Author: Prashanth Pagilla

సంచలన కథనాలతో అనతికాలంలోనే విశేష ఆదరణ పొందిన ఓ డిజిటల్ పేపర్ దిశ తన ట్యాగ్ లైన్ కు విరుద్దంగా వార్తా వ్యాఖ్యానాలు ప్రచురితం చేస్తోంది. మేము సత్యం వైపంటూ ట్యాగ్ లైన్ లో పేర్కొని అసత్యాలను పాఠకుల మదిల్లోకి ఎక్కిస్తోంది. మొదట్లో జనాల్లో ఆదరణ కోసం సంచలనాత్మక కథనాలతో దుమ్మురేపిన ఈ పత్రిక తెలంగాణకు దశ దిశను సూచిస్తుందని అంత నమ్మారు. దాంతో ఆ పత్రికకు పాఠకుల ఆదరణ పెరిగింది. నమ్మి నానబోస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు..ఆ పత్రికను విశ్వసించి చదివితే అవాస్తవ కథనాలు కుప్పలు, తెప్పలుగా రాలుతుండటం కనిపిస్తోంది. పత్రిక రంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న దిశ పత్రిక మెల్లమెల్లగా తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటుంది. పత్రిక విలువలకు మంగళం పాడుతూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోంది. కీలక నేతలే లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తూ.. ఈ కథనాల పరంపర నిలిచిపోవాలంటే తాము డిమాండ్ చేసినంత ఇచ్చుకోవాల్సిందేనని నిసిగ్గుగా వేధిస్తోంది. ఏదీ…

Read More

రాహుల్ నీకేమైనా పిచ్చి పట్టిందా..? హాయిగా దర్జాగా కాలు మీద కాలేసుకొని, ఏమాత్రం అలసట లేకుండా , విలాసవంతమైన జీవితాన్ని గడపకుండా ఎండలో ఎండుతూ, వానలో నానుతూ, చలికి వణుకుతూ ఎందుకయ్యా ఈ దేశం కోసం తిరుగుతున్నావ్.? మతం – కులమంటే కుత్తుకలు తెగ్గోసుకునే మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలే కాని, ఇలా ఐక్యం చేసి ఏం సాధిస్తావ్ రాహుల్. ఈ దేశ సేవలో నాన్నమ్మ, నాన్నను పోగుట్టుకున్నావ్ అయినా మళ్ళీ దేశం, దేశమంటూ ఆ కలవరింతలేంటి రాహుల్..? ఆకలి, ఆర్ధికమాంద్యం, ఆర్ధిక సంక్షోభం, నిరుద్యోగం.. ఇలా ఎ అంశాలపైనైనా మాట్లాడమంటే గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా మాట్లాడేస్తావ్. సావధానంగా మాత్రమే కాదు సహేతుకంగా సమాధానమిచ్చే నీ వాగ్ధాటిని గుర్తించని ఈ దేశం కోసం ఎందుకీ తాపత్రయం రాహుల్..? విలేకర్ల ప్రశ్నలకు భయపడి టెలి ప్రాంప్టర్ తోనే నెట్టుకొస్తు, దేశభక్తి ముసుగులో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తోన్న పాలకులను చూస్తే నీకింకా జ్ఞానోదయం కలగడం…

Read More

దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న మంత్రి కేటీఆర్ మునుగోడులో మాత్రం రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలు చేపట్టిన మంత్రి హరీష్ రావు మునుగోడు మొహం చూడటం లేదు. దాదాపు మంత్రులంతా మునుగోడులో మొహరించి ప్రచారంలో తలమునకలైపోతుంటే హరీష్ మాత్రం ప్రచారంలో పాల్గొనకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వేలో మునుగోడులో కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉండనుందని తేలింది. టీఆర్ఎస్ కొద్దిగా లీడ్ లో కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి లేదన్నది టీఆర్ఎస్ సర్వేల సారాంశం. బీజేపీకి 18శాతం ఓటు బ్యాంక్ మాత్రమే నమోదు అవుతుందని..అది కూడా రాజగోపాల్ చరిష్మాతోనే ఆ మాత్రం పోటీనైనా ఇస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ప్రచారం ముగిసే నాటికీ టీఆర్ఎస్ కే కాస్త ఎడ్జ్…

