Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
బీజేపీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంధం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుంది. బీజేపీని వీడాలని నిర్ణయం తీసుకున్న రాజగోపాల్ రెడ్డి…సొంత గూటికి చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాజగోపాల్ రెడ్డి చేరికకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రేపోమాపో ఆయన కాంగ్రెస్ లో చేరికపై అధికారిక ప్రకటన చేసేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరడంపై సన్నిహితులకు రాజగోపాల్ రెడ్డి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. క్యాడర్ ను కూడా అందుకు సంసిద్దులని చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి నిర్ణయంపై క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు తన సోదరుడు వెంకట్ రెడ్డి ద్వారా చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాయి. రాజగోపాల్ చేరికపై రేవంత్ తో కూడా వెంకట్ రెడ్డి చర్చించారని.. అందుకు రేవంత్ సానుకూలంగా స్పందించడంతో ఆయన చేరికకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. అయితే.. రాజగోపాల్ రెడ్డితోపాటు ఎవరెవరు కాంగ్రెస్…
తెలంగాణ బీజేపీని ప్రక్షాళన చేయాలనుకుంటుంది జాతీయ నాయకత్వం. బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని జాతీయ నేతలు స్పష్టం చేసినా కొంతమంది కీలక నేతలు ససేమీరా అనడంతో హైకమాండ్ తలొగ్గినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అసంతృప్త నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన అగ్రనేతలు బండిని తప్పించి ఆయన స్థానంలో మధ్యే మార్గంగా సీనియర్ నేతకు అద్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని నిర్ణయించినట్లు మీడియా వర్గాలు కోడై కొస్తున్నాయి. బండిని తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి అద్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని భావించినట్లు ఢిల్లీ బీజేపీ వర్గాలో ఉదయం నుంచి ప్రచారం జరిగింది. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని అప్పగించి రాష్ట్రవ్యాప్తంగా ఆయన్ను పర్యటించేలా స్వేఛ్చను కల్పిస్తారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో బండిని పదవి నుంచి తప్పిస్తే ఆయనను కేంద్ర కేబినేట్ లోకి తీసుకోవాలనుకున్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో హల్చల్ చేశాయి. మున్నూరు కాపు సామజిక వర్గానికి చెందిన బండిని కేంద్ర…
ఎన్నికలను బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉండగానే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అగ్రనేతల పర్యటనలతో పార్టీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇప్పుడు మాత్రం మునుపటి సీన్ కు భిన్నంగా కనిపిస్తోంది. త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్తాన్ , తెలంగాణలోనే ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలను ఇప్పటికే రెండు, మూడు రౌండ్లు చుట్టేసిన అగ్రనేతలు తెలంగాణలో మాత్రం పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు. వాస్తవానికి జూన్ లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నది. తుఫాన్ కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా పడింది. మోడీ పర్యటన కూడా వాయిదా పడింది కానీ కారణాలు వెల్లడి కాలేదు. జూలై రెండో వారంలో అగ్రనేతలు తెలంగాణాకు వస్తారని అనుకుంటున్నారు. వరంగల్ లో సభ నిర్వహించాలని ఇందుకు…
ఏఐసీసీ స్ట్రాటజీ మీటింగ్ లో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై రాహుల్ గాంధీ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునని…ఓవరాక్షన్ చేస్తే వేటు తప్పదని పేరు ప్రస్తావించకుండానే రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏదైనా అసంతృప్తి ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచించిన రాహుల్…మీడియా ముందే ఓపెన్ అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనపై సొంత పార్టీ నేతలే దుష్ప్రచారం చేయిస్తున్నారని…దీనిపై ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ లో రాహుల్ గాంధీతో తేల్చుకుంటానని ఉత్తమ్ మీడియా ముఖంగా చెప్పేశారు. జగ్గారెడ్డి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాహుల్ వరకు చేరాయో లేదంటే గతంలో వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకున్నారో కానీ ఈ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. పార్టీకి చేటు తెచ్చేలా ప్రకటనలు…
తెలంగాణ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లోకి వలసలు మునుపెన్నడూ లేని విధంగా కొనసాగుతున్నాయి. ఇదివరకు బీజేపీ, బీఆర్ఎస్ లోకి మాత్రమే కొనసాగిన చేరికలు ఇప్పుడు ఆ రెండుపార్టీల్లోకి చేరికలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ లోకి మాత్రమే చేరికలు నడుస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ రేసులోకి వచ్చేసింది. బీజేపీ పూర్తిగా వెనకబడిపోయింది. ఇటీవలే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావులు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చేరికలతో కాంగ్రెస్ మంచీ టచ్ లో కనిపిస్తుండగానే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, బాల్కొండ నేత సునీల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో సునీల్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. 2018ముందస్తు ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన…
ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆషాడం ముగిసిన వెంటనే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని తొలుత కేసీఆర్ భావించారు. ఎమెల్యేల పనితీరు ఆధారంగా సర్వే నివేదికల ప్రకారం టికెట్లను కేటాయించాలనుకున్నారు కానీ తాజాగా అందిన సర్వే నివేదికలతో నిర్ణయాన్ని కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు వేర్వేరు ఏజెన్సీలతో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన కేసీఆర్..ముచ్చటగా మూడోసారి సర్వే చేయించినట్లు ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే…ఒక పది, పదిహేను స్థానాలు అటు, ఇటుగా అన్ని సర్వే సంస్థలు 55మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు తేల్చాయి. ఈ సర్వే నివేదికలు బీఆర్ఎస్ బాస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ : జోగు రామన్న చెన్నూరు : బాల్క సుమన్ బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య ముథోల్ : విఠల్ రెడ్డి…
వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. భారత్ వేదికగా అక్టోబర్ – నవంబర్ మధ్య ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ తో వరల్డ్ కప్ సంగ్రామం మొదలు కానుంది. ఆతిథ్య భారత జట్టు లీగ్ దశలో మొత్తం తొమ్మిది మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన మ్యాచ్ లో తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్ధి పాక్ తో మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15,16 తేదీలలో ముంబై, కోల్ కత్తా వేదికగా సెమి ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ మూడు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్తాన్ తమకు రెండు వేదికలు అనుకూలంగా లేవని అభ్యంతరం వ్యక్తం చేయగా… ఐసీసీ దానిని…
తెలంగాణ బీజేపీ నేతల్లోనే కాదు…జాతీయ స్థాయి నేతల్లోనూ చీలికలు వచ్చాయి. ఏకంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా , బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మధ్య మునుపటిలా సఖ్యత లేదని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్ర క్యాబినెట్ ను ప్రక్షాళన చేయాలని పార్టీ సుప్రీం లీడర్ అమిత్ షా , మరో కీలక నేత బీఎల్ సంతోష్ లు ప్రధాని మోడీకి రిపోర్ట్ ఇచ్చారు. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చాలని సూచించారు. ప్రధాని మాత్రం షా, బీఎల్ సంతోష్ ల సూచనను పక్కనపెట్టేశారు. కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళనతో ఎన్నికలున్న రాష్ట్రాల్లో ఎంపీలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని మోడీకి షా , బీఎల్ సంతోష్ లు చేసిన సూచన. ప్రతిసారి ఈ ఇద్దరు నేతల సూచనలను అంగీకరించి వ్యవహారాలన్నింటిని మోడీ చక్కబెట్టేవారు కానీ కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తరువాత షా, బీఎల్ వ్యూహాలపై మోడీకి…
తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా సాగుతోంది. చేరికలతో పార్టీకి కావాల్సిన బూస్ట్ లభించింది. ఈ సమయంలో అందర్నీ సమన్వయము చేసుకుంటూ సాగాల్సిన సీనియర్ నేత పార్టీలో గందరగోళానికి తెరలేపాడు. ఆయన ఎవరో కాదు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీలో కొత్త చిచ్చు రాజేసేందుకు నేను రెడీ అనేలా సంకేతాలు ఇచ్చేశారు. తనపై పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా ముందే ఓపెన్ అయ్యాడు. పార్టీలో మునుపెన్నడూ కనిపించని జోష్ ప్రస్తుతం కనిపిస్తుండగా పార్టీ సీనియర్ నేతగా కాస్త బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాలి. కానీ ఆయన మాత్రం అంతర్గత విషయాలను మీడియా ముందే మాట్లాడుతున్నారు. పార్టీ ఎంత బలంగా మారినా బలహీనపరిచే చర్యలను ఉత్తమ్ మానుకోవడం లేదన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉత్తమ్ పై బీఆర్ఎస్ కోవర్ట్ అన్న ముద్ర ఉంది. ఈ సమయంలో ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీలో జరిగే అంతర్గత వేదికలపై చర్చించుకొని…
వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల్లో తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకే షర్మిల ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం షర్మిల రాజకీయ భవితవ్యంపై మరింత క్లారిటీ రానుంది. షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే తన రాజకీయం కొనసాగుతుందని స్పష్టం చేయడంతో…వైఎస్సార్ టీపీ విలీనం అంశం మళ్ళీ మొదటికి వచ్చినట్లు కనబడుతోంది. టి. కాంగ్రెస్ నేతలు కూడా షర్మిలను ఏపీకి పంపాలని పట్టుబడుతున్నారు. కోమటిరెడ్డి లాంటి నేతలు మాత్రం షర్మిలను తెలంగాణలో ఉంచాలని కోరుతున్నారు. ఏపీలో షర్మిల రాజకీయం చేసేందుకు అంగీకరిస్తే ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు హైకమాండ్ కూడా సిద్దంగా ఉంది. ఏపీ కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు షర్మిల ఒకే…