Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
బీజేపీ తెలంగాణపై ఆశలు వదిలేసుకున్నట్లే ఉంది. బీఆర్ఎస్ తో మునుపటిలా తలపడకుండా దిక్కులు చూస్తోంది. ఆర్టీసీ బిల్లు విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా రాజకీయాన్ని మార్చే అవకాశం కమలనాథులకు వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని నేలపాలు చేసుకున్నారు. ఆర్టీసీ బిల్లు విషయంలో తనకు అభ్యంతరాలు ఉన్నాయని గవర్నర్ ఆ బిల్లును తిప్పి పంపారు. ఆ సమయంలో గవర్నర్ నిర్ణయాన్ని సమర్ధించి పొలిటికల్ అటెన్షన్ ను గ్రాఫ్ చేసుకోవాల్సిన కమలం నేతలు కిర్రుమనలేదు. అందివచ్చిన అవకాశాన్ని అందుకోలేక ఆత్మరక్షణలో పడిపోయారు. బిల్లుపై గవర్నర్ ఎందుకు అభ్యంతరాలు చెప్పారో తెలిసాక కూడా బీజేపీ నేతలు గ్రౌండ్ లోకి దిగలేదు. బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయలేదు. గవర్నర్ ఆర్టీసీ బిల్లును ఆమోదిస్తారని మాత్రమే చెప్పుకున్నారు తప్పితే గవర్నర్ అభ్యంతరాలను ముందు పెట్టి కార్మికుల మెప్పు పొందే ప్రయత్నం చేయలేదు. దీంతో బీఆర్ఎస్ పై యుద్దంలో బీజేపీ కాడి వదిలేసిందా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి…
తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని రూపొందిస్తున్నారా..? 2018ముందస్తు ఎన్నికల సమయంలో చంద్రబాబును బూచిగా చూపి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే అస్త్రాన్ని ఎంచుకున్నారా..? అంటే అవుననే తెలుస్తోంది. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ , కేటీఆర్ అండ్ హరీష్ రావులు కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ 24గంటల విద్యుత్ కు అడ్డంకి అని, చెక్ డ్యాంల నిర్మాణాలకు వ్యతిరేకమని, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనీ అనుకోలేదని చెప్పేందుకు ముగ్గురు ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే.. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ భారీగా పెరిగింది. ఇదే ఊపు కాంగ్రెస్ లో ఉంటే తమ అధికారానికి ఎసరు వస్తుందని భావించిన ప్రభుత్వ పెద్దలు రివర్స్ ఎటాకింగ్ స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలకు శత్రువులా చూపేలా పదునైన వాగ్భాణాలను సంధించారు. తాజాగా అసెంబ్లీ…
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు తెలంగాణ సీఎం కేసీఆర్ ఓట్ల వర్షం కురిసేలా పథకాల రూపకల్పన చేస్తారు. ఓటర్ల మనస్సు దోచే పథకాలను ప్రకటించి, ఫలితం రాబడుతారు. అది ఉప ఎన్నిక అయినా, సాధారణ ఎన్నిక అయినా కేసీఆర్ పథకాలతో మ్యాజిక్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా పరోక్షంగా ప్రకటించేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాల జాతర ఉండబోతుందని స్పష్టత ఇచ్చారు కేసీఆర్ 2018లో ముందస్తుకు వెళ్లే సమయంలో రైతు బంధును ప్రకటించి గంపగుత్తగా రైతుల ఓట్లను ఖాతాలో వేసుకున్నారు. అప్పటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కానీ ఇప్పుడు మెల్ల, మెల్లగా అమలు చేస్తూ వ్యతిరేకతను తుడిచేసుకుంటున్నారు. అంతేకాదు కొత్తగా, సరికొత్తగా హామీలను ఇవ్వాలనే భావనలో కేసీఆర్ ఉన్నారు. ఇందుకోసం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పై మునుపటి కంటే ఎక్కువ వ్యతిరేకత ఉందని గ్రహించిన కేసీఆర్..కొత్త పథకాల ప్రకటన లేకపోతే బీఆర్ఎస్ హ్యాట్రిక్…
