Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Prashanth Pagilla
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కొత్త పేర్లు బయటకు వస్తునాయి. కనికా టేక్రివాల్ రెడ్డి అనే మహిళా పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. టేక్రివాల్ రెడ్డి ఎవరో కాదు..ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన శరత్ చంద్రా రెడ్డి రెండో భార్య. మొదటి భార్యతో విడిపోయిన అనంతరం ఆయన టేక్రివాల్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈమెకు ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు అద్దెకి ఇచ్చే కంపెనీ ఉంది. ఏపీతోపాటు తెలంగాణ నేతలు ఈమె కంపెనీ ప్రైవేట్ చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకుంటారని అంటున్నారు. కేసీఆర్ లాజిక్..అంటే మరోసారి ముందస్తు ఉన్నట్టే..! దాంతో ఈమెకు టీఆర్ఎస్ కీలక నేతలతో సంబంధాలు ఏర్పడి ఉంటాయని… ఈ కారణంతోనే టేక్రివాల్ రెడ్డికి చెందిన ఫ్లైట్లలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన నగదును తరలించారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కంపెనీకి చెందిన ఫ్లైట్లు బేగంపేట నుంచి ఎక్కడిక్కెక్కడికి వెళ్ళాయి..? అందులో ఎవరెవరు వెళ్ళారన్న…
బాలీవుడ్ అగ్రశ్రేణి కథా నాయికగా అలరించిన ఐశ్వర్యరాయ్ ఇంకా సినిమాలో అలరిస్తూనే ఉంది. “ఇమ్రావ్ జాన్” అనే సినిమాలో అభిషేక్ బచ్చన్ తో నటించిన సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. బుధవారం ఐషూ – అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య జన్మదినం కావడంతో సామజిక మాధ్యమాల్లో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బర్త్ డే సందర్భంగా తన కూతురికి లిప్ లాక్ చేసిన ఫోటోలు ఇన్స్టా లోని తన అకౌంట్ లో షేర్ చేసింది. అంతేకాకుండా నా ప్రేమ, నా జీవితం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఆరాధ్య అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇషూ షేర్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
బీజేపీలో ఇమడలేకపోతున్న ఈటల రాజేందర్ ను తిరిగి టీఆర్ఎస్ లో చేరాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో తిరిగి చేరితే టీఆర్ఎస్ లో నెంబర్ 2హోదా కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. కేసీఆర్ ఆహ్వానం పట్ల ఈటల అనాసక్తి చూపించారని..దాంతోనే తాజాగా ఆయనకు దేవరయంజాల్ భూముల విషయంలో ఉచ్చు బిగించారని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల…బీజేపీకి ట్రంప్ కార్డు అయ్యారు. దాంతో బీజేపీ సీఎం క్యాండిడేట్ ఆయనేననే అంత అనుకున్నారు. ఒకానొక దశలో బీజేపీ అద్యక్ష బాధ్యతలను ఈటలకు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కాని ఆయనను కొంతకాలం పట్టించుకోకుండా పక్కన పెట్టేయడంతో ఈటల అసంతృప్తిని గుర్తించిన అధిష్టానం ఆయన్ను చేరికల కమిటీ చైర్మన్ గా నియమించింది. తొలుత చేరికల విషయంలో ఈటల దూకుడుగా వ్యవహరించినా బండి సంజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యల వలన ఈటల సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్…
ఆరు నెలల ముందుగా ఎన్నికలు జరిగితే వాటిని ముందస్తు ఎన్నికలు అనరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ గడువు ముగిసే ఆరునెలల ముందు ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించవచ్చు. దీని ఆధారంగా ఆరు నెలలలోపు ఎన్నికలు జరిగితే అది ముందస్తుగా పరిగనించబడదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే ఫాలో అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ కు షాక్ – గజ్వేల్ లో ఈసారి ఎదురీతే..? షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. ఇంకా ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. కేసీఆర్ చెప్పినట్లుగా షెడ్యూల్ మేరకు ఎన్నికలు జరుగితే… ఎన్నికలకు ఇంకో పదమూడు నెలల సమయమున్నట్లు. కాని కేసీఆర్ మాత్రం మూడు నెలల సమయం కుదించి ఇంకో పది…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన మాత్రం ముందస్తు ప్రసక్తే లేదని..షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసి ఊహాగానాలకు తాజాగా తెరదించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న దృష్ట్యా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకొని…తెలంగాణ మోడల్ ను లోక్ సభ ఎన్నికల నాటికీ పలు రాష్ట్రాల్లో ప్రచారం చేసి ఓట్లు దండుకోవాలని వ్యూహం రూపొందించారు. ఏమైందో ఏమో కాని, ముందస్తుపై కేసీఆర్ సడెన్ గా వెనక్కి తగ్గారు. ముందస్తుకు వెళ్లాలని తొలుత భావించిన కేసీఆర్ మళ్ళీ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటని అంత చర్చించుకుంటున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని కేసీఆర్ కు నివేదికలు అందినట్లుగా చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో లేకపోవడం, పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటంతోపాటు సర్కార్ సంక్షేమ పథకాల్లో లోపాలు , కొన్ని వర్గాలకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న భావన…
సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలకు అభయం ఇచ్చారు. అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా టికెట్ ఇస్తారా..? అనే దానిపై టీఆర్ఎస్ లో విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి అంటూ కారెక్కారు. చేరికల సమయంలో టికెట్ పై స్పష్టమైన హామీ కేసీఆర్ ఇవ్వకపోవడంతో ఎప్పటి నుంచో వీరిని భవిష్యత్ బెంగ వెంబడిస్తోంది. ఈ సమయంలోనే సిట్టింగ్ లకే అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటనతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురించగా… ఈ 14నియోజకవర్గాల్లో గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నేతలు పార్టీని వీడే అవకాశం ఉంది. 2018లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన వారు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థులు పటోళ్ల సబితా ఇంద్రా రెడ్డి – మహేశ్వరం తీగల కృష్ణారెడ్డి జాజుల సరేందర్…
సర్వేల ఆధారంగా సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వాలా..? లేదా..? అనేది నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ ఆ మధ్య ప్రకటించారు. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు ఇస్తామని భరోసా కల్పించారు. షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని..ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన ఎమ్మెల్యేలకు నమ్మకం కల్గించడం లేదు. ఇందుకు కారణం.. గతంలో కేసీఆర్ , కేటీఆర్ లు చేసిన ప్రకటనలే. టీఆర్ఎస్ చేయించే సర్వేలో ఎవరి పనితీరు ఉత్తమంగా ఉంటుందో వారికీ టికెట్ ఇస్తామని బలంగా చెప్పారు. కాని ఇప్పుడు మాత్రం సర్వేల ప్రస్తావన లేకుండానే సిట్టింగ్ లందరికీ టికెట్లు కన్ఫాం అంటూ ప్రకటించేశారు. అయితే , కేసీఆర్ తాజా ప్రకటన వలసలను అడ్డుకునేందుకేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కారు ఓవర్ లోడ్ తో ఉంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన నేతలూ టికెట్లు ఆశిస్తున్నారు. సిట్టింగ్ లు కూడా…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్…శత్రువులను కూడా మిత్రులను చేసుకునే పనిలో పడ్డారా..? తనతో విబేధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను తిరిగి సొంతగూటికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలెట్టారా..? బీజేపీలో ఆయన కంఫర్ట్ గా లేకపోవడం గుర్తించి చక్రం తిప్పారా.? బీజేపీని వీక్ చేయాలంటే ఈటలను తన దారిలోకి తెచ్చుకుంటే సరిపోతుందని భావించే కేసీఆర్ తగ్గి మరీ, ఈటలను కారెక్కమని ఆహ్వానించారా..?అంటే అవుననే సమాధానం వస్తోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మీకే తెలివి ఉందా – మాకు లేదనుకుంటున్నావా..! ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే ఏ రంగంలోనైనా రాణిస్తారు. దీనిని కేసీఆర్ ఆచరణలో పెట్టేస్తున్నారు. గతంలో తనను విబేధించి ప్రత్యర్ధి పార్టీలోకి వెళ్ళిన నేతలను తిరిగి సొంత గూటికి రమ్మని తనే స్వయంగా ఫోన్ చేస్తున్నారు. ఇటీవల స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్, భిక్షమయ్య గౌడ్ లను టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించిన కేసీఆర్.. తాజాగా…
సోమవారం షూటింగ్ లో ఉండగా యంగ్ హీరో నాగ శౌర్య స్పృహ తప్పి పడిపోయారు. దాంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. నాగ శౌర్యకు చికిత్స కొనసాగుతోంది. ఓ యాక్షన్ సీన్ లో నాగ శౌర్య సిక్స్ ప్యాక్స్ చూపించాల్సి ఉండటంతో డైట్ మెయింటేన్ చేశాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. నాలుగు రోజులుగా మంచి నీళ్ళు కూడా ముట్టలేదని సమాచారం. దాంతో బాగా అలసిపోయిన నాగ శౌర్య..షూటింగ్ స్పాట్ లో కూడా ఏమి ముట్టకుండానే షూటింగ్ లో జాయిన్ కావడంతో.. కళ్ళు తిరిగి పడిపోయారని అంటున్నారు. మంచు మనోజ్ రెండో పెళ్లి – అమ్మాయి ఎవరో తెలుసా..? ఆయన కిందపడిపోగానే వెంటనే నాగ శౌర్యను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. శౌర్యకు వైరల్ ఫీవర్ ఎటాక్ అయిందని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికీ ఆయన అలసటగానే ఉన్నారని చెప్పారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల…
హుజురాబాద్ టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ నాకంటే నాకేనని ఇద్దరు నేతలు వరుస ప్రకటనలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురి అవుతున్నారు. 70మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందా..? తాజాగా ఇల్లందకుంటలో గ్రామాల వారీగా టీఆర్ఎస్ కార్యకర్తలతో పాడి కౌశిక్ రెడ్డి అంతర్గతంగా సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందంటూ పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నం చేశారు. టికెట్ విషయమై తనకు కేసీఆర్ నుంచి హామీ వచ్చిందని చెప్తున్నారు. పార్టీలో ఉంటూ కోవర్ట్ రాజకీయం చేస్తే సహించేది లేదంటూ తన ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపారు కౌశిక్ రెడ్డి. తాజా పరిణామాలతో గెల్లు శ్రీనివాస్ వర్గం పాడి కౌశిక్ రెడ్డిపై ఆగ్రహంగా ఉంది. టీఆర్ఎస్…