Author: Prashanth Pagilla

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ శ్రీ నగర్ లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. గ్రానైట్ బిజినెస్ లో రవిచంద్రకు ప్రమేయముందని ఈ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. బుధవారం మంత్రి గంగుల కమలార్ నివాసంతోపాటు హైదరాబాద్ , కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టింది. టీఆర్ఎస్ కు చెందిన గంగుల , రవిచంద్ర ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో వీరిద్దరికీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది. వెంటనే ప్రగతి భవన్ కు రావాలంటూ కేసీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని భావిస్తోన్న గులాబీ బాస్.. తదుపరి ఏం చేయాలన్న దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read More

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు విడిపోనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు మాలిక్ సన్నిహితుడు ఒకరు చెప్పారని మీడియా వెల్లడించింది. కొంతకాలంగా వారిద్దరూ దూరంగానే ఉంటున్నారని, ప్రస్తుతం విడాకుల ప్రక్రియ పూర్తి కొనసాగుతుందని చెప్పినట్లు తెలిపాయి. మాలిక్ వ్యవహారాలను చూసే అతని మిత్రుడు కూడా వారి విడాకుల విషయాన్ని దృవీకరించారు. వారిద్దరూ విడాకులు తీసుకుంటున్న మాట వాస్తవమేనని…ఇక ఇంతకంటే నేనేం మాట్లాడలేనని చెప్పాడు. కాని వారిద్దరి విడాకులకు కారణం ఎంటన్నది మాత్రం చెప్పలేదు. సానియా -మాలిక్ ల కుమారుడు ఇజాన్ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్ లో కలుసుకున్నారు. సానియా సోషల్ మీడియాలో బర్త్ డే పిక్స్ పోస్ట్ చేసింది కాని, అందులో మాలిక్ ఫోటో లేకపోవడం కూడా వారు విడిపోతున్నారన్న వార్తకు బలం చేకూర్చింది.

Read More

రైతు వ్యతిరేక చట్టాలపై ప్రధాని మోడీ అస్సలు వెనక్కి తగ్గరని అంత భావించారు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ముందుగానే పసిగట్టేశారు. టీఆర్ఎస్ పోరాటం, డిమాండ్ తోనే రైతు వ్యతిరేక చట్టాలను మోడీ రద్దు చేశారని ఆ క్రెడిట్ ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించిన అనంతరం అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తారని కేసీఆర్ కు ఎలా తెలిసిందని అంత చర్చించుకున్నారు. ఇదే కాదు, పలు విషయాల్లోనూ కేంద్రం తీసుకునే నిర్ణయాలపై టి. సర్కార్ కు ముందస్తు సమాచారం ఉంటోంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందన్నది ఎవరికీ తెలియడం లేదు. ఈ సమయంలో వచ్చిన ఫోన్ ట్యాప్ ఉదంతం కలకలం రేపుతోంది. తెలంగాణ గవర్నర్ కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని అంటున్నారు. తన ఫోన్ లోకి వచ్చిన మెసేజ్ టీఆర్ఎస్ నేతలకు ఎలా తెలిసిందని…

Read More

మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. అదే సమయంలో తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ అయింది. గత మూడు నెలలుగా బిజీ షెడ్యూల్ తోనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిరిగి పార్టీ సంస్థాగత బలోపేతంపై ఫోకస్ చేయనున్నారు. మరో పది నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలు కూడా జరిగే అవకాశం లేకపోలేదనే ఆలోచనతోనున్న రేవంత్… ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ నేతలను సమాయత్తం చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం పార్టీ నేతలు, క్యాడర్ పై ఎలాంటి ప్రభావం పడకుండా చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం మరికొద్ది రోజుల్లోనే పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై కార్యచరణ రూపొందించాలనే భావనతో ఉన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా కొద్ది నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో నెలకొన్న స్తబ్దతను బద్దలు కొట్టాలని.. క్యాడర్ ను మళ్ళీ యాక్టివ్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మినహా…

