Author: Prashanth Pagilla

కేసినో కింగ్ గా పేరొందిన చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. కాకపోతే ఆయన అరెస్ట్ జరిగింది హైదరాబాద్ లో కాదు. థాయ్ లాండ్ లో. పట్టాయలో ఓ లగ్జరీ హోటల్ లో బుక్ చేసుకొని ఇండియా నుంచి 83మందిని తీసుకెళ్ళిన ప్రవీణ్ అక్కడ జూదం ఆడిస్తున్నాడు. ఈ విషయం అక్కడి పోలీసులకు తెలియడంతో దాడి హోటల్ పై దాడి చేశారు. అక్కడ పట్టుబడిన వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పట్టాయలోని హోటల్ లో 83మందితో గ్యాంబ్లింగ్ ఆడుతోన్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలిసుల కళ్లుగప్పి కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోయినట్లుగా అక్కడి వార్తపత్రిక కథనం ప్రచురించింది. ఇందుకు సంబందించిన ఫోటోలను ద నేషన్ థాయ్ లాండ్ పత్రిక విడుదల చేసింది. ఈ ఫోటోలలో ఉన్న వారంతా తెలుగురాష్ట్రాలకు చెందిన వారేనని తెలుస్తోంది. గతంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసుల్లో ఈడీ ప్రశ్నించిన వారే ఎక్కువగా…

Read More

రెండో దఫా ప్రభుత్వంలో చేయాలనుకున్న టాస్క్ లను దాదాపుగా కంప్లీట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు తన దృష్టినంత ఎన్నికలపై కేంద్రీకరించబోతున్నారు. కొత్త సచివాలయం, జిల్లాలో సమీకృత కలెక్టర్ల నిర్మాణాలు , హైదరాబాద్ లో 40ఫ్లై ఓవర్లు , కమాండ్ కంట్రోల్, టీ వర్క్స్, టీ హబ్ వంటివి ప్రరంభించేసిన కేసీఆర్… ఇప్పుడు ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక  అనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ఇప్పటికే సర్వే బృందాలను రంగంలోకి దించారు. స్వయంగా కేసీఆరే ఇరవై ప్రశ్నలను రూపొందించి ప్రజల పల్స్ తెలుస్కోవాలని సర్వే టీమ్ ను ఆదేశించారు. వీటి ఆధారంగానే సర్వే బృందాలు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల  అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొని కేసీఆర్ కు తుది నివేదిక సమర్పించనున్నారు. మోదటగా గెలుపుపై సందేహమున్న నియోజకవర్గాల్లో సర్వే బృందాలు పనిని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ రూపొందించిన క్వశ్చనీర్ ఆధారంగా సర్వే బృందాలు ప్రజల నాడిని పసిగట్టనున్నాయి.…

Read More

ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన దగ్గర అంత ఉందని హెచ్చరించిన కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలకే టికెట్లు ఇస్తామని గురువారం జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. గతంలో సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు టోన్ చేంజ్ చేశారు. సర్వే ఫలితాల ఆధారంగానే టికెట్లు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఈసారి దాదాపు 30మంది సిట్టింగ్ లను మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను గుర్తించిన కేసీఆర్ వారికి వచ్చే ఎన్నికల్లో మొండి చేయి చూపనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో టికెట్ రాని వారి లిస్ట్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : అయిదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ అనుమానమే. మంచిర్యాల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్పలను పక్కనపెట్టనున్నారు. మిగతా కొందరి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. బాల్క సుమన్…

