Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. తన సూచనతో రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకునేందుకుగాను అమిత్ షా ఈ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. షా ఆదేశాల మేరకు కేంద్ర నిఘా వర్గాలు మునుగోడు ఉప ఎన్నికపై ఇటీవల సర్వే నిర్వహించాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ తరుఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. కేంద్ర ఇంటలిజెన్స్ చేసిన సర్వేలో మాత్రం బీజేపీకి నిరశాజనకమైన ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవని గుర్తించింది. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు సర్వే ఫలితాన్ని అమిత్ షా టేబుల్ మీద ఉంచగా.. మునుగోడులో పార్టీ ఓటమి అంచున ఉండటం…
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖకు జాతీయ నాయకత్వం అక్షింతలు వేసిందా..? ఢిల్లీలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య జరుగుతున్న లోపాయికారీ ఒప్పందాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి గుర్తించి సీపీఎం రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడా..? బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని, బీజేపీపై యుద్ధం చేస్తుంది కాంగ్రెస్సేనని ఆ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల్లో సపోర్ట్ చేయకుండా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడంపై ఏచూరి అసహనం వ్యక్తం చేశారా..? టీఆర్ఎస్ , బీజేపీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించడంలో విఫలం అయ్యారని రాష్ట్ర నాయకత్వాన్ని ఏచూరి ఎకిపారేయడంతోనే తమ్మినేని టీఆర్ఎస్ పై బిగ్ బాంబ్ పేల్చారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి తప్పు చేశామనే విధంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.…
అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కాంగ్రెస్ లోకి రానున్న రోజుల్లో నేతల చేరికలు ముమ్మరం కానున్నాయా..? రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ , బీజేపీలకు చెందిన అసమ్మత్తి నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా..? టీఆర్ఎస్ – బీజేపీలు ఒకటేననే విషయం కల్వకుంట్ల కుటుంబ అవినీతికి వ్యతిరేకంగా కత్తులు దూస్తోన్న నేతలు గ్రహిస్తున్నారా..? ఈ పరిణామం కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దోహదం చేయనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ప్రకటన బీజేపీ , టీఆర్ఎస్ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ రెండు పార్టీల నుంచి కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారని.. వారంతా త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రకటనతో ప్రత్యర్ధి పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు. ఎవరెవరు పక్కచూపులు చూస్తున్నారని బండి సంజయ్ ఆరా తీస్తున్నారు. ఇక, టీఆర్ఎస్ అధినేత…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా హస్తినకు వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన అనూహ్యంగా ఢిల్లీలో వాలిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన అభిషేక్ రావుకు టీఆర్ఎస్ కీలక నేతలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సీబీఐ కస్టడీలో అబిషేక్ కీలక విషయాలు చెప్తే నెక్స్ట్ టీఆర్ఎస్ బడా నేతలకు లిక్కర్ స్కాంలో నోటిసులు అందే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మార్చేందుకు హస్తినలో జరిగిన భేటీలో కేసీఆర్ తనయ ఎమ్మెల్సి కవిత పాల్గొన్నారని.. అందులో భాగంగానే ఆమెకు ఫ్లైట్ బుక్ చేసింది అభిషేక్ రావేనని సీబీఐ అధికారులు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అభిషేక్ కస్టడీ ముగిసిన తరువాత కవితతోపాటు…
బీజేపీ, టీఆర్ఎస్ నేతల డైరక్షన్ లోనే ఆ పార్టీ కార్యకర్తలు చండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టాలనే దుర్బుద్ధితోనే ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చుననే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పే వాదనలో నిజమెంత ఉందొ చెప్పలేం కాని, జరుగుతోన్న పరిణామాలను గమనిస్తుంటే మాత్రం వారి ఆరోపణలను అంతగా ఈజీగా కొట్టిపారేయలేమని అంటున్నారు రాజకీయ పండితులు. రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన కొన్ని క్షణాల వ్యవధిలోనే ఉప ఎన్నికకు తాము సిద్దంగా ఉన్నామని, రెండు రోజుల గ్యాప్ లోనే మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యర్ధి పార్టీలకు కాంగ్రెస్ హెచ్చరికలు పంపింది. అలాగే , ప్రతి మండలానికో ఇంచార్జ్ ను నియమించి ప్రచారంలో కాంగ్రెస్ ముందుండేలా కార్యాచరణ తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మాత్రం…
