Author: Prashanth Pagilla

బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం దక్కడంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ అదే జోష్ లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. కర్ణాటక ఎన్నికల ఫార్ములాను తెలంగాణలో అనుసరిస్తామని టీపీసీసీ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కంటే ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ఆయా నియోజకవర్గాల్లో పని చేసుకోమని అభ్యర్థులకు సూచించారు. ఈ వ్యూహం కర్ణాటకలో సక్సెస్ అయింది. అదే వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే దిశగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ ముమ్మరం చేసింది. Also Read : మెదక్ లో గాలి అనిల్ కుమార్ మార్క్ రాజకీయం ముందుగా కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసిన కాంగ్రెస్..ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ప్రజలకు చేరువ అయ్యేలా ప్రచారం చేసుకోవాలని సూచించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేసిన ఏఐసీసీ……

Read More

అసంతృప్తులను కూల్ చేసేందుకు అధిష్టానం నాయకత్వ మార్పు చేసినా తెలంగాణ బీజేపీలో కల్లోలం కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ అవినీతిపై బీజేపీ వైఖరి అనుమానాస్పదంగా ఉందని చంద్రశేఖర్, రవీంద్ర నాయక్ ల ప్రకటనలు దుమారం రేపిన సంగతి మరవకముందే మరో నేత అలాంటి వ్యాఖ్యలే చేశారు. బీజేపీ కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ విషయంలో బీజేపీ సాఫ్ట్ గా వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పార్లమెంట్ స్థానాలపై మాత్రమే ఆసక్తి ఉందని…అసెంబ్లీ ఎన్నికలను లైట్ తీసుకునేలా హైకమాండ్ ఆలోచన ధోరణి ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ వైఖరిలో మార్పు రావాలన్న జిట్టా వ్యాఖ్యలు కమలం పార్టీలో మరోసారి అలజడిని క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఒక్కొక్కరుగా నేతలంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కోవడం బీజేపీతో సాధ్యం కాదని…రెండు పార్టీల మధ్య అంతర్గత స్నేహం కొనసాగుతుందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకునే జిట్టా బాలకృష్ణారెడ్డి…

Read More

మనిలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో మగ్గుతున్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఇదివరకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు లక్ష్యంగా జైలు నుంచి లేఖలు విడుదల చేసిన సుఖేష్ తాజాగా అందులో రిలీజ్ చేసిన లేఖలో కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించడం కలకలం రేపుతోంది. అయితే ప్రతిసారి మీడియాకు లేఖను విడుదల చేసే సుఖేష్ ఈసారి మాత్రం ఏకంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైకి పంపారు. బీఆర్ఎస్ తప్పులు ఎక్కడ దొరుకుతాయా అని వేచిచూస్తోన్న తమిళిసై ఇప్పుడు ఆ లేఖ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. తమిళిసై కి సుఖేష్ పంపిన లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. దాదాపు రూ. 200కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉండటంతో తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కేటీఆర్, కవిత అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఆధారాలు…

Read More

మంత్రి హరీష్ రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనపై ఏడాది కిందట బీజేపీ విధించిన సస్పెన్షన్ ఇంకా ఎత్తివేయలేదు. ఈ క్రమంలోనే హరీష్ రావుతో రాజాసింగ్ సమావేశమవ్వడం అనేక అనుమానాలకు తెరలేపింది. పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ కాలపరిమితి ముగిసినా బీజేపీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. అంతేకాదు ఇటీవల అద్యక్షుడిగా నియమకమైన కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు గ్యాప్ ఉంది. దాంతో ఆయన పార్టీ మారేందుకు సిద్దమై హరీష్ తో భేటీకి ఆసక్తి చూపారన్న ప్రచారం జరిగింది. హరీష్ రావుతో భేటీ ముగిసిన అనంతరం భేటీకి గల కారణాలను రాజాసింగ్ వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసమే హరీష్ రావును కలిశానని చెబుతున్నారు. గోశామహల్ ఉన్న హాస్పిటల్‌ను 30 పడకలు లేదా 50 పడకలుగా అభివృద్ధి చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఆసుపత్రి కోసం అడుగుతూనే ఉన్నానన్నారు.…

Read More

దక్షిణ తెలంగాణపై పూర్తిగా పట్టు సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఈ రెండు జిల్లాలో చేరికలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ కు ధీటైన అభ్యర్థులను కాంగ్రెస్ లోకి లాగేందుకు ప్రణాళికలు రచించిన కాంగ్రెస్ ఆ దిశగా సక్సెస్ అయినట్లు సమాచారం. ఈసారి ఇందూర్ జిల్లాలో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవాలనే బలమైన నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోనున్నారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ విస్తరించినా ఆ పార్టీ గడిచిన కొన్నాళ్ళుగా చతికిలపడింది. ఇందూర్ లో ఆ పార్టీకి పెద్దదిక్కుగా కనిపించిన ధర్మపురి అరవింద్ మునుపటిలా అగ్రెసివ్ గా వ్యవహరించడం లేదు. దీంతో బీజేపీ క్యాడర్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తోంది. అలాగే , ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు టర్న్ అవుతోంది. దీంతో ఆయా పార్టీలోని…

