Author: Prashanth Pagilla

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పొమ్మనలేక పోగబెడుతున్నారా..? అంటే ఇటీవలి పరిణామాలు అవుననే విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డిప్యుటీ స్పీకర్ గా పని చేసిన హరీష్ వర్గం నేత పద్మా దేవేందర్ రెడ్డిని రెండో దఫా కేసీఆర్ క్యాబినెట్ లోకి తీసుకోకపోగా, ఆమెను క్రమ, క్రమంగా పార్టీకి దూరం పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెదక్ నుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ రావు అక్కడ యాక్టివ్ గా పాలిటిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. మెదక్ నియోజకవర్గంలో రోహిత్ ఎన్జీవో పేరుతో విస్తృతంగా పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ నియోజకవర్గంలో మరోసారి గెలిచే అవకాశం ఉనప్పటికీ మరో బీఆర్ఎస్ నేత అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ చేయడం.. అధిష్టానంతో సహా జిల్లా నేతలు రోహిత్ రావును వారించకపోవడం చర్చనీయంశంగా మారింది. రోహిత్ కి టికెట్ ఇచ్చే విషయంలో హైకమాండ్ నుంచి…

Read More

తెలుగు మీడియా దిగ్గజం రవి ప్రకాష్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆర్ టీవీకి అప్పుడే సమస్య వచ్చి పడింది. రిపబ్లిక్ టీవీ లోగో, ఆర్ టీవీ లోగో ఒకే రకంగా ఉన్నాయని… ఇది కాపీరైట్ ఉల్లంఘేనని ముంబై హైకోర్టులో రిపబ్లిక్ టీవీ మేనేజ్ మెంట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. రిపబ్లిక్ టీవీని పోలినట్లుగా ఆర్ టీవీ లోగో ఉన్నదని.. ఇది తమ సంస్థకు నష్టం కల్గించేలా ఉందని రిపబ్లిక్ టీవీ యాజమాన్యం తరుఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఆర్ టీవీ అనే మూడు అక్షరాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. తమ తరుఫున దాఖలు చేసిన అప్లికేషన్ పిటిషన్ ఇంకా కేంద్ర మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉందని ఆర్ టీవీ తరుఫు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. ఇంకా ఆర్ టీవీ ప్రసారాలు ప్రారంభం కాలేదని, శాటిలైట్ టీవీ ఛానెల్ లో లోగో డిస్ ప్లే…

Read More

కర్ణాటక ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం ఉందనగా కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పఠనంపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ నేతల ప్రకటనలకు నిరసనంగా మంగళవారం బెంగళూర్ లో హనుమాన్ చాలీసాను పఠించాలంటూ బీజేపీ పిలుపునిచ్చింది. భజరంగ్ దళ్ బ్యాన్ అంశాన్ని బేస్ చేసుకొని ఎన్నికల్లో సానుకూల ఫలితాలను పొందాలని బీజేపీ ఆలోచించి ఈ పిలుపు ఇచ్చినట్లు కనబడుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ కలగజేసుకుంది. హనుమాన్ చాలీసాను పఠించకుండా ఉండేందుకు వీలుగా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెంగళూర్ లోని విజయనగర్ లోని ఓ గుడి బయట ఐదుగురు కంటే ఎక్కువమంది గూమిగూడవద్దని బీజేపీ నేతలను, వీహెచ్ పీ నేతలను ఆదేశించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా…

Read More

కాంగ్రెస్ కు మైలేజ్ పెరిగే ప్రతి సమయంలోనూ దాని నీరుగార్చడంలో బీఆర్ఎస్ కు సహాయకారిగా ముందుంటుంది టీవీ9. అధికార పార్టీకి పరోక్షంగా సహాయకారిగా పని చేసే టీవీ9 ఇప్పుడు కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ సక్సెస్ తో అలాంటి ప్రయత్నమే ప్రారంభించింది. ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ కు ప్రాధాన్యత పెరుగుతుందని అంచనా వేసిన టీవీ9, వ్యూహాత్మకంగా సభ ప్లాప్ అయిందనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కొన్ని అంశాలను ప్రస్తావించి సభ అనుకున్న రీతిలో సక్సెస్ కాలేకపోయిందని కథనం ప్రసారం చేసింది. వాస్తవానికి సభ పూర్తిగా విజయవంతమైంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. కొద్దిమంది కాంగ్రెస్ నేతలు డుమ్మా కొట్టారు. నాయకులు గైర్హాజరు కావడాన్ని చూపించి సభ మొత్తమే ప్లాప్ అయిందని టీవీ9 కథనం ప్రచారం చేయడం వారి భావదారిద్ర్యాన్ని , వారు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారనే విషయాన్ని తేటతెల్లం…

Read More

ఓ వైపు సీనియర్లు రేవంత్ కు సహాయ నిరాకరణ చేస్తున్నా రేవంత్ మాత్రం వాటిని పట్టించుకోకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. డిక్లరేషన్ ల పేరుతో సభలను ఏర్పాటు చేసి హైకమాండ్ పెద్దలను రప్పించి సభలను సక్సెస్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పెద్ద దిక్కు అనే అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దల్లో కల్పిస్తున్నారు. రేవంత్ కున్న మాస్ క్రేజ్ చూసి ఢిల్లీ పెద్దలు కర్ణాటక తరువాత తెలంగాణపై ఫోకస్ చేయాలని… తెలంగాణ కూడా కాంగ్రెస్ హస్తగతమయ్యే అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు. గతంలో వరంగల్ లో రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి ప్రకటింపజేశారు. అందులో కీలకమైన ధరణి పోర్టల్ రద్దు అంశం ఉంది. ఈ హామీ రైతులను, భూవివాదాలతో చిక్కులు ఎదుర్కొంటున్న ఎంతోమందిని ఆకర్షించింది. కాంగ్రెస్ వైపు తొంగిచూసేలా చేసింది. రైతు డిక్లరేషన్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలా రేవంత్ ప్రత్యేక కార్యచరణ తీసుకొని ముందుకు సాగారు.…

