Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని లేఖలో గుర్తు చేశారు. 8 ఏళ్లుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లేఖలో ప్రస్తావించారు. *లక్షాలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై నిర్లక్ష్యం మంచిది కాదన్నారు. పైగా ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేయడం తెలంగాణ యువతకు నిరాశను కలిగించిందని పేర్కొన్నారు రేవంత్. *కాజీపేట ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దశాబ్దాల కల అని.. ఈ మేరకు విభజన చట్టం షెడ్యూల్ 13లో, 10వ అంశంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆ హామీని కూడా అటకెక్కించారన్నారు. *తెలంగాణలో 12 శాతం గిరిజనులు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చట్టం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఏర్పాటుకు చొరవ లేదని ప్రస్తావించారు. *పునర్విభజన…
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నారా..? బీజేపీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా వాణి వినిపించే విప్లవ రచయిత సంఘంకు ఈటల మద్దతుగా మాట్లాడటం దేనికి సంకేతం..? తెలంగాణలో హక్కులు అణచి వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న ఈటల.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అదే విధానం కొనసాగిస్తుందని చెప్పకనే చెప్పెస్తున్నారా..? ఆయన వ్యాఖ్యల పట్ల బీజేపీలో అంతర్మథనం ఎందుకు కొనసాగుతోంది..? ఇన్నాళ్ళు తనంతట తానే బీజేపీని వీడుతారనే అంచనాలు తప్పి, బీజేపీ సస్పెన్షనే ఈటల కోరుతున్నారా..? హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేస్తోన్న వ్యాఖ్యల మర్మం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయన బీజేపీలో కొనసాగుతున్నా ఆయన ఆలోచనల స్వభావం మాత్రం విప్లవ భావజాలం వైపే ఉందని మరోమారు బయటపెట్టుకున్నారు. తాజా మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ… విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులు వరవరరావుకు మద్దతుగా మాట్లాడారు. భీమా కోరేగావు కేసులో వివిని జైలుపాలు చేసింది కేంద్రంలోని బీజేపీ సర్కార్. తెలంగాణలో హక్కుల అణచివేత కొనసాగుతుందని…
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పోటీ చేయనున్నారు. ఆమె జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలువనున్నారు. ఈమేరకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో రవీంద్ర జడేజా భార్య పేరు కూడా ఉంది. రివాబా జడేజాకు బీజేపీ తరుఫున పోటీ చేసే అవకాశం కల్పించడంపై రవీంద్ర జడేజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముందుగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపారు. తన భార్యపై నమ్మకం ఉంచి బీజేపీ టికెట్ కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. అటు తన భార్యకు కూడా శుభాకాంక్షలు తెలిపారు జడేజా. బీజేపీ తరుఫున పోటీ చేయడం గర్విస్తున్నానని అన్నారు. ప్రజా సేవలో ముందుకు సాగాలని, ప్రజలకు నేరుగా సేవ చేసే అదృష్టం దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తోన్న దోషుల విడుదలకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. రాజీవ్ హత్యకేసులో 30ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన దోషి ఎ.జి పెరారివాళన్ ను విడుదల చేయాలని ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో మిగతా దోషులు కూడా తమను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. నళిని, రవిచంద్రన్, తదితరులు పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి.ఆర్ గవాయ్ , జస్టిస్ బి. వి నాగరత్నతో కూడిన ధర్మనాసం .. ఎ.జి పెరారివాళన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పే వీరికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో మిగతా నలుగురుకి జైలు శిక్ష నుంచి విముక్తి లభించినట్టు అయింది. ఇతర కేసులు వీరిపై నమోదై లేకపోతే జైలు నుంచి వారిని విడుదల చేయాలని…
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోదా చిత్రం శుక్రవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ మీరూ ఓ లుక్కేయండి కథ తల్లిదండ్రులను కోల్పోయిన యశోదా ( సమంత) తన సోదరి బృంద ( ప్రీతీ అస్రాని) ని సొంత బిడ్డలా చూసుకుంటుంది. చెల్లిని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది. తనే లోకంగా బతుకుతుండగా ప్రీతీకి అనారోగ్య సమస్య తలెత్తుతుంది. ఆపరేషన్ చేస్తేనే ఆమె బతుకుందని ఇందుకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని వైద్యుల సలహా మేరకు సమంత డబ్బును సంపాదించడంపై దృష్టి పెడుతోంది. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని టెన్షన్ పడుతుంది. కాని ఎదో ఓ రకంగా డబ్బు దొరికే అవకాశం సమంతను చేరుతుంది. సోదరిని రక్షించుకోవడానికి అవసరమయ్యే డబ్బు కోసం అద్దె గర్భం ద్వారా బిడ్డను కనేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మిస్ ఇండియా అనుమానాస్పదంగా మరణిస్తుంది. సరోగసికి రెడీ…
