Author: Prashanth Pagilla

బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధం ప్రారంభించడంతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తత స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించడంతో టీఆర్ఎస్ నాయకులు ఆయన ఇంటిని ముట్టడించారు. అరవింద్ నివాసం వద్ద విధ్వంసం సృష్టించారు. ఇంటి అద్దాలతోపాటు కారు అద్దాలను ధ్వంసం చేస్తుంటే పోలీసులు కళ్ళప్పగించి చోద్యం చూశారు. చేయాల్సిందంతా చేశాక వారిని వెనక్కి పంపించారు. ఈ ఘర్షణ ముగిసాక తెలంగాణ భవన్ లో కవిత ప్రెస్ మీట్ పెట్టింది. అరవింద్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది కవిత. ఇష్టారీతిన తనపై వ్యాఖ్యలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఎంపీ అరవింద్ ఫేక్ డిగ్రీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటూ తెలిపింది. తనను బీజేపీలో చేరాలని బీజేపీ నేతలు ఆహ్వానించిన మాట నిజమేనని స్పష్టం చేసింది. మహారాష్ట్ర రాజకీయాలను తెలంగాణలో ప్రవేశ పెట్టాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.…

Read More

బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎవరికీ దక్కని క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రష్మీ – సుధీర్ ల జోడీకి చాలా మందే అభిమానులున్నారు. బుల్లితెరపై సందడి చేస్తూనే వెండితెర పై కూడా అలరిస్తున్నాడు. కమెడియన్, సహా నటుడిగా నటిస్తూనే.. హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం చేస్తోన్న గాలోడు అనే సినిమా ద్వారా హీరోగా మెప్పించేందుకు సుధీర్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పవిత్రను వదలని నరేష్ – మీ సరసాలు తగలెయ్యా అంటూ నెటిజన్ల ఫైర్ సినిమాలో అవకాశాలు వచ్చినా జబర్దస్త్ ను మాత్రం వదిలేది లేదని పదేపదే చెప్పే సుధీర్ అకస్మాత్తుగా జబర్దస్త్ వీడాడు. మల్లెమాలతో పొసగకనే జబర్దస్త్ ను సుధీర్ వీడాడని అంత భావించారు. పారితోషకం విషయంలో విబేధించి జబర్దస్త్…

Read More

తన గురించి, పార్టీ మారడం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పుతో కొడతానని ఎంపీ అరవింద్ ను హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు తాను ఖర్గేతో మాట్లాడాననేది శుద్ధ తప్పు అని వివరణ ఇచ్చారు. తెలంగాణ వాసన లేని పార్టీల్లో తానెలా చేరుతానని ప్రశ్నించారు. తన జీవితం నేను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్. తన రాజకీయ ప్రయాణం కేసీఆర్ తోనేనని వివరించారు కవిత. చెప్పుతో కొడుతా – ఎంపీ అరవింద్ కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్ పార్లమెంటులో అరవింద్ పనితనం సున్నా అని వివరించారు. పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశారని ఆగ్రహించారు. అరవింద్ ది ఫేక్ డిగ్రీ.. దీనిపై తాను రాజస్థాన్ యూనివర్సిటీ కి ఫిర్యాదు చేస్తానని కవిత తెలిపారు. అరవింద్ బురద లాంటోడని తీవ్ర వ్యాఖ్యలు…

Read More

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని, వెంటాడి వేటాడి పట్టుకు తంతానని హెచ్చరించారు. కేసీఆర్ తోపాటు తనను అరవింద్ అనరాని మాటలు అంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలవడం ప్రజల కర్మ అన్నారు. ఎంపీ అరవింద్ పై కల్వకుంట్ల కవిత ఫైర్ అరవింద్ పై కవిత తీవ్రస్థాయిలో రెచ్చిపోయెందుకు కారణం ఉంది. బుధవారం మీడియాతో అరవింద్ మాట్లాడుతూ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట బీజేపీలో చేరేందుకు కవిత ప్రయత్నించిందని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారని.. ఆ పార్టీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సంప్రదింపులు కూడా షురూ చేశారన్న అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కవిత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొత్త సచివాలయం… కొత్త…

Read More

ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. ఇద్దరు అధికార పార్టీకి చెందిన నేతలే. కాని వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బహిరంగా వేదికలపైనే ఇద్దరు నేతలు కీచులాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఆ నేతలు…? తెలియాలంటే ఈ స్టొరీ చదవాల్సిందే. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు ఎంపీ, మాలోతు కవిత ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. కొంతకాలంగా ఈ ఇద్దరికీ అస్సలు పొసగడం లేదు. డీ అంటే డీ అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో రచ్చ జరిగింది. త్వరలో సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కార్యాలయంతోపాటు మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ రానున్న నేపథ్యంలో పనులను పరిశీలించేందుకు వెళ్ళగా అక్కడ మాటల యుద్ధం జరిగింది. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం తాను సొంత డబ్బులు ఖర్చు చేశానని శంకర్ నాయక్ చెప్పుకొచ్చారు. అందుకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ కవిత. పార్టీ కార్యాలయ…

