Author: Prashanth Pagilla

బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అద్యక్ష బాధ్యతల నుంచి తప్పించేది లేదని స్పష్టం చేసిన బీజేపీ అధినాయకత్వానికి అసంతృప్తులు ఝలక్ ఇచ్చారు. బండిని తప్పించకపోతే తమ దారి తాము చూసుకుంటామని హైకమాండ్ కు అల్టిమేటం విధించారు. బండి స్థానంలో ఈటలకు అద్యక్ష బాధ్యతలు అప్పగించి…కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణకు ఆదేశించాలని హైకమాండ్ వద్ద అసంతృప్తులు తమ వాణిని గట్టిగా వినిపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నా అరెస్ట్ చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందని..ఈడీపై రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా..? అని ప్రశ్నించినట్లు సమాచారం. కేసీఆర్ అవినీతిపై విచారణకు ఆదేశించకుండా పదేపదే ఆరోపణలు చేయడం వలన తెలంగాణలో బీజేపీకి నైతికత లేకుండా పోతుందని హైకమాండ్ పెద్దల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అనుచరులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. తనను తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్…

Read More

బీఆర్ఎస్ -బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరిందా..? ఒప్పందంలో భాగంగానే బీజేపీపై దాడిని కేసీఆర్ తగ్గించారా..? ఫలితంగానే ఎమ్మెల్సి కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ గండం నుంచి సేఫ్ అయ్యారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాతో సహా అందరూ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారెవరికీ బెయిల్ రావడం లేదు. ఈ స్కాంలో కవిత పాత్ర ఉందని…ఈ స్కాం ద్వారా వచ్చిన లాభాలతో కవిత బినామి భూములను కొన్నారని ఈడీ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. ఆమె పాత్ర ఉందని సౌత్ గ్రూప్ లో ఆమె కీలకమని ఈడీ స్పష్టం చేసింది. దాంతో కవిత అరెస్ట్ ఖాయమని అంత భావించారు కానీ, ఆమెను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే నాలుగుసార్లు కవితను ఈడీ ప్రశ్నించింది. ఆమె దగ్గరి నుంచి పది ఫోన్లను కూడా తీసుకున్నారు.…

Read More

ఈవారం కొత్త పలుకులో ఏబీఎన్ ఆర్కే ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలకు బాద్యతలు కట్టబెడుతారని ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తి అయ్యాయని రాసుకొచ్చారు. ఇప్పటికే ప్రియాంక గాంధీతో షర్మిల భేటీ అయ్యారని సంచలన కథనం వెలువరించారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ను కలిసిన షర్మిల అంతకుముందే ప్రియాంక గాంధీతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. శివకుమార్ ను షర్మిల కలిసిన తరువాత వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. వీటిని షర్మిల ఖండించినా భవిష్యత్ లో అలాంటి అవకాశం ఉండొచ్చునని అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఏపీలో పార్టీ బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రామిస్ ఏపీ వాసులను కాంగ్రెస్ వైపు చూసేలా చేస్తోంది. కానీ ఎపీ కాంగ్రెస్ కు ప్రజాదరణ కల్గిన నేత కావాలి. అది వైఎస్ షర్మిల…

Read More

తెలంగాణలో విలువైన ప్రభుత్వ భూములపై సర్కార్ గద్దల కన్ను పడిందని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో విలువైన కొంత సర్కార్ ల్యాండ్ ను తక్కువ మొత్తానికి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి కేటాయించారు. తాజాగా ఎకరం వంద కోట్లు పలికే కోకాపేటలో బీఆర్ఎస్ కు ఏకంగా 11ఎకరాల భూమిని ధారాదత్తం చేసేశారు కేసీఆర్. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ వ్యవహారం జరగడమే ఇపుడు సంచలనంగా మారింది. కోకాపేటలో రూ.550కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.37.53కోట్లకే బీఆర్ఎస్ కు కట్టబెడుతూ మంత్రివర్గం తీర్మానించింది. నూతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన ఫైల్ క్లియర్ అయింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు ఈ విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీఆర్ఎస్ కు పదకొండు ఎకరాల భూమిని కట్టబెట్టడానికి కారణం. కాలేజ్ పెడుతుందట. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్…

Read More

తెలంగాణ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ జయల ప్రశాంత్ నేతృత్వంలోని యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ పై సైబరాబాద్ పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు చేశారు. పేపర్ లీక్ ,యూత్ డిక్లరేషన్ అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి..?అనే వ్యూహాలతో స్టోర్ చేసి పెట్టుకున్న హార్డ్ డిస్క్ ,కంప్యూటర్ ,ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి నోటిసులు ఇవ్వకుండానే వార్ రూమ్ లోకి చొరబడిన పోలీసులు సోషల్ మీడియా టీం  నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని బయటకు వెళ్ళకుండా బందించారు. అనంతరం కంప్యూటర్లు,హార్డ్ డిస్క్ ల సేకరణ తరువాత ఉద్యోగులను బయటకు పంపించారు. ఈ ఘటనను టీపీసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శివసేనా రెడ్డి ఖండించారు. కర్ణాటక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ వ్యూహాలతో పార్టీ గెలుపు సులభమైందని కేపీసీసీ అద్యక్షుడు డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన మరుసటి రోజు తెలంగాణలో యూత్ కాంగ్రెస్ వార్…

