Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. వివేకా హత్యకేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన వెకేషన్ బెంచ్.. ఈమేరకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. ప్రతివారం సీబీఐ ఎదుట హాజరు కావాలని.. చెప్పకుండా విదేశాలకు వెళ్లకూడదని అవినాష్ రెడ్డిని ఆదేశించింది. ప్రధానంగా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కారణం..తన తల్లికి ఆపరేషన్ జరుగుతోందని ఇప్పుడున్న పరిస్థితుల్లో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, అవినాష్ రెడ్డి తల్లికి ఆపరేషన్ జరగలేదని, వెంటనే ఆతనిపై చర్యలు తీసుకోవాలని సునీత తరుఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై స్పందించిన వెకేషన్ బెంచ్.. అవినాష్ తల్లికి సర్జరీ జరగలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం పట్ల తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టుకు…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను కాపాడే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఓ కౌంటర్ లో కవిత ప్రస్తావనే లేకుండా పోవడంతో.. లిక్కర్ స్కాం నుంచి కవిత సేఫ్ అనే వాదనలు వినిపించాయి. తాజాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో మాత్రం మొత్తం కవితే చేశారని పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిళ్ళై బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో కవిత పాత్రను ప్రధానంగా పేర్కొంది ఈడీ. మద్యం కుంభకోణంలో ఇండోస్పిరిట్ వాటాల్లో కవితనే అసలైన పెట్టుబడిదారు అని పిళ్ళై అంగీకరించినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత, ఆప్ నేతల మధ్య ఒప్పందం ఉన్నట్లు పిళ్ళై స్టేట్ మెంట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ కేసులో నిందితులతో కవితకున్న సంబంధాలను వారి స్టేట్ మెంట్ల రూపంలో మెన్షన్…
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సొంత గూటికి చేరనున్నారా..? సోమవారం ఈటల చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం లేదనే నిర్ణయానికి వివేక్ వచ్చేశారా..? పొంగులేటి, జూపల్లి బాటలోనే వివేక్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాలనే సమాలోచనలు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు బీజేపీలోకి వచ్చే పరిస్థితి లేదని సోమవారం ఈటల చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీలో రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగానున్న నేతలను పక్కచూపులు చూసేలా ఉన్నాయని పొలిటికల్ ఏనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ బహిష్కరణ వేటుకు గురైన ఇద్దరు నేతలను బీజేపీలో చేరాలని చేరికల కమిటీ చైర్మన్ ఈటల విశ్వప్రయత్నాలు చేశారు కానీ పొంగులేటి, జూపల్లి సహా మరికొంతమంది నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరు. దీనిని గుర్తించిన ఈటల… వారిని బీజేపీలో చేరేలా ప్రయత్నించాను.. కానీ వారే తమతో జత కట్టాలంటూ…
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో వైఎస్ షర్మిల నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తులు, వైఎస్సార్ టీపీ విలీనం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ డీకేతో షర్మిల సమావేశమవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. పొత్తు ప్రతిపాదనలు, పార్టీ విలీనం అంశాలపైనే డీకేతో షర్మిల చర్చించారా..? మరేదైనా కారణమా..? అనేది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ డిబేట్ గా మారింది. వైఎస్ ఫ్యామిలీతో డీకే శివకుమార్ కు ముందు నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినట్లు షర్మిల చెబుతోంది. అయితే…బెంగళూర్ లో వైఎస్ కుటుంబానికి ఆస్తులు బాగానే ఉన్నాయి. మారిన పరిణామాలతో సోదరుడు జగన్ ఉమ్మడి ఆస్తుల్లో వాటా ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్న షర్మిల… ఉమ్మడి ఆస్తుల్లో వాటా దక్కించుకోవడానికి కర్ణాటక డిప్యుటీ సీఎం శివ కుమార్ ను కలిసి…
2018ఎన్నికల్లో మ్యానిఫెస్టో రూపకల్పనలో ఆలస్యం కావడంతో ఆ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడంలో టి.కాంగ్రెస్ వెనకబడింది. అది కూడా తమ ఓటమికి ఓ కారణమని కాంగ్రెస్ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడుతోంది కాంగ్రెస్. ఇందుకోసం ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్ ను ప్రకటించిన కాంగ్రెస్ మరో ఏడు డిక్లరేషన్ లను ప్రకటించనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ లక్కీ నెంబర్ 9 కలిసివచ్చేలా మొత్తం తొమ్మిది డిక్లరేషన్ లతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందించనున్నారు. రైతు, యూత్ డిక్లరేషన్ లకు తోడు త్వరలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఆ తరువాత మహిళ డిక్లరేషన్ కూడా ప్రకటించాలని రేవంత్ నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డిక్లరేషన్ ను తయారు చేసే పనిలో పడింది టి. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం. కర్ణాటకలో రూపొందించిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో అక్కడ…
