Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య మళ్ళీ ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయా..? అంటే ఉన్నాయనే సమాధానం వస్తోంది. ప్రస్తుతం సామ్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. టాలీవుడ్ ప్రముఖులంతా ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే, నాగ చైతన్య కూడా కాస్త ఆలస్యమైన ఆసుపత్రికి వెళ్లి సమంతను పరామర్శించాడని అంటున్నారు. సమంతను ఒక్కసారిగా అలా చూసే సరికి తట్టుకోలేకపోయిన చైతూ సమంత దగ్గరకెళ్ళి ఆమెను ఓదార్చాడని, ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే చైతూను విడాకులు రద్దు చేసుకోవాలని నాగార్జున కోరాడట. సమంత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు తోడు అవసరమని.. ఆమెను అమితంగా ప్రేమించిన వ్యక్తివి నువ్వు. తన దగ్గర నువ్వుంటేనే బాగుంటుందని నాగార్జున చైతుకు చెప్పాడట. అందుకు చైతూ కూడా ఒకే చెప్పాడట. నాగ్ ప్రతిపాదనకు చైతూ అంగీకరించాడు కాని సమంత కుటుంబ సభ్యులు అంగీకరిస్తారో లేదో చూడాలి.
మునుగోడు ఉప ఎన్నిక ఓటమిపై ప్రజా శాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికను రద్దు చేసి మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ లతో ఎన్నికను నిర్వహించాలన్నారు. పోలింగ్ రోజున ఈవీఎంలు మార్చారనే విషయం అధికారులకు సైతం తెలుసునని వ్యాఖ్యానించారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజే కౌంటింగ్ నిర్వహించాలని తాను పట్టుబట్టినా ఎందుకు ఆపని చేయలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు. ఈ నెల 10న ఢిల్లీ వెళ్తున్నానని.. ఈ విషయంపై అక్కడే చర్చిస్తానని పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ఇంకెంతకాలం నీ డ్రామాలు…నీ ప్రలోభాలు, ఇంకెంతకాలం మోసం చేస్తావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ రెడ్డితో దాడి చేయించినా తాను భయపడనని..కొట్లాడుతునే ఉంటానని స్పష్టం చేశారు.
హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదు. ఈ విషయాన్ని ఆమె ప్రకటించింది. పూర్తి ఆరోగ్యవంతంగా తయారు అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది సమంత. తనకు అనారోగ్యానికి గురి అయ్యాయని సమంత చెప్పడంతో కొన్ని యూట్యూబ్ ఛానెళ్ళు , వెబ్ సైట్లు పిచ్చి పిచ్చి హెడ్డింగ్ లతో కథనాలను ప్రసారం చేశాయి. చావు బతుకుల మధ్య సమంత అనే హెడ్డింగ్ పెట్టేసి వ్యూస్ కోసం కక్కుర్తి పడ్డాయి. ఈ విషయం సమంత వద్దకు చేరడంతో ఆమె ఎమోషనల్ గా సమాధానం ఇచ్చింది. సామ్ నటించిన “యశోదా” చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దాంతో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది సమంత. ఈ నేపథ్యంలోనే చిత్ర విషయాలపై ప్రశ్నించగా ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఆ తరువాత తన ఆరోగ్యంపై స్పందించింది. మీరు ఎలా ఉన్నారని ప్రశ్నించగా తాను బతికే ఉన్నా.. ఇంకా చావలేదు అంటూ ఎమోషనల్…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంబడిస్తున్నాయి. ఎలాగైనా ఈ కేసులో కవితను సేవ్ చేయాలని తలుస్తోన్న సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి ఆప్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనతో ప్రగతి భవన్ వర్గాలు లిక్కర్ స్కాం ఎపిసోడ్ ను క్షుణ్ణంగా వాచ్ చేస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్ళై అప్రూవర్ గా మారాడని వార్తలతో ఉలికిపడినా ఈ కేసుకు సంబంధించి ఆయన సహకరించడం లేదని తెలుస్తోంది. కాళేశ్వరం , మిషన్ భగీరథలపై టీఆర్ఎస్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐకి ఫిర్యాదులు కూడా అందాయి. బీజేపీ అగ్రనేతలు సైతం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్లపై సీబీఐ ఫోకస్ చెసిందని త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉందని బీజేపీలోని టీఆర్ఎస్ కోవర్టులు…
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు రాష్ట్రంలో మంచి ఆదరణ ఉంది. రాజకీయ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి త్యాగమే చేసింది హస్తం పార్టీ. ప్రజల్లో పార్టీపై ఆదరణ చెక్కుచెదరకపోయినా నేతల మధ్య అనైక్యతే కాంగ్రెస్ ను బలహీనపరుస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు చేపట్టాక పార్టీలో మంచి జోష్ కనిపించింది. పార్టీకి పునరుజ్జీవం పోసేందుకు రేవంత్ ఒక్కడై ప్రయత్నిస్తున్నా మిగతా నేతల నుంచి సహకారం కొరవడటంతో పార్టీ అనుకున్నంత స్థాయిలో బలపడటం లేదు. రేవంత్ రెడ్డి ఒంటరిగానైనా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయగలడన్న ధీమా క్యాడర్ లో కనిపిస్తోంది. కాని కోవర్ట్ నాయకుల తీరే ఆయనకు ఆటంకంగా మారుతుంది.అదే సమయంలో సీనియర్ నేతల వ్యవహారశైలి ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రంగా మారుతుంది. టీఆర్ఎస్ , బీజేపీ నుంచి విమర్శల మోత మోగుతున్నా తమ దారి తమదేనంటూ సీనియర్లు రేవంత్ కు సహాయ నిరాకరణ చేస్తున్నారు.…
