Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం ఖాయంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చర్చలు సఫలమయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే..ఏపీలో రాజకీయం చేసేందుకు అవకాశమిస్తాం. తెలంగాణలో మాత్రం కుదరదని షర్మిలకు గతంలో ఢిల్లీ పెద్దలు తేల్చి చెప్పడంతో వైఎస్సార్టీపీ విలీనం ప్రతిపాదన వీగిపోయింది. మళ్ళీ ఇంతలోనే విలీనం ఖరారు అయినట్లు తేలడంతో ఏం జరిగిందనే చర్చ జోరుగా కొనసాగుతోంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తానని షర్మిల చెప్పడంతోపాటు మూడు సీట్లు తమకు ఇవ్వాలని బెట్టు చేసినట్లు సమాచారం. అందుకు హైకమాండ్ పెద్దలు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు నాయకత్వ సమస్య లేదు కాని, ఏపీలో కాంగ్రెస్ కు నాయకత్వ సమస్య ఎదురు అవుతోంది. దాంతో షర్మిల అక్కడ ప్రచారం చేస్తానని అంగీకరించడంతో ఆమె కోరినట్లుగా మూడు సీట్లు ఇస్తామని ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకే చెప్పిందనే టాక్ నడుస్తోంది. షర్మిల కోరిన ఆ మూడు సీట్లు…
రాజు నీతిమంతుడైతే ఆయన పరివారం కూడా నీతిమంతంగా ఉంటుంది. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజు రాక్షసుడు అయితే ఆయన పరివారం జనాన్ని పీక్కుతినే రాబందులుగా మారి… మారణకాండ సృష్టిస్తారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు అచ్చుగుద్దినట్లు అలానే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రాన్ని హత్యా రాజకీయాలకు కేరాఫ్ గా మార్చేశారు. ప్రశ్నించేవాళ్లను బెదిరించడం… ఎదురుతిరిగితే వేసేయడం పరిపాటిగా మారింది. అధికారం కోసం సొంత బాబాయ్ నే కడతేర్చిన చరిత్ర వైసీపీ అధినాయకుడిది అయితే… నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం, అవసరమైతే అడ్డు తొలగించడం ఆయన పరివారంకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్న డ్రైవర్ సుబ్రమణ్యం కేసును సీబీఐకి అప్పగించాలని డ్రైవర్ తల్లిదండ్రులు కోర్టులో పిటీషన్ వేయడం చూస్తే ఇది మరో వివేకా హత్య కేసులా మారుతోందని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా విచారణ జరపడం లేదని ఆయన కుమార్తే సునీత సీబీఐతో…
నిరుపేద విద్యార్ధులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలబడింది. బుధవారం వెయ్యి మంది విద్యార్ధులకు విద్యా సంవత్సరం మొత్తం ఉపయోగపడేలా బస్సు పాసులను కాకినాడలోని సంస్థ కార్యాలయంలో అందించింది. ఫౌండేషన్ తరఫున సత్తిబాబు విద్యార్ధులకు బస్సు పాసులను పంపిణి చేశారు. విద్యార్థులకు బస్సు పాసుల పంపిణీ అనంతరం సత్తిబాబు మాట్లాడారు. పేద విద్యార్థులు బస్సు పాసులు లేక కాలిబాటన నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు చూసి సానా సతీష్ బాబు ఆవేదనకు గురయ్యారని అందుకే విద్యార్థులకు ఉచిత బస్సు పాసుల పంపిణీకి శ్రీకారం చుట్టారని సత్తిబాబు తెలిపారు. ఆర్ధిక పరమైన సమస్యలు విద్యార్థుల చదువుకు అవరోధం కాకూడదనే లక్ష్యంతో బస్సు పాసులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పేద కుటుంబాల తలరాతలు మారాలంటే చదువుతోనే సాధ్యమని, ఆ చదువుకు ఆర్థిక సమస్యలు భారం కావోద్దని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్ధులకు ఈ బస్సు పాసులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. ఈ…
ప్రజా యుద్ద నౌక గద్దర్ మరణంతో ఆయన కుమారుడు సూర్యంకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందా..? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న గద్దర్ కన్నుమూయడంతో…ఆయన కుమారుడికి టికెట్ ఇస్తే అన్ని వర్గాల మద్దతు ఉంటుందని హస్తం పార్టీ అనుకుంటోందా..? సూర్యంకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే చట్టసభలకు వెళ్ళాలనుకున్న గద్దర్ ఆశను కుమారుడి గెలుపుతో సాకారం చేసినట్లు అవుతుందనే ఆలోచనతో ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. రెండేళ్లుగా కాంగ్రెస్ తో దగ్గరగా ఉంటూ వస్తున్నారు గద్దర్. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరు అవుతున్నారు. రేవంత్ తో సన్నిహితంగా కొనసాగుతూనే…భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో, ఖమ్మంలో నిర్వహించిన సభలో రాహుల్ తో కనిపించారు గద్దర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే గద్దర్ ప్రకటించారు కూడా. కానీ దురదృష్టవశాత్తూ గుండె సంబంధిత సమస్యతో మరణించారు. దాంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గద్దర్ కుమారిడికి టికెట్ ఇవ్వాలని…
కాంగ్రెస్ షరతులకు వైఎస్ షర్మిల ఎట్టకేలకు అంగీకరించడంతో వైఎస్సార్టీపీ విలీన ప్రక్రియలో కదలిక పునః ప్రారంభమైంది. తెలంగాణ విడిచి ఏపీలో రాజకీయాలు చేసేందుకు మొదట నిరాకరించిన షర్మిల తరువాత కాస్త మెత్తబడింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంతోపాటు ఏపీలో కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తానని షర్మిల అంగీకరించింది. దీంతో షర్మిలను మెల్లగా ఏపీకి పరిమితం చేయడం ఎలాగో తెలిసిన కాంగ్రెస్ , వైఎస్సార్ టీపీ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలైలోనే వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియ పూర్తి అవుతుందని అనుకున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె అవసరం తెలంగాణకు లేదని ఏపీలో రాజకీయం చేస్తామంటే తమకు ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పేశారు. ఇదే విషయాన్ని హైకమాండ్ పెద్దలు షర్మిలకు చెప్పగా ఏపీలో రాజకీయం చేయడంపై షర్మిల ఆలోచనలో పడిపోయారు. దాంతో విలీనం ప్రక్రియ నిలిచిపోయింది. షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో చివరికి షర్మిలనే…
