Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
అనుకున్నదే జరిగింది. మునుగోడు టీఆరెఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు గులాబీ అధినేత కేసీఆర్ మొగ్గు చూపారు. పోటీకి కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ లు ఆసక్తి చూపిన కేసీఆర్ మరోసారి కూసుకుంట్లకే ఛాన్స్ ఇవ్వడం చర్చనీయంశంగా మారింది. మునుగోడులో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న కూసుకుంట్లకు గెలుపు అవకాశాలు లేవని ఆ మధ్య పీకే సర్వేలో కూడా తేలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక కేసీఆర్ ప్రైవేట్ సర్వే సంస్థలతో మునుగోడులో సర్వే చేయించినా ఇదే ఫలితం పునరావృత్తమైంది. అయినప్పటికీ కూసుకుంట్లనే టీఆరెస్ అభ్యర్థిగా బరిలో నిలపడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మునుగోడులో ఇక కూసుకుంట్ల పని అయిపోయినట్టేనని పీకే సర్వే మొదలు నిన్నమొన్నటి ప్రైవేట్ సర్వే సంస్థలు తెల్చేశాయి. ఇక , ఆయన టీఆరెస్ లో నామమాత్ర నేతగా కొనసాగాల్సి ఉంటుందని అంత భావిస్తుండగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్…
టీఆర్ఎస్ పేరు మార్పుపై టీపీసీసీ నేత చలమల్ల కృష్ణారెడ్డి స్పందించారు. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణతో ఆ పార్టీకున్న అనుబంధాన్ని తెంచేసుకున్నట్టేనని తెలిపారు. తెలంగాణకు టీఆరెస్ శ్రీరామ రక్షా అని ప్రతి వేదికపై మాట్లాడిన కేసీఆర్ , కేటీఆర్ లు ఇప్పుడు జనాలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయ అవసరాల కోసమే పార్టీ పేరును మార్చారని పేర్కొన్నారు. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్లు.. పార్టీ పేరు మార్చగానే టీఆరెస్ నేతలు అప్పుడే జాతీయ పార్టీ అయినట్లుగా భ్రమ పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీదరించుకుంటుందని..దాంతోనే ఆయన రాజకీయ నిష్క్రమణ జాతీయ రాజకీయాల వలన జరిగిందనే ఓ అభూత కల్పనను క్రియేట్ చేసేలా బీఆర్ఎస్ ను ముందుకు తీసుకొచ్చారన్నారు చలమల్ల కృష్ణారెడ్డి. కేసీఆర్ కు దమ్ముంటే టీఆరెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి బీఆర్ఎస్ పై పోటీ చేయించాలని సవాల్ విసిరారు. తెలంగాణను సంక్షోభంలోకి…
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు. గురువారం సుమారు ఐదు గంటలపాటు న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు విచారించారు. యంగ్ ఇండియా కంపెనీకి విరాళాలు ఇచ్చిన విషయమై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలిసింది. విచారణ అనంతరం గాలి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారన్నారు. అయితే, విరాళాల విషయంలోనే ఈ కేసు విచారణ నడుస్తుండటంతో తాను యంగ్ ఇండియాకు విరాళం ఇచ్చినట్లు ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. తాను ఈడీ అధికారులకు విచారణ సందర్భంగా పూర్తిగా సహకరించానని పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని ఈడీ నుంచి పిలుపు వస్తే మళ్ళీ తప్పకుండా విచారణకు హాజరు అవుతానని చెప్పారు. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. నగదు లావాదేవీలే జరగనప్పుడు.. మనీ ల్యాండరింగ్ ఎలా జరుగుతుందనేది అందరి సందేహం. తెలంగాణలో…
నేషనల్ హెరాల్డ్ కేసులో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించడం వెనక టీఆరెస్ – బీజేపీ ల జిమ్మిక్కు పాలిటిక్స్ ఉన్నాయా..? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయనుండటంతో అదే స్థానం నుంచి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ గా కొనసాగుతున్న గాలి అనిల్ కుమార్ ను కటకటాల్లోకి నెట్టాలని రాజకీయ వ్యూహముందా..? ఢిల్లీ లిక్కర్ స్కాంను తెరమరుగుచేసేందుకే ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ నేతలపైకి ఈడీని బీజేపీ ఉసిగోల్పిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. నేషనల్ హెరాల్డ్ కు విరాళాలు ఇచ్చారని గాలి అనిల్ కుమార్ కు తాజాగా ఈడీ నోటిసులు ఇష్యూ చేసింది. అక్టోబర్ 12న ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటిసుల్లో పేర్కొంది. అయితే, ఈడీ నోటిసులు జారీ చేయడం వెనక కేసీఆర్ చక్రం తిప్పారనే ఆరోపణలు వస్తున్నాయి.…
టీఆరెస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు రెడీ అయిపోయారు. భారతీయ రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తోన్న కేసీఆర్.. రాష్ట్రంలోనున్న టీఆరెస్ ను బీఆర్ఎస్ లో విలీనం చేస్తారా..? లేక అనుసంధానంగా టీఆరెస్ ను కొనసాగిస్తారా..? అనే సందేహం అందరిలో నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఓ ప్రాంతీయ పార్టీ. ప్రస్తుతం కేసీఆర్ పార్టీకి అద్యక్షుడు. ఇప్పుడు జాతీయ పార్టీకి ఆయన అద్యక్షుడు కానున్నారు. అలాగని, ఓ ప్రాంతీయ పార్టీకి , జాతీయ పార్టీకి అద్యక్షుడిగా కేసీఆర్ కొనసాగలేరు. దాంతో టీఆరెస్ ను బీఆర్ఎస్ లో విలీనం చేయాల్సి ఉంది. టీఆరెస్ ఇదే పని చేస్తే అంతకన్నా తెలివి తక్కువ పని మరొకటి ఉండదేమో. ఎందుకంటే.. తెలంగాణ అంటే టీఆరెస్ అన్నట్లుగా జనాల్లో ఓ రకమైన అభిప్రాయం ఏర్పడింది. అలాంటిది జాతీయ రాజకీయాల అవసరాల కోసం పార్టీ పేరు మార్చితే…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా..? నానాటికీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత మరో సంవత్సరమైతే మరింత పెరగడం తప్పితే తగ్గే ఛాన్స్ లేదని గులాబీ బాస్ కలవరపడుతున్నారా..?