Read More

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన వ్యవరశైలిని ఒకరిద్దరూ మినహా మిగలిన నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. దాంతో వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఏఐసీసీపై ఒత్తిడి పెరుగుతోంది. మునుగోడులో పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు వెంకట్ రెడ్డి తెర వెనక ప్రయత్నాలు చేశాడంటూ ఆడియో క్లిప్ ను ఏఐసీసీకి టీపీసీసీ పంపింది. అయితే, ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వెంకట్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలే కారణం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా చెప్పుకొచ్చారు. తన విజయానికి కృషి చేస్తానని ఓటమికి కుట్రలు చేశాడంటూ ఆరోపించారు. బీజేపీ తరుఫున పోటీ చేసిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది.…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం చైర్ బోర్ కొట్టినట్లు ఉంది. అందుకే ప్రధాని పీఠంపై గురి పెట్టారు. కొడుకు ఒత్తిడో, కూతురిపోటు ఏమో కాని ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్, పలు రాష్ట్రాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం ఖాయం కావడంతో పాలన వ్యవహారాలను కేటీఆరే చూసుకుంటున్నారు. కొద్దికాలంగా ఆయనే యాక్టింగ్ సీఎంగా కొనసాగుతున్నారు. మంత్రులు తమ శాఖ పెండింగ్ పనుల కోసం సీఎంను సంప్రదించేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరితే…ఒకవేళ ఆయన నిరాకరిస్తే కేటీఆర్ ను సంప్రదిస్తున్నారు. అన్ని శాఖల పనితీరుపై కేసీఆర్ సుపుత్రుడే మానిటరింగ్ చేస్తున్నారు. కేటీఆర్ ఓ మంత్రి అయ్యుండి సహచర మంత్రులకు ఆర్డర్స్ పాస్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలి పబ్ కేసు కావొచ్చు, బాసర ఐఐఐటీ విద్యార్థుల సమస్యలు కావొచ్చు, నిజాం…

Read More

టీ-20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియా సారధి రోహిత్ శర్మ గాయపడగా..తాజాగా సూపర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ విన్నింగ్ గేమ్ ఆడుతోన్న విరాట్ కోహ్లీ సైతం గాయపడ్డాడు. నెట్స్ లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా విరాట్ కోహ్లీకి గాయమైంది. హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీ గాయపడటంతో నెట్స్ ను వీడాల్సి వచ్చింది. గురువారం సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను టీమిండియా డీకొనబోతోంది. అయితే, ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే, కోహ్లీ గాయం అంత తీవ్రమైనది ఏమి కాదని.. భయపడాల్సిన పనిలేదని ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని టీమ్ మేనేజ్ మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. రోహిత్ విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది.

Read More

తెలంగాణలో ఐటీ, ఈడీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తోపాటు కరీంనగర్ లో ఈడీ, ఐటీ అధికారులు గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్ తోపాటు గ్రానైట్ బిజినెస్ చేసే వారి నివాసాలలో, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ ను విదేశాలకు తరలింపు విషయంలో ఫేమా నిబంధనలను ఉల్లఘించారని ఆరోపణలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రానైట్ పరిశ్రమకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలో, హైదర్ గూడలోని జనప్రియ అపార్ట్ మెంట్ లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. 20 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

Read More

తెలంగాణలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇటీవల అంత సర్దుకుంటుందని అని భావిస్తోన్న సమయంలోనే తాజాగా మరోసారి వివాదం రాజుకుంటున్నట్లు కనిపిస్తోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట గవర్నర్ లు పాలనపరమైన అంశాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తోందంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన నాలుగైదు బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. కాని గవర్నర్ తమిళిసై మాత్రం అటు ఆమోదించకుండా , ఇటు తిరస్కరించకుండా తన వద్దే పెండింగ్ లో ఉంచారు. కొన్ని బిల్లులపై తనకు సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలని ఆమె మంత్రులను కోరారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లుపై చర్చించాలంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్ కు ఆహ్వానిస్తూ లేఖ పంపారు. కాని మంత్రి మాత్రం తనకు ఎలాంటి లేఖ అందలేదని, అలాంటప్పుడు తనెందుకు రాజ్ భవన్…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుల దర్యాప్తుపై స్టే ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ఉన్నత న్యాయస్థానం… దర్యాప్తు చేసుకోవచ్చునని మొయినాబాద్ పోలీసులను ఆదేశించింది. గతంలో దర్యాప్తును నిలిపివేయాలని ఇచ్చిన స్టే ను తాజాగా రద్దు చేస్తునట్లు పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. మంగళవారం మరోసారి ఈ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం దర్యాప్తు నిలిపివేయాలని గతంలో ఇచ్చిన స్టే ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ముగ్గురు నిందితులను విచారించేందుకు మొయినాబాద్ పోలీసులకు మార్గం సుగమమైంది. విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను 18కి వాయిదా వేసింది హైకోర్టు.…

Read More