Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అన్యాయమైన నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేందుకు కాంగ్రెస్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభను నిర్వహిస్తోంది. .ఈ సభకు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసింది. రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ అనౌన్స్ చేయగా.. యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు. కేసీఆర్ హయంలో యువతకు జరిగిన అన్యాయాన్ని వివరించి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువత కోసం ఏమేం చేయనున్నారో ఈ డిక్లరేషన్ ద్వారా వెల్లడించనున్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం… ఉద్యమ ఆకాంక్షలు స్వరాష్ట్రంలో నెరవేరలేదని యువత అసంతృప్తిగా ఉంది. బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్…
తెలంగాణలో మద్యం ధరలను అనూహ్యంగా తగ్గించేశారు కేసీఆర్. రాత్రికి రాత్రి మద్యం ధరలను తగ్గిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫుల్ బాటిల్ పై ఏకంగా 40రూపాయలు తగ్గించారు. బీర్ పై రూపాయి కూడా తగ్గించలేదు. మద్యం ధరలను తగ్గించాలని సర్కార్ కు హటాత్తుగా ఆలోచన ఎందుకొచ్చిందని సర్వత్ర చర్చ జరుగుతోంది. సమ్మర్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా ఇంకా మద్యం అమ్మకాలు జోరందుకోలేదు. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో సర్కార్ కు ఆదాయం తగ్గిపోయింది. దీంతో ధరలు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయనే కార్పోరేట్ సూత్రాన్ని అమలు చేసింది బీఆర్ఎస్ సర్కార్. తెలంగాణ సర్కార్ కు ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలే. ఇప్పుడు ఈ అమ్మకాలు పడిపోవడంతో ప్రభుత్వాన్నికొచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. దీంతో సమయానికి సర్కార్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. పైగా ఈ ఏడాది…
కర్ణాటకలో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టమౌతుంది. సాధారణంగా ప్రధాని మోడీ రోడ్ షో లలో ఎక్కువగా పాల్గొనరు. ఒకవేళ పాల్గొనాల్సిన పరిస్థితి వస్తే కాసేపు మాత్రమే సమయం కేటాయించి అక్కడి నుంచి భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు కానీ కర్ణాటకలో మాత్రం శనివారం ఆ మూల నుంచి ఈ మూల వరకు రోడ్ షో ప్లాన్ చేశారు. ప్రధాని రోడ్ షో షెడ్యూల్ చూసి రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోవడమే కాదు కర్ణాటక ఎన్నికల ఫలితంపై బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా కనబడుతుందని చెప్పుకొస్తున్నారు. కర్ణాటకలో తనే సీఎం అన్నట్లుగా మోడీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కొన్ని సభల్లో పాల్గొన్నారు మోడీ. ఆయన చరిష్మాతో కర్నాటకలో బీజేపీని గెలుపు తీరాలకు చేర్చే అవకాశం ఎంతమాత్రం లేదని బీజేపీకి నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి బొమ్మైతోపాటు యడ్యురప్పను రంగంలోకి దింపినా జనాల నుంచి మునుపటి స్పందన వ్యక్తం కాలేదు.…
వివేకా హత్య కేసులో రోజురోజుకు సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ-1గానున్న ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు లొంగిపోయేందుకు వచ్చిన గంగిరెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇటీవల గంగిరెడ్డిని బెయిల్ ను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.. మే 5లోపు లొంగిపోవాలని గడువు విధించింది. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. వివేకా హత్య కేసులో ఏపీ పోలీసులు గంగిరెడ్డిని మార్చి 28-2019లో అరెస్ట్ చేశారు. గంగిరెడ్డిని అరెస్ట్ చేసి మూడు నెలలు అయినా ఎలాంటి చార్జీషీట్ దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అదే ఏడాది జూన్ 27న గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ హత్య కేసులో ఏపీ పోలిసుల విచారణ సరిగా లేదని వివేకా కూతురు సీబీఐ విచారణకు ఆదేశించాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ తరుఫు న్యాయవాది…
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను బీజేపీలో చేర్చుకొని పార్టీలో కొత్త ఊపు తీసుకురావాలని కమలదళం భావిస్తోంది. ఇందుకోసం వారిద్దరితో బీజేపీ చేరికల కమిటీ చర్చలు జరిపింది. బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లిలను ఆహ్వానించింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ చర్చలు జరుగుతోన్న సమయంలో బీజేపీ అనుకూల మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. జూపల్లి, పొంగులేటిలు బీజేపీలో చేరడం ఖాయమైందని కథనాలు ప్రసారం చేసింది. చర్చలు పూర్తికాకుండానే బ్రేకింగ్ లు వేసి బీజేపీకి మైలేజ్ పెంచే ప్రయత్నం చేసింది కానీ చివర్లో ఆ ఇద్దరి నేతల నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంత ఆ పార్టీ అనుకూల మీడియాతోపాటు బీజేపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిని వేదికగా చేసుకొని మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణా రావుతో నిర్వహించిన ఐదు గంటల…
