Author: Prashanth Pagilla

తెలంగాణ బీజేపీ అద్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందర్నీ అవాకయ్యేలా చేశాయి. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార సభలో తాజా మాజీ అద్యక్షుడు బండి సంజయ్ జపం చేశారు. ఆయన నాయకత్వంలోనే పార్టీ బలపడిందన్న రాజగోపాల్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు బండి సారధ్యంలోనే గెలిచామని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ను చూస్తుంటే తన కళ్ళలో నీళ్ళు తిరిగాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. బండి సంజయ్ పై అమితమైన ప్రేమను కనబరిచారు. ఇదే అక్కడున్న బీజేపీ నేతలను ఆశ్చర్యపరిచింది. అద్యక్షుడిగా బండిని మార్చాలని ఢిల్లీ పెద్దలను కలిసి తన అభ్యంతరాలను అధిష్టానంకు వివరించిన రాజగోపాల్ రెడ్డి తాజాగా జరిగిన సభలో మాత్రం బండిని ఆకాశానికి ఎత్తేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. పార్టీ మార్పుపై కూడా ఇదే వేదికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టతనిచ్చారు. తాను పార్టీ…

Read More

వందేళ్లుగా కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య మరో వందేళ్లు కలవలేని శత్రుత్వాన్ని మణిపూర్ వాసుల్లో నూరిపోసింది ఎవరు..? అక్కడి ప్రజల మధ్య అనుబంధాలను కత్తిరించిన కాలకేయులు ఎవరు..?పాలిచ్చిన అమ్మల రొమ్ములను బరితెగించి ఊరేగించిన ఉన్మాదానికి ప్రేరేపించిన శక్తులు ఏవి..? మూడున్నర నెలలుగా మణిపూర్ యుద్దకాండగా మారడంపై దేశవ్యాప్తంగా ప్రజల మధ్య జరుగుతున్న చర్చ ఇది. మణిపూర్ లో ఇద్దరు మహిళలపై ఆకృత్యానికి పాల్పడటానికి కారణం… రాజకీయ పార్టీలు పెంచిన పోషించిన కులం, మతం, వర్గం, ప్రాంతం. ఇవే మణిపూర్ ను మానని గాయంలా మార్చాయి. ప్రజల మధ్య చిచ్చును రాజేశాయి. మణిపూర్ ను రెండు వర్గాలుగా చీల్చాయి. ప్రజల మధ్య ఐక్యత నింపాల్సిన పాలకులు ఇవన్నీ కామన్ అని మాట్లాడుతుండటం వారి ఎజెండాను బయటపెడుతున్నాయి. స్వయంగా మణిపూర్ ముఖ్యమంత్రే.. మా మణిపూర్ లో ఇలాంటి ఘటనలు వందలసార్లు జరిగాయని వ్యాఖ్యానించాడంటే…మణిపూర్ మంటల వెనక రాజకీయ నేతల ప్రమేయం లేదని ఎలా అనుకోవాలన్న…

Read More

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ బహిష్కరణకు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఈటల కలవడంపై హైకమాండ్ సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తిని ఎలా కలుస్తారని, పార్టీ విధానాలకు కట్టుబడి నడుచుకోవాలని ఈటలకు హితవు పలికింది. ఓ వర్గాన్ని కించపరిచిన కేసులో రాజాసింగ్ పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడాడని బీజేపీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేత గడువు ముగిసినా ఆయన విధించిన బహిష్కరణపై పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే రాజాసింగ్ తో ఈటల భేటీ కావడం హైకమాండ్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. బోనాల సందర్భంగా గోషామహల్ లో బీజేపీ – బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీ వార్ చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మంగళ్ హాట్ బీజేపీ కార్పొరేటర్ శశికళపై పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేశారని బీజేపీ ఆరోపించింది. విషయం తెలుసుకున్న ఈటల, రాజాసింగ్…

Read More

బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశమయ్యారు. ఉద్యమ సమయంలో తాను చేసిన హామీల వీడియోలు సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఆంధ్రలో పుట్టిన వాళ్ళంతా లంకలో పుట్టినోళ్లెనని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రతిబంధకంగా మారాయి. గతంలో తాను మాట్లాడిన వీడియోలను తొలగించాలని చెప్పినా ఇంకా ఎందుకు కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వింగ్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతోపాటు మోడీని పొగిడినట్లు, వాళ్ళతో తనకు స్నేహం ఉన్నట్లు చెప్పిన వీడియోలను వెంటనే డిలీట్ చేసేలా చూడాలని ఆదేశించారు. ఆ వీడియోలను బ్లాక్ చేసేలా చూడాలని కర్తవ్య బోధన చేశారు. ప్రతిపక్షాలను కవ్వించేలా వీడియోలు చేయవద్దని సూచించిన కేసీఆర్… ప్రత్యర్ధి పార్టీలు ఇస్తోన్న కౌంటర్లకు కూడా సరైన…

Read More

రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. ఓ వైపు రేవంత్ తన నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పావులు కదుపుతూనే మరోవైపు బీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగుతు హీట్ పుట్టిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించి గులాబీ పార్టీ గుండెధైర్యం దెబ్బతీయాలని చేరికలపై ప్రత్యేక దృష్టిసారించారు రేవంత్. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునేలా ఆయన నడిపిన మంత్రాంగం ఫలించింది. బీఆర్ఎస్ రంగంలోకి దిగకముందే ఎవరికీ తెలియకుండా చేరికల ఆపరేషన్ ను రేవంత్ కంప్లీట్ చేస్తూ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తీగల కృష్ణారెడ్డితోపాటు ఆయన కోడలు అనితా రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. అనితా రెడ్డి జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. పదవిలో ఉన్నప్పటికీ ఆమె బీఆర్ఎస్ ను వీడెందుకు నిర్ణయం తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరడంతో మహేశ్వరం టికెట్ తనకు దక్కేలా లేదని…

