Author: Prashanth Pagilla

ఇప్పుడు ఎక్కడవిన్నా ‘దురికి మోహనరావు రచనలు’ అనే యూట్యూబ్ ఛానల్ గురించే చర్చ జరుగుతోంది. లోగడ అయన రాసిన ‘ది ఎక్స్-రే మ్యాన్’ అనే ఇంగ్లీష్ నవల అమెరికాలో పబ్లిష్ అయ్యి, 64 దేశాలల్లో విడుదలయ్యి సంచలం రేపగా అతనికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఆ నవల పలు రంగాల్లో ‘అమోజోన్ వర్డ్ రికార్డ్, ఇండియన్ వరల్డ్ రికార్డ్, స్టార్ వరల్డ్ రికార్డు లాంటి కొన్ని రికార్డ్ లు సృష్టించింది. 1985 నుంచి నేటివరకు ఆయన 600 పైగా కథలు, 12 నవలలు, 74 సినిమాలకు స్క్రీన్ ప్లే (కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్)గా రచనలు చేసి మంచి పేరు గడించారు. ఇప్పటివరకు ఆయన రాసిన ఈ రచనలను ‘దురికి మోహనరావు రచనలు’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రారంబించిన మూడు రోజుల్లోనే సంచలనం  రేపుతోంది. దీనికి కారణం ఆయన లోగడ రాసిన…

Read More

బీఆర్ఎస్ ను ఓడించేందుకు రాజకీయ పునరేకీకరణ జరగాలని కోరుకుంటున్న కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందా..? ఇందులో భాగంగా టీజెఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోదండరాం ముందు హస్తం నేతలు ప్రతిపాదనలు పెట్టారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితం తరువాత టి. కాంగ్రెస్ కు అధికారంపై మరింత ఆశ పుట్టింది. ఎన్నికలకు ముందు కాస్త అటు, ఇటుగా తెలంగాణ పరిస్థితులే కర్ణాటకలోనూ ఉన్నాయి. అయినప్పటికీ అసలే ఆశలు లేని స్థితి నుంచి అధికారంలోకి వచ్చేంత బలం సంపాదించుకుంది కన్నడ కాంగ్రెస్. దాంతో కాస్త కష్టపడితే కర్ణాటక మాదిరి తెలంగాణలోనూ అధికారంలోకు రావొచ్చుననేది హస్తం నేతల ఆలోచన. అందుకే పార్టీలోకి చేరికలను స్పీడప్ చేయాలనుకుంటుంది రాష్ట్ర నాయకత్వం. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లిలను కాంగ్రెస్ లో చేరే విధంగా తెర వెనక మంత్రాంగం నడిపిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో కీలక నేతను పార్టీలోకి తీసుకొచ్చేందుకు…

Read More

బీజేపీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అనేక భూవివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ధరణి పోర్టల్ ను కూడా కొనసాగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు ధరణిని రద్దు చేస్తామని ప్రకటించిన బండి.. కేసీఆర్ ధరణిపై మాట్లాడుతూ ఇటీవల ప్రతిపక్షాలపై విమర్శల మోత మొగిస్తోన్న వేళ బండి ఈ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చినా, కేసీఆర్ పథకాలనే కొనసాగించేటట్లైతే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి..? అనే ఆలోచన ఓటర్లకు తడితే అది కమలం పార్టీకి మైనస్ అవుతుంది. ధరణి పోర్టల్ విషయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణి తప్పుల తడకగా ఉంది. ధరణితో చాలామంది భూములను కోల్పోయారు. ఈ పోర్టల్ తో అధికార పార్టీ నేతలు పెద్దఎత్తున అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే వరంగల్ డిక్లరేషన్ సమయంలో రాహుల్ గాంధీతో ధరణిపై రేవంత్ రెడ్డి…