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదా..? అంటే అవుననే అంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ . ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తారనే విషయంపై ప్రశ్నించారు. అవును…కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారు. గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదని పునర్దాటించారు. మరి.. మీరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించగా..నా భవిష్యత్ ను కేసీఆరే డిసైడ్ చేస్తారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పూర్వీకుల గ్రామం కొనాపూరేనని, దాంతో మంత్రి కేటీఆర్ తన నానమ్మ ఊర్లో ఐదు కోట్లతో అభివృద్ధి పనులతోపాటు రెండున్నర కోట్ల రూపాయలతో స్కూల్ కట్టించారని గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి…
మరోసారి అధికారంలోకి వస్తామనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన మేకపోతు గాంభీర్యమేనా..? సిట్టింగ్ లకే టికెట్ ఇవ్వాలని భావించిన గులాబీ బాస్ తాజా సర్వే నివేదికలతో ఆలోచనలో పడిపోయారా..? ఓటమి కత్తి అంచనా 50మంది ఎమ్మెల్యేలు వేలాడుతున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఈసారి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్…వరుస సర్వేలు చేయిస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సర్వే నివేదికలను పరిశీలిస్తూ ఎమ్మెల్యేలను కొంతకాలంగా అలర్ట్ చేస్తున్నారు. ఏయే ఎమ్మెల్యే పనితీరు బాగోలేదో గుర్తించి గైడ్ చేస్తూ వ్యతిరేకత లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక కోసం ఫీల్డ్ టీమ్ తో చేయించిన సర్వేలో 49మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తేలినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సర్వే నివేదికను చూసి కేసీఆరే ఆశ్చర్యపోయినట్లుగా ప్రగతి భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం. 49మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో.. ఆ స్థానాల్లో ఎవరిని అభ్యర్థిగా…
సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుకు ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లందంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. 15రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. మరో నాలుగు నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు వనమా ఎన్నికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ మరో నాలుగు వారాలకు వాయిదా వేయడంతో వనమా ప్రత్యర్ధి జలగం వెంకట్రావ్ నిరాశ చెందారు. ఆయన పదవి కోల్పోతే ఈ నాలుగు నెలలైనా పదవిలో కొనసాగవచ్చునని జలగం అనుకున్నారు కానీ ఆయనకు ఊరట లభించలేదు. మరో నాలుగు నెలలో ఎన్నికలు ఉండటంతో వనమా సుప్రీంకోర్టుకు వెళ్ళరని అంత అనుకున్నారు. కానీ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. సిట్టింగ్ లో చాలామందికి…
చంద్రయాన్ -3 గురించి ఇస్రో ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. చంద్రునిపైకి పంపిన ఉపగ్రహం చంద్రుడికి సంబంధించి తీసిన వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో చంద్రుడు బూడిద కలర్ లో కనిపిస్తున్నాడు. చంద్రుని రెండో కక్ష్యలోకి ప్రవేశించే ముందు ఉపగ్రహం ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది. చంద్రుడిపై పరిశోధన చేసేందుకు ఇస్రో జూలై 14న చంద్రయాన్-3 పేరుతో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఆగస్ట్ 1న చంద్రుని కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం…ఆగస్ట్ ఆరున చంద్రుడికి సంబందించిన వీడియోను తీసింది. ఈ వీడియోను ఆదివారం ఇస్రో విడుదల చేసింది. ఈ ప్రయోగం ఫలితం ఆగస్ట్ 23న తేలనుంది. ఆ రోజున చంద్రుడిపై ఉపగ్రహం అడుగు పెట్టనుంది. ఇప్పటివరకు విజయవంతంగా కొనసాగుతూ వచ్చిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోనని ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. గతంలో చంద్రయాన్ – 2 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టగా…అది చంద్రుడిపై దిగే క్రమంలో ఫెయిల్ అయింది. కానీ ఈసారి అలాంటిది…
తనపై విధించిన సస్పెన్షన్ బీజేపీ ఎత్తివేయకపోవడంతో పొలిటికల్ జర్నీపై ఎమ్మెల్యే రాజాసింగ్ డైలమాలో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ నుంచి మాత్రమే చేస్తానని.. పార్టీ టికెట్ నిరాకరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయినా ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో గోషామహల్ నుంచి ఆయన పోటీపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో రాజాసింగ్ మాట్లాడుతూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత ఈ సభలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉండరో తెలియదని.. తానైతే ఉండనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడారు. ” నేను అసెంబ్లీకి రావొద్దని బయటవాళ్ళు, సొంత వాళ్లు కోరుకుంటున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే పార్టీలోనే కొంతమంది రాజాసింగ్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారని చెప్పకనే చెప్పారు. వాళ్ళు ఎవరనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే , తాను ఉన్నా లేకపోయినా…