Read More

తెలంగాణ ఉద్యమకారులకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానని నాడు సెంటిమెంట్ డైలాగ్ లు కొట్టిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయాడు. కేసీఆర్ పిలుపుకు స్పందించి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన పాలమూరు బిడ్డ మున్నూరు రవిపై కిరాయి మూకలు దాడి చేయిస్తే కేసీఆర్ కాదు కదా ఆ పార్టీ నేతలెవరూ స్పందించలేదు. ప్రతిపక్ష పార్టీలు ఉద్యమకారుడైన మున్నూరు రవిపై దాడి ఘటనను ఖండించాయి. రవికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం కిమ్మనడం లేదు. మహబూబ్ నగర్ టికెట్ ఆశించడమే మున్నూరు రవి చేసిన నేరమా..? తెలంగాణ రాష్ట్రం కోసం నిఖార్సుగా కొట్లాడిన వ్యక్తిగా మున్నూరు రవికి టికెట్ ఆశించే అర్హత లేదంటే ఎలా..? మానుకోట ఉద్యమకారుల మీద రాళ్ళేసిన వ్యక్తిని ఎమ్మెల్సీ చేశారు. కరీంనగర్ , తాండూర్ లో ఉద్యమకారులను ఉరికించికొట్టిన గంగుల , పట్నంలకు తెలంగాణ ప్రభుత్వంలో…

Read More

తెలంగాణ కళను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి చూపకపపోగా ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నారు కేసీఆర్. ఇందుకోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడమే కాదు ఏకంగా సీఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకొని కాంగ్రెస్ ను ఖతం పట్టించాలనుకున్నారు. కాంగ్రెస్ పతనావస్థకు చేరుకున్న దశలో రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక హస్తం పార్టీ తిరిగి పుంజుకుంది. పార్టీని గతంలో వీడిన నేతలు రేవంత్ నాయకత్వంతో పార్టీలో చేరే దిశగా ఆలోచిస్తున్నారు. ఇది నచ్చని కేసీఆర్ , కేటీఆర్ లు రేవంత్ టార్గెట్ గా విమర్శల జడివాన కురిపిస్తుంటారు. కేసీఆర్ పరోక్షంగా విమర్శల దాడి చేస్తే కేటీఆర్ మాత్రం నేరుగానే మాటల మంటను పుట్టిస్తుంటారు. తాజాగా ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రేవంత్ టార్గెట్ గా కేటీఆర్ నోటికి పని చెప్పారు. సోనియాగాంధీని గతంలో బలిదేవత అని విమర్శించిన వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి…

Read More

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె మరో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్న వేళ ఆమె చేసిన పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నందమూరి తారకరత్న మరణించి ఏడాది కూడా కాలేదు. అప్పుడే అతని భార్య అలేఖ్య రెడ్డి మరో వ్యక్తితో పెళ్లికి ఒకే చెప్పిందని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా అలేఖ్య కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి పెంచడంతో అందుకు అలేఖ్య అంగీకరించిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అలేఖ్య టార్గెట్ గా తీవ్ర విమర్శలు చెలరేగాయి. భర్త చనిపోయి పట్టుమని పది నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే మరో పెళ్లికి రెడీ ఐపోయవా..?అంటూ కొంతమంది అసభ్యంగా పోస్టులు పెట్టారు. ఇలా పోస్టులు పెట్టడంపై తీవ్ర చర్చ సాగింది. మరోవైపు…

Read More

వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డిని గెలిపించాలని ఆ మధ్య ఓ సమీక్షలో స్పష్టం చేసిన కేసీఆర్ ఇటీవల మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వంటేరును మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత మెదక్ ఎంపీగానున్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్.. మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలుపుతారని చర్చ జరుగుతోన్న వేళ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానంలో గజ్వేల్ అభివృద్ధిని పర్యవేక్షిస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డిని పోటీలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రత్యర్ధి పార్టీల నుంచి టికెట్ ఆశిస్తోన్న నేతలు బలమైన వారే ఉండటంతో వారికీ ధీటైన నేతలను బరిలో నిలపాలనుకుంటున్నారు కేసీఆర్. పైగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని…

Read More

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయో పరిశీలిస్తోన్న పొంగులేటి కొత్త వేదికతో కేసీఆర్ వ్యతిరేకుల్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే వ్యూహంలో ముందడుగు వేశారు. టీఆర్ఎస్ ( తెలంగాణ రైతు సమాఖ్య ) అనే పేరుతో వేదికను సిద్దం చేసుకున్న పొంగులేటి…ఇదే పేరుతో రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు తెలుస్తోంది. పొంగులేటి అనుచరులే టీఆర్ఎస్ పేరుతో పార్టీని రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికీ కేసీఆర్ వ్యతిరేకులను తన టీఆర్ఎస్ గూటికి తీసుకొచ్చి.. దాదాపు 45స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపాలని పొంగులేటి ప్లాన్ గా చెబుతున్నారు. ఇందుకు సంబధించిన కార్యాచరణ కూడా రెడీ అయిందని.. అందుకే ఆయన ఏ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురిని…

Read More