Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో పెద్ద హైడ్రామా చోటుచేసుకొనుందా..?మునుగోడు నుంచి టీఆర్ఎస్ మకాం మార్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం పక్కాగా ప్లాన్ చేసిందా..? రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రభావం మునుగోడు బైపోల్ పై లేకుండా చేసేందుకు ఉభయతారకంగా బీజేపీ, టీఆర్ఎస్ లు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నాయా..? ఢిల్లీలో తిష్టవేసి కూతురిని కాపాడుకునేందుకు కేసీఆర్ నడిపిన మంత్రాంగం వర్కౌట్ అయిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజుల్లో పెద్ద హైడ్రామా జరగనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిశ్ సిసోడియా విచారణకు హాజరు అవుతున్న నేపథ్యంలో నెక్ట్స్ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటిసులు అందే సూచనలు కనిపిస్తున్నాయి. కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీలో కేసీఆర్ తెర వెనక నడిపిన లాబియింగ్ వర్కౌట్ అయింది. అదేంటి..? కవితకు నోటిసులు అందటం ఖాయమంటున్నారు. మళ్ళీ గులాబీ బాస్ నడిపిన మంత్రాంగం సక్సెస్ అయిందంటున్నారని…
ఇటీవల ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ తో భేటీ తరువాత మెత్తబడిన మాజీ ఎంపీ బూర నర్సయ్య అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించడం వెనక ఎం జరిగింది..?అసలు ప్రగతి భవన్ లో బూరతో కేసీఆర్ ఎం మాట్లాడారు..? కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిన మూడు రోజుల వ్యవధిలోనే బూర నర్సయ్య కూడా హస్తినలో కనిపించడం వెనక దాగిన సీక్రెట్ ఏంటి..? ఢిల్లీ వెళ్ళిన తరువాత బీజేపీ నేతలను కలిసే ముందుగా బూరతో కేసీఆర్ ఎందుకు టచ్ లోకి వెళ్ళారు..? కేసీఆర్ సూచన మేరకే జేపీ నడ్డాను బూర నర్సయ్య కలిశారా ..? లెట్స్ వాచ్ దిస్ స్టొరీ మాజీ ఎంపీ బూర నర్సయ్య బీజేపీలో చేరాలని తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. ఇటీవలే ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమైన బూర నర్సయ్య మునుగోడులో కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించి, అనూహ్యంగా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం వెనక లిక్కర్…
దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని డైలాగ్ లు పేల్చే టీఆర్ఎస్ నేతలు ఓసారి ఒరిస్సా వైపు చూడాలని హితవు పలుకుతున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థే ఉండదని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఒరిస్సా ప్రభుత్వం ఒక్క సంతకంతో 57వేల మందిని రెగ్యులరైజ్ చేసిందని తెలంగాణ సర్కార్ కు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఇరవై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కాని ఇప్పటి వరకు హామీ అమలులో చెప్పుకోదగ్గ ముందడుగు పడనేలేదు. ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రం ఒక్క కలంపోటుతో ఏకంగా 57వేల మందిని రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసేలా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడమే కాదు..ఒరిస్సాలో కాంట్రాక్ట్ విధానాన్నే రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. మెజార్టీ రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థతో ప్రభుత్వ వ్యవస్థలను కొనసాగిస్తూ ఉండగా..ఒరిస్సా సర్కార్ మాత్రం…
