పటివరకు కేసు విచారణలో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాలని హైకోర్టు న్యాయమూర్తి సురేందర్ రెడ్డి ఆదేశించారు. అవినాష్ రెడ్డిని లిఖితపూర్వకంగా విచారించాలని సీబీఐని ఆదేశించిన న్యాయస్థానం… వీడియో రికార్డ్ చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. ఈ కేసులో 25న తుది తీర్పు ఇస్తామని వెల్లడించింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదంటూ హైకోర్టులో సీబీఐ తరుఫు న్యాయవాదులు గట్టిగానే వాదించారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రదారి అని స్పష్టం చేసింది. కడప ఎంపీ టికెట్ విషయంలో తలెత్తిన విబేధాలే హత్యకు దారి తీశాయని.. వివేకా చనిపోయిన మూడురోజులకే అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్…
కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తరుఫున ప్రచారం నిర్వహిస్తామని ఆ మధ్య ప్రకటించిన కేసీఆర్… ఎన్నికల షెడ్యూల్ రాగానే రంగంలోకి దిగుతున్నట్లు మాత్రం ఎక్కడ ప్రకటించలేదు. జేడీఎస్ – బీఆర్ఎస్ మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతిన్నాయని ఖమ్మం సభ జరిగిన సమయంలో వార్తలొచ్చాయి. ఖమ్మం సభకు కుమారస్వామి హాజరుకాకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. కర్ణాటకలో జేడీఎస్ తో జట్టు కట్టి కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కూడా కేసీఆర్ ప్రకటించారు. అందుకు జేడీఎస్ అంగీకరించలేదన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇదే రెండు పార్టీల మధ్య గ్యాప్ కు ప్రధాన కారణమనే విశ్లేషణలు వినిపించాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తరుఫున ప్రచారం చేసి కుమారస్వామిని సీఎం చేస్తామని ప్రకటించిన కేసీఆర్…ఎన్నికల ప్రచారం ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ప్రచారం ఊసే ఎత్తలేదు. కర్ణాటక ఎన్నికలను ఏమాత్రం పట్టించుకోడం లేదు కానీ మహారాష్ట్రలో సభ నిర్వహించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. దీంతో…
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో మాత్రం చెన్నై జట్టు తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీజన్ లో ధోని ప్రదర్శనపై అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్ల సమయంలో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుండటంతో ధోనికి ఎక్కువ సేపు ఆడే అవకాశం దక్కడం లేదు. దీంతో చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలనే డిమాండ్లు వస్తున్నాయి. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్న ధోని ఐపీఎల్ కు కూడా ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. గత మూడేళ్ళుగా ఇదే తరహ ప్రచారం జరుగుతోంది. కానీ ధోని మాత్రం ఈ వార్తలపై అస్సలు స్పందించడం లేదు. తాజాగా ధోని పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఎప్పుడని ప్రశ్నించారు. దానికి ఇంకా సమయం ఉందంటూ ధోని నవ్వుతు సమాధానం ఇచ్చారు. రిటైర్మెంట్ పై ఇప్పుడెం మాట్లాడిన…