Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
గ్రేటర్ హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్, గోషామహల్ నుంచి ఓ ఫేమస్ సింగర్ కు అవకాశం ఇవ్వాలనుకుంటుంది. ఆస్కార్ అవార్డ్ ను గెలుచుకున్న రాహుల్ సిప్లిగంజ్ ను గోషామహల్ బరిలో దింపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికుడు, బీసీ సామజిక వర్గానికి చెందిన రాహుల్ కు గోషామహల్ లో మంచి పట్టుంది. ఈ విషయం గ్రహించే గోషామహల్ నియోజకవర్గంలో రాహుల్ ను బరిలో నిలిపితే ఎలా ఉంటుందని సర్వే కూడా చేయించినట్లు సమాచారం. ఈ సర్వే రిపోర్ట్ లోనూ రాహుల్ కు అనుకూలంగా రిజల్ట్ వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. రాహుల్ కు ఆస్కార్ వచ్చినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదని.. తగిన విధంగా గౌరవించలేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆస్కార్ అవార్డుతో వచ్చిన రాహుల్ ను సన్మానించిన కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ కు 5కోట్లు, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పుడే…
మెగా ఫ్యామిలీ అంటేనే చాలు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది నటి శ్రీరెడ్డి. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచుగా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది. పవన్ దేనికి పనికిరాని వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ పై దారుణంగా వ్యాఖ్యలు చేసింది. “అరేయ్ పవన్ నీకు ప్యాకేజ్ ముడితే చాలా..? నీ వెనక ఉండే వారి గురించి ఆలోచించవా..? ఆడవారిని అవసరానికి వాడుకోవడం తప్ప దేనికి పనికిరావు అంటూ రెచ్చిపోయింది. అంతేనా… నాతో పడుకో.. పిల్లల్ని కను.. అప్పుడు ఆ పిల్లలని రాజకీయాల్లోకి పంపుదాం.. అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే మహిళవని కూడా చూడమంటూ శ్రీరెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారు. Also Read : మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగిందంటూ శ్రీరెడ్డి కామెంట్స్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట కల్గింది. అహ్మదాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్దరణకు మార్గం సుగమం అయింది. మోడీ అనే పేరుతో ఉన్న వాళ్ళంతా దొంగలేనని రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల సమయంలో కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై పూర్నేష్ మోడీ అనే గుజరాత్ ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించడంతో ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీనిపై రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఫలితం దక్కలేదు. కింది కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్దించడంతో ఇటీవల రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూలై 15న సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలు విన్న అనంతరం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గరిష్ట శిక్ష విధింపులో ట్రయల్…
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ సర్కార్ కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశ పెట్టాలనుకున్న ప్రభుత్వానికి ఝలక్ తగిలింది. ఆర్టీసీ బిల్లు ఆర్థికపరమైనది కావడంతో గవర్నర్ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. దాంతో ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని గవర్నర్ కార్యాలయానికి బిల్లును పంపించామని ప్రగతి భవన్ వర్గాలు అంటుండగా… రాజ్ భవన్ వర్గాలు మాత్రం ఈ వాదనను తోసి పుచ్చుతున్నాయి. తమకు ఆర్టీసీ బిల్లు అందలేదని చెబుతున్నాయి. దాంతో ఆర్టీసీ బిల్లు విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర వ్యతిరేకతతో ఉండటంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకున్నారు. ఇందుకు ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలనుకున్నారు. కానీ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శనివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.…
పెండింగ్ హామీలను నెరవేర్చేలా ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ సర్కార్ కు నిధుల సమస్య ఎదురైంది. దాంతో ఈ సమస్య నుంచి బయట పడేందుకు భూములను అమ్మకానికి పెట్టేసి ఆదాయం సమకూర్చుకున్నారు. కోకాపేటలో 43ఎకరాల విలువైన భూములను అమ్మి రూ. 3300 కోట్ల వరకు నిధులను సమీకరించుకోగలిగారు. ఈ ఆదాయాన్నే రైతు రుణమాఫీ కోసం వాడాలనే యోచనలో సర్కార్ ఉంది. రైతు రుణమాఫీ చేయకపోవడంతో తెలంగాణ రైతాంగం బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉందని కేసీఆర్ కు నివేదికలు అందాయి. దాంతో ఆరునూరైన రుణమాఫీ చేయలనుకున్నారు. అందుకోసం 19వేల కోట్ల నిధులు అవసరం. ఇప్పటికిప్పుడు ఆ నిధులు సమకూరడం కష్టమని అధికారులు చెప్పినా కేసీఆర్ వినలేదు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏదీ తమకు ప్రతికూలంగా మారొద్దని…భూముల అమ్మకంతో వచ్చిన నిధులను రైతు రుణమాఫీ కోసం వాడాలనుకుంటున్నారు. భూముల అమ్మకంతో 3300కోట్ల ఆదాయం, మద్యం దుకాణాల పేరిట రెండు వేల కోట్లు ఆదాయం సమకూరింది.…
