Author: Prashanth Pagilla

ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎలాంటి స్పందన లభించిందో అలాంటి స్పందనే మెదక్ జిల్లాలోనూ కనిపిస్తుండటం కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తోంది. భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ కళ్ళు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. రాహుల్ యాత్ర కొనసాగే దారులను కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేసి మెతుకుసీమలో జోడో యాత్రపై జనాల్లో విస్తృత చర్చ జరిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. హేమాహేమీలైన కాంగ్రెస్ నేతలు జిల్లాలో ఉన్నప్పటికీ గాలి అనిల్ కుమార్ పార్లమెంట్ ఇంచార్జ్ గా కొనసాగుతుండటంతో ఈ యాత్రను విజయవంతం చేసే బాధ్యతను ఆయనే తీసుకున్నట్లు తెలుస్తోంది. యాత్రకు వెల్కం చెబుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు కన్నులవిందు చేస్తున్నాయి. అలాగే, ఎల్ఈడీ తెరలు, ఎల్ఈడీ వాహనాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. భారత్…

Read More

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మునుగోడు ఉప ఎన్నిక దారి చూపుతుందని మరీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే పదవికి బీజేపీ అధినాయకత్వం రాజీనామా చేయించింది. ఈ ఉప ఎన్నికను నెగ్గి తీరాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. మునుగోడులో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ , టీఆర్ఎస్ నుంచి కమలం క్యాంప్ లోకి వలసలు భారీగా ఉంటాయని అంచనా వేసి..సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయముందని తెలిసినా కావాలనే ఈ ఉప ఎన్నికను తీసుకొచ్చారు ఢిల్లీ పెద్దలు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీదే విజయమని తేలింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వెల్లడైంది. ఈ ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడితే కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ కెరియర్ ప్రమాదంలో పడినట్లే. ఓడిన నేత అని పార్టీ కూడా రాజగోపాల్ ను పట్టించుకోదు. అదే సమయంలో… వెంకట్…

Read More

మునుగోడు ఉప ఎన్నికల ప్రస్తుత పోలింగ్ ట్రెండ్స్ ను పరిశీలిస్తే కాంగ్రెస్ బలంగా పుంజుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పోల్ అయిన ఓటింగ్ శాతం ప్రకారం అత్యధిక ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా యువత, మహిళలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక, నిన్నటివరకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట తిరిగిన పార్టీ కార్యకర్తలు కూడా కమలానికి ఓటేసేందుకు విముఖత చూపుతున్నారు. మొదటి నుంచున్న పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా తనతోపాటు బీజేపీలో చేరినవారికే రాజగోపాల్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంతో రగిలిపోయిన కమలం కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థికి ఒటేస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే ఫలితాలను తెరమరుగు చేస్తూ ఓటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి దూసుకుపోతున్నట్లుగా మునుగోడు ఎన్నికల పరిణామాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మూడు మండలాల్లో కాస్త బలహీనంగా ఉందని తేలినప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్ సత్తా చాటుతోంది. మహిళా గర్జన సభలో పాల్వాయి స్రవంతి దుఃఖానికి…

Read More

హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర విజయవంతగా ముగిసింది. నగరంలో రాహుల్ యాత్రను సక్సెస్ చేయడంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కో-ఆర్డినేటర్ రోహిన్ రెడ్డి కీలక భూమిక పోషించారు. అక్టోబర్ 23న భారత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన రోహిన్ రెడ్డి..జోడో యాత్రకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రచార రథాలు, ఎల్ఈడీ హవానాలు ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రయాణాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక, గ్రేటర్ లో యాత్రను సక్సెస్ చేయడంపై వారం రోజులుగా తలమునకలైన రోహిన్ రెడ్డి, నగరమంతా హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి యాత్రను చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయేలా చేశారు. హైదరాబాద్ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర మంగళవారం మధ్యాహ్నం చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగింది. ఈ…

Read More

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్లు రాల్చుకునేందుకు డబ్బును అస్త్రంగా వాడుతున్నారు. ఇందుకోసం బీజేపీ, టీఆర్ఎస్ లు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం అత్మగౌరవ ఎజెండాతో ఓట్లను అభ్యర్థిస్తోంది. ఈ ధన ప్రవాహంలో టీఆర్ఎస్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు. బీజేపీ నేతలు మాత్రం డబ్బు సంచులతో పట్టుబడుతున్నారు. ఎన్ని టెక్నిక్ లు యూస్ చేస్తోన్నా ఫలితం కనిపించకపోవడంతో రాజగోపాల్ రెడ్డి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకే నగదు బదిలీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం తన కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీకి 18వేల కోట్ల కాంట్రాక్ట్ రావడమేనని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. తాజాగా సుశీ కంపెనీ నుంచి మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులకు భారీగా డబ్బు బదిలీ అయింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు బయటకు రావడంతో రాజగోపాల్ రెడ్డి ఇరకాటంలో పడిపోయారు. ఐదు…

