Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. ఫ్గిలిం చాంబర్ అద్యక్షుడిగా ఎన్నికైన ఆయన రాజకీయ అరంగేట్రంపై స్పందించారు. తాను ఎంపీగా పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని వ్యాఖ్యానించడంతో దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తారనే చర్చకు బలం చేకూరింది. గత కొన్నాళ్ళుగా రాజకీయ ఎంట్రీపై డైలమాలో ఉన్నారు దిల్ రాజు. అధికార బీఆర్ఎస్ , ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో దిల్ రాజుకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ లో ఆయన సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దాంతో ఆయన ఏదో ఒక పార్టీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి కానీ దిల్ రాజు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే తాను పోటీగా పోటీ చేస్తే గెలిచి తీరుతాననడంతో ఏ పార్టీ నుంచి దిల్ రాజు పోటీలో ఉంటారనే చర్చ ఊపందుకుంది. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో…
కేసీఆర్ రాజకీయం డిఫరెంట్ గా ఉంటుంది. విమర్శల జడివాన కురుసిన తరువాత దానిని తనకు అనుకూల వాతావరణంగా మార్చుకోవడంలో కేసీఆర్ సిద్దహస్తులు. ఏదైనా ఆపద వస్తే వెంటనే సాయం చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదని అనుకుంటారో ఏమో కానీ ప్రతిపక్షాలు నోటికి పని చెప్పేవరకు ఆయన కాలుకదపరు. నోరు మెదపరు. అందరూ అలసిపోయిన తరువాత ఒకే ఒక్క నిర్ణయంతో బాధితులను కూడా బుట్టలో వేసుకుంటారు కేసీఆర్. వేనోళ్ళ తిట్టినళ్ళతోనే పొగిడించుకునేలా కేసీఆర్ రాజకీయ శైలి ఉంటుంది. కేసీఆర్ ఎవరూ ఊహించని రీతిలో నష్టపరిహారం ప్రకటించి… నష్టాన్ని కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కేసీఆర్. వరదలోస్తే కేసీఆర్ సమీక్షలతోనే కాలం గడుపుతున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. గతంలో వరదలోస్తే కుటుంబానికి పదివేల చొప్పున నష్టపరిహారం ఇచ్చి అందర్నీ అనుకూలంగా మార్చుకున్నారు. చాలామందికి సహాయం దక్కలేదు కానీ సహాయం చేశారన్న భావన మాత్రం జనాల్లో ఉంటుంది కదా అదే కేసీఆర్…
ఇటీవలి వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఇంకా కాలనీలు, గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని… పరిస్థితిని కేసీఆర్ సమీక్షిస్తున్నారని మీడియాకు ప్రకటనలు విడుదల చేస్తున్నారు తప్పితే నిజంగానే ప్రగతి భవన్ లో కేసీఆర్ రివ్యూలు చేస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం అప్రమత్తం కాలేదని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లకపోవడంతో ప్రాణ నష్టం జరిగిందనే విమర్శలు చెలరేగుతున్నాయి. కేంద్ర బృందాలు రంగంలోకి దిగడంతో కొంత మంది ప్రాణాలు బయటపడ్డారనే వాదనలు ఉన్నాయి. సమీక్షలతోనే కేసీఆర్ కాలం వెళ్ళదీశారని ప్రజలకు భరోసా ఇవ్వడం, సహాయక చర్యలు చేపట్టడంలో ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ముంపు ప్రాంత ప్రజలంతా కేసీఆర్ తీరుపై, బీఆర్ఎస్ సర్కార్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారు. అధికార పార్టీ నేతలు…
తెలంగాణలో వరుసగా కురిసిన వర్షాలతో రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, హైదరాబాద్ లోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన తెలంగాణ సర్కార్ ఈ నెల 31న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వరద బాధితులను ఆదుకునే ప్రధాన ఎజెండాతో ఈ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు చాలా రోజుల తరువాత కేబినేట్ భేటీ జరుగుతుండటంతో మంత్రివర్గ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీలను ఇస్తున్నారు. గృహలక్ష్మీ పథకాన్ని జూన్, జూలై నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. అలాగే, బీసీ బంధు, మైనార్టీ బంధులను ప్రకటించారు. కానీ నిధులు లేక అర్హులందరికీ సాయం అందటం లేదు. దీంతో ఎన్నికల నాటికీ అందరికీ లబ్ది చేకూరేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే…
ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కొండా కపుల్స్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా..? తమ కుటుంబంలోని ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు రావడం అసాధ్యమని అంచనా వేసి మరో పార్టీలోకి జంప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారా..? అసలే అభ్యర్థులు లేక పక్క పార్టీల వైపు ఆశగా చూస్తున్న కమలం నాయకత్వం కొండా కపుల్స్ కు టికెట్లపై హామీ ఇచ్చి బీజేపీలో చేర్చుకోనుందా ..? అంటే అవుననే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన కొండా దంపతులు రాష్ట్రం ఏర్పడ్డాక మునుపటి ప్రభ కోల్పోయారు. కాంగ్రెస్ ను వీడి అధికార బీఆర్ఎస్ లో చేరారు. 2018లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. రాజకీయ స్థిరత్వం లేకనే వీరి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానించడం లేదు. మరోవైపు.. కొండా దంపతులో ఒకరికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉంది. కానీ వీరు…