Read More

కేసీఆర్ ఏం చేసినా రాజకీయ ప్రయోజనం లేకుండా ఏపని చేయరనేది చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మునుపు కానీ రాష్ట్ర ఏర్పాటు తరువాత కానీ ఆయన అదే ధోరణి అవలంభిస్తున్నారు. ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా… భారీ బహిరంగ సభలు నిర్వహించినా కౌంటర్ గా ఏదో కార్యక్రమంతో మీడియాలో స్పెస్ దక్కించుకుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితంతో తెలంగాణ కాంగ్రెస్ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది. నేడు కర్నాటకలో బీజేపీని కొట్టాం.. రేపు తెలంగాణలో బీఆర్ఎస్ ను దెబ్బతీస్తామని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితంతో మార్పు మొదలైందని ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తోంది. జనాలు కూడా కాంగ్రెస్ గెలుపు గురించి చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు బలం చేకూరుతుందని అంచనా వేసిన కేసీఆర్, ప్రజల అటెన్షన్ తనవైపు తిప్పుకునేందుకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన…

Read More

కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోవడంపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. ఇక సౌత్ పై బీజేపీ ఆశలు వదిలేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోని బీజేపీ.. తెలంగాణపై ఆశలు పెట్టుకోవడం దండగ అని సూచిస్తున్నారు. నిజానికి తెలంగాణలో బీజేపీకి ఏమంత బలం లేదు. బీజేపీ రేసులోకి వచ్చిందనే ప్రచారం చేసుకోవడానికి ప్రధాన కారణం మీడియా బలమే తప్పితే అసలు బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని గ్రౌండ్ రియాలిటీని చెప్పేస్తున్నారు. ఆ పార్టీకి పట్టుమని పది మంది అభ్యర్థులు గట్టి వారు లేరు. ఢిల్లీ నుంచి నేతలు ఎంత ఫోకస్ చేస్తున్నా తెలంగాణ బీజేపీలోకి చేరికలు ఉండటం లేదు. దీంతో తెలంగాణపై ఆశలు పెట్టుకోవడం అత్యాశే అవుతుందని.. కర్ణాటక ఫలితం కమలనాథులు కన్ను తెరిపించినట్టేనని అంటున్నారు. దక్షిణ భారత దేశంలో ఓసారి బీజేపీ ఉనికి పరిశీలిద్దాం. ఏపీలో ఆ పార్టీ ఏమాత్రం బలంగా లేదు. పొత్తుల కోసం కిందామీదా పడుతోంది. తమిళనాడులో ఎదగడానికి…

Read More

మిషన్ కర్ణాటక విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు తన దృష్టిని తెలంగాణపైకి మల్లిస్తోంది. కర్ణాటకలో అసంతృప్త నేతలనంతా ఎకతాటికిమీదకు తీసుకొచ్చిన విధంగా తెలంగాణలోనూ అదే తరహలో ఐక్యం చేయగలిగితే కాంగ్రెస్ సగం విజయాన్ని సాధించినట్లే. ఈ విషయాన్ని గుర్తించిన అధిష్టానం తన ఫోకస్ ను తెలంగాణపై కేంద్రీకరిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు స్ట్రాటజిలతో ఇప్పటికే బీజేపీని వెనక్కి నెట్టి… రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితిని క్రియేట్ చేశాడు రేవంత్. ఈ క్రమంలోనే వచ్చిన కర్ణాటక రిజల్ట్స్ బీజేపీని పూర్తిగా నిరాశపరిచాయి. కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇచ్చాయి. కర్ణాటకలో విజయం సాధించి సౌత్ లో సత్తా చాటాలని… కర్ణాటకలో గెలిస్తే ఆ ప్రభావం తెలంగాణపై పడుతుందని లెక్కలేసుకున్నారు కమలనాథులు. కర్ణాటక గెలుపు తెలంగాణకు గెట్ వే అవుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై…

Read More

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లోక సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్రలోని లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారా..? ఇందుకు సంబంధించిన కార్యాచరణ రెడీ అవుతుందా..? తెలంగాణను వీడి పక్క రాష్ట్రం నుంచి పోటీ చేయడం వలన బీఆర్ఎస్ వైపు దేశ ప్రజల దృష్టి కేంద్రీకృతం అవుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారా ..? అంటే అవుననే అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో భాగంగా కేసీఆర్ సంచలనాలకు తెరతీయబోతున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మాహారాష్ట్ర లోక్ సభ నియోజకవర్గం నాందేడ్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి కేసీఆర్ బరిలో నిలవడం ద్వారా బీఆర్ఎస్ కు ఎలాంటి మైలేజ్ లభిస్తుంది..? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి..? బీఆర్ఎస్ పట్ల అక్కడి ప్రజలు అభిప్రాయం ఎలా ఉందనే అంశాలను బేరీజు వేసుకొని నాందేడ్ నుంచి పోటీపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక…

Read More

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కేసీఆర్ ముఖ్య సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇప్పటికే రాజీవ్ శర్మ అనే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇదే పదవి కట్టబెట్టి పదవిలో కొనసాగిస్తున్నారు. ఆయన మాత్రం పూర్తిగా పాలన వ్యవహారాలను మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు సోమేశ్ కుమార్ కు పదవిని కట్టబెట్టడం ద్వారా ఉత్తరాది పార్టీ వ్యవహారాలను ఆయన చూస్తారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. నిజానికి సోమేశ్ కుమార్ కు రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది. సీఎస్ గా ఉన్న సమయంలో సర్వేలు కూడా చేయించి కేసీఆర్ కు ఇచ్చేవారు. ధరణి పోర్టల్ అంశంలో కేసీఆర్ కు పూర్తిగా భరోసా ఉన్నాడు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చాక ఆయన బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమేశ్ కుమార్ ఆసక్తిని గమనించిన కేసీఆర్, సోమేశ్ సేవలను…

Read More