Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి చాలా మందిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. గతానికి, ప్రస్తుతానికి మధ్య ఆయనలో స్పష్టమైన పరిణితి కనిపిస్తోంది. సమస్యలపై స్పందించే విధానం కానీ, ప్రజలతో కలిసిపోతున్న తీరు కానీ అందర్నీ ఆలోచింపజేస్తోంది. నరేంద్ర మోడీ వ్యతిరేకులకు రాహుల్ గాంధీ ఓ టార్చ్ బేరర్ లా కనిపిస్తున్నారు. గతేడాది భారత్ జోడో యాత్ర చేపట్టి 4000కి. మీ సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టిన రాహుల్.. అప్పటి నుంచి ప్రజలతో మమేకం అవుతోన్న తీరు అందర్నీ ఆకర్షిస్తోంది. తాను ప్రధానమంత్రి అభ్యర్థి, గాంధీ, నెహ్రూల వంశీకుడి అనే గర్వం రాహుల్ లో కించిత్ కూడా కనిపించడం లేదు. సాధారణ పౌరుడిలా జనంతో కలిసిపోతున్నారు. అందరిలో ఒకడిగా ముందుకు సాగుతున్నారు. సమస్యలు చెప్పే వారి సమస్యలను సావధానంగా వింటున్నాడు. పలు అంశాలపై ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. జర్నలిస్టులు రాహుల్ గాంధీకి తికమక పెట్టె ప్రశ్నలను సంధించినా పూర్తి రాజకీయ పరిణితితో కూడిన…
పెండింగ్ లో ఉంచిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈమేరకు అభ్యర్థులకు కేటీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని అభ్యర్థులకు కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. గత నెల 21న 119 అసెంబ్లీ స్థానాల్లో 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు సీఎం కేసీఆర్. నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్ పెట్టారు. జనగామ, నాంపల్లి, నర్సాపూర్ , గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. తాజాగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి వారిని క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని సూచించినట్లు తెలిస్తోంది. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ నుంచి మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, గోషామహల్ నుంచి నంద కిషోర్ వ్యాస్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. నాంపల్లి అభ్యర్థిత్వం విషయంలో కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎంఐఏంతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని స్పష్టం చేసిన కేసీఆర్..…
తెలంగాణలో మహిళాఓటర్లు అధికంగా ఉండటంతో వారిని ఆకర్షించేలా మహాలక్ష్మీ పథకం ప్రకటించిన కాంగ్రెస్ కు కౌంటర్ గా హామీలను ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే తమ దగ్గర మెరికల్లాంటి పథకాలు ఉన్నాయని కేసీఆర్ , హరీష్ రావులు చెప్తుండటంతో ఆ పథకాలు ఏవై ఉంటాయనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటికే రైతు ఫించన్ అమలు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోన్న బీఆర్ఎస్.. మహిళల ఓట్లు గంపగుత్తగా పొందేలా ఓ హామీని ఇవ్వాలని మ్యానిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు ఇంకా వైరల్ ఫీవర్ తగ్గలేదు. ఆయన కోలుకున్న వెంటనే కేబినెట్ లో బీఆర్ఎస్ ఎన్నికల హామీలపై చర్చించి వాటిని ప్రకటించనున్నారు. అందులో మహిళా బంధు అనే పథకం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ మహాలక్ష్మీ అనే పథకం ప్రకటించింది. ఈ పథకం ద్వారా మహిళలకు గ్యాస్ సిలిండర్ ను రూ. 500లకే ఇవ్వడంతోపాటు ప్రతి నెల రూ. 2500లు ఇస్తామని స్పష్టం చేసింది.…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారు అయింది. అక్టోబర్ మొదటి వారంలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. శుక్రవారం బెంగళూర్ వెళ్లి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి.. తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ పై హామీ కోరినట్లుగా తెలిసింది. అయితే.. తుంగతుర్తి టికెట్ మోత్కుపల్లికి ఇస్తే ఇదే స్థానం నుంచి మరోసారి పోటీ చేసి ఈసారి విజయం సాధించాలని ప్లాన్ చేసుకుంటున్న అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటన్నది బిగ్ డిబేట్ గా మారింది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన అద్దంకి దయాకర్ స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ పై ఓటమి పాలయ్యారు. ఈసారి మాత్రం గెలుపు తనదేనని ధీమాతో అద్దంకి దయాకర్ ఉన్నారు. కానీ దయాకర్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండడనే అపవాదు ఉంది.…
అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికలను సన్నాహాలను ముందుగానే ప్రారంభించినట్లు కనిపించింది. కానీ, అభ్యర్థుల ప్రకటన తరువాత ఆయన అనుకున్నంత స్థాయిలో ఎన్నికల ముందు నిర్వహించే కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నారు. ప్రతి సారి ఎన్నికల ముందు కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఆయన చండీయాగం చేయలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి సీఎం అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం మొదటిసారి చండీయాగం నిర్వహించారు. మూడు రోజులపాటు కొడంగల్ లోని తన నివాసంలో చండీయాగం నిర్వహించగా చివరి రోజు కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా లాంటి కేసీఆర్ పీడ విరగడ కావాలనే చండీయాగం నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజాస్వామ్య పాలన రావాలని ఆకాంక్షించిన రేవంత్.. అది కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు. రేవంత్ రెడ్డి గతంలో యాగాలు చేయలేదు.…