Read More

బీజేపీని కీలక నేతలు వీడటంపై పార్టీ అధినాయకత్వం ఆగ్రహంగా ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ పార్టీ నుంచి వలసలు ఊపందుకోవడంపై హైకమాండ్ ఆరా తీస్తోంది. నేతలు అసలెందుకు పార్టీని వీడుతున్నారో తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో పార్టీని నేతలు వీడుతుంటే చేరికల కమిటీ చైర్మన్ ఏం చేస్తున్నారని ఈటల రాజేందర్ పై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీని నేతలు ఒక్కొక్కరుగా వీడుతుంటే ఈటల రాజేందర్ వలసలను నివారించేందుకు ప్రయత్నాలేమైనా చేశాడా..? అని రాష్ట్ర నాయకత్వంతో చర్చించినట్లు తెలుస్తోంది. చేరికలను అటుంచితే నేతలను పార్టీ మారకుండా చర్యలు చేపట్టకపోవడం ఎంటని ఈటల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ జాయినింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు కట్టబెట్టింది. టీఆర్ఎస్ లో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారో తెలిసిన ఈటలకు ఈ బాధ్యతలు…

Read More

తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో పార్టీని వీడిన నేతలను తిరిగి టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు స్వయంగా కేసీఆర్ , కేటీఆర్ రంగంలోకి దిగారు. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో కలిసి సాగుదామంటూ తండ్రి, కొడుకులు ఆహ్వానాలు పలుకుతున్నారు. బీజేపీలో కొనసాగుతూ అసంతృప్త నేతలుగా ముద్రపడిన కీలక నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. జితేందర్ రెడ్డి , రఘునందన్ రావు, వివేక్ వెంకట స్వామితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, విఠల్ తోనూ కేసీఆర్ , కేటీఆర్ లు మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ తో చర్చలు ఫలించగా… రెట్టించిన ఉత్సాహంతో టీఆర్ఎస్ అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదును పెట్టింది. బీజేపీ కీలక నేతలు జితేందర్ రెడ్డి, రఘునందన్…

Read More

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగలనుంది. ఆయనకు అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ ను వీడిన పాత నేతలతో టచ్ లోకి వెళ్ళిన అధినాయకత్వం ఏనుగు రవీందర్ రెడ్డిని పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ ను ఈటల రాజేందర్ వీడిన సమయంలో ఆయనతోపాటు ఏనుగు రవీందర్ , తుల ఉమా కూడా కారు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఈటలతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వర్గపోరు వలన పార్టీలో ఈటల వంటి నేతకే ఆశించిన ప్రాధాన్యత దక్కకపోగా.. ఆయనతోపాటు పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ ను ద్వితీయ శ్రేణి నాయకుడిగా ట్రీట్ చేస్తున్నారు. పలుమార్లు ఈ విషయమై ఈటలతో ఏనుగు రవీందర్ రెడ్డి చర్చించినా…

