Author: Prashanth Pagilla

కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన తరువాత జగన్ తోపాటు షర్మిల, వైఎస్ విజయమ్మతో భేటీ అయిన పొంగులేటి తాజాగా మరోసారి జగన్ తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లో చేరాలనే పొంగులేటి నిర్ణయాన్ని జగన్ సైతం సమర్ధించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పొంగులేటి కంపెనీలకు వేల కోట్ల కాంట్రాక్ట్ లు కట్టబెడుతున్న జగన్, పొంగులేటిని తను అంతర్గతంగా మద్దతు ఇస్తోన్న బీజేపీలో చేరాలని సలహా ఇవ్వకుండా కాంగ్రెస్ లో జాయినైపో అని సూచించడం చూసి ఆ పార్టీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. పొంగులేటి కోసం ఓ వైపు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర నేతలను రంగంలోకి దింపి సంప్రదింపులు జరిపింది. పొంగులేటి బీజేపీలో చేరితే ఏమాత్రం బలం లేని ఖమ్మంలో పుంజుకోవచ్చుననేది కమలం నేతల…

Read More

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న వివేకా హత్య కేసులో ఈడీ ఎంటర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన నిందితులకు పెద్దమొత్తంలో డబ్బులు అందినట్లు తేలడంతో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దమొత్తంలో లంచం ఇచ్చి వివేకాను ఎందుకు హత్య చేయించారనేది ఈ కేసులో కీలకంగా మారింది. దాంతో ఈ కేసులో అసలు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈడీ ప్రవేశిస్తే సంచలన విషయాలు బయటపడనున్నాయి. వివేకా హత్యకు రూ.40కోట్ల డీల్ జరిగిందనే విషయం బయటపడింది. దస్తగిరికి కోటి అందాయని చెబుతున్నారు. సునీల్ యాదవ్ కూడా కోటి ఇచ్చారు. ఇతర నిందితులకు భారీగానే ముట్టిఉంటాయన్న అనుమానాలు ఉన్నాయి. అయితే…నిందితులకు డబ్బులు ఎవరి వద్ద నుంచి అందాయి.? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? అనేది సీబీఐ విచారణలో కొంతమేరకు తేల్చింది. ఈ కేసులో మనిలాండరింగ్ జరిగినట్లుగా ఈడీకి సీబీఐ వివరాలు ఇచ్చి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా…

Read More

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరనున్నారు. మే మొదటి వారంలో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. మే 4 లేదా 5వ తేదీన హైదరాబాద్ లో టీ. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సభలోనే ప్రియాంక సమక్షంలో పొంగులేటి, జూపల్లికృష్ణారావులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటి శ్రీనివాస్ , జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే పొంగులేటితో రాహుల్ టీమ్ సంప్రదింపులు జరిపి…ఆయన కాంగ్రెస్ లో చేరితే ఎలా ఉంటుంది..? బీజేపీలో చేరితే ఏం జరుగుతుంది..?అనే విషయాలను పూసగుచ్చినట్లు వివరించింది. తాము చెప్పిన అంశాలపై నమ్మకం కుదరకపోతే సొంతంగా సర్వే చేయించుకొండని సూచించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిర్వహిస్తోన్న సభకు ప్రియాంక గాంధీ…

Read More

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెగ హడావిడి చేసిన తెలంగాణ సర్కార్ చివరికి చల్లబడింది. స్టీల్ ప్లాంట్ ను మేమే కొంటామంటూ బిడ్ దాఖలు చేస్తామని ఊరించి, ఊరించి ఉసురుమనిపించింది. సింగరేణి అధికారులు కోరారని బిడ్ దాఖలు చేసేందుకు ఐదు రోజుల సమయం కూడా ఇచ్చింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. కానీ తెలంగాణ సర్కార్ సింగరేణితో కలిసి ఈవోఐ బిడ్లను దాఖలు చేయలేదు. ఇప్పుడు ఆ ఐదు రోజుల గడువు కూడా ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించింది. బిడ్ దాఖలు చేసే విషయమై ఉన్నాతాదికారులతో చర్చలు కూడా జరిపింది. వివరాలు సేకరించి తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి అధికారులు నివేదిక సమర్పించారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే బిడ్ దాఖలు చేసేందుకు సింగరేణి అధికారులు రెడీ అయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో…

