Author: Prashanth Pagilla

టాలీవుడ్ ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మరణంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా..టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ సూపర్ స్టార్ కృష్ణ మృతిపై తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు..! కృష్ణ గారి మృతిపై చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, స్వర్గంలో కృష్ణ, విజయనిర్మల పాటలు పాడుకుంటూ , డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడుపుతారని అనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. అలాగే , మోసగాళ్ళకు మోసగాడు సినిమాలోని డ్యూయెట్ సాంగ్ ను కూడా షేర్ చేశాడు. https://twitter.com/RGVzoomin/status/1592359653404729344 ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More

మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో పేరుగాంచిన భూమా నాగిరెడ్డి – శోభల రెండు కూతుర్ని మనోజ్ వివాహం చేసుకుంటారని ఆ ప్రచార సారాంశం. వీటిని వారిద్దరూ ఖండించకపోవడంతో వీరి పెళ్లిబాజాలు త్వరలో మొగనున్నాయని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త యాంకర్ ను పడేసే పనిలో హైపర్ ఆది..! మంచు మనోజ్ 2015లో ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తరువాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మంచు మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. ఈ సమయంలోనే మంచు మనోజ్ భూమానాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డితో కనిపించడం… తరుచుగా బయట జంటగా కనిపించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలకు బలం చేకూరింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ కావడంతోనే వీరిద్దరి సోషల్ మీడియాలో అకౌంట్…

Read More

హమ్మా.. మీకే తెలివి ఉందా..మాకు లేదనుకుంటున్నారా…? అన్నట్లుగా టీఆర్ఎస్ , బీజేపీలు దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ నేతలపై గురి పెట్టగా..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏర్పాటైన సిట్ తో బీజేపీని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. గ్రానైట్ తరలింపులో జరిగిన అవకతవకల్లో టీఆర్ఎస్ నేతలకు ఉచ్చు బిగించేందుకు ఐటీని బీజేపీ రంగంలోకి దించడంతో.. స్టేట్ జీఎస్టీ అధికారులను దించేసి బీజేపీ నేతల్లో కలవరం పుట్టిస్తోంది టీఆర్ఎస్. ఇలా రెండు పార్టీలు విచారణ సంస్థలతో రాష్ట్ర రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి. బీజేపీకి కేసీఆర్ సరెండర్ – లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ లేనట్టే..!? ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితకు ప్రమేయముందని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ తథ్యమని ప్రకటించారు. దాంతో ఈ కేసులో ఏం జరగుతుందన్న ఉత్కంట అందరిలోనూ నెలకొంది. లిక్కర్…

Read More

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. కార్డియాక్ అరెస్ట్ తో ఆదివారం గచ్చిబౌలిలోని కాంటి నెంటల్ ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ ఇకలేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొనగా.. అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. జీవిత ప్రస్థానం  1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో కృష్ణ జన్మించారు. వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు ఐదుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు. సూపర్ స్టార్ పూర్తి పేరు ఘట్టమనేని శివ కృష్ణ మూర్తి. బాల్యం నుంచే కృష్ణకు సినిమాలంటే పిచ్చి. తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్ చేయాలనీ భావించారు. కాని ఇంజినీరింగ్ లో సీట్ దక్కకపోవడంతో డిగ్రీలో చేరాల్సి వచ్చింది. ఏలూరులో అక్కినేని నాగేశ్వర్ రావుకు సన్మానం జరగడం చూసి ఎలాగైనా సినిమా రంగంలో రాణించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు కృష్ణ. 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. రమేష్ బాబు…

Read More

టీఆర్ఎస్ అనుకూల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నించినట్టుగానే ఏపీ సర్కార్ ను కూడా కూలదోయాలని చూసిందని పేర్కొంది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో ఈ విషయం బయటపడినట్లు పేర్కొంది. తెలంగాణ, ఏపీతోపాటు మరో మూడు రాష్ట్రాలు బీజేపీ హిట్ లిస్టులో ఉన్నాయని వెల్లడించింది. అయితే, ఏపీ సీఎం జగన్ తో స్నేహపూర్వకంగా మెదిలే బీజేపీ అగ్రనేతలు వైసీపీని కూల్చేందుకు ప్రయత్నించారనే కథనం వైసీపీ శిబిరంలో కలవరం రేపుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మీకే తెలివి ఉందా – మాకు లేదనుకుంటున్నావా..! ఏపీ అధికార పార్టీకి చెందిన 70మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని..వీరిలో 55కి పైగా ఎమ్మెల్యేలు మధ్యవర్తుల టచ్ లోకి వెళ్ళారని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది. జగన్ కేసులను అడ్డు పెట్టుకొని వైసీపీ సర్కార్ ను కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితులు సిట్ అధికారులకు తెలిపినట్టు సమాచారం…

