Author: Prashanth Pagilla

ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్న జనసేనాని వ్యూహత్మక రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. కుదిరితే బీజేపీని కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం చేయాలనేది పవన్ స్ట్రాటజీ. మరోవైపు జగన్ మాత్రం 175కు 175స్థానాల్లో ఈసారి గెలుపు మాదేనని ధీమాగా చెబుతున్నారు. వైసీపీ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలంటే జగన్ ను ఓడించాలనేది పవన్ స్కెచ్. ఇందుకోసం ఎం చేయాలన్న దానిపై ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. జనసేనకు రాయలసీమలోనూ మంచి ఆదరణ ఉంది. గతంలో చిరంజీవి పీఆర్పీ తరుఫున పోటీ చేయగా తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఇప్పుడు తాను కూడా రాయలసీమ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది..? అని పవన్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది . రాయలసీమ నుంచి తిరుపతి, నగరి స్థానాలు పవన్ పరిశీలనలో ఉన్నాయని…అవసరమైతే పులివెందుల నుంచి కూడా పోటీ చేసేందుకు రెడీగా…

Read More

కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని మెజార్టీ జనాలు విశ్వసిస్తున్నారు. బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చేస్తోన్న ప్రచారం నమ్మశక్యంగా ఉందని జనాలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న అందరిని విచారించి అరెస్ట్ చేసిన ఈడీ, సీబీఐ ఒక్క కవితను మాత్రం విచారించి అరెస్ట్ చేయలేదు. దీంతో బీఆర్ఎస్ – బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ ఉందన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది. ఇదే బీజేపీ , బీఆర్ఎస్ గ్రాఫ్ ను తగ్గిస్తున్నాయి. కాంగ్రెస్ రేంజ్ ను పెంచుతున్నాయి. దాంతో చాలామంది నేతలు కవితను అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో బీజేపీని విశ్వసించే పరిస్థితులు లేవని హైకమాండ్ కు తేల్చి చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీ కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఎంత పోరాడినా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది…

Read More

డాక్టర్ కావాలనుకున్నాడు. లక్ష్య సాధనలో ఎన్నోసార్లు పడిపోయాడు. అనుకున్న లక్ష్యానికి నాలుగుసార్లు సుదూరంగానే ఉండిపోయాడు. నీ వలన కాదు. ఇక ముగించేయ్ అని కుటుంబ సభ్యులు. తెలిసినా వాళ్లు, ఇరుగుపొరుగు వాళ్ళ వెక్కిరింతలు. ఇన్ని అవమానాలు, ఒత్తిళ్ళ మధ్య ఓ యువకుడు ఐదో ప్రయత్నంలో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాడు. 11 ఏళ్లకే పెళ్లి చేసుకుని 20ఏళ్లకు తండ్రి అయ్యి ఇప్పుడు నీట్ ర్యాంకర్ గా మారిన యువకుడి కథ ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇటీవల ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ – 2023) ఫలితాలు వచ్చాయి. వీరిలో 700కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు చాలామందే ఉన్నారు కానీ అందరిలో రాజస్తాన్ కు చెందిన రాంలాల్ భోయ్ మాత్రం అందరికంటే స్పెషల్. చిత్తోర్ గఢ్ జిల్లాకు చెందిన రాంలాల్ భోయ్ కు డాక్టర్ కావాలని ఆశ. కానీ అతనికి పదకొండేళ్ళ వయస్సులో పెళ్లి చేశారు. అప్పుడు…

Read More

కొన్నాళ్ళుగా కేసీఆర్ తో సన్నిహితంగా మెదులుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కు ఆహ్వానం అందని విపక్షాల భేటీకి కేజ్రీవాల్ హాజరు కావడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొన్ని అనుభవాలతో కేజ్రీవాల్ కన్ను తెరిచారని..బీఆర్ఎస్ తో కలిసి సాగేందుకు ఆయన అనాసక్తిగా ఉన్నారని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. ఆప్ కు ఎన్నికల సమయంలో ఎన్నికల ఫండ్ ఇచ్చిన కేసీఆర్ తో దోస్తీని కేజ్రీవాల్ ఇంత తొందరగా ముగిస్తారా..? ఛాన్స్ లేదనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. ఖచ్చితంగా కేసీఆర్ ను కాదని విపక్షాల కూటమిలో కేజ్రీవాల్ ఉండరని చెప్పుకొచ్చారు. అందుకు తాజా ఉదాహరణ విపక్షాల భేటీ ముగిసిన తరువాత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ వైఖరి సరిగా లేదని.. విపక్షాలు నిర్వహించే తరువాతి భేటీలో తాము పాల్గొనబోమని తేల్చి చెప్పారు. దీంతో ఆయన…

Read More

గత ఎన్నికల సమయంలో జగన్ కు మైలేజ్ పెంచేందుకు సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అదే చేస్తున్నాడు. వ్యూహం అనే టైటిల్ తో సినిమా రూపొందించాడు. ఇందుకు సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు వర్మ. పెద్దగా హడావిడి, వివాదాస్పద అంశాలను కనిపించకుండా టీజర్ విడుదల చేశాడు వర్మ. హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో వైఎస్సార్ మ‌ర‌ణించిన సీన్ తో ఈ టీజ‌ర్ స్టార్ట్ అవుతుంది. అనంతరం రోశయ్య ఎంట్రీ, జగన్ పై కాంగ్రెస్ సీబీఐ ఎంక్వైరీ , అరెస్ట్ చేయడం వంటివి చూపిస్తూ టీజర్ ను చూపించారు. అయితే టీజర్ లో అన్ని తెలిసిన అంశాలే ఉన్నాయి. కొత్తగా వర్మ చూపించినదేమి లేదు. కేవలం జరిగిన వాటిని కొంత ఆసక్తిగా చూపించినట్లు చూపించారు. “వ్యూహం”ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. దాంతో మొదటి పార్ట్ లో జనసేన ప్రస్తావన ఉండదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మరణం నాటికి…