Read More

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బస్సు యాత్ర చేయబోతున్నారా..? ఇందుకు సంబంధించిన అంశంపై నేతలందరితో చర్చించేందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారా..? ఈ సమావేశం ముగిసిన అనంతరం బస్సు యాత్రపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే కీలక ప్రకటన చేయనున్నారా…? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలను తొలగించి ఐక్యం చేసే దిశగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత నాయకుల మూడ్ మాత్రమే కాదు జనాల అటెన్షన్ లో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని గ్రహించే పలువురు బీఆర్ఎస్ , బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసిన కోమటిరెడ్డి ఇంకాస్త కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి…

Read More

తెలంగాణలో రేవంత్ రెడ్డిని మాత్రమే బీఆర్ఎస్ ప్రత్యర్థిగా అనుకుంటోంది. ఆయన టార్గెట్ గానే బీఆర్ఎస్ అండ్ కో రాజకీయం చేస్తోంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో ఒంటరి చేయాలని, సీనియర్ల ముందు దోషిగా నిలపాలని ఎప్పటి నుంచో అనేకానేక ప్రయత్నాలు చేస్తోంది కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఆ చిల్లర ప్రయత్నాలే రేవంత్ లో పట్టుదలను పెంచాయి. కేసీఆర్ పై అవిశ్రాంతంగా కొట్లాడేలా పురమాయించాయి. కేసీఆర్ కు ధీటైన నేతగా గుర్తింపు పొందేలా మార్చాయి. రేవంత్ రూపంలో బీఆర్ఎస్ అధికారానికి ప్రమాదం పొంచి ఉందని గులాబీ పార్టీ గ్రహించింది. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో కనిపిస్తోన్న ఊపు, రేవంత్ నాయకత్వ చరిష్మా చూస్తుంటే బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయం దక్కదని ప్రగతి భవన్ పెద్దలు టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ లో ఉచిత విద్యుత్ అంశంపై రేవంత్ మాట్లాడినదాన్ని వక్రీకరించి రేవంత్ ను బద్నాం చేసే…

Read More

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరికొంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన బీఆర్ఎస్ , బీజేపీ నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానికం ఠాకూర్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ , బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ , మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి , వేముల వీరేశంతోపాటు గద్వాల జడ్పీ చైర్మన్ సరిత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి , బీఆర్ఎస్ తిరుగుబాటు నేత మందుల సామేలు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. గురువారం ఏఐసీసీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో వీరంతా కాంగ్రెస్ లో చేరనున్నారు. వాస్తవానికి వీరంతా కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ లో చేరేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు…

Read More

ఇటీవల జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు చేస్తూ సన్నీ లియోన్ ప్రస్తావన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లు ఉందంటూ రోజా సెటైర్ వేశారు. రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సినీనటి అయిన రోజా మరో నటిని చర్చలోకి తీసుకురావడం సరైంది కాదంటూ చర్చ నడిచింది. గతంలో సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా కొనసాగింది. ఆమె ఆ వృత్తిని వదిలేసి చాలా కాలమైంది అయినా ఆమె గతాన్ని పట్టుకొని పవన్ పై సెటైర్లు వేయడం సబబు కాదనే అభిప్రాయాలు సినీ వర్గాల నుంచి వచ్చాయి. రాజకీయాల కోసం ఓ మహిళను చర్చలోకి తీసుకొస్తారా..? అని విమర్శలు వచ్చాయి. అయితే, రోజా వ్యాఖ్యలపై సన్నీ లియోన్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సన్నీ లియోన్ పేరుతో ఓ ట్వీట్…

Read More

కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తో కాంగ్రెస్ ఎన్నికల రేసులో ముందంజలోకి వచ్చేసింది. పవర్ వార్ లోనూ తగ్గేది లేదని అధికార బీఆర్ఎస్ కు సవాల్ విసురుతోంది. బీఆర్ఎస్ మాత్రం మునుపటి వేవ్ ను అందుకోలేక చతికిలపడింది. ఫలితంగా 24గంటల ఉచిత కరెంట్ పై రేవంత్ ను ఇరికించబోయిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీనే ఇరికించేశాడు. రైతులకు 24 గంటల కరెంట్ బీఆర్ఎస్ ఇవ్వట్లేదనే కాదు, 24గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చూపించి అవినీతికి పాల్పడుతున్నారని రేవంత్ సాక్ష్యాలు బయటపెట్టడంతో బీఆర్ఎస్ ప్లాన్ భూమ్ రాంగ్ అయింది. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ కు ప్రధాన ఓటు బ్యాంక్ గానున్న రైతులు కాంగ్రెస్ వైపు టర్న్ అవుతున్నారు. దళిత బంధు అందరికీ ఇస్తామని ఎన్నికల వరకు సాగదీసే కుట్ర నడుస్తోంది. గిరిజన బంధు మునుగోడు ఉప ఎన్నికల్లో గిరిజనులను మచ్చిక చేసుకునేందుకు మాత్రమే బీఆర్ఎస్ ప్రయోగించిన అస్త్రమని తేలింది. బీసీ కులవృత్తులకు రూ. లక్ష సాయం ఇస్తామని 400కోట్లు…

Read More