మునుగోడు బైపోల్ ఆలస్యం అవుతుండటంతో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ యోచిస్తున్నారా..? ఓ వైపు బీజేపీ , కాంగ్రెస్ బలపడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి ముందస్తు ఎన్నికలకు సై అనాలనుకుంటున్నారా..? పీకే ను ఆల్ ఆఫ్ సడెన్ గా ఊడపీకడం ఇందులో భాగమేనా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. https://youtu.be/O4E8D_4k2Sw తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ సెప్టెంబర్ మాసంలోనే వెలువడుతుందని అనుకుంటే నవంబర్ లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ట్రెండ్స్ టీఆరెఎస్ కు…
ప్రగతి భవన్ లో అన్ని వ్యవహారాలను చక్కబెట్టే ఎంపీ సంతోష్ రావు నాలుగు రోజులుగా ప్రగతి భవన్ కు రావడం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ప్రగతి భవన్ లో కేసీఆర్ కు మందులిచ్చే దగ్గ నుంచి.. గేట్ లోపలి ఎవరిని అనుమతించాలి..? ఎవరికీ ఎగ్జిట్ బోర్డు పెట్టాలి..? ఇలా అన్ని వ్యవహారాలను సంతోష్ చూసుకుంటాడు. కాని , నాలుగు రోజులుగా ప్రగతి భవన్ లో కనిపించని సంతోష్.. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకోవడంతో ఏం జరిగి ఉంటుందని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఇటీవల వెన్నమనేని శ్రీనివాస్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈయన సంతోష్ రావుకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరు వ్యాపార భాగస్వామ్యులన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే సంతోష్ – శ్రీనివాస్ రావుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల అంశం సంతోష్ రావును కూడా కటకటాల్లోకి నెట్టే…
బతుకమ్మ చీరల్లో భారీ కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోంది. 18 లక్షల మంది మహిళల కోసం ఈ ఏడాది బతుకమ్మ చీరలకై 340కోట్లు కేటాయించింది ప్రభుత్వం. పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి చీరలు కొనుగోళ్ళు చేసినా సర్కార్ పంపిణీ చేసిన చీరలన్నీ నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు నిరసన తెలుపుతుండటంతో అసలేం జరిగి ఉంటుందని ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు మెల్లగా బయటకొస్తున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న ఒక్క చీర విలువ కూడా వంద రూపాయలు ఉండే ఛాన్స్ లేదంటున్నారు మహిళలు. లేదు.. ఒక్కో చీరకు వంద రూపాయల చొప్పున లెక్క కట్టినా 18కోట్లు మాత్రమే అవుతాయి. మరి, ప్రభుత్వం కేటాయించిన 340కోట్లలో మిగతా 322కోట్లు ఎవరు కాజేశారన్న చర్చ జరుగుతోంది. కల్వకుంట్ల పాలనలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు… బతుకమ్మ చీరల కొనుగోళ్ళలోనూ దోపిడీ చేశారని ఆరోపిస్తున్నారు. బతుకమ్మ చీరల పేరుతో 322కోట్లను కాజేశారని ఆరోపణలు రావడంతో తెలంగాణ మహిళా సమాజం తీవ్ర…
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేసులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నేత , టీపీసీసీ నాయకులు డాక్టర్ రవి నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విద్యార్ధి యువ నాయకుడు కావడం, పార్టీ కోసం కమిట్మెంట్ తో పని చేస్తుండటంతోపాటు నిత్యం ప్రజల్లోనే ఉండటం రవి నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారానికి ఊతమిస్తోంది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన ఈ నియోజకవర్గం సీపీఐతోపాటు కాంగ్రెస్ కు కంచుకోటగా నిలుస్తు వస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ – సీపీఐ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన రమావత్ రవీంద్ర కుమార్ ఆ తరువాత అధికార పార్టీలోకి జంప్ చేశారు. తిరిగి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థిగా పోటీ చేసి బాలు నాయక్ పై విజయం సాధించారు రవీంద్ర కుమార్. అప్పటి నుంచి అధికార టీఆరెస్ వైఫల్యాలపై ప్రశ్నించే నేతగా రవి నాయక్…
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరెస్ , బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని టీపీసీసీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండల కేంద్రంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చలమల్ల కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు టీఆరెస్ , బీజేపీలు ఒకటయ్యాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ఓటర్ కు ఐదు వేలు పంచుతూ ఓట్ల బేరానికి దిగాయని టీఆరెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. మందు- విందు రాజకీయాలను ప్రోత్సహిస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని నిప్పులు చెరిగారు. సొంత పార్టీ కార్యకర్తలే కొత్తగా పార్టీలో చేరుతున్నట్లు కండువాలు కప్పేసి కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేసేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్సే రెండు పార్టీల టార్గెట్ ఐందంటేనే.. నియోజకవర్గంలో హస్తం పార్టీ ఎంత బలంగా ఉందొ అర్థం…