బీఆర్ఎస్ ను ఆ పార్టీ సీనియర్ నేతలు వరుసగా నేతలు వీడుతునే ఉన్నారు. ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశంలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగా… తాజాగా మాజీమంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా బీఆర్ఎస్ ను వీడబోతున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్న మోత్కుపల్లి ఇటీవల కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడు ప్రగతి భవన్ కు వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకుంటాడని విమర్శించారు. దీంతో ఆయన బీఆర్ఎస్ ను వీడటం ఖాయమని తెలిసింది. ఈ క్రమంలోనే మోత్కుపల్లి బెంగళూరు కేంద్రంగా రాజకీయ మంతనాలు కొనసాగిస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో శుక్రవారం భేటీ అయ్యారు. చాలా సేపు ఈ భేటీ జరగడంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అక్టోబర్ మొదటి వారంలో మోత్కుపల్లి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఆయన తుంగతుర్తి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు.…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్ గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. రాహుల్ కు దమ్ముంటే హైదరాబాద్ లో ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసరడంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అసద్ కు ఈసారి ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పాలని డిసైడ్ అయింది. ఇందుకోసం ప్రణాళికలు ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కీలక నేతలపై కాంగ్రెస్ కన్నేసింది. బీఆర్ఎస్ , బీజేపీ, ఎంఐఎంలోని అసంతృప్త నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే కొంతమంది నేతలను చేర్చుకున్న హస్తం పార్టీ.. తాజాగా ఓల్డ్ సిటీలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త మస్కతి డెయిరీ చైర్మన్ అలీ బిన్ ఇబ్రహీంను సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా పాతబస్తీలో పలుకుబడి ఉన్న మహ్మద్ అయూబ్ ఖాన్ అలియాస్ అయూబ్ తన కుమారుడు…
కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా శ్రమిస్తోన్న టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కుట్రలు మొదలు పెట్టింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కన్వీనర్ కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్ లు రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రత్యేక వీడియోలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ను దెబ్బకొడితే కాంగ్రెస్ ను దాదాపు అధఃపాతాళానికి తోక్కేసినట్లేనని ప్లాన్ తో ఈ వీడియోలను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితోపాటు క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న, మన తొలివెలుగు రఘు , కాళోజీ టీవీపైన భయంకరమైన కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రేవంత్ తోపాటు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా 3, 500 నకిలీ వీడియోలను ఇప్పటికే తయారు చేసినట్లుగా సమాచారం. మరో వెయ్యి వీడియోలు తీన్మార్ మల్లన్న, మన తొలివెలుగు రఘు, కాళోజి టీవీ నిర్వాహకులపై రూపొందించినట్లు తెలుస్తోంది. గతంలో సోనియా గాంధీని రేవంత్ విమర్శించిన వీడియోలను తాజాగా తెరపైకి…
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఇప్పటికే అరెస్ట్ చేశారు. త్వరలో నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. టీడీపీకి రెండు కళ్ళుగా ఉన్న తండ్రి, కొడుకులు అరెస్ట్ అయితే టీడీపీ భవితవ్యం ఏం కావాలన్న చర్చ నడుమ నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలు టీడీపీ క్యాడర్ కు ఆశలు రేకెత్తిస్తున్నారు. కారణం..ఏపీలో ఎమర్జెన్సీ తరహ నిర్బంధాలు అమలులో ఉన్న వాటిని లెక్క చేయకుండా నిరసనలు చేస్తున్నారు. టీడీపీ చేపట్టాల్సిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వారిద్దరూ అందులో భాగస్వామ్యం అవుతున్నారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా అడ్డుపడినా, రాజకీయ కక్షతో నారా లోకేష్ ను అరెస్ట్ చేసినా పార్టీకి నాయకత్వ సమస్య రాదనీ అత్తాకోడళ్ళు నిరూపిస్తున్నారు. మాటలతోనే కాకుండా చేతలు కూడా ప్రారంభించారు. రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ తీరును ఎండగడుతున్నారు. రాజకీయ అనుభవం లేకున్నా ఎలాంటి తడబాటు లేకుండా రాజకీయ నాయకురాళ్ళ వలె ప్రసంగించారు.…
త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికారంలోకి రావాలంటే ఏం చేయాలన్న అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. పార్టీ బలం, బలహీనతలతోపాటు విజయావకాశాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టిసారిచింది. ఆ దిశగా లోతుగా కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలా 60 వేల మందిని నిత్యం జనాల్లో ఉండేలా ఎన్నికల దళాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ లో 60మంది ఓటర్లకు ఓ ఇంచార్జ్ ను చొప్పున నియమించి అతని సపోర్టివ్ గా మరో పదిమందిని ఎంపిక చేయనున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ బూత్ ఇంచార్జ్ ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సమాంతరంగా బూత్ లెవల్ ఏజెంట్ ( బీఎల్ఎ ) గా మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించనున్నారు. పది పోలింగ్ బూత్ లను కలిపి…