Author: Prashanth Pagilla

కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేలా రేవంత్ ఓవైపు పావులు కదుపుతుంటే…మరోవైపు కాంగ్రెస్ లోని కీలక నేతలను కారెక్కించేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్దం చేశారు. కర్ణాటక ఎన్నికల తరువాత పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారడంతో బీఆర్ఎస్ – బీజేపీ నుంచి హస్తం పార్టీలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. దీంతో కాంగ్రెస్ ను తిరిగి దెబ్బకొట్టే దిశగా కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రణాళికలు సిద్దం చేశారు. ఈమేరకు టీపీసీసీ మాజీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతిని బీఆర్ఎస్ లో చేర్చుకునేలా కేసీఆర్ తెర వెనక మంత్రాంగం నడిపిస్తున్నారు. ఉత్తమ్ చేరికను కేసీఆర్ ఎప్పుడో ఫిక్స్ చేశారని సందర్భం బట్టి ఆయన్ను కారెక్కిస్తారన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్నాళ్ళుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఎన్నికల సమయానికి ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్…

Read More

ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు అసంతృప్తితో ఉన్నారని మరోమారు ఋజువైంది. నేతలంతా ఐక్యంగానే ఉన్నామని మీడియాకు చెబుతున్నా లోలోపల మాత్రం పార్టీ వ్యవహారాలపై అసహనంగా ఉన్నారని తేలింది. మోదీ పాలనను జనాల్లోకి తీసుకెళ్లాలని భావించిన కేంద్రం ఇంటింటికి వెళ్లి కేంద్ర పథకాల గురించి వివరించాలని ఆదేశించింది. ఒక్కో నియోజకవర్గాల్లో ఆయా నేతలు కనీసం వంద ఇళ్ళకు వెళ్లాలని టార్గెట్ విధించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతల దృష్టిలో పడాలని పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పాల్గొంటారని అంత భావించారు కానీ ఈ ఇద్దరు నేతలు మొహం చాటేశారు. ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు బీజేపీలో…

Read More

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పూర్తిగా ధ్వంసమైన రంగం ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ విద్యారంగమే. ప్రభుత్వ విద్యకు సర్కార్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విద్యాశాఖపై కేసీఆర్ పెద్దగా సమీక్షలు చేసిన సందర్భాలు కూడా లేవు. మన ఊరు – మన బడి పేరుతో పైపెచ్చు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రయత్నించారు కానీ విద్యాశాఖలో పోస్టుల భర్తీకి మాత్రం చర్యలు చేపట్టడం లేదు. టీచర్ పోస్టుల నుంచి మొదలుకొని జిల్లా పాఠశాలలను పర్యవేక్షించే డీఈవోల వరకు అన్ని పోస్టులు ఖాళీలే ఉన్నాయి. పాఠశాల విద్యపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా క్షీణిస్తున్నాయి. హెచ్ఎంలు, ఎంఈవోలు, డీఈవోల పోస్టులను దాదాపుగా ఇంచార్జ్ లతోనే నడిపిస్తున్నారు. వాస్తవానికి ప్రతి జిల్లాకు ఓ డీఈవో చొప్పున తెలంగాణలోని 33జిల్లాలకు 33మంది డీఈవోలు ఉండాలి. కాని ఏడుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం 33జిల్లాలను ఏర్పాటు చేసిన…

Read More

గతేడాది కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీలో సాధారణ నేతగానే ఉండిపోయారు. పార్టీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలో లభించిన ప్రాధాన్యత బీజేపీలో దక్కడంలేదు. దీంతో ఆయన తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్దమయ్యారు. ప్రియాంక గాంధీతో భేటీ సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సోదరుడిని కాంగ్రెస్ లోకి తిరిగి తీసుకొస్తానని చెప్పారు. తొందర్లోనే మరికొంతమంది బీజేపీ నేతలతో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే, ఆయన వచ్చే ఎన్నికల్లో మునుగోడు కాకుండా ఎల్బీ నగర్ సీట్ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన చాలామంది ఎల్బీ నగర్ లో ఉంటున్నారు. పైగా ఈ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తే తన గెలుపు ఈజీ అవుతుందని రాజగోపాల్ రెడ్డి తలంపుతో ఉన్నారు. ఇదే నియోజకవర్గం…