కర్ణాటక ఎన్నికల వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేసి అనుకున్న ఫలితాన్ని రాబట్టాలని టి. కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ఎవరైతే ఉన్నారో తెలంగాణలోనూ అతనే ఉన్నారు. అతడే సునీల్ కనుగోలు. అతని వ్యూహాలన్నీ కన్నడనాట సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. దాంతో అక్కడ అనుసరించిన ఎన్నికల పాలసీని తెలంగాణలో అనుసరించాలని అనుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఎస్కే టీం వర్క్ చేస్తోంది. అతనిచ్చిన సర్వే రిపోర్ట్ ల ఆధారంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేకంటే ముందే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. సగం మంది అభ్యర్థుల ఎంపికను జూన్ చివరివరకు ఫిక్స్ చేయనున్నారు, ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై అనేక సర్వేలు చేసి వడపోతలు చేసిన ఎస్కే.. మరో సర్వే చేసి అభ్యర్థుల లిస్టును రెడీ చేయనున్నారు. 55నుంచి 60నియోజకవర్గాల అభ్యర్థులను జూన్ లోపు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ఖరారు చేస్తారు కానీ పేర్లను మాత్రం బయటకు…
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా కేంద్రం మాత్రం ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా బీజేపీ నేతలెవరూ స్పందించడం లేదు. అందరూ సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. దేశానికి పతకాలు వస్తే అవన్నీ కేంద్రం అందిస్తున్నా సహకారంతోనే సాధ్యం అవుతున్నాయని చెప్పుకునే బీజేపీ నేతలు..ఇప్పుడు ఆ పతాకాలు సాధించిన క్రీడాకారులకు ఆపద వచ్చిందంటే మాత్రం మాట్లాడటం లేదు. చాలామంది మహిళ రెజ్లర్ల తరుఫున మాట్లాడుతున్నారు. సంఘీభావం తెలుపుతున్నారు. ప్రధానికి కూడా ఈ విషయంలో చిక్కులు ఎదురు అవుతున్నా ఆయన మాత్రం మౌనముని పాత్రను వీడటం లేదు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడే మోడీ… మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేతపై కనీసం ఓ మాట ఎందుకు మాట్లాడటం లేదనేది అందరి ప్రశ్న. బ్రిజ్‌భూషణ్…
ఓఆర్ఆర్ స్కామ్ లో రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. ఈ స్కామ్ లో ప్రభుత్వ పెద్దలు, హెచ్ఎండీఏ అధికారులపై నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. దీంతో రేవంత్ కు హెచ్ఎండీఏ లీగల్ నోటిసులు ఇచ్చింది. హెచ్ఎండీఏపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని..సంస్థ గౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్నారని, 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని రేవంత్ కు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొన్నారు. లేదంటే సీరియస్ యాక్షన్స్ ఉంటాయని హెచ్చరించింది. సరిగ్గా ఇలాంటి పరిణామం జరుగుతుందని ముందే అంచనా వేసిన రేవంత్ తేల్చుకుందామని సవాల్ చేశారు. ఓఆర్ఆర్ టెండర్ల స్కామ్, లిక్కర్ స్కామ్ కంటే వెయ్యి రెట్లు పెద్దదని అదంతా బయటకు రావాల్సిందేనని అంటున్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. టెండర్ ను రద్దు చేసేందుకు దీనినొక అవకాశంగా మలుచుకుంటానని రేవంత్ వెల్లడించారు. టెండర్ ప్రక్రియకు సంబందించిన డాక్యుమెంట్ ను అధికారులు,ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇది కూడా రేవంత్ కు అస్త్రంగా మారింది. ఓఆర్ఆర్…
కేసీఆర్ ఏ పథకం రూపొందించినా అది ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమలు తరువాత పథకం పేరు చెప్పి ప్రచారం చేసుకొని లబ్ది పొందటంలో కేసీఆర్ మించిన రాజకీయ నేత మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ప్రారంభించారు కేసీఆర్. దళిత బంధు ద్వారా దళితులకు పది లక్షలు ఇస్తున్నారు. బీసీ పథకం ద్వారా కుల వృత్తుల వారికీ రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ఇళ్ల నిర్మాణం కోసం మూడు లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్తగా ఇళ్ల పథకానికి ఈ ఏడాది రూ. 18వేల కోట్లను ఖర్చు చేస్తామని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంపై మరింత భారం పడుతుంది. నిరుద్యోగ భ్రుతిపై హామీని నెరవేర్చాలని ప్రశ్నిస్తే ఖజానే లేదు ఎక్కడి నుంచి ఇవ్వాలని ఓపెన్ స్టేట్ మెంట్ పాస్ చేసిన ప్రభుత్వ పెద్దలు…ఇప్పుడు అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి ఇస్తారు అనేది చర్చనీయాంశం అవుతోంది. నిజంగా…
బీజేపీలో ఈటల రాజేందర్ వ్యవహారశైలి దయనీయంగా మారుతోంది. పార్టీ రాష్ట్ర అద్యక్ష బాధ్యతలను ఆశిస్తోన్న ఈటల తనను టీ. బీజేపీ చీఫ్ గా నియమించాలని హస్తిన వెళ్లి శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఆయనకు కొంతమంది నేతలు కోరస్ పాడారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బండిని మార్చే ప్రసక్తే లేదని అగ్రనేతలు స్పష్టం చేయడంతో…ఈటల తన బలాన్ని చూపించి అధిష్టానంకు తనేంటో తెలియజేయాలని చూస్తున్నారన్న వాదనలు సర్వత్ర ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాజకీయాలను పొంగులేటి,జూపల్లి చేరికలు ప్రభావితం చేస్తాయని కాంగ్రెస్,బీజేపీలు భావిస్తున్నాయి. పొంగులేటి,జూపల్లిని పార్టీలో చేర్చుకోవాలని ఢిల్లీ నుంచిబీజేపీ నేతలకు ఆదేశాలు అందాయి. బండి రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈటల కూడా ఓసారి తన టీంను వెంటబెట్టుకొని వెళ్లి పొంగులేటి కలిసారు. బీజేపీలో చేరాలని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చాక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్…