Author: Prashanth Pagilla

బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన నేతలు ఆ లక్ష్యం ఆ పార్టీతో సాకారం అయ్యేలా లేదనే అంచనాతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పార్టీలో చేరిక సమయంలో కేసీఆర్ తో ఎలాంటి లోపాయికారి ఒప్పందం ఉండదని హామీ ఇచ్చి.. ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీ లొంగిపోయినట్లు కనిపిస్తుందని కమలం నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో ఉంటే తమ లక్ష్యం నెరవేరదని ఓపెన్ గానే ప్రకటిస్తున్న ఆ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా..? అని ఆలోచనలో పడిపోయారు. తెలంగాణలో బీజేపీ రాజకీయ ఆత్మహత్య చేసుకుందని విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా…ఆమెను పార్టీలో సీనియర్ నేతలేవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆమెతోపాటు సీక్రెట్ భేటీలు నిర్వహిస్తున్న ఓ ఐదారు మంది నేతలు బీజేపీ విధానాలు బీఆర్ఎస్ విషయంలో ఏమాత్రం సరిగా లేవని తూర్పారబడుతున్నారు. పూర్తిగా బీఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తుందన్న ఆలోచనకు వచ్చేస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి…

Read More

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు పార్టీ హైకమాండ్ సుతిమెత్తగా వార్నింగ్ లు ఇస్తోంది. పార్టీలో ఇష్టం ఉంటే ఉండండి…లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చునని స్పష్టం చేస్తోంది. పార్టీలో ఉంటూ చేరికలను అడ్డుకుంటాం.. టికెట్ల విషయంలో రచ్చ చేస్తామంటే కుదరదని తేల్చి చెబుతోంది. సీనియర్లమని విర్రవీగితే వేటు తప్పదని వార్నింగ్ లు ఇస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ జోక్యం చేసుకొని వేములను పార్టీలో జాయిన్ చేసుకుంది. పార్టీకి ఉపయోగపడే నేతల చేరికలను వద్దంటే ఆగే ప్రసక్తే లేదని ప్రస్తుత చేరికతో ఇండికేషన్ ఇచ్చేసింది హైకమాండ్. గతంలో సీనియర్లు చెప్పినట్టు నడుచుకొని తెలంగాణలో అధికారాన్ని అప్పనంగా బీఆర్ఎస్ కు అప్పగించేసింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా హైకమాండ్ అన్నింటిని పరిశీలిస్తుంది. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదికలతో వ్యవహారాలను ఎప్పటికప్పుడు చక్కబెడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్…

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ మధ్య తెగ ఆసక్తి చూపిన టి. బీజేపీ ఎంపీలు ప్రస్తుతం వెనక్కి తగ్గారా..? ఓటమి భయంతోనే నలుగురు ఎంపీలతోపాటు సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల పోటీపై పునరాలోచనలో పడ్డారా..? లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే వారు ఆసక్తిగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు, సీనియర్ నేతలను పోటీ చేయించాలని అధినాయకత్వం భావించింది. ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలను బరిలో నిలిపి అధిక సీట్లను గెలుచుకోవచ్చునని పశ్చిమ బెంగాల్ చేసిన ప్రయత్నం ఫలించడంతో.. ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేయాలనుకున్నది. ఇందుకు సదరు నేతలు కూడా అంగీకారం తెలిపారు. కిషన్ రెడ్డి – అంబర్ పేట్, ధర్మపురి అరవింద్ – ఆర్మూర్, సోయం బాపురావు – బోథ్ , బండి సంజయ్ – కరీంనగర్ లేదా వేములవాడ నుంచి పోటీ చేసేందుకు…