పాటను సాయుధంగా మలిచి ప్రభుత్వ విధానాలపై ఎక్కుపెట్టిన విప్లవ గాయకుడు గద్దర్ తన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని కేసీఆర్ పాలనపై అసంతృప్తి వెళ్ళగక్కిన గద్దర్… ప్రజా ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కానీ ఇంతలోనే గద్దర్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ మరణించడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ కు పోటీ చేయాలనుకున్నారు. త్వరలోనే వరంగల్ లో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాలని భావించారు. అవసరమైతే కేసీఆర్ పై పోటీ చేస్తానని కూడా గద్దర్ ప్రకటించారు. ఇటీవల ఆయన పార్లమెంట్ కు వెళ్లాలని మనస్సు మార్చుకున్నారు. కొన్నాళ్ళుగా కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగుతున్న గద్దర్.. రాహుల్…
వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసిన సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా..? రెవెన్యూ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు రావాలని అభిప్రాయపడుతోన్న కేసీఆర్ ఆర్డీవో వ్యవస్థను రద్దు చేయబోతున్నారా..? అంటే అవుననే టాక్ నడుస్తోంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక ఆర్డీవోల ప్రాధాన్యత తగ్గింది. ఆ తరువాత వీఆర్వో , వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ఆర్డీవో అధికారాలను మరింత కుదించింది. ఇప్పుడు ఏకంగా ఆర్డీవో వ్యవస్థనే రద్దు చేయాలని కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్డీవో వ్యవస్థను రద్దు చేస్తే ఆ శాఖ అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు..? వారి సేవలు ఎలా ఉపయోగించుకుంటారు..? అనేది ఉన్నాతాదికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే మండలిలో మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలు ఆర్డీవో వ్యవస్థను రద్దు చేస్తారనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి. తెలంగాణలోని ఏరియా ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్ లు ఉన్నారు. ఇకపై వీళ్ళను పర్యవేక్షించే బాధ్యతలను ఆర్డీవోలకు…
ఎన్నికలకు సమాయత్తం అవుతోన్న తెలంగాణ సర్కార్ పెండింగ్ హామీల అమలుకు నిధుల సమస్య రాకుండా చూసుకుంటుంది. ఇందుకోసం హైదారాబాద్ లోని విలువైన భూములను వేలం పాట ద్వారా అమ్ముతున్నది. దాంతో సర్కార్ ఖాజనాకు భారీగా నిధులు సమకూరుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా భూములను అమ్మోద్దంటూ ప్లకార్డుతో కేటీఆర్ నిరసన తెలిపిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫ్లకార్డుల్లో.. “ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి – టీఆర్ఎస్” అని రాసి ఉంది. ఆ ఫ్లకార్డును రెండు చేతులతో పైకి ఎత్తిపట్టుకుని కేటీఆర్ ప్రదర్శిస్తున్నారు. ఈ ఫొటోనే సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నాడు సమైక్య పాలకులు భూములను అమ్మితే రియల్ ఎస్టేట్ వ్యాపారమని వ్యాఖ్యానించిన కేటీఆర్..ఇప్పుడు అదే చేస్తోన్న తన తండ్రిని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావా అని కేసీఆర్ ను నిలదీయగలడా..? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు…
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నటి, సోషల్ యాక్టివిస్ట్ రేణు దేశాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదేదో రాజకీయం చేసేందుకు కాదు. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె కోర్టు మెట్లను ఎక్కారు. హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పార్క్ తోపాటు పక్షిశాల ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనినే రేణు దేశాయ్ వ్యతిరేకిస్తున్నారు. ఆక్వా మెరైన్ పార్క్ కోసం కృతిమ సరస్సును ఏర్పాటు చేయడం పర్యావరణానికి మంచిది కాదని..వెంటనే పనులను నిలిపి వేయాలంటూ కోరారు. డైరెక్టర్ శశికిరణ్ తిక్కా,నటి శ్రీదివ్య,హీరోయిన్ సదా తోపాటు మరికొంతమందితో కలిసి రేణు దేశాయ్ జూన్ 27న కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం…ఇలాంటి నిర్మాణాలు సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో జరిగాయి.…