చాలామటుకు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం కామన్ గా జరుగుతుంటుంది కాని, టీఆర్ఎస్ రెండో దఫా పాలనలో జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి భంగపాటు తప్పలేదు. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని అంత అనుకున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల మెప్పు పొందినా.. ప్రత్యర్ధి పార్టీల నాయకత్వంతో టీఆర్ఎస్ కు మరోసారి అధికారంపై బెంగ మొదలైంది. ఈ సమయంలోనే వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్ఎస్ లో కొత్త చర్చ జరుగుతోంది. ఇదే ఊపులో ముందస్తుకు వెళ్తే మూడోసారి విజయం దక్కడం ఖాయమని..ఆలస్యం చేస్తే ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ , బీజేపీలు క్యాష్ చేసుకోనున్నాయనే ఆలోచనతో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తును కేసీఆర్ కొట్టిపారేస్తున్నా ..మునుగోడు ఉప…
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11వేల మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ కు మొత్తం 88,716 ఓట్లు పోలుకాగా, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 79,630, కాంగ్రెస్ కు 21, 243ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. పద్నాలుగో రౌండ్ ఫలితం పద్నాలుగో రౌండ్ లో పదివేల పైచిలుకు మెజార్టీ సంపాదించింది టీఆర్ఎస్ టీఆర్ఎస్ -6,608 బీజేపీ – 5,553 పదమూడో రౌండ్ ఫలితం పదమూడో రౌండ్ లోనూ కారు హవా 9,136 ఓట్ల లీడ్ తో టాప్ గేర్ లో కారు ఏడు మండలాల్లో గుబాలించిన టీఆర్ఎస్ ఒక్క చౌటుప్పల్ లోనే టఫ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ పన్నెండో రౌండ్ ఫలితం 12 వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ దే ఆధిక్యం 7,836ఓట్ల ఆధిక్యంతో విజయం దిశగా టీఆర్ఎస్…
సందర్భం వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ పై అభిమానాన్ని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చంపుకోలేకపోతున్నారు. తాజాగా మీడియా ముంగిటకు వచ్చిన ఈటల ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో బీజేపీ ప్రమేయమేమి లేదని చెప్పకుండా.. కాంగ్రెస్ హయంలోనే ప్రజాస్వామ్యం పరిడవిల్లిందని చెప్పుకొచ్చారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీకి ఇందులో ఖచ్చితంగా ప్రమేయం ఉండి ఉంటుందనో లేక, ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ పై మాట్లాడే అర్హత ఆ పార్టీ ప్రతినిధిగా తనకు లేదనుకున్నారో ఏమో కాని ఈ విషయాన్ని ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. పైగా కేసీఆర్ పై ఎదురుదాడి చేస్తూ కాంగ్రెస్ ను చంపుతావా అని మాట్లాడటం అనేక అనుమానాలకు కారణం అవుతోంది. https://www.youtube.com/watch?v=dl9S7pmqQGk ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ ను అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించి, అదే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మనసెలా ఒప్పిందంటూ కాంగ్రెస్ పార్టీ అనధికారిక ప్రతినిధిగా ఈటల మాట్లాడారు.…
ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోలను బయటపెట్టారు సీఎం కేసీఆర్. తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తె ఊరుకోవాలా అంటూ కేంద్రంలోని బీజేపీపై ఊగిపోయారు. ఇక బీజేపీతో జగడమేనని గంభీరంగా చెప్పారు. కాని కేసీఆర్ ను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ఆయనకు ఎవరూ కోరస్ కలపడం లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీని నిజంగా బోనులో నిలబెట్టాలనుకుంటే కేసీఆర్ తన దగ్గరనున్న వీడియోలను పోలీసులకు, కోర్టుకు సబ్మిట్ చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సింది. కాని ఆడియోలు, వీడియోలను కేసీఆర్ స్వయంగా రిలీజ్ చేయడం బీజేపీ – టీఆర్ఎస్ ల గేమ్ ప్లాన్ కు మచ్చుతునక అనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. చార్జీషీట్ ఫైల్ అయ్యేవరకు భద్రంగా ఉంచాల్సిన సాక్షాలను ఎందుకు బహిర్గతం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. అంటే, ముందస్తు ప్లాన్ లో భాగంగా ఈ కేసును నీరుగర్చేందుకు ఆ వీడియో, ఆడియోలను కేసీఆరే రిలీజ్ చేశారన్న అభిప్రాయాన్ని న్యాయకోవిదులు…
టీ. టీడీపీ రాష్ట్ర అద్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించారు ఆ పార్టీ జాతీయాద్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇటీవలే పార్టీలో చేరిన ఆయనకు రాష్ట్ర అద్యక్ష బాధ్యతలు కట్టబెట్టడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర అద్యక్షుడిగా కొనసాగిన బక్కని నరసింహులును పోలిట్ బ్యూరోలోకి తీసుకోవడమే కాకుండా జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు. ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరాక బక్కని నరసింహులకు పార్టీ అద్యక్ష బాధ్యతలను అప్పగించినా పార్టీలో ఏమాత్రం జోష్ నింపలేకపోయారు. టీఆర్ఎస్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్ళడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో పూర్తిగా టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే స్థితికి చేరుకుంది. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుతోపాటు ఆర్థికంగా బలవంతుడైన కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో చేరడంతో ఆయనే చంద్రబాబుకు రైట్ ఛాయిస్ అయ్యారు. మరీ, కాసాని హయంలోనైనా తెలంగాణలో టీడీపీ తలరాత మారుతుందో చూడాలి. తెలంగాణ అనే సెంటిమెంట్ ను టీఆర్ఎస్ వదిలేయడంతో టీడీపీ…