Read More

రైతు బాంధవుడిగా, సంఘ సంస్కర్తగా కలరింగ్ ఇచ్చిన బీజేపీ నేత చక్రధర్ గౌడ్ అసలు రంగు మెల్లగా బయటపడుతోంది. ఆ మధ్య తన స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం చేసిన చక్రధర్ గౌడ్, తాజాగా ఓ యువతితో హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ లాడ్జిలో సరసాలు ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. విషయం బయటకు రావడంతో చక్రధర్ గౌడ్ పై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. సేవా కార్యక్రమాల ముసుగులో అమ్మాయిలను లోబరుచుకుంటున్నాడని మండిపడుతున్నారు. మరోవైపు..ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గాద‌గోని చ‌క్ర‌ధర్ గౌడ్.. ఈ మ‌ధ్య కాలంలో సిద్ధిపేటలోనే కాకుండా పలు జిల్లాలోనూ వినిపిస్తోంది ఈ పేరు. సిద్ధిపేటలో నివాసమంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో ఆర్థికంగా బలంగా ఎదిగిన చక్రధర్ గౌడ్ ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించి కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు.…

Read More

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని…కొత్త సెక్రటేరియట్ నిర్మాణంతో హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు మరింత పెంచామని సర్కార్ చెప్పుకుంటున్న వేళ… బీఆర్ఎస్ చెప్తున్న దానికి వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.ఓపెన్ నాలా కారణంగా సికింద్రాబాద్ కళాసిగూడలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కనీసం కాషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో అసలు హైదరాబాద్ లో మౌలిక వసతుల కల్పనపై చర్చలు ప్రారంభమయ్యాయి. సెక్రటేరియట్ నిర్మాణంతో అద్భుతం సృష్టించి హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచామని చెప్పుకుంటున్న వేళ ఈ విషాద సంఘటన చోటుచేసుకోవడం బీఆర్ఎస్ సర్కార్ కు చేటు తెచ్చేదే. ఇది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో వర్షాలు ఏకధాటిగా కురవవు. గంట లేదా అరగంటపాటు దంచికొడుతాయి. అంత దానికే కాలనీలు జలమయం అవుతున్నాయి. డ్రైనేజ్ లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉండేదే.…

Read More

నా భార్య బంగారం బ్యాంకులో కుదువ పెట్టి కౌలు పైసలు కట్టిన, రెండు లక్షల రూపాయల అప్పు చేసి పెట్టుబడి పెట్టి ఆరు ఎకరాలలో వరి పంట వేస్తే పది నిమిషాలు అయితే కోయవలసిన చేనులో 25-04-2023 రోజున కురిసిన రాళ్ల వానతో ఒక్క వడ్ల గింజ కూడా లేకుండా పోయిందని ఉమ్మడి వరంగల్ జిల్లా, కొమురవెల్లి మండలం, అయినాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ శ్రీకాంత్ వయసు 30 సంవత్సరాలు ఏడుస్తూ చెప్పిన మాటలు. నా భార్య, నా కోడలు బంగారం సిద్దిపేటలోని మార్వాడి సేటు దగ్గర కుదవబెట్టి నాలుగు ఎకరాల టమాట, మూడు ఎకరాల వరి సాగు చేస్తే మొన్నటి రాళ్లవానకు పూర్తిగా పోయిందని ఉమ్మడి మెదక్ జిల్లా, మిరుదొడ్డి మండలం, కొండాపూర్ గ్రామానికి చెందిన రైతు చత్తిరి గుట్టయ్య ఏడుస్తూ తనకున్న మూడెకరాల భూమితో పాటు ఇంక నాలుగెకరాలు కౌలుకు తీసుకొని సుమారు మూడు లక్షల 50 వేల…

Read More

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీని వీడనున్నారా..? ఆయన తిరిగి సొంతగూటికి చేరనున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. రాజాసింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన సొంతగూటికి వెళ్లేందుకు రెడీ అయ్యారని చర్చ విస్తృతంగా సాగుతోంది. తనను సస్పెండ్ చేసి ఆరు నెలలు దాటినా బీజేపీ హైకమాండ్ రాజాసింగ్ సస్పెన్షన్ ను ఎత్తివేయకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారని.. అదే సమయంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలు కూడా నచ్చకే బీజేపీని వీడాలని రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని రాజాసింగ్ సన్నిహిత వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రాజాసింగ్ 2009లో జీహెచ్ఎంసి ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన 2014ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018ముందస్తు ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీజేపీలోని హేమాహేమీలైన నేతలంతా ఓటమి…