Read More

ఖమ్మం జిల్లా వైరాలోని రెసిడెన్షియల్ స్కూల్ లో జరిగిన ఘటన తెలంగాణలోని విద్యా వ్యవస్థ యొక్క అధ్వాన స్థితిని మరొసారి బయటపెట్టింది. అక్కడ తొమ్మిది, పదో తరగతికి చెందిన ఆరుగురు విద్యార్థుల కాళ్ళకు, చేతులకు ఎలుకలు కరిచి గాయాలపాలయ్యారు. విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వ పరువు పోతుందని రహస్యంగా ఆ ఆరుగురు విద్యార్థులకు వైద్యం చేయించారు. ఎలుకలు కరిచినట్లు బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. దీంతో ఖమ్మం డీఈవో స్కూల్ కు వెళ్లి పరిశీలించగా.. తరగతి గదుల్లో మళ్ళీ ఎలుకలు కనిపించాయి. తెలంగాణలో విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉందని ఉపన్యాసాలు ఇచ్చే పాలకులకు ఇలాంటి సంఘటనలు ఏమాత్రం కనిపించవు. కనీసం ఆ విద్యార్థులను పరామర్శించాలనే సోయి ఉండదు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్గించేలా చర్యలు చేపట్టాల్సిన పాలకులు ఆ దిశగా ఏమాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది విద్యార్థుల…

Read More

చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు వేగంగా జరిగిపోతున్నాయి. పార్టీలో చేరికల నుంచి సభలు, సమావేశాలు. ఇలా అన్నింట్లోనూ కాంగ్రెస్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వేగవంతమైన నిర్ణయాలను చూసిన వారంతా ఇది కాంగ్రెస్ పార్టీనేనా? అనే ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తిగా ఉన్నారని తెలిస్తే చాలు.. ఆలస్యం చేయకుండా పార్టీ కండువా కప్పేస్తున్నారు. మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా నేతల చేరికల విషయంలో రేవంత్ రెడ్డి పకడ్బందీగా సాగుతున్నారు. పీసీసీ అద్యక్ష బాధ్యతలను రేవంత్ చేపట్టాక పార్టీలో వేగం బాగా పెరిగిందని ప్రస్తుతం పరిణామాలను బట్టి అర్థం అవుతోంది. గతంలో పార్టీలో చేరికల విషయంలో నాన్చి, నాన్చి ప్రత్యర్ధి పార్టీలకు అవకాశం ఇచ్చే కాంగ్రెస్..  రేవంత్ అద్యక్షుడు అయ్యాక ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. దూకుడు తన నైజంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు చేస్తే…

Read More

గత వారం రోజులుగా సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ వైరల్ ఫీవర్ పై సోషల్ మీడియాలో తనదైన శైలిలో పోస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ నాయకురాలు సీతా దయాకర్ రెడ్డి. కేసీఆర్ కు వచ్చింది వైరల్ ఫీవర్ కాదు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల ఫీవర్ అంటూ పోస్ట్ చేశారు. ఇందులో మంత్రి కేటీఆర్ యశోదా వైద్యులతో మాట్లాడుతున్న ఫోటోను ఉంచారు. యశోదా వైద్యులు కేటీఆర్ తో మాట్లాడుతూ.. కేసీఆర్ కు వచ్చింది వైరల్ ఫీవర్ కాదు అన్నట్టుగా ఫోటో డిజైన్ చేశారు. అనంతరం కేటీఆర్.. నాన్నకు వచ్చింది కాంగ్రెస్ గ్యారంటీల ఫీవర్ అనుకుంటా యశోదా వైద్యులతో అన్నట్లుగా పోస్ట్ డిజైన్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూప్లో హల్చల్ అవుతోంది. ఈ పోస్ట్ కాంగ్రెస్ శ్రేణులను బాగా…