కేంద్రం డైరక్షన్ లో టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా ఈడీ దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లు ముందే చెప్పేశారు. తమపై ఈడీ దాడులు చేసినా బెదరమని, ఎం చేయాల్నో , ఎలా ఈడీ దాడులను ఎదుర్కోవాలో తమకు తెలుసునని పెద్ద , పెద్ద డైలాగ్ లే పేల్చారు. కేసీఆర్ ముందస్తు సమాచారంతోనే ఈ ప్రకటన చేశారో లేక అంచనా వేశారో కాని, టీఆర్ఎస్ నేతలపై ఈడీ దాడులైతే జరిగాయి. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర నివాసాలలో, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేశారు. సొంత పార్టీ నేతలపై ఈడీ దాడులు జరిగినా టీఆర్ఎస్ అధినాయకత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈడీ, ఐటీ దాడులతో సీఎం కేసీఆర్ వెంటనే గంగుల , రవిచంద్రలను ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడారు. తాను చూసుకుంటానని వారిద్దరీకి కేసీఆర్ అభయం ఇచ్చారు. అదే సమయంలో…
తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారులు వరుసగా రెండురోజులపాటు దాడులు నిర్వహించారు. గ్రానైట్ వ్యాపారస్తులే టార్గెట్ గా ఈ సోదాలు జరిగాయి. ఈ బిజినెస్ లో లొసగులను ఆధారం చేసుకొని కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. గ్రానైట్ ను ఎక్కువ ఎగుమతి చేస్తూ.. తక్కువ చూపించి పన్నులు ఎగ్గొట్టి బాగానే వెనకేసుకున్నారు. ఇదే ఈడీ , ఐటీ ఎంటర్ అయ్యేందుకు ఆస్కారం కల్పించాయి. రెండు రోజులుగా ముమ్మరంగా తనిఖీలు చేసిన అధికారులు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వాస్తవానికి గ్రానైట్ వ్యాపారులందరూ ఎక్కువ ఎగుమతి చేసి తక్కువ చూపించి అక్రమాలకు పాల్పడుతారనేది ఓపెన్ సీక్రెట్. అందుకే గ్రానైట్ వ్యాపార సామ్రాజ్యంలో వెలుగొందిన వారంతా రాష్ట్రంలోని అధికార పార్టీతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలకు నిధులు సమకూర్చుతుంటారు. ఇటీవలి రాజకీయాలు పూర్తిగా మారడంతో ఈడీ దాడులు ప్రారంభించింది. టీఆర్ఎస్ తో సంబంధం ఉన్న గ్రానైట్ కంపెనీలను టార్గెట్ చేసింది. మొదటి…
టీ-20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా దారుణ పరాజయం మూటగట్టుకుంది. పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గ్రేట్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20ఓవర్లలో 168పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కు నిర్దేశించింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లో ఓపెనర్లు మరోసారి పూర్తిగా నిరాశపరిచారు. రెండో ఓవర్ లోనే కేఎల్ రాహుల్ అవుట్ కాగా, 28బంతుల్లో 27పరుగులు చేసి రోహిత్ శర్మ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 50పరుగులు చేసి డెత్ ఓవర్లలో రాంగ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఆ తరువాత హార్దిక్ (33 బంతుల్లో 66పరుగులు ) చివర్లో బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా 168పరుగులైన చేయగలిగింది. ఇక , బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ మొదటి ఓవర్ నుంచే టీమిండియా బౌలర్లపై…
-గులాబీ బాస్ ఏం చేయనున్నారు..? మునుగోడు ఉప ఎన్నిక ముగిసినా టీఆర్ఎస్ , బీజేపీ ల మధ్య డైలాగ్ వార్ ఆగడం లేదు. ఈసారి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ విషయమై రెండు పార్టీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన ఫ్యాక్టరీని జాతికి అంకితం ఎలా ఇస్తారని టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కర్మాగారంలో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధానిని అడ్డుకుంటామని వామపక్ష విద్యార్ధి సంఘాలు ప్రకటించాయి. టీఆర్ఎస్ అభ్యంతరాలపై బీజేపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. దీంతో ప్రధాని రామగుండం టూర్ టెన్షన్ రేకెత్తిస్తోంది. ప్రధాని తెలంగాణ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం లేదు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలని మోడీ – షా లు ప్రయత్నించారని మీడియా సమావేశంలో స్వయంగా కేసీఆరే చెప్పారు. మరీ, ఈ పర్యటన సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరినైనా పంపిస్తారా..? ప్రోటోకాల్…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు అవమానాలే స్వాగతం పలుకుతున్నాయి. ఆమె పర్యటనలో అధికారులు ఎవరూ ప్రోటోకాల్ పాటించడం లేదు. ఇప్పటికే ప్రోటోకాల్ విషయంలో తనను అవమానిస్తున్నారని గవర్నర్ పదేపదే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా..అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా సిద్ధిపేట జిల్లా పర్యటనలోనూ తమిళిసైకి అవమానం ఎదురైంది. జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ ను జిల్లా కలెక్టర్, ఎస్పీ , ఇతర ఉన్నాతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్ళినా గవర్నర్ కు అధికారులు ఎవరూ స్వాగతం పలకలేదు. డీఆర్వో , ఆలయ అర్చకులు మినహా ఎవరూ తమిళిసైకి స్వాగతం పలకకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం , గవర్నర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుండటంతో సర్కార్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే అధికారులు గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం లేదని తెలుస్తోంది.