ORR టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ORR టెండర్ల సమాచారాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ఏజీని ప్రశ్నించింది. దీంతో నీళ్ళు నమిలిన ఏజీ, రేవంత్ కు పూర్తి సమాచారం ఇస్తామని కోర్టుకు నివేదించారు. రెండు వారాల్లోగా రేవంత్ అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని గడువును నిర్దేశించింది హైకోర్టు. ఓఆర్ఆర్ టెండర్లపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే ఇవ్వలేదని, ఆర్టీఐ ద్వారా కోరినా ఇవ్వడం లేదని రేవంత్ చెప్పడంతో ప్రభుత్వంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీఐ ఉన్నది ఎందుకని విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ను ప్రశ్నించింది. దీంతో ఓఆర్ఆర్ టెండర్ కు చెందిన సమాచారాన్ని రేవంత్ కు ఇస్తామని అంగీకరించక తప్పలేదు. ఓఆర్ఆర్ టెండర్లలో భారీ గోల్ మాల్ జరిగిందని, వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని రేవంత్ ఆరోపణలు చేస్తూ జూలై 26న హైకోర్టులో పిటిషన్…
తెలంగాణలో ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ ముందుగానే రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయిన బీఆర్ఎస్ ఈమేరకు కసరత్తును ముమ్మరం చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. బుధవారం ప్రగతి భవన్ లో ఈ ఇద్దరు నేతలు ఐదారు గంటలపాటు సమావేశమై సిట్టింగ్ ఎమ్మెల్యేల బలబలాలు, సర్వే రిపోర్ట్లపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సర్వేల రిపోర్టింగ్ ను పరిశీలించిన కేటీఆర్ , హరీష్ రావులు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలను పరిశీలించారు. ఏ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది..? ఎవరిని తప్పించాలి..? వాళ్ళ స్థానంలో ఎవరిని చేర్చాలి..? ప్రత్యామ్నాయ నేతలు ఎవరున్నారు..? అనే అంశాలపై చర్చించారు. ఎలాంటి పోటీ లేని, నేతల మధ్య సమన్వయము కుదిరిన చోట అభ్యర్థుల జాబితాను కేటీఆర్ , హరీష్ రావులు ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. వీటిపై గురువారం మరోసారి సమావేశమై తుది…
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎన్నికల అఫిడవిట్ తప్పుగా సమర్పించారని ఆయన ప్రత్యర్ధి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు గెలుపును సవాల్ చేస్తూ జలగం 2018లోనే హైకోర్టును ఆశ్రయించారు. వనమా ఎన్నికల అఫిడవిట్ తప్పుడు తడకగా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేగా వనమాపై అనర్హత వేటు వేసింది. వనమా ఎన్నికల అఫిడవిట్ తప్పుగా ఉందని చెబుతూ జలగంను ఎమ్మెల్యేగా ప్రకటించింది హైకోర్టు. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకుగాను వనమాకు రూ .5 లక్షల జరిమానా విధించడంతో పాటు 2018 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అర్హుడు కాదంటూ తీర్పు నిచ్చింది.…
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాదు తిప్పిపోతల పథకం మరోసారి నిరూపణ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎగువకు ఎత్తిపోసిన నీళ్ళను తాజాగా గోదావరికి పోటెత్తిన వరదల కారణంగా ఎత్తిపోసిన నీళ్ళను మళ్ళీ దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి ఎందుకు పనికి రాకుండా పొయిందన్న విమర్శలు సర్వత్ర వెళ్ళువెత్తుతున్నాయి. తెలంగాణలో ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాంతో వర్షాకాలం సీజన్ ప్రారంభమైనా వరణుడు కరుణించకపోవడంతో ఈ నెల 3న కన్నెపల్లి వద్ద మోటార్లు స్టార్ట్ చేసి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ళ , సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లి వరకు కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ చేశారు. మొత్తం 15రోజులపాటు 9టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. తెలంగాణ రైతాంగానికి సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. ఇంతలో…
రోమ్ నగరం తగలబడిపోతుంటే..నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఈశాన్య రాష్ట్రాల ఇంఛార్జి మంత్రి కిషన్ రెడ్డి తీరు ఉంది. మణిపూర్ లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేస్తుంటే…కిషన్ రెడ్డి భేషుగ్గా తెలంగాణలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మణిపూర్ యుద్దకాండపై మౌనం వహిస్తున్నారు. ఇంచార్జ్ మంత్రి హోదాలో అక్కడ పర్యటించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన కిషన్ రెడ్డి మణిపూర్ తగలబడిపోతుంటే నాకేంటి అన్నట్లుగా తెలంగాణలో రాజకీయంపై దృష్టిసారించారు. దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పే బీజేపీ నేతలు… దేశంలో అంతర్భామైన మణిపూర్ లో దారుణ మరణహోమం జరుగుతుంటే రాజకీయంపై దృష్టిపెట్టారు. మణిపూర్ ఘటన ఏమంత సీరియస్ అంశమే కాదన్నట్లు తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ బాగోతంపై పోరుకు కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. యావత్ దేశం మణిపూర్ ఘటనపై తమ స్పందనను వ్యక్తీకరిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆ అంశాన్నే…