Author: Prashanth Pagilla

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కేసీఆర్ లోక్ సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దింపేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే కొంత కష్టమే. అందుకే కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ బీఆర్ఎస్ గెలిస్తే వెంటనే కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం చేస్తారా..? లోక్ సభ ఎన్నికల వరకు కేసీఆరే సీఎంగా కొనసాగుతారా..? అనేది క్లారిటీ రావడం లేదు. మూడోసారి కేసీఆర్ బొమ్మతోనే బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్తుంది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని బీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుంది. సౌత్ ఇండియాలో వరుసగా మూడోసారి సీఎం అయిన ఖ్యాతి కేసీఆర్ కు సొంతం అవుతుందని కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అయినా కొన్నాళ్ళుగా కేటీఆరే పాలనపరమైన వ్యవహారాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.…

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ కంటే ముందే జరగనున్నాయా..? ఆషాడం ముగిసిన వెంటనే మంచి ముహూర్తం చూసుకొని అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేయనున్నారా..? కాంగ్రెస్ కు ఊపిరిరాడకుండా చేసేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని బీఆర్ఎస్ నేతలంతా చెప్తూ వచ్చారు కానీ, పరిస్థితులు మారడంతో కేసీఆర్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు కనడుతోంది. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ అనూహ్య రీతిలో పుంజుకుంది. కాంగ్రెస్ బలపడుతోందని నిఘా వర్గాలు కేసీఆర్ కు నివేదించాయి. దాంతో బీఆర్ఎస్ బాస్ వ్యూహాలపై దృష్టిసారించారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ కు మేలు చేస్తుందని… ఆలస్యం చేస్తే కాంగ్రెస్ కు ఉపయుక్తంగా ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. అందులో భాగంగా కేటీఆర్ గత నెల చివరి వారంలో కేంద్ర పెద్దలతో మాట్లాడి ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి.…

Read More

ఇండియాలోని ప్రముఖులకు, రాజకీయ నేతలకు ఐదు కేటగిరీల వారీగా భద్రత ఉంటుంది. ఇందులో కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు ఉంటారు. వ్యక్తులు చేసే పని లేదా ప్రజాదరణ కారణంగా వారి జీవితాలు ప్రమాదంలో ఉన్న గుర్తింపు పొందిన వ్యక్తులకు భద్రతా కవర్ అందించబడుతుంది. ఇంటలిజెన్స్ వర్గాలు అందించే సమాచారాన్ని బట్టి వివిధ రకాల భద్రతలను సరఫరా చేస్తారు. z+ కేటగిరి భద్రత : రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, సీఎంలు, కేంద్ర కేబినెట్ సభ్యులకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తారు. ప్రముఖులు ఎవరికైనా ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తే జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తారు. 10 మంది కమాండోలు సహా 55 మంది సిబ్బంది ఉంటారు. 5+ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. నెలకు రూ.33 లక్షల ఖర్చవుతుంది. Z కేటగిరి భద్రత: జడ్ కేటగిరీ ఉన్నవారికి 22 మంది రక్షణగా ఉంటారు. ఈ కేటగిరీలో వారికి…

Read More

తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా కలుషితం అవుతున్నాయి. ఒకరి పుట్టుకను మరొకరు అనుమానించే సంస్కృతి తెలంగాణ రాజకీయంలో ఇదివరకు లేదు. కానీ ఇప్పుడు ఆ జాడ్యం ఏపీ నుంచి తెలంగాణకు కూడా వ్యాప్తి చెందుతోంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పుట్టుకను అనుమానిస్తూ నీచంగా మాట్లాడారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఆయన మరోసారి గెలిచే పరిస్థితి లేదు. దీంతో స్టేషన్ ఘన్ పూర్ నుంచి వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కడియం టార్గెట్ గా రాజయ్య విమర్శల డోస్ పెంచేశారు. సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా కడియం అవినీతిపరుడని, ఎన్ కౌంటర్ల సృష్టికర్త అని ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్ళీ అవినీతి ఆరోపణలు చేస్తే పస ఉండదని అనుకున్నారో…

Read More

బండి సంజయ్ ను అద్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తేనే పార్టీలో కొనసాగుతామని పట్టుబట్టి ఎట్టకేలకు సక్సెస్ అయిన ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీలో రిలాక్స్ గా ఉండటం లేదు. బండిని తప్పిస్తే అంత సెట్ అవుతుందని హైకమాండ్ పెద్దలకు చెప్పారు ఈటల. అగ్రనాయకత్వం ఈటలను గౌరవించి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చింది. అయినా నేతలు బీజేపీని వీడితే ఈటలపై అగ్రనేతలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఆయన ఇప్పుడు పార్టీని వీడాలని ఆలోచన చేస్తోన్న నేతల లిస్టును రాసుకొని ఒక్కొక్కరిని బుజ్జగించే బాధ్యతను తీసుకున్నారు. పార్టీలో చేరుతారని నమ్మకం పెట్టుకున్న నేతలు బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనని కమలం గూటికి చేరడం లేదు. కాంగ్రెస్ లో చేరుతున్నారు. చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. వారిని బీజేపీలోనే ఉంచడం ఎలక్షన్ మేనేజ్ మెంట్ చైర్మన్ గానున్న ఈటలకు ఇప్పుడు టాస్క్.…