Read More

మూడు, నాలుగు రోజుల్లో ఏ పార్టీలో చేరుతామనే విషయంలో క్లారిటీ ఇస్తామన్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో కలిసి టి.పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీమంత్రి జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ వారిద్దరిని ఆహ్వానించారు. రేవంత్ తో భేటీ ముగిసిన తరువాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్ కోసమే అందరం ఏకం అవుతున్నామని ప్రకటించిన ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు. గత కొన్ని రోజులుగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామని మరికొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. డైలీ సీరియల్ ను తలపిస్తున్న పొంగులేటి ఎపిసోడ్ కు మూడు నాలుగు రోజుల్లో తెరదించనున్నట్లు ప్రకటించారు. జూపల్లితో కలిసి తెలంగాణ అంతటా పర్యటనలు చేపడుతామని పొంగులేటి చెప్పారు. వీరి పర్యటనలకు పార్టీ నుంచి ఆమోదముద్ర…

Read More

వైసీపీ ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గడప, గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంపై చర్చించిన జగన్…ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ అందించిన నివేదిక గురించి వివరించారు. 15మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదని చెప్పిన జగన్, పని తీరు మెరుగు పర్చుకోవాలని ఆ పదిహేను మందికి సూచించారు. అయితే ఆ పదిహేను మంది ఎమ్మెల్యేలు ఎవరనేది మాత్రం జగన్ గోప్యంగా ఉంచారు. గతంలో పనితీరు బాగోలేని ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించిన జగన్ ఈసారి మాత్రం పదిహేను మంది ఎమ్మెల్యేల వర్క్ బాగోలేదని చెప్పారు తప్పితే పేర్లు మాత్రం బయటకు వెల్లడించలేదు. వారికే సీఎంవో ఆఫీసు నుంచి సర్వే నివేదికను పంపిస్తామని వెల్లడించారు. నివేదిక ఆధారంగా ఎక్కడ వెనకబడుతున్నారో గుర్తించి ప్రజలకు చేరువ కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే వచ్చే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు జగన్.…

Read More

టీమిండియా యంగ్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ గుజరాత్ జట్టు నుంచి తప్పుకోనున్నారా..? హైదరాబాద్ నుంచి ఆఫర్ రావడంతో గుజరాత్ టీమ్ నుంచి వైదొలగనున్నాడా..? సన్ రైజర్స్ టీమ్ నుంచి గిల్ కు ఇచ్చిన ఆఫర్ ఏంటి..? అనే అంశాలపై స్పోర్ట్స్ సర్కిల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఐపీఎల్ లో గుజరాత్ టీమ్ ఓపెనర్ గా సత్తా చాటిన శుభ్ మన్ గిల్ వచ్చే ఏడాది హైదరాబాద్ జట్టు తరుఫున బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మేనేజ్ మెంట్ నుంచి గిల్ కు ఆఫర్ రావడంతో గుజరాత్ టీమ్ నుంచి తప్పుకోవాలని ఈ యువ సంచలనం నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. గడిచిన ఐపీఎల్ రెండు సీజన్లలో గుజరాత్ అద్భుత విజయాలను సాధించింది. ఇందులో శుభ్ మన్ గిల్ పాత్ర కాదనలేది. ఓపెనర్ కీలక భాగస్వామ్యలను నెలకొల్పి జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర…

