Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
కాలం కలిసిరాకపోతే అరటిపండు తిన్న పన్ను విరుగుతుందని అంటుంటారు పెద్దలు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే పరిస్థితిలో ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో చెలిమి కారణంగా ఏడేండ్లుగా తెలంగాణను నిలువు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం బీజేపీ అధికార దాహానికి గద్దకు చిక్కిన కోడిపిల్లాలా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ను బలహీనం చేయాలనే వ్యూహంలో భాగంగా పరోక్షంగా బీజేపీకి బలం పెంచే ప్రయత్నం చేసిన టీఆరెస్ అధినేత రూపొందించిన వ్యూహాలే తన రాజకీయ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారాయి. అసలు తెలంగాణలో బీజేపీ ఉందా ..? లేదా అనే స్థాయిలోనున్న పార్టీకి వలసలు పెంచి ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి ఈ రాష్ట్రంపై ఆశలు రేగేలా చేసింది కేసీఆర్ అనేది అందరికీ తెలిసిన విషయం. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా తన నిర్ణయాలే పార్టీ కొంపముంచేలా మారాయి. నిత్యావసర ధరల పెంపు, జీఎస్టీ, కార్పోరేట్ శక్తుల…
కాంగ్రెస్ పై అభిమానం చంపుకోలేకపోతున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన కావాలనే కాంగ్రెస్ పై సానుభూతి వ్యాఖ్యలు చేస్తున్నారా..? అనే సందేహం అందరిలో కల్గుతుంది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ…ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కళను సాకారం చేసిన కాంగ్రెస్ కు అధికారం అప్పగించలేదని బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈటల హస్తం పార్టీపై సానుభూతి వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయంశంగా మారింది. అసలే బీజేపీలో వర్గపోరుతో సతమతం అవుతున్నారు ఈటల రాజేందర్. బండి సంజయ్ కూడా వైఖరి ఆయనకు మింగుడు పడక సాధారణ కార్యకర్త వలె నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సిన సిట్యుయేషన్ ఏర్పడింది. పైగా..తన భావజాలానికి పూర్తి వ్యతిరేకమైన బీజేపీలో చేరడం కొన్ని అనివార్య కారణాల వలెనే జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. ఈ క్రమంలోనే ఈటలపై కాషాయ క్యాంప్ లో ఆర్ఎస్ఎస్ వాదులు ఆయనపై ఓ కన్నేసి ఉంచారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఆయనను…
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏదీ కలిసి రావడం లేదు. తన నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేయాలని యోచించిన కేసీఆర్ కు అన్ని చోట్ల ఆశాభంగమే ఎదురు అవుతుండటం టీఆరెస్ పార్టీ నేతలను సైతం కలవరపరుస్తోంది. దసరా తరువాత జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన ఉంటుందని.. ఆ తరువాత ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేస్తారని టీఆరెస్ నేతలే చెప్పారు. కాని , కేసీఆర్ రాజకీయాలను ఓ కంట గమనిస్తోన్న ప్రాంతీయ పార్టీల అధినేతలు టీఆరెస్ అధినేతతో చెలిమిని అసలే ఇష్టపడటంలేదు. అందితే జుట్టు అందక పొతే కాళ్ళు అనే రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా నిలిచే కేసీఆర్ తో ఫ్రంట్ ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఆగం అవ్వడం తప్ప పెద్దగా ఫలితం ఉండదని..పైగా ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించే కేసీఆర్ కు బీజేపీ నుంచి రాజకీయంగా…
ప్రధాని మోడీ హత్యకు కుట్ర జరిగిందంటూ ఎన్ఐఏ గుర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై విస్తృత సోదాలు చేస్తోన్న ఎన్ఐఏ ఈ సోదాల్లో ప్రధాని హత్యకు కుట్ర జరిగినట్లు తేలిందని పేర్కొంది. ఈ ఏడాది జూలైలో ప్రధాని పాట్నా పర్యటనలో హత్యకు విఫలయత్నం జరిగిందంటూ ఎన్ఐఏ గుర్తించింది. ఇందుకోసం పలువురికి శిక్షణ కూడా ఇచ్చారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించామని తెలిపింది. యూపీకి చెందిన నేతలను సైతం మట్టుబెట్టేందుకు కుట్ర జరిగిందని పేర్కొంది. దాదాపు 1000మంది కమాండోలతో రక్షణ వలయంలో ఉండే ప్రధానిని హతమార్చేందుకు ప్లాన్ చేస్తారా..? అది సాధ్యమేనా..? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఐదు అంచెలో భద్రత వలయంలో ఉండే ప్రధాని భద్రత వ్యవహారాలను ఎస్పీజీ అధికారులు మినిట్ టూ మినిట్ పర్యవేక్షిస్తూ ఉంటారు. మొదటి వలయంలో కమాండోలు భద్రతగా ఉంటారు. రెండో లేయర్ లో వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులు పహారా…