Read More

రాంగ్ రూట్ లో నడుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ను సెట్ రైట్ చేస్తున్నారు కేపీసీసీ అద్యక్షుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్. టి. కాంగ్రెస్ ను శక్తివంతంగా మార్చడంపై ఆయన ఫోకస్ పెట్టారు. కర్ణాటకలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కాంగ్రెస్ ను ఎలాగైతే అధికారంలోకి తీసుకోచ్చారో అలాగే తెలంగాణ కాంగ్రెస్ ను పవర్ లోకి తీసుకువచ్చేలా సేవలు అందించాలని డీకే డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ ను ఓడించేది కాంగ్రెస్సే అనే అభిప్రాయాన్ని ముందుగా ప్రజల్లో కలగజేయాలని తద్వారా కాంగ్రెస్ రేసులోకి వస్తుందనేది ఆయన భవన. టీపీసీసీ చీఫ్ రేవంత్ కు అత్యంత సన్నిహితుడు డీకే శివకుమార్. కర్ణాటక వ్యూహాలు తెలంగాణలోనూ మేలు చేస్తాయని భావిస్తోన్న రేవంత్… డీకే సేవలను తెలంగాణలోనూ వినియోగించుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ కూడా డీకే సామర్ధ్యంపై పూర్తి విశ్వాసంతో ఉంది. ఆల్రెడీ డీకే శివ కుమార్ వర్క్ స్టార్ట్ చేశారని… పార్టీలో చేరికల వెనక…

Read More

క్రియేటివ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ కాంబోలో ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఆదిపురుష్ కథ : జానకి (కృతి సనన్ ), శేషు (సన్నీ సింగ్ )తో రాఘవుడు ( ప్రభాస్ ) అరణ్యవాసానికి వెళ్తాడు. అక్కడ రాఘవుడిని చూసి సూర్పుణఖ( తృప్తి) మనస్సు పారేసుకుంటుంది. ఆయనను తన భర్తగా పొందాలని ఆరాటపడుతోంది. తన మనస్సులోని మాటను రాఘవుడితో పంచుకోగా నాకు వివాహం జరిగిపోయింది. మిమ్మల్ని వివాహమడలేననని సూర్పుణఖకు చెప్పి రాఘవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఘవుడిని పెళ్లి చేసుకున్నది ఎవరని తెలుసుకొని ఆమెను చంపి, తనను వశం చేసుకోవాలని సూర్పుణఖ ఎత్తుగడ వేసి విఫలయత్నం చేస్తుంది. జానకిని చంపాలని చూసిన సూర్పణఖ ముక్కుకు శేషు వేసిన బాణం తగులుతుంది. దీనిని అవమానంగా భావించిన సూర్పణఖ జరిగిన విషయాన్నీ తన అన్నయ్య లంకేషుడు(సైఫ్…

Read More

బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల ప్రభుత్వ ఆర్థిక సాయం గడువును పొడగించాలనే యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీని చివరి తేదీగా సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ ఆర్ధిక సాయం పొందేందుకు కావాల్సిన కుల, ఆదాయం దృవీకరణ పత్రాల జారీలో ఆలస్యం అవుతోంది. ఈ సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల ఎదుట జనాలు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. మరోవైపు అధికారులంతా దశాబ్ది ఉత్సవాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం అవుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గడువులోపు కుల వృత్తుల్లో అర్హులైన వారందరికీ సర్కార్ సాయం అందుకునేందుకు ఉండాల్సిన ఆదాయ, కుల దృవీకరణ పత్రాలు పొందే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఫలితంగా ఎంతోమంది అర్హులైన వారు సర్కార్ సాయం పొందే అవకాశం కోల్పోనున్నారు. ఇది సర్కార్ కు ఓ రకమైన ఇబ్బందే. కొంతమందికి మాత్రం లక్ష రూపాయల ఆర్థిక సాయం…