Read More

బీఆర్ఎస్ ఆవిర్భావ ప్లీనరీలో కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అక్టోబర్ లో ఎన్నికలు ఉంటాయని… ఇందుకోసం ఎమ్మెల్యేలంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే డిసెంబర్ లో పోలింగ్ ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం అక్టోబర్ లోనే ఎన్నికలు ఉంటాయని చెప్పడం ఆ పార్టీ నేతల్లో తీవ్ర చర్చకు కారణమైంది. పక్కా సమాచారంతోనే ఇలా ప్రకటన చేశారా..? లేక తమను అలర్ట్ చేసేందుకే ముందుగానే ఎన్నికలు ఉంటాయని అబద్దం చెప్పారా..? అని ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. వాస్తవానికి అక్టోబర్ నెల ద్వితీయార్థంలో ఎన్నికల ప్రకటన ఉండొచ్చు. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసేందుకు కేసీఆర్ అక్టోబర్ లో ఎన్నికలు ఉంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. ముందుగానే ఎన్నికలు ఉంటాయని చెబితే ఎమ్మెల్యేలంతా బుద్దిగా నియోజకవర్గాల్లో పని చేసుకుంటారని… ప్రజల్లో ఉంటారని కేసీఆర్ ఈ విధమైన…

Read More

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ తెలంగాణలో రాజకీయాలు అంతకంతకూ సెగలు రేపుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య డైలాగులు డైనమేట్లలా పేలుతున్నాయి. ఎవరికివారు పొలిటికల్ రేసులో ముందు ఉండేందుకు మాటలని మిస్సైళ్లలా ప్రయోగిస్తున్నారు. మరి ఈ పోటీలో ఎవరు ఎక్కడ ఉన్నారు? రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు ఎవరై ఉంటారని ప్రజలు భావిస్తున్నారు? అనే ప్రశ్నలు రాజకీయ పరిశీలకుల్లో తలెత్తకమానవు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. నేటి తరం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేది గూగుల్ లోనే. మరి తెలంగాణలో పవర్ ఫుల్ పొలిటిషియన్ ఎవరు అంటే.. గూగుల్ ఎవరి పేరు చెబుతుందో తెలుసా?.. రేవంత్ రెడ్డి అని.. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు రేవంత్ రెడ్డి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా.. ఇప్పుడది వైరల్ గా మారింది. దటీజ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ టైగర్.. ఇదీ రేవంత్ చరిష్మా అంటూ.. ఆయన అభిమానులు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు.

Read More

మద్యం ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునేందుకు తమిళనాడు డీఎంకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లబ్బులు, స్టార్ హోటల్స్ కి మాత్రమే మద్యం వినియోగానికి పర్మిషన్ ఇచ్చిన సర్కార్ తాజాగా కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బాంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు స్టాలిన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇళ్ళకు, శుభకార్యాలకు మద్యం పంపిణీ చేసేందుకు స్టాలిన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడు సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో వివిధ ఫంక్షన్స్ , సమావేశాలకు అధికారికంగానే మద్యం సరఫరా చేసుకునేందుకు వీలు కల్గుతుంది. అయితే… ఇలా అందరూ సరఫరా చేసేందుకు వీలు లేదు. సర్కార్ లైసెన్స్ కల్గి ఉంటేనే మద్యం పంపిణీ చేయవచ్చు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ‘ఎఫ్.ఎల్.12’ అనే ఒక ప్రత్యేక లైసెన్స్ ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని కూడా తమిళనాడు ఎక్సైజ్ శాఖ గత నెలలోనే జారీ చేసింది.…

Read More