మునుగోడు ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అసంతృప్త నేత బూర నర్సయ్య గౌడ్ బరిలో దిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన బూర నర్సయ్యకు టీడీపీ అధిష్టానం తాజాగా టచ్ లోకి వెళ్ళిందనే ఊహాగానాలు మునుగోడు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. మునుగోడులో బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని బీసీ సంఘాలు ప్రకటిస్తోన్న నేపథ్యంలో బూర నర్సయ్య కూడా టీడీపీ తరుఫున పోటీ చేసే విషయమై ఆలోచనలో పడినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడు టికెట్ ను బీసీలకే కేటాయిస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ దృష్టి సారించింది. టీడీపీకి అక్కడి నుంచి నియోజకవర్గ ఇంచార్జ్ గా కొనసాగుతున్న బీసీ నేతకు అవకాశంఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైనా… టీఆర్ఎస్ పై అసంతృప్తిగా నున్న బూర నర్సయ్య కు టికెట్ ఇస్తే బీసీ వాదంతో మునుగోడులో నెగ్గుకురావొచ్చునని…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీలు దూకుడు మీదుండటంతో టీఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్చడంలో టీఆర్ఎస్ బడా నేతలే కీలక పాత్ర పోషించారని..ఇందులో కొన్ని వేల కోట్లు చేతులు మారి ఉంటాయనే కోణంలో విచారణ చేపట్టిన సీబీఐ, ఈడీ అధికారులు అరెస్టులు కూడా చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు టీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన అభిషేక్ రావు ఉన్నారు. అయితే, అభిషేక్ రావును విచారించిన సీబీఐ అధికారులు.. అతనితో వ్యాపార సంబంధాలు కల్గి ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్ళైను అరెస్ట్ చేయలేదు. ఇందుకు ఆయన అప్రూవర్ గా మారడమే కారణమని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అరుణ్ రామచంద్ర పిళ్ళై ను ఈ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ సమయంలోనే అన్ని ఆధారాలు సేకరించిన సీబీఐ అధికారులు.. కీలక డాక్యుమెంట్స్ ను పిళ్ళై ముందుంచడంతో.. ఈ స్కాంకు సంబంధించిన…
టీఆరెఎస్ కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరనున్నారా..? ఇందుకు సంబంధించి వ్యవహారాలు కూడా పూర్తయ్యాయా..? మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీఆరెఎస్ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా వ్యాపారవేత్తలే. వారి ఆస్తులపై ఏ క్షణమైనా ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని లిక్కర్ స్కాం ఉదంతం బయటకు వచ్చిన నాటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో లిక్కర్ స్కాం ఎపిసోడ్ లో ఎంపీ సంతోష్ రావు సన్నిహితుల ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు జరగడం ఆ తరువాత సంతోష్ రావు రెండురోజులపాటు కనిపించకుండా పోయారనే వార్త మరిన్ని అనుమానాలను పెంచేసింది. ఈ లిక్కర్ స్కాం ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో తెలియదు. ఇదిలా ఉండగానే టీఆరెస్ నేతలపై ఈడీ దాడులు త్వరలోనే జరుగుతాయని మంత్రి కేటీఆర్ స్పష్టం…
తెలంగాణ బీజేపీలో ముసలం ఏర్పడింది. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రయోగాత్మకంగా చేసిన ఓ ప్రయోగం వికటించి పార్టీలో కూనిరాగాలకు కారణమైంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 119నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను బండి సంజయ్ ప్రకటించారు. ఈ ఇంచార్జ్ లు ఎవరు స్థానిక నేతలు కాదు. ఇతరులను నియోజకవర్గ ఇంచార్జ్ లుగా నియమించడం ఆ పార్టీ నేతల ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గ ఇంచార్జ్ లుగా నియమించబడ్డ వారెవరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరని కూడా పేర్కొన్నారు. కేవలం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ అధినాయకత్వం బాధ్యతలను కట్టబెట్టింది. నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోయే వారి గెలుపు కోసం పని చేయాలని ఇంచార్జ్ లకు వర్క్ ను అప్పగించారు. దీంతో ఈ 119నియోజకవర్గాలకు ఇంచార్జ్ లుగా నియామమైన వారంతా ఈ ఇంచార్జ్ పోస్టులు తమకు వద్దు బాబోయ్ అంటూ బండికి లేఖలు రాస్తున్నారు. సరిగ్గా.. ఎన్నికలకు సమయం…
బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తామని ప్రకటించిన కేసీఆర్ పలు రాష్ట్రాల్లో బీఆరెఎస్ పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేస్తామని గొప్పగా ప్రకటించుకున్నారు. తమకు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నేతలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి మద్దతు ఉందని, వారంతా బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం చేసుకున్నారు. కాని, బీఆర్ఎస్ ప్రకటన సమయంలో ఒక్క కుమారస్వామి మినహా ఎవరు చరిష్మా కల్గిన నేతలు పాల్గొనలేదు. దీంతో బీఆర్ఎస్ కు తెలుగు మీడియా తీసుకురావాలనుకున్న హైప్ అంతగా రాలేదు. శుక్రవారం మంత్రి కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ పోటీపై క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ కు బాగా పట్టున్న రాష్ట్రాలు కావడం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ మిత్ర పక్షాలను విచ్చిన్నం చేసేందుకు బీఆర్ఎస్ పేరుతో…