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ నమోదైన కేసు నీరుగారిపోయినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనేందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారు పోలీసులు. స్పాట్ లో వంద కోట్లు పట్టుకున్నామన్న పోలీసులు ఆ తరువాత దానిని 15కోట్లకు కుదించారు. ఇప్పుడు ఆ డబ్బు గురించి కూడా క్లారిటీ లేదు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడి కారులో నాలుగు బ్యాగులో డబ్బులున్నాయని చెప్పారు. కాని కోర్టుకు మాత్రం అసలు డబ్బే దొరకలేదని చెప్పడంతో ఈ కేసు వెనక ఎదో జరుగుతుందన్న అనుమానాలకు బలం ఏర్పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నించారని చెప్పేందుకు ఆధారాలున్నాయని పోలీసులు కోర్టుకు చెప్పలేదు. బుధవారం రాత్రి తెగ హడావిడి చేసిన పోలీసులు ఆ తరువాత సైలెంట్ కావడంతో ఈ మొత్తం వ్యవహారంలో తెరవెనక గట్టి రాజకీయమే జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఒక్క ఆధారం…

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిజంగానే బీజేపీ విఫలయత్నం చేసిందా..? ఆ నలుగురు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయేందుకు సిద్దపడి ఆఖర్లో పోలిసుల ఎంట్రీతోనే ఫ్లేట్ ఫిరాయించారా..? పక్కగా ప్లాన్ చేసి నేతలను తన బుట్టలో వేసుకునే బీజేపీ ఈసారి ఫెయిల్ కావడానికి కారకులెవరు..? బీజేపీ సెక్రెట్ ఆపరేషన్ విషయాన్ని చేరవేసింది ఆ పార్టీ ఎమ్మెల్యేనే టీఆర్ఎస్ అధినేతకు చేరవేశారా..? టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డిలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చి బీజేపీలో చేర్చుకోవాలని ప్రలోభపెట్టారని, ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేలే కేసీఆర్ కు చేరవేశారని చెబుతున్నారు. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపించింది. ఫామ్ హౌస్ వేదికగా బీజేపీ తమను పార్టీ మారాలని ప్రలోభాలకు గురి చేసిందని వారు ఎక్కడ చెప్పలేదు.…

Read More

తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపు. బుధవారం సాయంత్రం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రలోభాలు జరిగాయంటూ బయటకొచ్చిన వార్త సంచలనంగా మారింది. ఈ ఎపిసోడ్ పై బీజేపీ , టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ట్విస్ట్ ఏంటంటే… నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు, గతంలో టీఆర్ఎస్ నేతలతో కనిపించడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది. . ముగ్గురు ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత సిబ్బంది లేకుండానే తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. వారితోపాటు సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి , సింహయాజులు అనే స్వామిజీ తోపాటు నందకుమార్ అనే మరో వ్యాపారవేత్త ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపినట్లు తెలుస్తోంది. నందకుమార్ అనే వ్యక్తి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరాలంటూ నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద…

Read More

ఇండియన్ కరెన్సీపై అంబేడ్కర్ చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్లు వస్తున్నా వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త వాదన ముందుకు తీసుకొచ్చారు. భారత కరెన్సీపై ఓ వైపు గాంధీ చిత్రాన్ని అలాగే ఉంచి, మరోవైపు గణేశుడు, లక్ష్మీదేవి చిత్రాలను ముద్రించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం చేసిన ఈ వాదన బీజేపీ అవలంభించే సిద్దాంతాలకు అనుకూలంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ బీ- టీమ్ అని విమర్శలు ఉన్నాయి. యూపీఏ హయంలో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ లు అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ డైరక్షన్ లో ఉద్యమించినట్లు వీరిపై కంప్లైంట్స్ ఉన్నాయి. యూపీఏ హయంలో అవినీతి, అవినీతి అంటూ గొంతు చించుకొని మరీ అరచిన ఈ ఇద్దరు నేతలు, బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి అక్రమాలపై గొంతెత్తిన దాఖలాలు లేవు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ అవసరాల కోసం బీజేపీపై అడపాదడప విమర్శలు…

Read More

మునుగోడు ఉప ఎన్నికల్లో అంచనాలు తలకిందులు అవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులకు కూడా అందని విధంగా సర్వే ఫలితాలు ఉండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉంటుందని విశ్లేషించారు కాని, ఒక్కొక్కటిగా వెలువడుతోన్న సర్వే ఫలితాల్లో బీజేపీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడం రాజకీయ పండితులను కూడా ఖంగుతినిపిస్తోంది. కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తాజాగా వెలువడిన సర్వే రిపోర్ట్ లో తేలింది. మిషన్ చాణక్య అనే సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన సర్వేలో టీఆర్ఎస్ కు కాస్త ఎడ్జ్ ఉన్నట్లు తేలింది. అంతమాత్రానా టీఆర్ఎస్ కు అంత ఈజీగా విజయం దక్కే సూచనలు లేనట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని సర్వేలో తేలింది. బీజేపీకి ఈఫలితాలు మింగుడు పడనివే. టీఆర్ఎస్ 37 శాతం, కాంగ్రెస్ 34శాతం, బీజేపీ…

Read More