Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే అప్పుడే అభ్యర్థిని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించలేదు. జనసేనాని మాత్రం తెనాలి అభ్యర్థిని ప్రకటించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ వెల్లడించారు. టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని ఇరు పార్టీల ముఖ్య నేతలు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. పొత్తులపై ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయని – త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతున్న వేళ పవన్ ఏకపక్షంగా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తాడు..? అంటే పొత్తు లేదా..? అనే చర్చ జరుగుతోంది. తెనాలి నుంచి టీడీపీ తరుఫున ఆలపాటి రాజా పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఆయనకు డెబ్బై…
తెలంగాణ రాజకీయాలకు గ్లామర్ అద్దాలని బీజేపీతో సహా ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకోసం టాలీవుడ్ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నాయి. సెలబ్రిటీలను తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నాయి. ఏడాది కిందటి నుంచే టాలీవుడ్ ప్రముఖులతో బీజేపీ అగ్రనాయకత్వం సమాలోచనలు జరుపుతోంది. కానీ బీజేపీకి తెలంగాణలో ఆదరణ లేకపోవడంతో పలువురు హీరో, హీరోలు బీజేపీ అగ్రనాయకత్వ విజ్ఞప్తి పట్ల ఆలోచిస్తామని మాట దాటవేస్తు వచ్చారు. ఇక దిల్ రాజు, నితిన్ లపై బీఆర్ఎస్ , బీజేపీలు గురి పెట్టాయి. ఈ ఇద్దరు నేతలు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే. నితిన్ తో ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం చర్చలు జరిపింది ఆయన మాత్రం పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నితిన్ మేనమామ నగేష్ రెడ్డి పీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.ఆయన నిజామాబాద్ రూరల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ అక్కడి నుంచి పోటీ అధికంగా ఉంది. నగేష్ రెడ్డి తనకు టికెట్ దక్కకపోతే లోక్ సభ…
మెగా ఫ్యామిలీకి ఒకప్పటి స్టార్ హీరో అల్లుడు కాబోతున్నట్లు రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరో కాదు. ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తరుణ్… మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం విస్తృతంగా సాగుతున్న సమయంలోనే తరుణ్ తల్లి మా వాడికి పెళ్లి జరగబోతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు..మా వాడికి బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో పెళ్లి జరగబోతుందని చెప్పడం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలు అంటే మెగా, అక్కినేని, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు. అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు. దగ్గుబాటి ఫ్యామిలీలో ఒకరున్నా ఆమెకి తరుణ్ కి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ కూతుర్లకు పెళ్లి అయింది. ఇక మిగిలింది కొణిదెల ఫ్యామిలీనే. దాంతో తరుణ్ పెళ్లి చేసుకొబోయేది మెగా ఫ్యామిలీ నుంచె అనే ప్రచారం జరుగుతోంది. శ్రీజ తోనో…
జనగామ బీఆర్ఎస్ టికెట్ ఫైట్ తారాస్థాయికి చేరుకుంది. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. జనగామ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గం, పల్లా వర్గంగా చీలిపోయింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి చేసిన ఫోన్ కాల్ సంబాషణ జిల్లా పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా మనమంతా పని చేయాలి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా నడుచుకోవాలని నర్మెట జడ్పీటీసీ శ్రీనివాస్ నాయక్ తో పాగల సంపత్ ఫోన్ కాల్ లో సంభాషించారు. ఆయనపై వ్యతిరేకత ఉందని, టికెట్ ఇచ్చినా గెలవరని అనుకున్నారో కానీ జడ్పీ చైర్మన్ మాత్రం ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పని చేయాలనీ ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. పాగల సంపత్ రెడ్డి ఎమ్మెల్సీ పల్లాకు…
పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా ఎలా మార్చుకోవాలని సీఎం కేసీఆర్ వారం రోజులపాటు ఫామ్ హౌజ్ వేదికగా కసరత్తు చేశారు. కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి వరాల జల్లు కురిపించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా 500కోట్లు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని, గ్రేటర్ చుట్టూ 400కి. మీ మేర మెట్రో విస్తరణ, వరంగల్ కు ఎయిర్ పోర్ట్ అంటూ ప్రకటించి ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ జరిగేలా చేసుకున్నారు. ఇవి ప్రభుత్వ వ్యతిరేకతను తుడిచేసి ప్రభుత్వానికి మేలు చేసేలా చేస్తాయని అనుకున్నారు. తమొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లుగా కేసీఆర్ ఏదైతే ఆశించారో అది జరగడం లేదు. ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ మూడేళ్ళ కిందట చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. భూమండలం ఉన్నంతవరకు ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని గట్టిగా చెప్పేశారు. అసలు ఆర్టీసీ విలీనం చేయడం కుదరదని చెప్పి, ఆర్టీసీని విలీనం చేస్తే మిగతా కార్పోరేషన్లను విలీనం చేయాలనీ…
తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈ నెలలో 80మందితో మొదటి జాబితాను కేసీఆర్ ప్రకటించనున్నారు. అయితే, బీఆర్ఎస్ కు పోటీగా అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ కూడా సై, సై అంటోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసినట్లు టి. కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నెల చివరి నాటికి 80మంది పేర్లను అభ్యర్థులుగా ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే పేర్కొన్నారు. ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం వలెనే గత ఎన్నికల్లో నష్టపోయామని కాంగ్రెస్ అనుకుంటోంది. Also Read : 50 మందికిపైగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు వీరే ..!!? ఈసారి ఆలస్యం చేయకుండా తొందరగానే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. ఇప్పటికే రాజకీయ…
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుపై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో చాలామంది నేతలకు టెన్షన్ పట్టుకుంది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించడంతోపాటు పలు కారణాలను చూసి 28మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లుబాటు కాదంటూ హైకోర్టులో వారి ప్రత్యర్ధులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల వనమా విషయంలో సంచలన తీర్పు వెలువరించిన హైకోర్టు, ఈ నెల 12నుంచి 17వరకు మిగతా పెండింగ్ పిటిషన్లపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో 30పిటిషన్లు పెండింగ్ లో ఉండగా అందులో 28 పిటిషన్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యేలకు అనర్హత వేటు టెన్షన్ పట్టుకుంది. మరికొద్ది రోజుల్లో ఈ పిటిషన్ లు విచారణకు రానున్నాయి. దాంతో ఈ నెలఖారు చివరి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అనర్హులుగా మారుతారోనని బీఆర్ఎస్ వర్గాల్లూ చర్చ జరుగుతోంది. ఎవరెవరిపై పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి..? మహబూబ్‌నగర్ :- శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ చంద్రశేఖర్ వేములవాడ :-…
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మూడేళ్ళ కిందట కార్మికులు కోరితే కుదరదని కేసీఆర్ చెప్పేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 50రోజులకు పైగా సాగుతుందని.. వారి డిమాండ్లను నెరవేర్చారా..? అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చారు కేసీఆర్. అలా ఎలా కుదురుతుంది..? అన్ని అంశాలను పరిశీలించే చెబుతున్నాం. ఆర్టీసీని విలీనం చేస్తామని దొంగ హామీలు ఇచ్చి…మోసం చేయడం మాకు తెలవదు అంటూ కేసీఆర్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం అసంభవం. సమ్మె విరమించి విధుల్లో చేరితే సరి. లేదంటే ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. కార్మికుల డిమాండ్ల పట్ల కేసీఆర్ కరుణించకపోవడంతో ఎంతోమంది కార్మికులు మనస్తాపంతో చనిపోయారు. మరెంతోమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆర్టీసీ కార్మికులను యూనియన్లే రెచ్చగోడుతున్నాయని యూనియన్లను లేకుండా చేశారు. కేసీఆర్ హెచ్చరికలతో సమ్మెను విరమించి కార్మికులు విధుల్లో చేరారు. ఆ తరువాత కార్మికుల పక్షానా గళమెత్తే వారె లేకుండా పోయారు. సకాలంలో జీతాలు రాకపోయినా,…
కేంద్ర పెద్దల అండదండలు జగన్ కు ఎంతలా ఉన్నాయో మరోసారి ఏపీ ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వివరాలను బయట పెట్టింది. తాజాగా కేంద్రం మాత్రం అప్పుల విషయంలో ఏపీ సర్కార్ చెబుతున్న లెక్కలే నిజమనేలా పార్లమెంట్ లో వంత పాడింది. వివిధ కార్పోరేషన్ల ద్వారా ఏపీ ప్రభుత్వం మొత్తం రూ. పది లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారని పురందేశ్వరి చాలా స్పష్టంగా చెప్పింది, కేంద్ర మంత్రి నిర్మలా సీతరామన్ ను కలిసి ఏపీకి కొత్తగా అప్పులు తీసుకునే వెసులుబాటు ఇవ్వొద్దని చెప్పింది. కానీ పురందేశ్వరి చెప్పిన వాటిని పట్టించుకోకుండా నిర్మలా సీతారామన్ వైసీపీ నేతల లెక్కలను చెప్పటం హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ అధికారం కోల్పోయే నాటికి అంటే 2019 మార్చి నెలాఖరు నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్ల అప్పు ఉన్నది. ఆ అప్పులు ఈ ఏడాది…
తెలంగాణ కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఏమాత్రం నమ్మశక్యంగా కనిపించడం లేదు. వారం రోజులు ఫామ్ హౌజ్ లో తిష్టవేసి ప్రభుత్వంపై ఏయే వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయో గుర్తించిన కేసీఆర్… కేబినేట్ నిర్ణయాలతో వారిని కూల్ చేసేలా హామీలు ఇచ్చినట్లు కనబడుతోంది. ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జీతాల పెంపును ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు తప్పితే ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఎక్కడ డిమాండ్ చేయలేదు. వారు కూడా ఊహించని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపోయేలా చేశారు. గతంలో ఆర్టీసీ విలీనం అసంభవమన్న కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సమ్మతించడం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం ప్రక్రియను పూర్తి చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు కానీ ఎన్నికల లోపు ఈ ప్రక్రియ పూర్తి కావడం కష్టమే. ఎన్నికల కోణంలో ఆలోచించే కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో…