Author: Prashanth Pagilla

వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమైన వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ ఒకటే ఆప్షన్ ఇచ్చింది. తెలంగాణలో రాజకీయాలు చేయడం అస్సలు కుదరదు. ఏపీలో కాంగ్రెస్ తరుఫున రాజకీయాలు చేస్తానంటే ఒకేనని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. దాంతో షర్మిలకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పాలుపోవడం లేదు. తెలంగాణను వీడి ఏపీలో చేరితే ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకే చెబుతోంది కానీ, ఇన్నాళ్ళు తెలంగాణలో తాను మాట్లాడిన మాటలకూ, చేసిన పాదయాత్రకు ఓ అర్థం లేకుండా పోతుందని ఆమె ఫీల్ అవుతున్నారు. పైగా ఏపీలో అన్న జగన్ ను ఎదురించి రాజకీయాలు చేసేందుకు షర్మిల వెనకా ముందు ఆడుతున్నారు. వైఎస్ ఆత్మ కేవీపీ కూడా షర్మిలను ఏపీలో రాజకీయాలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ జెండాతో వెళ్తే రాజకీయ ఎదుగుదల ఉంటుందని ఒత్తిడి తెస్తున్నారు. ఎంతోమంది నేతలు, వైఎస్సార్ అభిమానులు, జగన్ వ్యతిరేకులు షర్మిల వెంటే…

Read More

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతున్నారని తెలియగానే మారోసారి బిగ్ బాంబ్ పేల్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. పార్టీ అద్యక్షుడిని మార్చడంపై స్పందించిన ఆయన అదంతా సంజయ్ స్వయంకృతాపరాధమన్నారు. ప్రస్తుతం బీజేపీ బలీయంగా ఉండటం వెనక తన గెలుపు బలం ఉందని వ్యాఖ్యానించారు. తాను బీజేపీ గుర్తుపై గెలవలేదని తన చరిష్మాతోనే గెలిచానని చెప్పారు. మునుగోడులో వంద కోట్లు ఖర్చు పెట్టినా పార్టీ విజయం సాధించలేదని గుర్తు చేసిన రఘునందన్ రావు..ఆ వందకోట్లను తనకు ఇచ్చి ఉంటే తెలంగాణను దున్నేసేవాడినని చెప్పారు. పార్టీలో రఘునందన్, ఈటలలు ఉంటేనే బీజేపీకి భవిష్యత్ అని వ్యాఖ్యానించిన రఘునందన్…మా బొమ్మలను చూసే ఓట్లేస్తారని అన్నారు. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీచేసిన బండి సంజయ్‌కి వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించిన ఆయన పార్టీ డబ్బులో తనకు కూడా వాటా ఉందని అన్నారు. పార్టీకి శాసన సభ పక్ష నేత లేడనే విషయం…

Read More

తెలంగాణ బీజేపీ అద్యక్షుడు మార్పు ఖాయమైంది. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. బండి సంజయ్ ను కేంద్ర కేబినేట్ లోకి తీసుకొని కిషన్ రెడ్డి లేదా డీకే అరుణలలో ఒకరిని అద్యక్షుడిగా ప్రకటించాలని హైకమాండ్ నిర్ణయించింది. చాలామంది నేతలు బండి సంజయ్ నేతృత్వంలో పని చేయలేమని స్పష్టం చేయడంతో అద్యక్షుడిని మార్చడం హైకమాండ్ కు తప్పనిసరి అయింది. కిషన్ రెడ్డిని అద్యక్షుడిగా ప్రకటించాలని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది కానీ ఆయన మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదని సమాచారం. అద్యక్ష పదవి పట్ల కిషన్ రెడ్డి విముఖత వ్యక్తం చేస్తే డీకే అరుణకు పదవి అప్పగించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. అయితే కిషన్ రెడ్డి అద్యక్ష పదవి చేపట్టేందుకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు వంటి నేతలు బండి సంజయ్ సారధ్యంలో…