Read More

టాలీవుడ్ కు ఈరోజు ఏమాత్రం కలిసి వచ్చినట్లు లేదు. ఇప్పటికే అనారోగ్యంతో సూపర్ స్టార్ కృష్ణ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరగా.. తాజాగా యువ హీరో ఆసుపత్రి పాలయ్యాడు. యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యాడు. షూటింగ్ లో ఉండగా అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దాంతో ఆయన్ను వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగ శౌర్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ యంగ్ హీరో ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం నాగ శౌర్య చేస్తోన్న సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన డైట్ మెయింటేన్ చేస్తున్నాడు. సరైన ఆహరం తీసుకోకపోవడం వలన అస్వస్థతకు గురై ఉండొచ్చునని మూవీ యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధిస్తున్నారు.

Read More

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కండిషన్ సీరియస్ గానే ఉందని ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. కృష్ణ గారికి.. కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో ఎమర్జెన్సికి తరలించి సీపీఆర్ చేశాం. ఆ తరువాత కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకొచ్చారు. అనంతరం ఐసీయూకు తరలించి వెంటిలెటర్ పై ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఇప్పటికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనను కోలుకునేలా అత్యుత్తమ వైద్యం అందిస్తున్నాం. మరో రెండు రోజులపాటు కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎంటన్నది ఏమి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.

Read More

క్యాసినో వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు చికోటి ప్రవీణ్. ఆయనకు పలు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలతో సంబంధాలూ ఉన్నాయి. కరుడుగట్టిన హిందుత్వ వాది అయిన చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి రావాలనిపిస్తే పాలిటిక్స్ లోకి కూడా వస్తానని మనస్సులో మాటను ప్రవీణ్ బయటపెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టారనే కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్ పై విడుదలైన రాజాసింగ్ ను కలిసిన అనంతరం చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పై బీజేపీ తరుఫున మీరు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు..? అని మీడియా ప్రతినిధులు చికోటి ప్రవీణ్ ను ప్రశ్నించారు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ..ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని చెప్పేశారు. అంతేకాదు, సిరిసిల్లను కేటీఆర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను…

Read More

లిక్కర్ స్కాంలో తన కూతురు కవితను సేవ్ చేసుకునేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మార్గం దొరికిందా..? ఇక , ఈ కేసులో కవిత అరెస్ట్ ఉండే అవకాశం ఎంతమాత్రం లేదా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏదైనా అనుకుంటే సాధించి తీరుతాడని కేసీఆర్ నుద్దేశించి అంటుంటారు. ఇది ఉరికే అనలేదమో. ఎందుకంటే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇక కవిత అరెస్ట్ తప్పదని అంత భావిస్తుండగా..అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కూతురి అరెస్ట్ ను కేసీఆర్ అడ్డుకోగలిగారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సమయంలో బీజేపీతో చేసుకున్న ఒప్పందంతో కూతుర్ని అరెస్ట్ గండం నుంచి బయటపడేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఊహించిన దానికంటే రెట్టింపు ఆదరణ రావడం టీఆర్ఎస్ , బీజేపీలకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఒప్పందంలో భాగంగా వారానికో అరెస్ట్ చూపించి మీడియా అటెన్షన్ ను గ్రాఫ్ చేసుకోగలిగారు. దాంతో రాహుల్…

Read More

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. కొంతకాలంగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. కరోనా సమయంలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి పరిస్థితులను పూర్తిగా తట్టుకొని అనారోగ్య సమస్యల నుంచి కృష్ణ బయటపడ్డారు. అయినప్పటికీ తాజాగా మరోసారి అనారోగ్యం తిరగబెట్టింది. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్ లో ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన పూర్తిగా కోలుకోవాలని సూపర్ స్టార్ అభిమానులు ప్రార్ధిస్తున్నారు. కాసేపటి క్రితమే మహేష్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆయన అనారోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు ఆసుపత్రి వైద్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరించనున్నారు.

Read More