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. 80మందితో కూడిన మొదటి జాబితాను బీఆర్ఎస్ ఆగస్ట్ లో విడుదల చేయనుంది. కాంగ్రెస్ కూడా మొదటి విడతను ఈ నెల చివర్లో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు ధీటుగా తామూ ముందంజలో ఉన్నామని చాటేందుకు అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తోంది. అందుకే 30మందితో మొదటి జాబితాను ప్రకటించేందుకు కమలం అగ్రనేతలు రెడీ అయ్యారు. అయితే ఇదివరకు ఈటల రాజేందర్ ప్రకటించినట్లుగా ఆయన్ను గజ్వేల్ నుంచి బరిలోకి దించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో ఈటల భార్య జమునను బరిలో నిలిపి గజ్వేల్ లో ఈటలను పోటీకి దించాలని ఎత్తుగడ వేస్తునున్నట్లు సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థులు వీరే అని కొన్ని పేర్లతో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అందులో గజ్వేల్ నుంచి ఈటల పోటీ…
పెండింగ్ లోనున్న హామీలను ఎన్నికల ముంగిట నెరవేర్చాలని భావిస్తోన్న బీఆర్ఎస్ సర్కార్ నిధుల సమస్యను అధిగమించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం లిక్కర్ బిజినెస్ నుంచి ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నవంబర్ తో ముగిసే మద్యం షాపుల గడువుకు ఆగస్ట్ లోనే టెండర్లు పిలుస్తున్నారు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్లో పాల్గొనే వారు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. తెలంగాణలోని రెండు వేలకు పైగా మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానించారు. గతేడాదికి సంబంధించిన వైన్ షాపుల లైసెన్స్ గడువు నవంబర్ వరకు ఉంది. డిసెంబర్ నుంచి కొత్త లైసెన్స్ షాపులు చెలామణిలోకి రానున్నాయి. నిజానికి వచ్చే ఏడాదికి సంబందించిన ఎక్సైజ్ లైసెన్స్ షాపుల కోసం అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి, నవంబర్ లో లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని హామీలను నెరవేర్చేందుకు నిధుల సమస్య ప్రభుత్వానికి సంకటంగా మారడంతో.. దీని…
కేసీఆర్ తన మార్క్ పాలన ఏంటో మరోసారి చూపిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేసీఆర్ ఆదేశించారు. నాలుగున్నరేళ్ళుగా పెండింగ్లో ఉంచిన రైతు రుణమాఫీని నేటి నుంచి ప్రారంభించాలన్నారు. సెప్టెంబర్ 2వ వారం వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. గతంలోనూ కేసీఆర్ ఇలాగే చెప్పి వెనక్కి తగ్గారు. ఇప్పుడు కూడా రైతు రుణమాఫీని పూర్తి చేస్తారా..? లేక కొంతమందికి రుణమాఫీ చేసి చేత్తులేత్తెస్తారా..?అనే అనుమానాలు కల్గుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రుణమాఫీ చేసేందుకు కావాల్సిన రూ. 19వేల కోట్ల నిధులను నెల రోజుల వ్యవధిలో ఎలా సమీకరించుకుంటారు..? అనే అంశం ఈ అనుమానాలను రెట్టింపు చేస్తోంది. కేసీఆర్ కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పై ఏయే వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారోనని ఆరా తీశారు. పార్టీకి ఉన్న మైనస్ లను ప్లస్ చేసుకోవాలనుకున్నారు. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత…
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ పై బీసీ లీడర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ , అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ లు బీసీ కోటాలో టికెట్ ఆశిస్తున్నారు. గాలి అనిల్ కుమార్ సొంత నియోజకవర్గం నర్సాపూర్ కావడంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి కూడా పోటీకి గాలి అనిల్ ఆసక్తి కనబరుస్తున్నారు. పటాన్ చెరు టికెట్ దక్కని పక్షంలో నర్సాపూర్ బరిలో నిలిచేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ గా కొనసాగుతోన్న ఆయన గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి గణనీయమైన ఓట్లను సాధించారు. నర్సాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో గాలి…
మణిపూర్ ఘటన యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది. ఇద్దరు ఆదివాసీ స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తు, వారిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఓ తెగకు చెందిన కొంతమంది యువకులు తీవ్రంగా అవమానించారు. అనంతరం ఆ ఇద్దరిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగిన రెండు నెలల తరువాత వీడియోస్ బయటకు వచ్చాయి. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను శిక్షించాలని డిమాండ్లు పెద్దఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి మణిపూర్ ఘటనపై వివాదాస్పద పోస్ట్ చేసింది. మణిపూర్ ఘటనలో అసలు నిజం తెలిసింది. ఆడవాళ్లే బట్టలు విప్పి పోలీసులపై దాడి చేశారని, ఆ ఘటన చూసి అసహ్యం వేసిందిని ఫేస్ బుక్ లో కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి. జాతీయ జెండాను తగలబెట్టిన ఘటనను ఖండిస్తూ పెట్టిన పోస్ట్ కు…అబ్బో పోడుకుచుకొని వచ్చావ్ అక్క. మొన్న మణిపూర్ లో సాటి ఆడ మనిషిని బట్టలు లేకుండా…