ప్రతి ఆహారపు గింజను వృధా చేయకుండా కాపాడినట్లయితే ఆ గింజను మనము పండిoచి నట్టే లెక్క! ఆహారం వృధా చేయకపోతే దేశ సంపదను సృష్టించినట్లు! మనం బతకాలంటే ఆహారం తినాలి, ఆహారం వృధాగా పారేయడానికి ఒక్క నిమిషం చాలు… కానీ అదే ఆహారాన్ని పండించడానికి 6 నెలల సమయం( అన్నీ అనుకూలిస్తే) పడుతుంది.మనం తినే ఆహారం విత్తనం నుండి మొదలు తినే వరకు 18 రూపాల్లో మారి ఆహారంగా తయారవుతుంది. ఉదాహరణకు:- రైతు, రైతు కూలీలు,విత్తనం, భూమి, వాతావరణం, నీరు, మార్కెట్, కరెంటు, అమ్మ, చేసే వంట పని మొదలైనవి. ఒక ఆహారపు గింజ తయారు కావాలంటే దాదాపు 22 వ్యక్తులు, లేదా సంస్థల ప్రోత్సాహం అవసరం. ఉదాహరణకు:- రైతు, భూమి,నీరు, పశువులు, ఎరువులు, కూలీలు, కరెంటు, వాతావరణం మొదలైనవి. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదలు తాము సంపాదించిన డబ్బులు 60 నుండి 80 శాతం వరకు ఆహారానికే…
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న టీఆరెఎస్.. తాజాగా మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పల్లె రవి కుమార్ ను కూడా కొనుగోలు చేసింది. కాంగ్రెస్ నాయకులే లక్ష్యంగా సంతలో సరకులా ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్ళు జరుపుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో చుర్రుగా కనిపించిన పల్లె రవి ఆ తరువాత కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో కనిపించారు. అ తరువాతే టీఆఆర్ఎస్ నేతలు పల్లె రవితో టచ్ లోకి వచ్చారని.. దాంతో భారీ మొత్తంలో ఆఫర్ చేయడంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే, బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను దెబ్బతీసే లక్ష్యంతో నేతలను కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీలోకి చేరికపై మాజీ ఎంపీ బూర నర్సయ్య శుక్రవారం క్లారిటీ ఇచ్చారు.…
ఈ ఏడాది అంతర్జాతీయ ఆకలి సూచిలో భారత్ మరింత దిగజారింది. 121 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో భారత్ 107స్థానానికి పడిపోయింది. గతేడాది 101 ర్యాంక్ దక్కించుకున్న భారత్… ఈ ఏడాది మాత్రం ఏకంగా 6 స్థానాలు దిగజారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… పాక్ , బంగ్లాదేశ్, నేపాల్ భారత్ కంటె మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. ఆకలి, పౌష్టికాహారం లను ఆధారంగా చేసుకొని ఈ ఆయా దేశాల ఆకలి సూచిని నిర్ణయిస్తారు. ఈమేరకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్ సైట్ రూపొందించిన నివేదికలో ఇండియాలో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉందని.. ఇదే విధంగా కొనసాగితే భారత్ లో ఆకలి చావులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. జీహెచ్ఐలో ఇండియా స్థానం పతనం అవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. నరేంద్ర మోడీ అభివృద్ధి ఇదేనా విమర్శలు గుప్పించింది. మోడీ భారత్ ను ఆకలి చావుల వైపు తీసుకెళ్తున్నారని మండిపడుతున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై నమోదైన కేసులో సాయి బాబాతోపాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శనివారం నిలిపివేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) ప్రకారం జీఎన్ సాయి బాబాను ముందుగా విచారించడానికి అనుమతి తీసుకోలేదనే కారణాన్ని చూపి, సాయి బాబాను నిర్దోషి అని ఎలా ప్రకటిస్తారని తుషార్ మోహత వాదించారు. కేవలం సాంకేతిక అంశాలను ఆధారం చేసుకొని హైకోర్టు బెయిల్ కు అంగీకరించిందన్నారు. కేసులో వాస్తవాలను పరిశీలనలోకి తీసుకేలేదన్నారు. సాయి బాబా తరుఫున సీనియర్ న్యాయవాది బసంత్ వాదనలు వినిపించారు.…
