Author: Prashanth Pagilla

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం జరిగిపోయింది. నాగబాబు ఇంట్లో జరిగిన వేడుక సినీ ప్రముఖులు, ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరిగింది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమాయణంలో ఉన్నప్పటికే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. నేరుగా నిశ్చితార్ధం ప్రకటనతోనే వీరి లవ్ స్టొరీకి ప్రూఫ్ లభ్యమైంది. మిస్టర్ సినిమాలో ఈ జంట జోడిగా కలిసి నటించింది. ఆ తరువాత అంతరిక్షం సినిమాలోనూ కనిపించారు. అప్పుడు మొదలైన స్నేహం ప్రేమగా మారిందని ప్రచారం జరిగింది. కాని వీరు ఎక్కడ జంటగా కనిపించకపోవడంతో వీరి ప్రేమాయణంకు సంబంధించిన వార్తలన్నీ పుకార్లుగానే నమ్మారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అధికారిక ప్రకటన రావడంతో అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. మెగా వారసుడికి కాబోతున్న వధువు బ్యాక్ గ్రౌండ్ ఏంటి?అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. యూపీలోని అయోధ్యలో లావణ్య త్రిపాఠి జన్మించింది. డెహ్రాడూన్ లో పెరిగింది. తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి…

Read More

ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బీజేపీపై దుమ్మెత్తిపోసే కేసీఆర్, కొద్ది రోజులుగా బీజేపీ గురించి ప్రస్తావించడం మానేశారు. అసలు ప్రత్యర్ధి కాంగ్రెస్ అనుకుంటున్నారో, బీజేపీని విమర్శిస్తే లేని తలనొప్పులు వస్తాయని ఆందోళన చెందారో కాని బీజేపీపై కేసీఆర్ యుద్ధ విరమణ చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల రెండు జిల్లాలో పర్యటించిన కేసీఆర్ రెండు బహిరంగ సభలో బీజేపీ ప్త్రస్తావనే తీసుకురాలేదు. కేవలం కాంగ్రెస్ నే కార్నర్ చేశారు. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ పటిష్టం కావడానికి కేసీఆర్ ప్రధాన కారణం. ఏమాత్రం బలం లేని బీజేపీని పదేపదే విమర్శించి, బీఆర్ఎస్ ప్రత్యర్ధి బీజేపీనే అనే విధంగా ప్రజల్లోకి ఓ రకమైన భావనను క్రియేట్ చేశాడు. కాంగ్రెస్ ఎక్కడుంది..? అంటూ ఎగతాళి చేస్తూ బీజేపీపై పోరు చేస్తానని బీరాలు పలికాడు.దాంతో పోటీ మొత్తం బీజేపీ – బీఆర్ఎస్ మద్యే అన్నట్లు వాతావరణం ఏర్పడింది. కొన్ని రోజులుగా కేసీఆర్ బీజేపీని మునుపటి రీతిలో విమర్శించడం లేదు. కాంగ్రెస్ పై…

Read More

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. రాజేష్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కు బాటలు వేయాలని యోచిస్తున్న అయన తండ్రి దామోదర్ రెడ్డి కుమారుడి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజేష్ రెడ్డి భవిష్యత్ కు కాంగ్రెస్ నుంచి ఆశాజనకమైన హామీ లభిస్తే దామోదర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడెందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. రాజేష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేకంటే ముందుగానే దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే జిల్లాలో బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామాలు తప్పవు. దామోదర్ రెడ్డి పార్టీని వీడితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని సీఎం కేసీఆర్ పర్యటనకు ఒకరోజు ముందే స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి,…

Read More

ఎన్నికలు సమీపిస్తున్న సమయాన తెలంగాణ బీజేపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కొత్తగా పార్టీలో చేరిన నేతలతో బలీయంగా కనిపించిన బీజేపీకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారో..? తెలియక సతమతం అవుతోంది. కీలకమైన నేతలు ఒకరిద్దరూ పార్టీని వీడినా ఈ ప్రభావం మామూలుగా ఉండదు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీ ఎందుకు ఇలా సంకట పరిస్థితిని ఎదుర్కొంటుందని పార్టీ అగ్రనేతలు ఆరా తీస్తున్నారు. బీజేపీలో రెండు, మూడు వర్గాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. గత కొద్దిరోజులుగా బండి సంజయ్, ఈటల వర్గంగా పార్టీ చీలిపోయింది. ఈటలకు అద్యక్ష బాధ్యతలు అప్పగించాలని కొత్తగా పార్టీలో చేరిన నేతలంతా కోరుతున్నారు. బండిని పదవి నుంచి తప్పించాలనుకుంటున్నారు. ఇప్పట్లో బండిని మార్చే ప్రసక్తే లేదని ఢిల్లీ పెద్దలు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వలస నేతలు పక్కచూపులు చూస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలు కాస్త ఢిల్లీని తాకాయి. వెంటనే ఢిల్లీ…