Read More

తెలంగాణలో ఎన్నికలకు సమాయత్తం అవుతోన్న కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి చాలామంది నేతలు తాము కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులమేనని ప్రకటిస్తుండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రి చెస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్. అమెరికాలో జరిగిన తానా సభల్లో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్ ను కోరారు. ఇందుకు స్పందించిన రేవంత్… కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. అవసరమైతే సీతక్కను కూడా ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. సీనియర్ నేతల వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకే రేవంత్ ఈ కామెంట్స్ చేశారా..? లేక సీతక్కను సీఎం చేయాలనే ఆలోచన హైకమాండ్ పార్టీలో…

Read More

రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులోనూ పరాభవమే ఎదురైంది. రాజకీయ విమర్శల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షను గుజరాత్ హైకోర్టు కూడా సమర్ధించింది. రాహుల్ కు విధించిన శిక్షపై స్టే విధించాలని రాహుల్ తరుఫు న్యాయవాదులు కోరినా హైకోర్టు నిరాకరించింది. రాహుల్ పై క్రిమినల్ కేసులు ఉన్నాయని దీనిని కూడా ఓ కారణంగా చెప్పుకొచ్చింది. “రాహుల్ గాంధీపై పదికిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఆయనపై రాజకీయ విమర్శల కేసు నమోదయ్యాక కూడా రాహుల్ పై మరో కేసు నమోదైంది. వీర్ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఆయన మనవడు ఫిర్యాదు చేశాడు. మొత్తంగా రాహుల్ ను ఎన్నికలకు దూరం చేయాలనే కుట్రకు రాజకీయనాయకులు ఓ పథకం ప్రకారం కుట్ర పన్నుతున్నారనేది అర్థం అవుతోంది. సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్దించడంతో రాహుల్ పై అనర్హత వేటు కొనసాగుతుంది. ఈ కారణం చేత ఎనిమిదేళ్ళపాటు…

Read More

కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అద్యక్ష పదవికి ఎంపిక చేశారని ఒక రోజు ముందుగానే Polytricks.in చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అద్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. బండి హయాంలో పార్టీ గొప్పగా పుంజుకున్నా ఏకపక్ష నిర్ణయాలు, వ్యక్తిగత ఎదుగుదలకు ఎక్కువ ప్రియార్టి ఇచ్చారన్న ఆరోపణలను మూటగట్టుకున్నారు. బండి నేతృత్వంలో తాము పని చేయలేమని, ఆయన్ను తప్పిస్తే సరేసరి. లేదంటే తమ దారి తాము చూసుకుంటామని హైకమాండ్ కు అసంతృప్త నేతలు అల్టిమేటం విధించారు. దీంతో అద్యక్ష మార్పు తప్పనిసరి అయింది. బండి స్థానంలో అద్యక్ష బాధ్యతలను ఈటల ఆశించారు కానీ ఆయనకు ఇస్తే సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని హైకమాండ్ గుర్తించింది. ఈటలకు అద్యక్ష పదవి ఇస్తే పార్టీలో సీన్ మళ్ళీ మొదటికే వస్తోంది కాబట్టి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సీనియర్…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలోని మెజార్టీ అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్ గురి పెట్టింది. బీఆర్ఎస్ పతనం కేసీఆర్ సొంత జిల్లా నుంచే ప్రారంభిస్తామని కాంగ్రెస్ నేతల ప్రకటనలు వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, పటాన్ చెరు, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాల్లో గెలుపుకోసం కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతం కంటే మెరుగ్గానే కాంగ్రెస్ గ్రాఫ్ కనిపిస్తోంది. గజ్వేల్ లో బీఆర్ఎస్ కు ప్రమాద ఘంటికలు మొగించేలా వ్యూహరచన చేస్తోన్న కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో పని చేస్తోంది. అందుకే గ్రౌండ్ లెవల్ సిట్యుయేషన్ ను బట్టి కాకుండా ప్రజాబలం లేని నేతలకు ఆదరణ పెరుగుతోందని బీఆర్ఎస్ అనుకూల పత్రిక రాసుకోస్తోంది. బీఆర్ఎస్ పేపర్ కాంగ్రెస్ కు కాస్త అనుకూలంగా వార్త ప్రచురించిందంటేనే సీన్ అర్థం చేసుకోవచ్చు. బలహీన అభ్యర్థులకు లేని బలాన్ని క్రియేట్ చేస్తూ…

Read More

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వృద్దులు, వితంతువులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగానే బీఆర్ఎస్ అప్రమత్తం అయింది. 44లక్షల మంది వృద్దుల ఓటు బ్యాంక్ చేజారిపోకుండా ఉండేందుకు ప్రస్తుత పెన్షన్ ను డబుల్ చేస్తామని హామీ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎంత ఆర్థిక భారం పడుతుంది..? అనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. నిజానికి ఆసరా పెన్షన్ ను 3,016కు పెంచాలని బీఆర్ఎస్ తొలుత భావించింది. కాంగ్రెస్ నాలుగు వేలు ఇస్తామని ప్రకటించడంతో బీఆర్ఎస్ కూడా ఆసరా పెన్షన్ ను పెంచాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆసరా పెన్షన్ కోసం ఈ ఏడాది బడ్జెట్ లో ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఒకవేళ పెన్షన్ ను 4000 ఇవ్వాలనుకుంటే ప్రతి సంవత్సరం 24వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2018ముందస్తు ఎన్నికల హామీల విషయంలో పెన్షన్ ను 2వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ కూడా…

Read More