Read More

మనిషి జీవితంలో మొబైల్ ఓ భాగమైంది. మొబైల్ పక్కనపెట్టి కాసేపు కూడా ఉండలేకపోతున్నారు. మనిషి ప్రతి అవసరం తీర్చే వస్తువుగా మొబైల్ మారిపోయింది. అలాంటి ఫోన్ ఎక్కడైనా మిస్ అయితే ఇదివరకు పెద్దగా ఆందోళన చెందేవారు కాదు. కానీ ఇప్పుడు ఆర్ధిక లావాదేవీలతోపాటు బ్యాంకింగ్ కు సంబంధించిన సమాచారమంతా మొబైల్ లోనే నిక్షిప్తమై ఉంటుంది. అందుకే మొబైల్ ఎక్కడైనా పోయినా..? ఎవరినా దొంగిలించినా ఇట్టే ఆందోళనకు గురి అవుతున్నారు. స్మార్ట్ఫోన్ ఎక్కడైనా మిస్ అయిన.. ఎవరైనా దొంగిలిస్తే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. మొబైల్ మిస్ అయితే మొదట ఆందోళన చెందటం మానేయండి. సీఈఐఆర్ ద్వారా దాన్ని ట్రాక్ చేసి తిరిగి ఫోన్  దక్కించుకోవచ్చునని తెలుసుకోండి. మొబైల్ చోరీలపై ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో ఈ అంశంపై పోలీసులు ప్రత్యేక అవహగన కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన CEIR అనే అప్లికేషన్ ద్వారా సెల్ ఫోన్…

Read More

ఈ నెల 21న నల్గొండ జిల్లాలో నిర్వహించాల్సిన నిరుద్యోగ నిరసన ర్యాలీని 28వ తేదీకి వాయిదా వేసింది టీపీసీసీ. నల్గొండ జిల్లాకు చెందిన తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని రేవంత్ ఎలా ప్రకటిస్తారని సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము నల్గొండ జిల్లాలో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే తోపాటు ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్ లు ఉత్తమ్ , వెంకట్ రెడ్డిలతోపాటు రేవంత్ రెడ్డితో చర్చించారు. ఇరువురి నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. అనంతరం ఈ నెల 28న నల్గొండ జిల్లాలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. దీంతో ముందుగా రేవంత్ రెడ్డి ప్రకటించిన షెడ్యూల్ లో మార్పులు చేస్తూ టీపీసీసీ ప్రకటన విడుదల…

Read More

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ టికెట్ ఆశావహులు పెరిగిపోతున్నారు. దాదాపు ఐదారు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే.. కంటోన్మెంట్ టికెట్ కోసం దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యుల మధ్య పోటీ కనిపిస్తోంది. ఆయన ముగ్గురు కుమార్తెలు కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నమ్రత, లాస్య నందిత, నివేదిత ఈ ముగ్గురు ఎవరికీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయన్న కుమార్తెలకు టికెట్ ఇస్తే ఆయన చరిష్మాతో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని సాయన్న సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ముఖ్యంగా లాస్యనందిత టికెట్ ప్రయత్నాలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కవాడిగూడ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరుఫున పోటీచేసి గెలుపొందిన ఆమె తరువాత ఎన్నికల్లో ఓటమి పాలైంది. సాయన్న వారసురాలిగా లాస్యనందితను ప్రకటిస్తే ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని వచ్చే ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని ఆమె…

Read More

వివేకా హత్య కేసులో ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దనే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐకి స్వేఛ్చను ఇవ్వాలని ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సునీత పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. శుక్రవారం సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతామని వెల్లడించారు. వివేకా హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరుతూ ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు… పిటిషనర్ తరుఫు న్యాయవాది, సీబీఐ తరుఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ…

Read More

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురు అయింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసు విషయంలో కిందికోర్టు ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టు సమర్ధించింది. మోడీ అనే ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్ ఎమ్మెల్యే పూర్నేశ్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మోడీ అనే పేరుతో ఉన్న వారంతా దొంగలేనని రాహుల్ చేసిన వ్యాఖ్యలు తమ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్నాయంటూ పూర్నేశ్ మోడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీంతో చట్టప్రకారం రాహుల్ గాంధీని లోక్ సభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ స్పీకర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.…

Read More

వచ్చే ఏడాది ఐపీఎల్ లో మరో కొత్త టీమ్ రానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. వైజాగ్ వారియర్స్ పేరిట కొత్త టీమ్ ను తీసుకొచ్చేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది కానీ, ఏపీ నుంచి ఎలాంటి టీమ్ లేదు కాబట్టి వైజాగ్ వారియర్స్ అనే టీమ్ తీసుకొస్తే బాగుంటుందని రామ్ చరణ్ భావిస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతోన్న రామ్ చరణ్ క్రికెట్ రంగంలోనూ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో పెట్టుబడులు పెట్డంట వలన రెండు విధాల ఉపయుక్తంగా ఉంటుందనేది రామ్ చరణ్ ఆలోచనగా చెబుతున్నారు. ఒకటి పాన్ ఇండియా లెవల్ లో హీరోగా మరింత గుర్తింపును సొంతం చేసుకోవడం. బిజినెస్ పరంగా మరింత రాణించడం. ఇప్పటికే బిజినెస్ మెన్ గా మారిన చరణ్…

Read More