రాజకీయాల్లో విలువలు పతనం అంచున ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. పదవో, పైసలో ఆఫర్ చేశారంటే చాలు సెకండ్ థాట్ లేకుండా పార్టీ ఫిరాయించడం చూస్తూనే ఉన్నాం. తద్వారా రాజకీయ నాయకులు తమ విలువలను కోల్పోవడమే కాకుండా ప్రజల్లో రాజకీయాలంటేనే అసహ్యం కల్గేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ రాలేదని ఓ పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేసే జంప్ జిలానీలను కొదువే ఉండదు. అప్పటివరకు టికెట్ వస్తుందని కోటి ఆశలు పెట్టుకొని పార్టీ టికెట్ నిరాకరించే సరికి అదే పార్టీతో పెనవేసుకున్న బంధాన్ని ఈజీగా తెంచుకునే నేతలు బోలెడు మంది ఉన్నారు. కాని, పార్టీతో బంధం తెంచుకోవడమంటే బొడ్డు పేగు బంధాన్ని తెంచుకోవడమేనని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా..? అంటే ఉన్నారు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు చలమల్ల కృష్ణారెడ్డి. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా చలమల్ల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వం ఫైనల్ అయిందంటూ ప్రధాన స్రవంతి మీడియాలో వార్తలు కూడా…
కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ మిత్రపక్షంగా మార్చుకున్న బీజేపీ రాజకీయ ప్రత్యర్ధులపై ఈడీని ఉసిగొల్పుతుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ.. తాజాగా ఈ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విచారణకు రావాలంటూ నోటిసులు అందించినట్లుగా కథనాలు వస్తున్నాయి. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డితోపాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లకు నోటిసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచిందనే వార్తలతో అలర్ట్ అయిన బీజేపీ అగ్రనాయకత్వం టి. కాంగ్రెస్ నేతలపైకి ఈడీని ఉసిగొల్పిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నలుగురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటిసులు ఇష్యూ చేసిందన్న వార్తలపై వారు స్పందించారు. తమకు ఈడీ నోటిసులు ఇవ్వలేదని..ఒకవేళ నోటిసులు వస్తే విచారణకు హాజరు అవుతామని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ కు ఆర్థికంగా సహాయం చేశామని… చెక్కుల రూపంలోనే సహాయం అందించామని పేర్కొన్నారు. ఢిల్లీ…
అనుకున్నది ఒక్కటి..అయినది ఒక్కటి..బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అనే సాంగ్ అందరికీ దాదాపు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ పాట గురుంచి ఎందుకంటారా..? మరేం లేదండి.. హుజురా ‘బాద్ షా’ ఈటల పరిస్థితి బీజేపీలో అలాగే మారిందని ఆయన అనుచర వర్గం మధనపడుతోంది. టీఆరెస్ నుంచి తప్పుకున్నాక ఎటు తేల్చుకోలేక అనేక పరిణామాల మధ్య చివరికి తను నమ్మిన సిద్దాంతాన్ని కూడా కాదని శరణు కోరుతూ బీజేపీలో చేరిపోయారు. అయితే, ఆయన బీజేపీలో చేరడం ఆ పార్టీకి కొంత ఊపు తీసుకొచ్చినా బండి సంజయ్ కు మాత్రం ఉక్కపోత పుట్టిస్తుందట. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి చివర్లో హాజరైన బండి సంజయ్..ఆయన గెలుపునకు కూడా పెద్దగా సహకరించింది లేదు. ఈటల ఒక్కడే తన అనుచరులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడు. మొత్తానికి అనేక ఆటుపోట్ల మధ్య హుజురాబాద్ లో ఈటల గెలిచి బీజేపీలో ట్రంప్ కార్డు అయిపోయారు. హుజురాబాద్ లో ఈటల…
కుల – మత రాజకీయాలతో విచ్చనమైన భారత్ ను ఐక్యం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కన్యాకుమారిలో చేపట్టిన ఈ యాత్ర కశ్మీర్ వరకు 3500కిలోమీటర్లు కొనసాగనుంది. ఈ యాత్ర చేపట్టి రెండు వారాలు అవుతోంది. భారత్ జోడో యాత్రకు జనం నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అధికారంలోకి వచ్చాక క్రమంగా ఫోర్త్ ఎస్టేట్ ను తమ గుప్పిట్లోకి తీసుకున్న బీజేపీ.. తమ అనుకూల ఛానెల్ లో భారత్ జోడో యాత్రకు కనీసం స్పెస్ ఇవ్వడంలేదు. కాంగ్రెస్ అనుకూల ఛానెల్ లేకపోవడం, నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్ళే ఎన్డీటీవీ ని కూడా మోడీ తన మిత్రుడు ఆదానీకి కట్టబెట్టి ఫోర్త్ ఎస్టేట్ ను భజన మండలిగా మార్చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ సెన్సేషన్ కావాల్సిన రాహుల్ గాంధీ పాదయాత్ర సోషల్ మీడియా పుణ్యమా అని కొద్దికొద్దిగా జనాల్లో చర్చ సాగేలా చేస్తోంది.…
వచ్చే ఎన్నికల కోసం టీఆరెస్ గెలుపునకు సహకరించాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు హైదరాబాద్ వేదికగా ఐ – ప్యాక్ ఆఫీసు కూడా ఓపెన్ చేసి పని ప్రారంభించింది. సోషల్ మీడియా , ఎమ్మెల్యేల బలాబలాలు వంటి విషయాలపై కేసీఆర్ కు రిపోర్ట్ సమర్పించారు. అయితే, ఇటీవలి సర్వేలో టీఆరెస్ నానాటికీ బలహీనపడుతుందని ప్రగతి భవన్ లో కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే సర్వే సారాంశం బయటకు పొక్కడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సర్వేలు పక్కనపెట్టి కేవలం సోషల్ మీడియాలో ట్రోలింగ్, హైప్ క్రియేట్ చేసే వాటిపై మాత్రమే ఫోకస్ చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీకే – కేసీఆర్ ల బంధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా, వచ్చే నెల 2వ తేదీ నుంచి బీహార్ లో మూడు వేల…