Read More

బీఆర్ఎస్ నేతల ఇళ్ళు, నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు చెందిన సంస్థలు, ఇళ్ళలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఒకే సమయంలో ఈ ముగ్గురు నేతల ఇళ్ళలో ఇన్ కంట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ఈ ముగ్గురు నేతలు మంచీ సౌండ్ పార్టీలు కావడంతో ఈ ముగ్గురి నేతలపై ఐటీ అధికారులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి జేసీ బ్రదర్స్ అనే వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాలు ఉన్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు ఉంది. పైళ్ల శేఖర్ రెడ్డికి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. దీంతో బీఆర్ఎస్ సౌండ్ పార్టీలపై ఐటీ దాడులు జరిగినట్లు కనిపిస్తోంది.…

Read More

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడినా ఓ సంచలనమే. తాజాగా మరోసారి అలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు. ప్రతిసారి హిందూ- ముస్లింలకు సంబంధించి వ్యాఖ్యలు చేసి సంచలనాలు సృష్టించే బండి సంజయ్ ఈసారి మాత్రం వాస్తవ పరిస్థితులను వివరించి పార్టీలో కాక రేపారు. ఇంతకీ ఏం జరిగిందంటే..సోమవారం వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీ చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని వ్యాఖ్యానించి పెద్ద చర్చకు తెరలేపారు. ఇన్నాళ్ళు బీజేపీపై విమర్శలు చేస్తు ఆ పార్టీకి అభ్యర్థులే దిక్కు లేరు.. అధికారంలోకి ఎలా వస్తారనుకుంటున్నారని ప్రత్యర్ధి పార్టీ నేతలు ప్రశ్నించేవారు. వీటిని ఖండించేవారు బండి. ఇప్పుడు ఆయనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చెస్తున్నాయి. వాస్తవాన్ని అంగీకరించాలని ఇలాంటి కామెంట్స్…

Read More

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కసరత్తును ముమ్మరం చేశారా..? ఓటమి ఎరుగని నేతగానున్న ఎర్రబెల్లికి ఓటమి రుచి చూపించేందుకు పాలకుర్తిలో ధీటైన అభ్యర్థిని రేవంత్ ఎంపిక చేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాలకుర్తిలో ఎర్రబెల్లిని ఓడించేందుకు రేవంత్ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు. ఎర్రబెల్లిపై పోటీకి కాంగ్రెస్ తరుఫున ఎవరిని బరిలో నిలిపితే గెలుస్తారు..? గెలుపు అవకాశాలు ఎక్కువగానున్న నేత ఎవరు..? అనే అంశాలపై ఫోకస్ పెట్టిన రేవంత్.. ఎర్రబెల్లికి ఓటమి పరిచయం చేసేందుకు ధీటైన అభ్యర్థిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. పాలకుర్తి ప్రజల్లో మంచి ఇమేజ్ కల్గిన హనుమండ్ల ఝాన్సీరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలపాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా మహిళ నేత కావడం కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు. ఎన్ఆర్ఐ అయిన ఝాన్సీరెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితురాలు. 25ఏళ్ల క్రితమే నియోజకవర్గంలో 30పడకల ఆసుపత్రిని నిర్మించి ఎంతోమందికి వైద్య సేవలు…

Read More

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి కేసీఆర్ ఆరా తీస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ కు గెలుపుకు దోహదం చేసిన హామీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం హామీ ఒకటి. ఈ హామీని అక్కడి సర్కార్ ప్రారంభించింది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ హామీ గురించి చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఈ పథకాన్ని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టగా… తాజాగా కేసీఆర్ కూడా ఈ పథకం గురించి సమాలోచనలు జరుపుతున్నారు. కర్ణాటక ఫార్మూలను అనుసరించాలని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. అక్కడ కాంగ్రెస్ గెలుపును ఈజీ చేసిన పలు పథకాలు తెలంగాణలోనూ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడం లాంచానమే. అయితే, ఈ పథకం కాంగ్రెస్ కు వరంగా మారి మహిళల ఓట్లను హస్తం వైపు మల్లిస్తుందని కేసీఆర్ హైరానా పడుతున్నారు. అందుకే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశంపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది. రోజూవారీగా…

Read More