Read More

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ కు ఆందోళన కల్గిస్తున్నాయి. కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ ఆరు గ్యారంటీలతో అదే తరహ ఫలితం రాబడుతుందని బీఆర్ఎస్ బెంగ. అందుకే ఆ పథకాలు ప్రకటన మరుసటి రోజు నుంచే 6 గ్యారంటీలు అమలు సాధ్యం కాదని బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలు పెట్టింది. అయినప్పటికీ ఈ పథకాల పట్ల జనాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆరు గ్యారంటీలపై ఎదురుదాడి చేస్తుండటంతో కాంగ్రెస్ పథకాలకు తామే ఫ్రీ ప్రమోషన్ చేసినట్లు అవుతుందని అధికార పార్టీ గ్రహించింది. అందుకే మరోసారి అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఏం చేస్తుందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు కౌంటర్ గా మెరుపులాంటి పథకాలను ప్రకటించాలని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ లోపు ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతు…

Read More

తెలంగాణలో అమలు అవుతోన్న పలు సంక్షేమ పథకాలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. నిధుల సమస్య తీవ్రంగా ఉండటంతో పథకాల అమలుకు అంతరాయం కల్గుతోంది. ఈ నేపథ్యంలో పథకాల అమలును కొన్ని రోజులపాటు వాయిదా వేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం వెనక రాజకీయ లబ్ది కూడా ఉంది. పథకాలు వాయిదా వేయమనడం రాజకీయ లబ్ది ఎందుకు అవుతుంది..? అని ఆశ్చర్యపోకండి. ఎన్నికల షెడ్యూల్ ముందు పథకాల అమలును ప్రారంభిస్తే ఓట్లు రాలుతయనేది కేసీఆర్ వ్యూహం. అదే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చాక ఎలాగూ ఈ పథకాల అమలుపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పడం ఖాయమే. దీనిని కూడా పొలిటికల్ గా అడ్వాంటేజ్ గా తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ పథకాలను ప్రజలకు చేరువ చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని కాంగ్రెస్, బీజేపీ లను బద్నాం చేసేలా కేసీఆర్ వ్యూహంతోనే పథకాల అమలుకు తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని…

Read More

తెలంగాణ కాంగ్రెస్ అధికారం లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. జిల్లాలవారీగా పార్టీలో చేరికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంతో నేతలను పార్టీలో చేర్చుకున్నారు. పొంగులేటి, తుమ్మల చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు తిరుగులేకుండా పోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ చేరికలు స్టార్ట్ అయ్యాయి. జిట్టా బాలకృష్ణారెడ్డితోపాటు ఇటీవల కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. వేముల వీరేశం చేరిక వాయిదా పడుతోంది. 29న వీరేశం కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ తన సొంత జిల్లా పాలమూరుపై దృష్టి కేంద్రీకరించారు. పాలమూరు జిల్లాలో 14స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసంపార్టీ నేతల సమన్వయముతో రేవంత్ ప్రత్యర్ధి పార్టీలో బలమైన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త రిపోర్ట్ మేరకు ప్రత్యర్ధి పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. గెలుపు గుర్రమని…

Read More

తెలంగాణ ఏర్పడిన తరువాత రాజకీయ పునరేకీకరణ పేరిట ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ పునరేకీరకరణ పేరుతో టీడీపీని ఖతం చేశారు. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేయాలని కోవర్ట్ ఆపరేషన్ లు కూడా చేశారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు మళ్ళీ రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. అది కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా. నేతలంతా కేసీఆర్ ను ఓడించేందుకు రైట్ చాయిస్ గా కాంగ్రెస్ ఎంచుకుంటున్నారు. గతంలో ఏ పేరైతే చెప్పి ప్రతిపక్ష పార్టీలను దారుణంగా కేసీఆర్ దెబ్బతీశాడో.. ఇప్పుడు దాన్నే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీపై ప్రయోగిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లోకి చేరికలు ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ అంటేనే అంతెత్తున లేచే నేతలు సైతం కేసీఆర్ ను డీకొట్టేందుకు హస్తం పార్టీలో జాయిన్ అవుతున్నారు. కారణం.. ఒకే ఒక్క ఎజెండా. తొమ్మిదేళ్ళుగా తెలంగాణ పేరుతో కేసీఆర్…

Read More