Read More

వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రెడీ అయిన వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు..? ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న షర్మిల అక్కడి నుంచి బరిలో నిలుస్తారా..? లేక గెలుపు స్థానం మరొకటని తలిచి మరో సెగ్మెంట్ పై గురి పెట్టారా..? అనే చర్చ జరుగుతోన్న వేళ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు రిపోర్ట్ షర్మిల పోటీపై స్పష్టతనిచ్చినట్లు కనిపిస్తోంది. వైఎస్ షర్మిల తెలంగాణ వేదికగానే రాజకీయాలు చేయాలనుకుంటుంది. ఏపీకి వెళ్లాలని హైకమాండ్ పట్టుబడుతున్న ఆమె మాత్రం ససేమీరా అంటోంది. తాను తెలంగాణను వీడేది లేదని తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కుండబద్దలు కొడుతోంది. షర్మిల పట్టువీడకపోవడంతో హైకమాండ్ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో ఆమెకు సర్దిచెప్పి ఏపీకి పంపించవచ్చు ప్రస్తుతానికి తెలంగాణ వేదికగానే రాజకీయాలు చేసిన పరవాలేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే…

Read More

ఇప్పటికే అనేక అటుపొట్లను ఎదుర్కొంటున్న బీజేపీకి తాజాగా షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఓ వైపు అసంతృప్తులను ఒక్కొక్కరిని పిలిచి బుజ్జగిస్తూ పార్టీని హైకమాండ్ గాడిన పెడుతోన్న వేళ.. పార్టీలో తనకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని రఘునందన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన గెలుపుతోనే పార్టీలో ఊపు వచ్చిందని.. తాను దుబ్బాకలో గెలిచి ఉండకపోతే ఈటల బీజేపీలో చేరేవాడా..? అని ప్రశ్నించారు. అలాంటి తనను పార్టీ హైకమాండ్ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రఘునందన్ రావు కొన్ని రోజులుగా పార్టీ ఆఫీసు వైపే చూడటం లేదు. నియోజకవర్గానికే పరిమితమై రాజకీయాలు చేస్తున్నారు. పార్టీలో అసంతృప్తులు ఒక్కొక్కరు తమ స్వరాన్ని వినిపిస్తోన్న సమయంలో రఘునందన్ కూడా అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ తన సేవలను గుర్తించడం లేదని పెదవి విరిచారు. రాజాసింగ్ పై పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగా ఏర్పడింది. దాంతో…

Read More

పవన్ కళ్యాణ్ మూడుపెళ్ళిళ్ళ అంశాన్ని వైఎస్ జగన్ పదేపదే ప్రస్తావిస్తూ ఉండటంతో సీనియర్ జర్నలిస్ట్, జనసేన నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాడని కానీ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విడాకులు ఇవ్వకుండానే నటిని బెదిరించి వివాహం చేసుకున్నారని బాంబ్ పేల్చారు. వైఎస్సార్ తరుచు చెన్నై వెళ్ళడానికి కారణం అక్కడ తనకు రెండో భార్య ఉండటమే కారణమని ఆరోపించారు. వైఎస్ అంటే తనకు అమితమైన అభిమానం అని, కానీ జగన్ వ్యవహారశైలితో ఎవరికీ తెలియని ఈ చీకటి బాగోతాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నట్లు జనసేన నేత చెప్పారు. విజయమ్మకు విడాకులు ఇవ్వకుండానే నటి జయచిత్రను వైఎస్ రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్నారన్న ఆయన…ఈ విషయం వైఎస్ కుటుంబీకులందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. జయచిత్రకు పెళ్లి జరిగి…కుమారుడు ఉన్నప్పటికీ ఆమెను వైఎస్ బెదిరించి వివాహం చేసుకున్నారని ఆరోపించాడు జనసేన నేత. తను చెబుతున్నవి అబద్దమైతే…

Read More

ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని టి. కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను ముందుగా ప్రకటించలేదు కానీ నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల పాలసీని తెలంగాణలోనూ అనుసరించాలని ఏఐసీసీ నుంచి టి. కాంగ్రెస్ కు ఆదేశాలు అందాయి. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలు గుర్తించినట్లు సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన ఎస్కే టీం చివరికి అనేక వడపోతల అనంతరం గెలుపు గుర్రాల జాబితాను ఏఐసీసీకి అందజేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు పాత మొహాలకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం. అందుకే రెండు మూడు స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను సూచించిన ఎస్కే టీం దాదాపుగా పాత వారందరి పేర్లను జాబితాలో చేర్చింది.…

Read More

సానా సతీష్ బాబు…కొటారి సోమేశ్వరరావు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. పెరిగి పెద్దయాక ఎవరు జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. ఇంతలోనే తన స్నేహితుడు కొటారి సోమేశ్వరరావు అకాల మరణం చెందాడన్న వార్త విని చలించిపోయాడు. తన ఆప్త మిత్రుడి పిల్లలు అనాధలు కాకూడదని తలచి వారి భవిష్యత్ చక్కదిద్దే బాధ్యత తీసుకొని సానా సతీష్ బాబు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. అప్పటికే తల్లి మరణంతో అమ్మ ప్రేమకు దూరమైన సోమేశ్వరరావు పిల్లలు తాజాగా తండ్రి కూడా మరణించడంతో ఏ దిక్కుమొక్కు లేని అనాధలా మారారు. ఈ విషయం తెలియడంతో ఎలాగైనా తన స్నేహితుడి పిల్లలను ఆదుకోవాలని భావించాడు. ఏ స్వార్ధం చూసుకోకుండా మనసు గెలిచిన స్నేహితుల బాగోగుల కోసం శ్రమించే స్వభావం ప్రస్తుత సమాజంలో అరుదుగానే కనిపిస్తోంది. అలాంటి అరుదైన వ్యక్తుల్లో సానా సతీష్ బాబు ఒకరు. కాకినాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్…

Read More

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి నెగ్గడం అంత తేలిక కాదని బీజేపీకి అర్థమైంది. భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్ నాయకత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. హిమాచల్, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో బీజేపీ ఏసారి ఏ ఎజెండాతో ఎన్నికల కదనరంగంలోకి దూకాలని ఆలోచనలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే పీవోకే ఎజెండాతో ఎన్నికలకు సన్నధం కావాలని బీజేపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై ఆగ్రహావేశాలు కనబరుస్తున్నారు. డైలాగ్ లను డైనమేట్లుగా పేల్చుతున్నారు. దీనిని బట్టి చూస్తుంటే బీజేపీ లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా పీవోకే ఎజెండాతో సెంటిమెంట్ రగిల్చి బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. భారత్ లో ఉన్నది గతంలోని ప్రభుత్వం కాదని.. సరిహద్దును దాటి వచ్చి దాడి చేస్తామని పాకిస్థాన్…

Read More

తెలంగాణ ఉద్యమంలో పాటను పోరు ప్రవాహంగా మలిచిన గొంతు ఆగిపోయింది. తన పాటకు,మాటకు శాశ్వతంగా వీడ్కోలు పలికింది. ఉద్యమ సమయంలో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా…నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా..తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా అంటూ అమరుల తల్లుల కడుపుకోతను పాటతో వినిపించిన ఉద్యమ గళం మూగబోయింది. ఈ ఒక్క పాట ఎంతోమందిని కదిలిచింది. తెలంగాణా వ్యతిరేకులను సైతం కంటతడి పెట్టించింది.ఉద్యమానికి మద్దతు తెలిపేలా చేసింది. తన శ్రావ్యమైన గొంతుతో ఎన్నో పాటలు పాడిన సాయిచంద్ గుండెపోటు తో ఆకస్మికంగా మృతి చెందారు. నాగర్ కర్నూల్ కారుకొండలోని ఫామ్ హౌజ్ లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన…

Read More