Read More

తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఎలా సయోధ్య కుదుర్చాలో అగ్రనేతలకు అంతుపట్టడం లేదు. బండి సంజయ్ ను అద్యక్ష బాధ్యతల నుంచి దించేయాలని ఓ వర్గం నేతలంతా కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో బండిని మార్చడం సరైంది కాదని హైకమాండ్ అంటోంది. అదే సమయంలో బండి నాయకత్వంలో పని చేయలేమని చెబుతున్నా నేతలకు తియ్యని కబురు పంపింది. ఈటలకు కీలకమైన పదవి ఇస్తామని చెప్పింది కానీ ఇప్పటివరకు ఆ పదవి ఏంటో..? ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఈటలకు పదవి ఇస్తే ఒకే. లేదంటే అందరం కలిసి ఒకేసారి కాంగ్రెస్ లో చేరుదామని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలంతా ఆలోచిస్తున్నారు. కొంతమంది నేతలు కాంగ్రెస్ నాయకత్వంతో టచ్ లో కూడా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో పరిస్థితిని అంచనా వేసిన కమలాదళం నష్టనివారణ చర్యలు చేపట్టింది.…

Read More

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో కవిత హస్తం ఉందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఈడీ, సీబీఐలు కవితను సాక్షిగా మాత్రమే పరిగణించాయి. సీబీఐ న్యాయమూర్తి మాత్రం కవిత ఈ స్కామ్ లో నిందితురాలు అనే విధంగా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అరుణ్ పిళ్ళై బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేక కోర్టు…లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని అభిప్రాయపడింది. పిళ్ళై బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం..పిళ్ళై పేరిట ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదని ఈడీ పేర్కొనటం చూస్తే కవిత కోసం బినామీ లావాదేవీకి పాల్పడినట్లు స్పష్టం అవుతుందని పేర్కొంది. అలాగే, స్కామ్ ద్వారా ఆర్జించిన లాభాలతోనే కవిత కోసం ఆస్తులను కొనుగోలు చేశారని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నిధులు బదిలీ జరిగిన తీరు చూస్తుంటే…

Read More

సబ్బండ వర్గాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి నేటితో తొమ్మిదేళ్ళు నిండాయి. ఉద్యమ లక్ష్యం నెరవేరింది కానీ ఉద్యమ ఆకాంక్షల కోసం స్వరాష్ట్రంలోనూ నినదించాల్సిన దుస్థితి కనిపిస్తోంది. తెలంగాణకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని, కేసీఆర్ వచ్చాకే తెలంగాణకు అభివృద్ధి పరిచయమైందని బీఆర్ఎస్ నేతలు అతిగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ సర్కార్ పురోగతి సాధించిన మాట వాస్తవమే కానీ కీలక అంశాల్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇచ్చారు. సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకున్నారు. కాళేశ్వరం ఒక అనర్థక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో లక్షన్నర కోట్ల రూపాయలు వ్యయం చేసి కమిషన్లు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన 33 ప్రాజెక్టులు పనులు పూర్తి కాక నిర్మాణ దశలోనే ఉన్నాయి. వాటిని మరో 8కోట్లు కేటాయిస్తే నిర్మాణమై..33లక్షల ఎకరాలకు…

Read More

ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు మరో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. రాజకీయ అరంగేట్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. ఆ మధ్య ఏపీ సీఎం జగన్ ను క్యాంప్ ఆఫీసులో కలిసిన అంబటి రాయుడు చాలా సమయంపాటు జగన్ తో ముచ్చటించారు. ఆ తరువాత ఆయన సామజిక మాధ్యమాల్లో జగన్ పాలనను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడంతో రాయుడు వైసీపీలో చేరుతారని అంత భావించారు కానీ రాయుడు రాజకీయ అరంగేట్రం చేయనున్నారని తెలిసి కాంగ్రెస్ చక్రం తిప్పింది. రాయుడుని కాంగ్రెస్ లో చేరే విధంగా మరో మాజీ టీమిండియా క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు రంగంలోకి దింపింది. రాయుడును కాంగ్రెస్ లో చేరాలని అజారుద్దీన్ కోరినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరి గుంటూర్ జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేయాలనుకున్నారు రాయుడు. కానీ రాయుడును కాంగ్రెస్ లోకి ఆహ్వానించి లోక్ సభ సీటును…

Read More

మరో ఐదారు నెలలో తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ కూడా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. వలస నేతలు కాంగ్రెస్ లో చేరుతారనే ఆందోళన ఆ పార్టీని వేధిస్తోంది. షర్మిల కూడా ఏదో ఒక పార్టీతో జత కట్టే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రజల్లో ఓ భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈసారి వందసీట్లు మావే అంటున్నారు. అధికారంపై ధీమాగా ఉన్నామని చెబుతున్నా ఏమాత్రం ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడం లేదు. రేవంత్ కూడా మంచీ టచ్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా పాదయాత్ర పూర్తి చేసి ఉత్తర తెలంగాణలో పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి చేశారు. రేవంత్ తోపాటు భట్టి కూడా పాదయాత్ర చేస్తుండటంతో…

Read More

కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణ బీజేపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇన్నాళ్ళు ఎలాగోలా బీజేపీ తెచ్చిపెట్టుకున్న హైప్ కర్ణాటక ఫలితంతో ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. అధికారం ఉన్నచోటనే పార్టీ తిరిగి అధికారంలోకి రాలేకపోయింది. ఇక అంతంత మాత్రం ఆశలున్నా తెలంగాణలో ఎలా సాధ్యం అవుతుందని..? పెదవి విరుపులు ప్రారంభమైయ్యాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది నేతలు కమలం కాంపౌండ్ నుంచి గాంధీ భవన్ లోకి దూకేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు జూన్ రెండో వారంలో కాంగ్రెస్ చేరనున్నారు. వారితోపాటు నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా ఒకరిద్దరు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరుతారని..వారిలో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ నలుగురు నేతలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందని విస్తృతస్థాయి…

Read More