Read More

కాంగ్రెస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదని ఇన్నాళ్ళు ఎగతాళి చేస్తూ వచ్చిన కేటీఆర్…తాజాగా అదే పార్టీకి చెందిన రాష్ట్ర అద్యక్షుడు  రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రోడ్డు మీదకు వచ్చారు. ఉచిత కరెంట్ రేవంత్ వద్దన్నారని ధర్నాలు చేశారు. కాంగ్రెస్ గల్లీలో కూడా లేనప్పుడు రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి..? ఓ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై ధర్నాలు చేయడం అందర్నీ  ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ అధికారంలో లేదు. మరోసారి తమదే అధికారమని కేటీఆర్ ధీమాగా చెబుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించడం కొత్త చర్చకు తెరలేపింది. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై కేటీఆర్ కు ఆశలు సన్నగిల్లాయా..? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.  అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదనీ అంత ధీమా కేటీఆర్ కు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రకటనలపై ధర్నాలు…

Read More

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తుంగతుర్తిలో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ఏ గ్రూప్ లు లేని, ఆరోపణలు లేని, క్లీన్ ఇమేజ్ కల్గిన కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, వడ్డేపల్లి రవితోపాటు ఎస్సీ సెల్ చైర్మన్ నగరిప్రీతం పీర్లు ఉన్నాయి. తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ మాదంటే మాదేనని ఎవరికీ వారు ధీమాగా ఉన్నారు. పార్టీ పిలుపునిచ్చినా కార్యక్రమాలను సమన్వయము చేసుకుంటూ ఐక్యంగా సాగాలసిన ఈ నలుగురు నేతలు ఎవరికీ వారుగా నిర్వహిస్తున్నారు. ఇది పార్టీలో చీలికలకు దారితీస్తోంది. పరిస్థితిని అంచనా వేసిన రాష్ట్ర నాయకత్వం టికెట్ ఆశవాహులను పిలిచి మాట్లాడినా నేతల మధ్య సఖ్యత కనిపించలేదు. విసిగిపోయిన…

Read More

పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అప్పుడే ఓటమి భయం మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకత, అనుచరుల భూకబ్జాలు మితిమీరడంతో నియోజకవర్గంలో ఎర్రబెల్లికి ఎదురీత క్రమ, క్రమంగా ప్రారంభమైంది. ఇది చాలదు అన్నట్లుగా ఎన్నారై అనుమాండ్ల ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనుండటంతో ఎర్రబెల్లికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఝాన్సిరెడ్డి గెలుపుకు సోపానాలుగా మారనున్నాయని అంచనా వేసిన ఎర్రబెల్లి పాలకుర్తి నుంచి మకాం మార్చేందుకు రెడీ అయ్యారన్న వాదనలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. మొన్నటివరకు పాలకుర్తిలో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కూడా లేడు. ఇప్పుడు అనుమాండ్ల ఝాన్సీరెడ్డి రాకతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో పార్టీని వీడిన నేతలు, ఎర్రబెల్లి వ్యతిరేకులు అంత ఝాన్సీరెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు సిద్దం అవుతున్నారు. వైద్య వృత్తితో అమెరికాలో స్థిరపడినా, పుట్టిన నేలను మరవని ఝాన్సీరెడ్డి పుట్టిన గడ్డకు సేవా చేస్తూనే వస్తున్నది.…

Read More

ప్రజల మధ్యన ఉంటూ.. జీవితకాలం ప్రజా సేవకు పునరంకితం అవుతానని సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబు స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలతో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. తన ఇష్టదైవం శ్రీ భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజాసేవకు పునరంకితం కావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన ప్రస్థానానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఆ సంకటహరునికి మొక్కులు చెల్లించుకుని ముందడుగు వేస్తున్నట్టు సతీష్ బాబు తెలిపారు. కాకినాడ, రేచర్లపేటలోని శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన జీవితంలోని కొత్త ప్రయాణం విజయవంతం కావాలని మొక్కులు మొక్కారు. దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి తనవంతు సాయం చేసిన సతీష్ బాబు ఆలయ అభివృద్ధికి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సతీష్ బాబుకు కృతజ్ఞతలు…

Read More

బీసీ కులవృత్తుదారులకు సర్కార్ అందిస్తామన్న లక్ష సాయం అర్హులందరికీ ఇప్పట్లో అందటం కష్టమే. ఆ పథకానికి అప్లై చేసుకోవాలని సర్కార్ ప్రకటనతో మొత్తం 5.5లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సర్కార్ సాయం అందాలంటే 5.5 వేల కోట్లు అవసరం అవుతాయి. కానీ ప్రభుత్వం కేవలం తాజాగా రూ. 400కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇలాగె ప్రతి ఏటా అరకొర నిధులు రిలీజ్ చేసుకుంటూ పోతే అప్లై చేసుకున్న 5.5లక్షల మందికి లక్ష సాయం అందాలంటే పుష్కర కాలం పడుతుంది. సర్కార్ విడుదల చేసిన అరకొర నిధులతో ఈ పథకం అమలుపై ఆదిలోనే అనేక అనుమానాలు ముసురుకున్నాయి. అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా..? మధ్యలోనే అటకెక్కిస్తారా..? అనేది చర్చ జరుగుతోంది. ప్రతి నెల విడతల వారీగా అర్హులకు సర్కార్ సాయం అందిస్తామని చెబుతోంది. ప్రతి నెల ఎంపిక ప్రక్రియ చేపట్టి ఆ నెల 15న లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయాలని భావిస్తున్నారు.…

Read More