గవర్నర్ ఆమోదం కోసం కేబినెట్ పంపిన ఆర్టీసీ విలీనం బిల్లు పరిశీలన అనంతరం తమిళిసై సౌందరరాజన్ ఆ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపారు. అందులో ఐదు అంశాలపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను ఇవ్వాలని అందులో ప్రస్తావించారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు బిల్లులో ఎందుకు లేవు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా?, ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు..?విభజన చట్టం ప్రకారం ఆర్టీసీని మార్చడంపై సమగ్రమైన సమాచారం ఈ బిల్లులో ఎందుకు లేదు..? అని ఈ అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు గవర్నర్. తను కోరిన వివరణ ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఉంటె వెంటనే బిల్లును ఆమోదిస్తానని…ప్రభుత్వం తొందగారా వివరణ ఇవ్వాలని తెలిపారు గవర్నర్. మరోవైపు..గవర్నర్ కు వివరణ ఇచ్చే అంశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వీలైనంత తొందరగా ఆమె అభ్యంతరాలపై సంతృప్తికరమైన వివరణ ఇస్తే…
బీఆర్ఎస్ పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తోన్న కేటీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెలలోనే వస్తుందని పార్టీ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. అక్టోబర్ లోనే ఎన్నికలు ఉంటాయని మరీ,మరీ చెబుతున్నారు. నిర్దిష్టమైన సమాచారం ఉండటంతోనే ఎన్నికల అలర్ట్ ను పార్టీ నేతలకు కేటీఆర్ ఇస్తున్నారా..? అనేది క్లారిటీ లేదు కానీ, ఈ విషయాన్ని నొక్కి మరీ చెబుతుండటం చర్చనీయాంశం అవుతోంది. కేటీఆర్ దాదాపు కొంతమంది సిట్టింగ్ లకు టికెట్ మీకేనని అభయం ఇచ్చారు. వారితో విడివిడిగా మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచిస్తున్నారు. టికెట్ ఇవ్వొద్దని భావించిన నేతలతో కేటీఆర్ దూరం, దూరంగానే ఉంటున్నారు. దాంతో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల ఎంపిక పూర్తైనట్లు స్పష్టత వస్తోంది. కాకపోతే రెండు నెలల ముందుగానే ఎన్నికలు ఉంటాయని పార్టీ నేతలను కేటీఆర్ అలర్ట్ చేయడమే ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీకి 2018 డిసెంబర్ లో ఎన్నికలు జరగడంతో 2024 జనవరి వరకు తెలంగాణ అసెంబ్లీకి…
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆర్టీసీ బిల్లు మనీ బిల్లు కావడంతో బిల్లు డ్రాఫ్ట్ ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది తెలంగాణ కేబినెట్. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం భావించింది. గవర్నర్ ఎలాంటి కొర్రీలు పెట్టారని అంచనా వేసి అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులే పెట్టుకున్నారు. గవర్నర్ మాత్రం బిల్లును ఆమోదించలేదు. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే తనకు సమయం పడుతుందని చెప్పకనే చెప్పారు. తొందరగా ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి ఆర్టీసీ ఉద్యోగుల మన్ననలు పొందాలని బీఆర్ఎస్ భావిస్తే గవర్నర్ బ్రేకులు వేశారు. మరి అసెంబ్లీ సమావేశాలను గడువును పెంచుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీ విలీనం అనేది చిక్కుముళ్ళతో ఉంటుంది. ఆర్టీసీలో కేంద్రానికి కూడా వాటా ఉంటుంది. అందుకే ఈ విషయంలో కొర్రీలు పెట్టేందుకు గవర్నర్ కు ఛాన్స్…