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో తెలంగాణ హైకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ఆఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఇందులో పలు విషయాలను పేర్కొన్న సీబీఐ… నవీన్, కృష్ణమోహన్ రెడ్డిల ఫోన్ అంశాలను ప్రస్తావించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. వివేకా హత్య జరగడానికి ముందు ఆ తరువాత జరిగిన ఫోన్ కాల్స్ పై సీబీఐ ఓ స్కెచ్ వేసింది. అందులో అవినాష్ రెడ్డి మాట్లాడిన నవీన్, కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తుల ఫోన్ నెంబర్ల వివరాలను ప్రస్తావించలేదు. వివేకా హత్య జరిగిన వెంటనే అవినాష్ రెడ్డి హైదరబాద్ కు కాల్ చేశారు. హైదరాబాద్ లోని జగన్ నివాసంలో పని చేసే నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు ఫోన్ చేశారు. ఈ అంశంపై సీబీఐ వారిద్దరిని పిలిచి ప్రశ్నించింది. ఈ విషయమై అప్పట్లో సజ్జల స్పందించారు. వారి ఫోన్లకు అవినాష్ రెడ్డి ఫోన్ చేశారని.. వివేకా…
లిక్కర్ స్కామ్ లాభాలను కవిత హైదరాబాద్ లో భూములను కొనుగోలు చేసేందుకు వినియోగించారని అనుమానిస్తోన్న ఈడీ…పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఫోకస్ పెట్టింది. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు..? వంటి అంశాలను వెలికితీయడంలో ఈడీ నిమగ్నమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించిన ఈడీ…త్వరలోనే రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బుతోనే కవిత వట్టినాగులపల్లిలో భారీ ఎత్తున భూములు కొన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు, లిక్కర్ స్కామ్ లో కవిత ప్రతినిధిగా వ్యవహరించిన పిళ్ళైలు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ మరింత లోతైన సమాచారం సేకరించింది. భూముల కొనుగోళ్ళ కోసం పిళ్ళై ఖాతా నుంచే క్రియేటివ్ గ్రూప్ కు మూడు విడతల్లో నగదు బదిలీ అయినట్లు గుర్తించిన ఈడీ…కవిత ఆదేశాలతో పిళ్ళై నగదు బదిలీ చేసినట్లు అనుమానిస్తోంది. ఈ డబ్బు ఎక్కడి…
బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే ప్రారంభిస్తుండటం చర్చకు దారితీసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి కోల్పోయారని చెప్పేందుకు ఇదో మచ్చుతునక అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చాక కేసీఆర్ చేస్తోన్న రాజకీయాలను ఓ పట్టాన గమనిస్తే ఇది నిజమేననే అనుమానం తప్పకుండా కలుగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ తాత్కాలిక కార్యాలయ ప్రారంభోత్సవంతోనే… బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినట్టేననే రేంజ్ లో ప్రచారం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వందలమంది ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పుడు శాశ్వత భవనం ప్రారంభిస్తుంటే మాత్రం ఆ హడావిడి కనిపించడం లేదు. కేసీఆర్ కూడా ఎదో తప్పదు కాబట్టి వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేసీఆర్ ముందుగానే వెళ్తారని అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారని.. జాతీయ మీడియాతో మాట్లాడుతారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేశాయి. కానీ ఆయన మాత్రం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం రోజున ఢిల్లీకి వెళ్ళారు.…
ఓ ప్రముఖ తెలుగు శాటిలైట్ ఛానెల్ లో అర్దరాత్రి పావుగంటపాటు బ్లూఫిలిం ప్రసారం కావడం కలకలం రేపింది. ఈ ఛానెల్ ఆఫీసు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ మధ్యలో ఉంది. సరిగ్గా మూడురోజుల కిందట అర్దరాత్రి సమయంలో ఈ అశ్లీల చిత్రాలు ప్రసారం అయ్యాయి. పేరుమోసిన ఆ ఛానెల్ లో ఏకంగా పదిహేను నిమిషాలపాటు న్యూడ్ వీడియో ప్రసారం అయింది. వాస్తవానికి శాటిలైట్ చానెల్ సిబ్బంది ప్రతిక్షణం అలర్ట్ గా ఉంటారు. ఒక్క నిమిషం ఛానెల్ ప్రసారాలు ఆగిపోయినా, ఇతర కార్యక్రమాలు ప్రసారమైనా పరువు పోతుందని అప్రమత్తంగా ఉంటారు. అందుకే పీసిఆర్ లో అనుభవమున్న వ్యక్తులనే అపాయింట్ చేసుకుంటారు. అలాంటిది మంచి ఆదరణ కల్గిన ఈ ఛానెల్ లో పదిహేను నిమిషాలపాటు బ్లూఫిలిం ప్రసారం కావడం వెనక ఎవరో కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఛానెల్ ఎయిర్ లోకి వెళ్ళాలంటే ముందుగా సర్వర్ లోకి న్యూస్ ఫీడ్ ను పంపాలి. ఆ తరువాతే…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తాజాగా దాఖలు చేసిన మూడో చార్జీషీట్ సంచలనం రేపుతోంది. కవిత పాత్రపై పక్కా ఆధారాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. గత చార్జీషీట్లతో పోలిస్తే ఈ చార్జీషీట్ బలంగా ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చార్జీషీట్ లో ప్రధానంగా కవిత పొందిన లాభాలను ప్రస్తావించింది ఈడీ. లిక్కర్ దందా లాభాలతో కవిత హైదరాబాద్ లో భూములు కొన్నట్లు పేర్కొన్న ఈడీ…ఆమె భూములను ఎలా కొన్నారు..?ఎంతకు కొన్నారు..? ఎవరి ద్వారా ఈ భూముల కొనుగోలు జరిగిందనే విషయాలను చార్జీషీట్ లో పొందుపరిచింది. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, ఇతర నిందితుల పాత్రకు సంబంధించిన సమాచారాన్ని కవిత ఫోన్ల నుంచి సేకరించడంతోపాటు…కవిత విశ్వసించిన బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళైలు అన్ని వివరాలను ఈడీకి చెప్పడం వలెనే సాధ్యమైందని అంచనా వేస్తున్నారు. ఇటీవల బుచ్చిబాబు అప్రూవర్ అయ్యాడన్న లీకులు వచ్చాయి. ఈ లీక్ ఈడీనే ఇచ్చింది. కవిత ఆర్ధిక వ్యవహారాలు,…