Read More

ఏపీతో పోలిస్తే తెలంగాణలో భూముల రేట్లు అధికంగా ఉన్నాయని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఇటీవల టీడీపీ అధినేత కూడా అదే మాట అన్నారు. ఏపీ కన్నా తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ప్రశంసించారు. కాని చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ పింక్ మీడియాకు బూతుల్లాగా కనిపించాయి. చంద్రబాబు వ్యాఖ్యల్లో అక్కసు వెళ్ళగక్కినట్లు అనిపించాయి. ఒకప్పుడు ఏపీలో భూమి అమ్మితే తెలంగాణలో నాలుగెకరాలు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ చుట్టూపక్కల ఏరియాలో భూమిని కొనుగోలు చేయాలంటే ఏపీలో మూడెకరాల భూమిని అమ్మేయాల్సిన పరిస్థితి ఉందని కేసీఆర్ ఆ మధ్య ప్రతి సభలో చెప్పేవారు. ఇదే మాటను కాస్త అటు, ఇటుగా చంద్రబాబు అనేసరికి బీఆర్ఎస్ కరపత్రమైన పత్రికలో “తకరారు బాబు ఎకరాల ఏడుపు” అనే హెడ్డింగ్ తో పెద్ద కథనమే రాశారు. మళ్ళీ చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నాడని.. అందుకే ఈ ప్రశంసలు అని   పేర్కొన్నారు. మెచ్చుకోవడం కూడా కరిచెందుకేనని కథనం…

Read More

ఏపీ సీఎంవోలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల ఆధిపత్యపోరు కొట్టుకునే స్థాయికి చేరింది. ఇద్దరు జుట్లు పట్టేసుకొని కొట్టుకున్నారు. నీ బాగోతం నాకు తెలియదా..? అంటూ ఒకరిని ఉద్దేశించి ఒకరు ఆగ్రహంతో తిట్టుకున్నారు. దాడి చేసుకొని పరువు తీసుకున్న జర్నలిస్టులు ఏదో అనామక చానల్ కు చెందిన జర్నలిస్టులు కాదు. పేరుమోసిన ఛానెల్ కు చెందిన ప్రతినిధులు. వారిలో ఒకరు టీవీ9 రిపోర్టర్ హసీనా మరొకరు ఎన్టీవీ రిపోర్టర్ రెహానా. ఏపీలో ఏదైనా ఇష్యూ జరిగితే సీఎంవోలో ఈ ఇద్దరు జర్నలిస్టులు వెంటనే వాలిపోతారు. సజ్జల ముంగిట కనిపిస్తారు. మా మైక్ ముందుండాలంటే మా మైక్ ముందుండాలని ఆరాటపడుతుంటారు. సజ్జల మెప్పు పొందేందుకు వీళ్ళు చూపించే ఆసక్తి చూసి సహచర జర్నలిస్టులు సైతం నవ్వుకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటిని ఈ ఇద్దరు అస్సలు పట్టించుకోరు. సజ్జల దృష్టిలో నేనే భేష్ అనిపించుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సమాజానికి నీతివాక్యలు వల్లించే ఈ చానెల్స్ ప్రతినిధులు…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నోటిసులు వచ్చిన వేళ మహిళా రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ల కోసం రాజీ లేని పోరాటం చేస్తానని ప్రకటించిన కవిత… ఇప్పుడు ఆ అంశం గురించి నోరు తెరవడం లేదు సరికదా ఎక్కడ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించినప్పుడే ఆమెపై విమర్శలు వచ్చాయి. తెలంగాణలో పట్టుమని పదిశాతం కూడా మహిళలకు అవకాశాలు ఇవ్వని కేసీఆర్ ను నిలదీయడం మానేసి కవిత ఢిల్లీలో ఏమొహం పెట్టుకొని ధర్నా చేస్తారనే విమర్శలు వచ్చాయి. 2014కంటే 2018లో మహిళలకు కేసీఆర్ ఇచ్చిన అవకాశాలు మరీ తక్కువ అని, ముందు కవిత ఢిల్లీలో ఆందోళన చేపట్టడం మానేసి తెలంగాణ భవన్ ముందు ధర్నా చేయాలని చురకలు అంటించారు. మహిళా రిజర్వేషన్ కోసం ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించిన కవిత.. మిస్డ్…

Read More