Read More

మంత్రులు, ఎమ్మెల్యేలతోనే మునుగోడు ప్రచారాని ముగించాలనుకున్నా గులాబీ దళపతి, అనూహ్యంగా తను కూడా ప్రచారానికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు..?మొదటి విముఖత చూపిన కేసీఆర్ ఆ తరువాత ట్రాక్ మార్చడం ఎవరి సూచన మేరకు జరిగింది..? పది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కేసీఆర్ తిరిగొచ్చాక మునుగోడుకు వెళ్లాలని ఎందుకనుకున్నారు..? కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అల్లరిమూకలు మునుగోడులో మొహరిస్తుంటే పొలిసు శాఖ సైలెంట్ గా ఉండటం వెనక సీక్రెట్ ఏమైనా ఉందా..? తెలియాలంటే ఈ స్టొరీని చదవాల్సిందే. మరో వారం రోజుల్లో మునుగోడు రణరంగంగా మారనున్నట్లు తెలుస్తోంది. విచిత్రమేంటంటే బీజేపీ, టీఆర్ఎస్ కనుసన్నలోనే నియోజకవర్గంలో అలజడులు కొనసాగనున్నాయి. ఎలాగైనా మునుగోడులో నెగ్గాలని పంతమ్మీదున్న బీజేపీ డైరక్షన్ లోనే పెద్ద ఎత్తున అలజడలకు ప్రణాళిక రూపొందినట్లు కనిపిస్తోంది. లిక్కర్ స్కాంలో కూతురిని కాపాడుకునేందుకు పదిరోజులుగా హస్తినలోనే ఉన్నా కేసీఆర్, బీజేపీ అగ్రనేతలకు టచ్ లోకి వెళ్ళినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మునుగోడు ఫలితం బెడిసికొట్టేలా కనిపిస్తోందని…

Read More

మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. కాంగ్రెస్ , టీఆర్ఎస్ లోని కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. తమకు అనుకూలంగా ఉండే ఛానెల్ లో పలానా నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ కథనాలు ప్రసారం చేయిస్తోంది. బీజేపీ అనుబంధ సోషల్ మీడియాలో ఈ ప్రచారం వైరల్ అవుతుండటంతో ప్రత్యర్ధి పార్టీలలో కలవరం మొదలైంది. ఇప్పటికే టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీలో చేర్చుకున్న కమలనాథులు…నెక్స్ట్ ఎవరన్న దానిపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నారంటూ బట్టకాల్చి మీదేసే పనిలో బీజేపీ అనుకూల మీడియా నిమగ్నమైంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కాషాయదళంలో చేరేందుకు రెడీ అయ్యారంటూ ప్రచారం చేశారు. కనీసం ఆయన వివరణ…

Read More

మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. తన సూచన మేరకు కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికను ప్రత్యేకంగా వాచ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటని నివేదికలు తెప్పించుకుంటున్నారు. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలతో సర్వేలు కూడా చేయిస్తూ రాజగోపాల్ రెడ్డితోపాటు పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు షా. ఉప ఎన్నికల్లో గెలవడమే ధ్యేయంగా బరిలోకి దిగిన బీజేపీకి ఆర్థిక వనరులు పుష్కలంగా అందుతున్నాయి. ఒక్కో ఓటరుకు 40 వేలు ఇచ్చేందుకు వీలుగా డబ్బులను రెడీ చేసినట్లుగా బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అంతేకాదు.. మరికొంతమందికి డబ్బుల రూపంలో కాకుండా బంగారం రూపంలో తులం బంగారం ఇస్తామని వారికీ నచ్చిన డిజైన్ కూడా సిద్దం చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే..…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో..? అక్కడేం చేస్తున్నారో సమాచారం లేదు. అంతా సీక్రెట్ గా ఉంచుతున్నారు. కూతురిని లిక్కర్ స్కాంలో కాపాడుకునేందుకే కేసీఆర్ పైరవీలు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఖండించడం లేదు. దీంతో కేసీఆర్ హస్తిన పర్యటన అనేక అనుమానాలకు దారితీస్తోంది. గత బుధవారం ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ ఐదు రోజులుగా అక్కడే మకాం వేశారు. బీఆర్ఎస్ పై జాతీయ స్థాయిలో చర్చించేందుకే ఈ పర్యటన అని మొదట్లో చెప్పినా..కేసీఆర్ ఎవరితో భేటీ అయినట్లు కూడా సమాచారం లేదు. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పై చర్చ జరిగేలా ఢిల్లీలోనే బీఆర్ఎస్ విధి విధానాలు ప్రకటిస్తారనుకున్నా అది జరగలేదు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పీక్స్ కు చేరుతున్న దశలో ప్రచారానికి హాజరు కాకుండా కేసీఆర్ ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారు. పోనీ…

Read More