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించకుండా, బూర నర్సయ్యకు టికెట్ ఇస్తే సమిష్టిగా పని చేస్తామని టీఆరెఎస్ మునుగోడు నాయకులంతా స్పష్టం చేసినా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కూసుకుంట్లనే అభ్యర్థిగా బరిలో దించడం…ఆపై మునుగోడులో బీసీ సామజిక వర్గంలో మంచి ఆదరణ ఉన్న బూర నర్సయ్యను కాదని, మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఉప ఎన్నిక ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం…బూర నర్సయ్య టికెట్ ఆశిస్తున్నాడని తెలిసి కూడా ఆయనను బుజ్జగించకుండా పార్టీలో ఉంటె ఉండండి..లేదంటే వెళ్లిపోవచ్చునని జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ చేయడం…ఆ తరువాత బూర నర్సయ్యను ప్రగతి భవన్ కు కేసీఆర్ పిలిచి మాట్లాడటం…ఆపై కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే డాక్టర్ సాబ్ కూడా హస్తిన వెళ్ళడం…అక్కడ ఆయన బీజేపీ నేతలతో సమావేశం కావడం…ఏంటి ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగినట్టు ఉందని అనుకుంటున్నారా..? మీరనుకున్నదే నిజం. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని బలపరచడం వెనక బీజేపీకి లబ్ది చేకూర్చే ఎత్తుగడ…
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్రపై ముఖ్యులతో చర్చించేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన అని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నా..హస్తిన టూర్ వెనక పెద్ద తతాంగమే నడుస్తోందని తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో తన కూతురిని కాపాడుకునేందుకు ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తోన్నకేసీఆర్ బీజేపీ విధించిన షరతులన్నింటిని అంగీకరించేందుకు రెడీ అయిపోయినట్లు తాజా సమాచారం. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన బూర నర్సయ్యను బీజేపీలోకి పంపేందుకు కేసీఆర్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థలు చేసిన సర్వేలో బీజేపీ ఓటమి అంచున ఉందని తేలింది. దాంతో గెలుపు వ్యూహాలపై దృష్టి సారించింది బీజేపీ హైకమాండ్. ఇందులో ప్రధానంగా బీసీ ఓటర్లను బీజేపీ వైపు అట్రాక్ట్ చేస్తే రాజగోపాల్ రెడ్డిని గట్టేక్కించవచ్చునని వ్యూహం రచించింది. ఆ సామజిక వర్గం ఓటర్లను ఆకర్షించాలంటే బలమైన నేత కోసం అన్వేషించిన బీజేపీకి బూర ఆశా కిరణంలా కనిపించాడు. ఎలాగూ.. లిక్కర్ స్కాం నుంచి కవితను…
బీసీసీఐ అద్యక్షుడిగా సౌరవ్ గంగూలీని తప్పించారు. మరోసారి బీసీసీఐ అద్యక్షుడిగా కొనసాగేందుకు గంగూలీ ఆసక్తి కనబరిచినా దాదాకు నిరాశే ఎదురైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడికి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగేందుకు మరో దఫా అవకాశం ఇచ్చి..దాదాను సైడ్ చేయడం విమర్శలకు దారితీస్తోంది. అయితే, గంగూలీకి బీసీసీఐ అద్యక్షుడిగా మరో అవకాశం ఇవ్వకపోవడానికి ఆయన బీజేపీలో చేరేందుకు నిరాకరించడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన గంగూలీకి బీజేపీ రాష్ట్ర అద్యక్ష బాధ్యతలను అప్పగించాలని అమిత్ షా భావించారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల సమయంలో రేసులోనున్న సువెందు అధికారిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గంగూలీని బీజేపీలో చేరాలని మే లో గంగూలీ నివాసానికి వెళ్లి అమిత్ షా ఆహ్వానించారు. రాజకీయల్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదని గంగూలీ షా ఆహ్వానాన్ని తిరస్కరించడమే దాదా బీసీసీఐ పోస్ట్ కు ఎసరు తెచ్చిందని అంటున్నారు పరిశీలకులు. రోజర్ బిన్నీబీసీసీఐ…