Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీతా వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డి తరుఫున ముకుల్ రోహాత్గీ వాదించగా…సునీత తరుఫున సిద్దార్థ లూద్రా వాదించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులపై సీజేఐ ధర్మాసనం మండిపడింది. హైకోర్టు ఉత్తర్వులను అపార్ధం చేసుకున్నారని ముకుల్ రోహాత్గీ వాదించారు కానీ ఆయన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. సుప్రీంకోర్టు ధర్మాసనం వాలకం అర్థమైన అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాది చివరికి పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటామని ప్రతిపాదన పెట్టారు. మామూలుగనైతే ఇందుకు అంగీకరించేవారమని కాని ఇక్కడ హైకోర్టు అసాధారణ ఉత్తర్వులు ఇచ్చిందని అందుకే తాము అంగీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేశారు. అయితే…వేరే న్యాయమూర్తి ముందు పెట్టాలనే ప్రతిపాదనను అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనం…
ఇటీవల మైత్రి మూవీస్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థతోపాటు డైరక్టర్ సుకుమార్ నివాసం, కార్యాలయంలోనూ ఐటీ తనిఖీలు చేపట్టింది. ఇందులో అధికారులు కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సినిమాల ద్వారా హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషకం వివరాలను గుర్తించినట్లు సమాచారం. జనరల్ గా హీరో, హీరోయిన్స్ కు ఇచ్చే పారితోషకాలు బ్లాక్, వైట్ లలో ఇస్తుంటారు. మొత్తాన్ని వైట్ లో అస్సలు చూపించరు. హీరోలకు ట్యాక్స్ నుంచి వెసులుబాటు కల్గించేందుకు ఇలా చేస్తుంటారు. మైత్రీ మూవీస్ అగ్రశ్రేణి హీరోస్ తో సినిమాలు చేస్తోంది. హీరోస్ కు ఇచ్చే పారితోషకం ఎనభై కోట్ల వరకు ఉంటుంది. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఓ సినిమాను నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ తోపాటు టెక్నిషియన్లకు అడ్వాన్స్ చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. ఈ సమాచారమంతా…
కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తిరిగి బీజేపీ వైపే వేలెత్తి చూపేలా ఉన్నాయా…? ఈటల చేసిన ఆరోపణలు బీజేపీకి సైతం నష్టం కల్గించేలా ఉన్నాయనే భావించే, ఈ వివాదంలో ఆ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారా..?అంటే అవుననే సమాధానం వస్తోంది. మునుగోడు బైపోల్ సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ.25కోట్లు తీసుకుందని ఈటల చేసిన వ్యాఖ్యలు అటు, ఇటు పోయి బీజేపీని డిఫెన్స్ లో పడేశాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పాతిక కోట్లు తీసుకుంది సరే… దీనిపై బీజేపీ నేతలంతా కలిసి ఎందుకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్న చర్చకు వస్తోంది. ఎప్పుడో ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక గురించి ఈటల తాజాగా మాట్లాడటం వెనక ఆయన వ్యూహం ఏంటని బండి వర్గం సైతం ఆరా తీస్తోంది. అయితే … ఈటల కాంగ్రెస్ టార్గెట్ గా ఆరోపణలు చేసినా అసలు టార్గెట్ బండి సంజయ్ అయి…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళారు. ఆయన ఏమి మాట్లాడటం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు పర్యటనకు వచ్చినప్పుడు స్వాగతం పలకకపోవడమే తాను చేసిన పెద్ద పోరాటమని అనుకుంటున్నారు తప్పితే ఇతర మార్గాల్లో కేసీఆర్ ఏవిధంగానూ మోడీపై పోరాడుతున్నట్లు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీపై శివాలెత్తే కేసీఆర్ ఇప్పుడు పంథా మార్చుకున్నారు. ప్రధానిపై విమర్శల జడివాన కురిపించడం కాదు కదా ఆయన పెరేత్తెందుకే వెనకడుగు వేస్తున్నారు. మోడీపై విమర్శలు చేయాల్సి వస్తే లైవ్ కెమెరాలను ఆఫ్ చేయించి విమర్శలు చేస్తున్నారు. కేంద్రంపై కేసీఆర్ మునుపటిలా గర్జించడం లేదు. ఎందుకొచ్చిన తలనొప్పి. కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వి కొని కష్టాలు తెచ్చుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పేరును సైతం తెరమీదకు తెస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఇటీవల విచారించిన సీబీఐ… బీఆర్ఎస్ చీఫ్ తోనున్న ఆర్థిక…
వచ్చే ఎన్నికల్లో 40మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ పక్కనపెట్టనున్నారా..? సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ తాజాగా కేసీఆర్ చేయిస్తోన్న సర్వే ఆధారంగానే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారా..? ఎమ్మెల్యేలపై ఆశావహులు మాటల దాడి చేస్తుంటే.. కార్యకర్తల ముందే బాహాబాహీకి దిగి తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటె అన్ని గమనిస్తోన్న అధినేత ఓ నలభై మందికి క్లారిటీ ఇవ్వబోతున్నారనే అంశాలపై బీఆర్ఎస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించినా ఇంటిపోరుతో ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారు. ఇదే సమయంలో లేటెస్ట్ సర్వే ఒకటి ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోంది. ఈ సర్వేలో ఎలాంటి ఫలితం వస్తుందోనని ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాట పడుతున్నారు. బీఆర్ఎస్ లో గెలుపు జోష్ కనబడుతోన్న ఎమ్మెల్యేలకు మాత్రం సర్వే ఫీవర్ పట్టుకుంది. ఆరు నెలలకు ఓసారి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించే కేసీఆర్ మారిన పరిణామాలతో ఇటీవల ఓ సర్వే చేయిస్తున్నట్లు…
మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ పార్టీకి 25కోట్లు బీఆర్ఎస్ ఇచ్చిందని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. దీనిపై రేవంత్ రెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కు తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేస్తావా అంటూ ఈటలకు సవాల్ విసిరారు. దీంతో రేవంత్ – ఈటల మధ్య రాజకీయం సెగలు కక్కుతుండగా ఇందులోకి విజయశాంతి ఎంటర్ అయింది. ఇద్దరి నేతలను తమ్ముళ్ళని పేర్కొంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా బీఆర్ఎస్ పై యుద్ధం చేయాలని రేవంత్ అండ్ ఈటలకు విజయశాంతి సలహా ఇచ్చారు. తెలంగాణలోని దుర్మార్గ వ్యవస్థపై పోరాడవలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉన్నదని… కానీ ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే బీఆర్ఎస్ కే మేలు జరుగుతుందన్నారు. తమ దాడిని ఒకరిపై ఒకరు కాకుండా ఎవరి పంథాలో వారు సర్కార్ పై…
తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసలు సందర్భానుసారం వ్యాఖ్యలు చేసి పెద్ద చర్చకు తెరలేపారు. మునుగోడు బైపోల్ లో కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీ 25కోట్లు తీసుకుందని ఆరోపించారు. దీంతో వెంటనే ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. బీజేపీ సవాల్ కు ఎప్పుడు వేదికగా మార్చుకునే భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు ఆధారాలతో ఈటల రావాలని, ప్రూఫ్స్ లేకపోతే తడిబట్టలతో ప్రమాణం చేయాలని రేవంత్ సవాల్ విసిరారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేవంత్ సవాల్ ను స్వీకరించేందుకు ఈటల వస్తారా.? లేదా అన్నది పక్కనపెడితే ఇదంతా వ్యూహత్మకమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈటలకు బీజేపీలో సరైన ప్రాధాన్యత లేదు. రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ నుంచి సహకారం అసలే అందటం లేదు. దీంతో పార్టీలో తన పరపతి పెంచుకోవాలనే ఇలా అసందర్బనుసారం కాంగ్రెస్ పై ఈటల ఆరోపణలు చేసి ఉంటారన్న…
వైఎస్ కుటుంబంలో వార్ ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిమితం అవుతుందా..? పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా..? కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో అదే కుటుంబానికి చెందిన సునీత పోటీ చేయనున్నారా..? వైఎస్ సొంత కుటుంబంలోనే విపక్షం తయారు కానుందా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ త్వరలోనే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయనుంది. ఇదే జరిగితే కడప జిల్లాలో వైసీపీ పునాదులు కూలిపోనున్నాయి. వైసీపీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఇప్పటికే వైసీపీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తోన్న సునితారెడ్డికి టీడీపీ నుంచి పరోక్ష మద్దతు అందుతుందని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ సీనియర్ నేతలతోపాటు కడప జిల్లాకు చెందిన బీటెక్ రవి…
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీతా. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్ ఉత్తర్వుల మీద స్టే విధించింది. తాము ఈ కేసును పూర్తిగా విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక బెయిల్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విదించడంతో సీబీఐ వెంటనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది. దాంతో సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాదులు తమ వాదనలు వినే వరకు ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సునీత పిటిషన్ లో ఏముందో తమకు తెలియదని, అందువల్ల పేపర్ బుక్ తమ వద్ద ఉంటె అవినాష్ రెడ్డి తరుఫున వాదనలు వినిపించే వారమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళారు.…
ఏపీ , ఓడిశా రాష్ట్రాలకు బీఆర్ఎస్ ఇంచార్జ్ లను నియమించారు కానీ పార్టీకి గుర్తింపు లభించేలా ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు. ఈ క్రమంలోనే ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం అందివచ్చిన అవకాశంగా మలుచుకోవాలని చూసింది బీఆర్ఎస్. ఇందుకోసం బిడ్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. తమకు ఐదు రోజుల గడువు కావాలని కూడా కోరింది. దీంతో స్టాల్ ప్లాంట్ అంశంలో బీఆర్ఎస్ చూపిస్తోన్న చొరవతో ఏపీలో బీఆర్ఎస్ కు కొంత ఊపు వచ్చే పరిస్థితులు కనిపించాయి. కట్ చేస్తే సింగరేణితో తెలంగాణ సర్కార్ బిడ్ దాఖలు చేయలేదు. దీంతో స్టాల్ ప్లాంట్ అంశంలో బీఆర్ఎస్ పోరాటమంతా పార్టీ విస్తరణ కోసం తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాదని పెదవి విరుపులు ప్రారంభమయ్యాయి. స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొంటామని ఈమేరకు సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది కూడా. ఇప్పుడు బిడ్ లో పాల్గొనకపోవడంతో బీఆర్ఎస్ నిర్వహించాలనుకున్న సభ నిర్వహణకు అవకాశమే…