Read More

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణ నేతల్లో అత్యంత సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందుకే పొంగులేటి ‘రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ’ కి ఏపీలో వేల కోట్ల కాంట్రాక్ట్ లను కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం. ఎలాంటి లాభం ఆశించకుండా కోట్ల కాంట్రాక్ట్ లను పొంగులేటికి అప్పగించే అవకాశం లేదు. ఆయనతో రాజకీయంగా పనులు చేయించుకునే ఆలోచనతో జగన్ కాంట్రాక్ట్ లను కట్టబెట్టి ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆయన జగన్ తో పలుమార్లు సమావేశమయ్యారు. ఆ తరువాతే ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ లో చేరడమే మేలని పొంగులేటికి జగన్ సూచించి ఉంటారని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లో మాట్లాడి చేరికను పొంగులేటి కన్ఫాం చేసుకున్నారు. వచ్చే నెల ఆయన ఖమ్మంలో సభ ఏర్పాటు…

Read More

ఏపీలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానందస్వామిపై కేసు నమోదైంది. బాలికపై పూర్ణానందస్వామి లైంగిక వేధింపులు నిజమేనని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం పరిపూర్ణనంద స్వామి జైలులో ఉన్నారు. ఈ కేసును దిశ పోలీసు విభాగం డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో విచారణ చేపట్టారు. బాలిక చేసిన ఆరోపణలు నిజమేనని విచారణలో తేల్చిన పోలీసులు… ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, తొమ్మిది మంది బాలురు ఉన్నారు. బాలికను పూర్ణానందస్వామి అర్దరాత్రి నిద్రలేపి గదిలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసినట్లు చెప్పారు. మరో బాలికతోనూ ఇలాగె ప్రవర్తించడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బాలిక కుటుంబీకులకు తెలియడంతో బాలికను ఇంటికి తీసుకెళ్ళారు. కానీ విషయం బయటకు రాకుండా బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిళ్ళు తీసుకొచ్చారు. ఇక మరో బాలిక స్వామి ఆగడాలను భరించలేక ఆశ్రమం నుంచి…

Read More

బీఆర్ఎస్ – బీజేపీల మధ్య ఉద్రిక్త వాతావరణం సడలిపోవడంతో రెండు పార్టీలకు ఆదరణ క్రమంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా బీజేపీ రెండేళ్ళుగా సంపాదించిన హైప్ కొట్టుకుపోతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారని హడావిడి జరిగినా చివరికి దర్యాప్తు సంస్థలు సైలెంట్ అయ్యాయి. దీంతో రెండు పార్టీల మధ్య అవహగన కుదిరిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇవే కాంగ్రెస్ కు అస్త్రంగా మారాయి. బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకు హాజరు కాలేదు. ఈ సమావేశం జరిగిన రోజునే మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. అమిత్ షా తో భేటీ అనంతరం విపక్షాల భేటీపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కలవాల్సింది పార్టీలు కాదు ప్రజలని సందేశం ఇచ్చారు. కలవాల్సిందే ప్రజలే అయితే గతంలో కేసీఆర్ విపక్ష పార్టీలతో భేటీకి ఎందుకు ఆరాటపడ్డారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.…

Read More

హిందూపురంలో పోటీకి వైసీపీ కొత్త నేతను తయారుచేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీకి ఎవరికీ తెలియని నేతను తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు, ఇంచర్జులతో గడప, గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హిందూపురం వైసీపీ ఇంచార్జ్ గా నున్న ఇక్బాల్ కు ఆహ్వానం అందలేదు. దీపిక అనే నాయకురాలిని ఆహ్వానించారు. ఈ సమీక్ష సమావేశానికి దీపికను ఆహ్వానించడం వెనక హిందూపురంలోని వైసీపీ గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకునని అంటున్నారు. ఎందుకంటే హిందూపురం వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసిన మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ ది ఒక వర్గం. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ ది మరో వర్గం. గ్రూప్ రాజకీయాలతో హిందూపురంలో వైసీపీ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఓ వైసీపీ నేత హత్యలో ఇక్బాల్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు…

Read More

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ కాబోతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్తున్న కేటీఆర్.. అమిత్ షాతో సమావేశం కానుండటం ఆసక్తి రేపుతోంది. భేటీ ప్రాధాన్యత అంశాలు ఏంటో బయటకు రాలేదు కాని బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం జరుగుతోన్న సమయనా ఈ భేటీ జరుగుతుండటం బిగ్ డిబేట్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారణకు పిలిచిన నాటి నుంచి బీజేపీపై కేసీఆర్ , కేటీఆర్ లు మునుపటి స్థాయిలో విమర్శలు చేయడం లేదు. కాంగ్రెస్ ను మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ లో విచారణ మందగించడంతో బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుందన్న అనుమానాలు ఉన్నాయి. బీజేపీ నేతలు కూడా ప్రజల్లో ఈ అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అప్పటి నుంచి బీజేపీ క్రమంగా డౌన్ ఫాల్ అవుతూ వస్తోంది. వలస…

Read More