Read More

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయం మరో రెండు నెలలో పూర్తి కానుంది. గురువారం సెక్రటేరియట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. నాణ్యతలో రాజీ పడకుండా త్వరగా అందుబాటులోకి వచ్చేలా నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దాదాపు పూర్తి కావొచ్చిన సెక్రటేరియట్ పనులను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంకో రెండు నెలలో సచివాలయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది తెలంగాణ సీఎం మాత్రమేనని ప్రతిపక్షాలు విమర్శించినా పట్టించుకోని కేసీఆర్ , కేటీఆర్ లు నూతన సచివాలయ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం ఎక్కడుండి పని చేస్తే ఏంటని ప్రశ్నించిన కేటీఆర్.. ఇప్పుడు సెక్రటేరియట్ పై నిర్మాణం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుండటంతో కేటీఆర్ కు సీఎం చైర్ అనే…

Read More

బీజేపీలోకి కల్వకుంట్ల కవితను ఆహ్వానించారన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. లిక్కర్ స్కాం కేసును ముందుంచి కవితను బీజేపీలో చేరాలంటూ బెదిరించారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు. బీజేపీపై బురదజల్లెందుకే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. తామెందుకు కవితను బీజేపీలో చేర్చుకుంటామని తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. కవితను బీజేపీలో చేరాలని అగ్రనేతలు ఆహ్వానించారా అని మీడియా ప్రతినిధులు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రశ్నించగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితే బీజేపీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసిందని, తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్దమని కవిత చెప్పినట్లు అరవింద్ సమాధానం ఇచ్చారు. కవిత బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లిందని తెలిసే.. తనను ఢిల్లీ నుంచి హడావిడిగా హైదరాబాద్ కు కేసీఆర్ తిప్పి పంపారని తెలిపారు. అయితే, కేంద్రమంత్రి పదవి అడగటంతో ఆమె చేరికను పార్టీ పెద్దలు…

Read More

సూపర్ స్టార్ కృష్ణ పార్ధివ దేహం వద్ద పవిత్ర , నరేష్ ల వ్యవహారశైలి చూసిన పలువురు సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. ఇద్దరు జంటగా రావడం.. పదేపదేనరేష్ చేతిపట్టుకొని పవిత్ర అటు, ఇటు తిరగడం వంటి దృశ్యాలను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. కృష్ణ భౌతికకాయం ఉంచిన పద్మాలయ స్టూడియోస్ వద్ద వారి వ్యవహారశైలి జుగుప్సాకరంగా ఉందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చగానే ఆసుపత్రికి పవిత్ర, నరేష్ లు కలిసే వచ్చారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని ఉంచిన పద్మాలయ స్టూడియోకు పవిత్రను నరేష్ వెంట పెట్టుకొని వచ్చారు. ఇద్దరు అక్కడ సందడి చేశారు. నరేష్ మూడో భార్య కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించి వెళ్ళిన వెంటనే పవిత్ర లోకేష్ ను నరేష్ తీసుకువచ్చారు. ఇద్దరు అన్యోన్యంగా కలిసి రావడం చూసి అక్కడున్న వారంతా…

Read More

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రానున్నారా..? ఇందుకు సంబంధించి ముందస్తు వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వచ్చే నెలలో రిటైర్ అవ్వనున్నారు. తరువాత ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ సృష్టికర్త మహేందర్ రెడ్డి అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సమయంలోనే మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ గురించి ప్రస్తావిస్తూ… ఆయన రిటైర్ అయ్యాక మహేందర్ రెడ్డి సేవలను మరోలా వాడుకుంటామని చెప్పారు. ఆయన్ను వదిలే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తె ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమని అర్థం అవుతుంది. అయితే, ఆయన రాజకీయాల్లోకి వస్తారా..? లేదా..? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్…

Read More

సింగర్ మంగ్లీ.. పరిచయం అక్కర్లేని పేరు. పండగలు వస్తున్నాయంటే చాలు అందరూ మంగ్లీ పాట కోసం ఎదురుచూసేంతగా ఆమె పాటలుంటాయి. అక్కడక్కడ ఈవెంట్లలోనూ సందడి చేసే మంగ్లీ అందరిలో కలిసిపోతు చలాకీగా ఉంటుంది. అలాంటి మంగ్లీ ఓ మహిళా నెటిజన్ వలన వివాదంలో చిక్కుకుంది. లిప్ లాక్ చేసిన ఐశ్వర్యరాయ్ మంగ్లీ ఇటీవల ముస్లిం దర్గాను సందర్శించి ప్రార్ధనలు చేసిన ఫోటోలను ఓ మహిళా నెటిజన్ తన సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి రచ్చకు కారణమైంది. హిందువులు ఇలాంటి పనులు మానుకుంటే మంచిది. ముస్లింలు మన దేవాలయాలను సందర్శిస్తారా..? వాళ్ళకున్న కమిట్మెంట్ మనకు లేకపోవడం వలనే హిందువులపై చిన్నచూపు. తప్పు అల్లాది కాదు.. ఇలాంటి సెక్యులర్ హిందువులది. ముస్లింలు వంద శాతం గుడికి రారు.. నీకెందుకు దర్గాలు అంటూ ట్వీట్ చేసింది. సూపర్ స్టార్ లేడని బాధపడాల్సిన అవసరంలే – ఆర్జీవీ ట్వీట్ అంతే కాకుండా ఆమె చేసిన ఈ పోస్ట్…

Read More